ఈసారైనా తలపడతారా? | Nadal, Federer In Same Half Of US Open Draw | Sakshi
Sakshi News home page

ఈసారైనా తలపడతారా?

Published Sun, Aug 27 2017 2:02 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ఈసారైనా తలపడతారా? - Sakshi

ఈసారైనా తలపడతారా?

ఒకే పార్శ్వంలో నాదల్, ఫెడరర్‌ ∙యూఎస్‌ ఓపెన్‌ ‘డ్రా’ విడుదల
న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో స్పానిష్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్, స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఒకరికొకరు ఎప్పుడూ ఎదురుపడలేదు. అయితే ఈసారి మాత్రం ఈ టెన్నిస్‌ లెజెండ్స్‌ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. దీంతో టాప్‌ సీడ్‌ నాదల్, మూడో సీడ్‌ ఫెడరర్‌ తమ ప్రత్యర్థులను ఓడించుకుంటూ సెమీస్‌ వెళితే మాత్రం... దిగ్గజాల పోరుతో ఈ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ హోరెత్తనుంది. అది సెమీస్‌ అయినా ‘ఫైనల్‌’ను తలపిస్తుంది. సోమవారం మొదలయ్యే ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ ‘డ్రా’ను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. తొలిరౌండ్లో నాదల్‌... లెజొవిచ్‌ (సెర్బియా)తో తలపడనుండగా, ఫెడరర్‌... ఫ్రాన్సెస్‌ టియాఫె (అమెరికా)తో ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో మరియా షరపోవాకు తొలిరౌండ్లో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రుమేనియా) ఎదురైంది. డోపింగ్‌ సస్పెన్షన్‌ తర్వాత రష్యా స్టార్‌ బరిలోకి దిగుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇదే. ఆమెకు నిర్వాహకులు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement