పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్‌ | Federer says return date uncertain | Sakshi
Sakshi News home page

పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్‌

Published Sat, Aug 14 2021 5:41 AM | Last Updated on Sun, Oct 17 2021 12:36 PM

Federer says return date uncertain - Sakshi

ఈనెల 30న మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్‌ వింబుల్డన్‌ టోర్నీ తర్వాత ఆటకు విరామం ఇచ్చాడు. ‘వింబుల్డన్‌ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో మళ్లీ రాకెట్‌ పట్టలేదు. ఈ వారంలో డాక్టర్లను కలవాల్సి ఉంది. ఇప్పటికైతే నా పునరా గమనంపై అనిశ్చిత నెలకొని ఉంది’ అని  ఫెడరర్‌ వివరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement