Grandslam tournment
-
జొకోవిచ్ 430
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జొకోవిచ్ అవతరించాడు. 429 మ్యాచ్‌లతో స్విట్జర్లాండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును 430వ మ్యాచ్‌తో జొకోవిచ్ అధిగమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–7 (4/7), 6–3, 6–2తో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలుపొందాడు. 3 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 14 ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 33 విన్నర్స్ కొట్టడంతోపాటు 33 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్లో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్) రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కెరీర్లో 77వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్ ఇప్పటి వరకు 379 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఇది కూడా ఒక రికార్డే. 369 ‘గ్రాండ్’ విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాదే జొకోవిచ్ సవరించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జొకోవిచ్, ఫెడరర్ తర్వాత సెరెనా విలియమ్స్ (423), రాఫెల్ నాదల్ (358), వీనస్ విలియమ్స్ (356) ఉన్నారు. జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. జ్వెరెవ్ 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలిచారు. రూడ్ 2 గంటల 44 నిమిషాల్లో 2–6, 6–3, 1–6, 4–6తో జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన రూడ్ ఇప్పటి వరకు ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. బోపన్న జోడీకి షాక్ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నకు చుక్కెదురైంది. గత ఏడాది మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి బరిలోకి దిగాడు. తొలి రౌండ్లో 14వ సీడ్ బోపన్న–బారింటోస్ ద్వయం 5–7, 6–7 (5/7)తో పెడ్రో మార్టినెజ్–జామి మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. యూకీ–ఒలివెట్టి ద్వయం 2–6, 6–7 (3/7)తో ట్రిస్టన్ స్కూల్‌కేట్–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం పాలైంది. కిన్వెన్ జెంగ్ అవుట్మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్లో 36 ఏళ్ల లౌరా సిగెమండ్ (జర్మనీ) 7–6 (7/3), 6–3తో కిన్వెన్ జెంగ్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 6–3, 7–5తో బుజాస్ మనీరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–3, 7–5తో జోడీ బురాజ్ (బ్రిటన్)పై, పెగూలా 6–4, 6–2తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 1–6, 6–1, 6–3తో 20వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–4, 3–6, 7–6 (10/8)తో మొయూక ఉచిజిమా (జపాన్)పై, 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–1, 6–0తో తాలియా గిబ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్'
పారిస్: రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు ‘ఫ్రెంచ్’ మరోసారి అచ్చిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రష్యన్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మెద్వెదెవ్ క్లేకోర్టులో ఐదోసారి మొదటి రౌండ్లోనే కంగుతిన్నాడు. వరుసగా నాలుగేళ్లు అతను తొలిరౌండ్ అడ్డంకి దాటలేకపోయాడు. తాజాగా మెద్వెదెవ్ 6–7 (5/7), 7–6 (8/6), 6–2, 3–6, 4–6తో క్వాలిఫయర్ సెబొత్ వైల్డ్ (బ్రెజిల్) చేతిలో కంగుతిన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–4, 6–3, 6–2తో క్వాలిఫయర్ ఎలియస్ వైమెర్ (స్వీడెన్)పై గెలుపొందగా... 22వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) తొలిరౌండ్ అడ్డంకిని దాటేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ జర్మన్ ప్లేయర్ 7–6 (8/6), 7–6 (7/0), 6–1తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా)పై చెమటోడ్చి నెగ్గాడు. Biggest W of his young career. ✨🇧🇷 Seyboth Wild's astonishing match against No.2 seed Medvedev is the extraordinary moment of the day! #ExtraordinaryMoments @HaierEurope pic.twitter.com/ZTcL9Q2tmC — Roland-Garros (@rolandgarros) May 30, 2023 స్వియాటెక్ శుభారంభం.. డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పోలండ్ స్టార్ 6–4, 6–0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో కేవలం గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 3–6, 6–1, 6–2తో రెబెక మసరొవా (స్పెయిన్)పై, ఏడో సీడ్ ఓన్స్ జాబెర్ (ట్యూనిషియా ) 6–4, 6–1తో లూసియా బ్రాంజెటి (ఇటలీ)పై, నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–4, 6–2తో క్వాలిఫయర్ లిండా ఫ్రువిర్టొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డియన్ ప్యారీ (ఫ్రాన్స్) 6–2, 6–3తో 25వ సీడ్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్)కు వరుస సెట్లలో షాకిచ్చింది. చదవండి: 'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!' -
ఒకే ఏడాది 4 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన ఆల్‌టైమ్ గ్రేట్
ఒక ఏడాదిలో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే కొందరికి అదే జీవితకాలపు ఘనత.. రెండు గెలిస్తే ఆనందం రెట్టింపు.. మూడు గెలిస్తే గొప్ప ఆటగాళ్ల సరసన చోటు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అది టెన్నిస్ చరిత్రలో ఐదుగురికి మాత్రమే సాధ్యమైన అసాధారణ ప్రదర్శన.. ఈ నాలుగుతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలిస్తే ఆ అద్భుతం పేరే స్టెఫీ గ్రాఫ్.. సుదీర్ఘ కాలం ఆటపై తనదైన ముద్ర వేసి పలు రికార్డులతో కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశాన నిలిపి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అనిపించుకున్న ఈ జర్మన్ స్టార్ సాధించిన ఘనతలెన్నో! 1999లో స్టెఫీగ్రాఫ్ ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు టెన్నిస్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు 30 ఏళ్లే! అప్పటి ఆమె ఫిట్నెస్ స్థాయి, ఆటపరంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు. పైగా అంతకు రెండు నెలల క్రితమే ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె విజేతగా నిలిచింది. 19 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెలరేగుతున్న మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. అనంతరం వింబుల్డన్ లోనూ ఫైనల్ చేరింది. మరికొన్నాళ్లు కొనసాగి ఉంటే మరింత ఘనత ఆమె ఖాతాలోకి చేరేదేమో! అయితే తాను అనుకున్న సమయంలో అనుకున్న తరహాలో ఆటను ముగించింది స్టెఫీ. ‘టెన్నిస్‌లో నేను సాధించాల్సిందంతా సాధించేశాను. ఇంకా ఏం మిగిలి లేదు. ఆటను ఇంకా ఆస్వాదించలేకపోతున్నాను. గతంలో ఉన్న ప్రేరణ కూడా కనిపించడం లేదు. మైదానంలోకి దిగుతున్నప్పుడు ఒక టోర్నీలో ఆడుతున్న భావనే రావడం లేదు’ అని ప్రకటించింది. నిజమే.. ఆమె కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టెఫీ కెరీర్ గ్రాఫ్‌ను చూస్తే అంతా అద్భుతమే కనిపిస్తుంది. సీనియర్లను దాటి.. స్టెఫీ కెరీర్లో పెద్దగా ఒడిదుడుకుల్లేవ్. ఆరంభంలో సహజంగానే వచ్చే కొన్ని అడ్డంకులను దాటిన తర్వాత విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. 13 ఏళ్ల వయసులో తొలి ప్రొఫెషనల్ టోర్నీ ఆడినప్పుడు ఆమె ప్రపంచ ర్యాంక్ 124. అయితే స్టెఫీ తండ్రి, తొలి కోచ్ పీటర్ గ్రాఫ్ ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తర్వాతి రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా ఆట మెరుగుపర్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 1985 వచ్చే సరికి నాటి దిగ్గజాలు మార్టినా నవత్రిలోవా, క్రిస్ ఎవర్ట్ల కెరీర్ చరమాంకంలో ఉంది. వీరిద్దరి తర్వాత ఎవరు అంటూ చర్చ మొదలైన సమయంలో అందరికంటే ముందుగా వినిపించిన పేరు స్టెఫీగ్రాఫ్దే. 1986 ఫ్యామిలీ సర్కిల్ కప్ ఫైనల్లో ఎవర్ట్నే ఓడించి తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకోవడంతో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మయామీ ఓపెన్ లో క్రిస్ ఎవర్ట్‌తో పాటు మార్టినా నవ్రతిలోవాపై కూడా విజయం సాధించడంతో ఇక కొత్త టెన్నిస్ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం లభించింది. 22లో మొదటిది.. ఒకే ఏడాది ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిల్స్‌తో మహిళల టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్ ఆధిపత్యం మొదలైంది. అయితే అసలు ఆటలోకి ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. అదే గ్రాండ్‌స్లామ్ విజయం. ఎన్ని ట్రోఫీలు అందుకున్నా, గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోకపోతే వాటికి లెక్క లేదనేది స్టెఫీకి బాగా తెలుసు. ఆ చిరస్మరణీయ క్షణం 1987లో వచ్చింది. ఆ ఏడాది అప్పటికే ఆరు టోర్నీలు గెలిచి అమితోత్సాహంతో ఉన్న గ్రాఫ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురు లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో మార్టినా నవ్రతిలోవాను 6–4, 4–6, 8–6తో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను స్టెఫీ ముద్దాడింది. పశ్చిమ జర్మనీలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి పెరిగి, ప్రధాన క్రీడల్లో ఒకటిగా ఎదిగేందుకు ఈ విజయం కారణంగా నిలిచిందని అప్పటి మీడియా స్టెఫీ ఘనతను ప్రశంసించింది. అదే సంవత్సరం ఆగస్టు 17న తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ గా మారిన ఘనత.. మొత్తంగా 1302 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఆల్‌టైమ్ గ్రేట్‌గా.. స్టెఫీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టిన ఏడాది 1988. హార్డ్ కోర్టు, క్లే, గ్రాస్.. ఇలా మూడు రకాల కోర్ట్స్‌లో చెలరేగిపోతున్న స్టెఫీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఏ టోర్నీ కోసం బరిలోకి దిగినా ఆమెదే విజయం అన్నట్లుగా మారిపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే అదో గొప్ప ఘనతగా భావించే సమయమది. అప్పటికి టెన్నిస్ చరిత్రలో నలుగురు మాత్రమే దీనిని అందుకున్నారు. పురుషుల విభాగంలో డాన్ బడ్జ్, రాడ్ లేవర్ (రెండు సార్లు), మహిళల విభాగంలో మౌరీన్ కనోలీ, మార్గరెట్ కోర్ట్లకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇందులో ఆఖరిది 1970లో వచ్చింది. మారిన టెన్నిస్, పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరూ అంత నిలకడగా అన్ని గ్రాండ్‌స్లామ్‌లలో గెలవలేని పరిస్థితి. అయితే స్టెఫీ మాత్రం తానేంటో చూపించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లు గెలిచి ఐదో ప్లేయర్‌గా తన పేరు ముద్రించుకుంది. అంతకు ముందు మరో అరుదైన ఘనతతో ఉన్నత స్థానంలో నిలిచింది స్టెఫీ. అదే ఒలింపిక్స్ స్వర్ణపతకం. సియోల్ ఒలింపిక్స్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి గాబ్రియెలా సబటిని (అర్జెంటీనా)ని ఓడించి ‘గోల్డెన్ స్లామ్’ అనే నామకరణానికి తాను కారణమైంది. ఇప్పటికీ 34 ఏళ్లు ముగిసినా మరెవరికీ అది సాధ్యం కాలేదంటే స్టెఫీ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతోంది. మరో దిగ్గజంతో జత కట్టి.. 1999 ఫ్రెంచ్ ఓపెన్ .. మహిళల విభాగంలో స్టెఫీ విజేత కాగా, మరో వైపు పురుషుల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్ ఆండ్రీ అగస్సీ చాంపియన్ . టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఇచ్చే ‘డిన్నర్’లో ఇద్దరూ కలిశారు. స్టెఫీకి అది చివరి గ్రాండ్‌స్లామ్ (22వది) కాగా, అగస్సీకి నాలుగోది మాత్రమే. సర్క్యూట్లో పరిచయం ఉంది. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టెఫీ అంటే గౌరవం కూడా ఉంది అతనికి. కానీ ఈ సారి మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు. దాంతో స్నేహం కాస్త బలపడింది. టెన్నిస్ జగత్తులో ఇద్దరు స్టార్ల మధ్య అనుబంధం అంత సులువు కాదు. అహం, ఆర్జన వంటివి తోడుగా వస్తాయి. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత స్టెఫీ, అగస్సీ పెళ్లి చేసుకున్నారు. చివరకు ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లతో అగస్సీ ఆట ముగించాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జర్మనీని వదిలి యూఎస్‌లో ఆమె స్థిరనివాసం ఏర్పరచుకుంది. స్టెఫీగ్రాఫ్ విజయాల్లో కొన్ని.. 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత (7 వింబుల్డన్, 6 ఫ్రెంచ్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ ). ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన జాబితాలో రెండో స్థానం. కెరీర్లో మొత్తం సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 107 (ఓవరాల్‌గా అత్యధిక టైటిల్స్ జాబితాలో మూడో స్థానం) ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 4 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ వరల్డ్ నంబర్‌వన్ గా అత్యధిక వారాల (377) పాటు సాగిన ఘనత. (ఇందులో వరుసగా 186 వారాల రికార్డు) ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అల్కరాజ్ దూరం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌నుంచి వరల్డ్ నంబర్‌వన్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా కుడి కాలి గాయంతో బాధపడుతున్న అతను సరైన సమయంలో కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. గత ఏడాది సెప్టెంబర్ 12న అల్కరాజ్ ఏటీపీ చరిత్రలో అతి పిన్న వయసులో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. అల్కరాజ్ దూరం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. -
నిష్క్రమించిన దిగ్గజం
బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్ దిగ్గజ త్రయంలో ఫెదరర్తోపాటున్న రాఫెల్ నాదల్, జోకోవిచ్లిద్దరూ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్ అడ్రస్. ఫుట్‌వర్క్, అటాకింగ్ గేమ్ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్ల సంగతలా ఉంచి హ్యూబర్ట్ హుర్కజ్లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు. ఫెదరర్ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్ మొదట్లో ఫెదరర్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి. -
శోకోవిచ్... వరల్డ్ నంబర్‌వన్ కల చెదిరె
అవును... జొకోవిచ్ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్బోర్న్, పారిస్, లండన్ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు. జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. న్యూయార్క్: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. . మెద్వెదెవ్ జోరు... గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్ బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్ స్టార్లూ మెద్వెదెవ్ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో 5–2 వద్ద డబుల్ ఫాల్ట్ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాన మెద్వెదెవ్... ‘డెడ్ ఫిష్’ సంబరాన్ని ప్రదర్శించాడు. జొకో అసహనం... మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి సెమీస్ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్ ఓవర్ సమయంలో జొకో టవల్ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు! జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా. –మెద్వెదెవ్ ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. –జొకోవిచ్ ► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్. గతంలో కఫెలి్నకోవ్ (1996 ఫ్రెంచ్ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్ ఓపెన్), మరాత్ సఫిన్ (2000 యూఎస్ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) రెండేసి ట్రోఫీలు గెలిచారు. ► ఒకే గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో కొత్త చాంపియన్స్ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాస్టన్ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్’ విజేతలుగా నిలిచారు. ► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది. ► జొకోవిచ్ కెరీర్లో 11సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్ (11), ఇవాన్ లెండిల్ (11) సరసన జొకోవిచ్ కూడా చేరాడు. -
యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న థీమ్
డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్ నంబర్ 6 యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ బుడాపెస్ట్ (హంగేరీ)లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 150వ ర్యాంకర్ శ్రీజ 11–9, 11–6, 13–11తో ప్రపంచ 53వ ర్యాంకర్ బార్బొరా బలజోవా (స్లొవాక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన వరల్డ్ 60వ ర్యాంకర్ మనికా బాత్రాతో తలపడుతుంది. -
యూఎస్ ఓపెన్: పునరాగమనంపై ఫెడరర్ క్లారిటీ
గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో ఈ ఆటగాడు మళ్లీ రాకెట్ పట్టలేదు. అయితే తాజాగా తన పునరాగమనంపై ఫెడరర్ స్పందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఫెడరర్ తాను యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఇటీవల చేసుకున్న శస్త్రచికిత్స కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఫెడరర్ మాట్లాడుతూ.. ఇటీవల గాయం కారణంగా చాలా నెలలు ఆటకు దూరంగా ఉన్నాను. ఇది కొన్ని విధాలుగా కష్టంగా ఉంటుంది, కానీ అదే సమయంలో నేను ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటున్నా. "నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నన్ను తప్పుగా భావించవద్దు. ఈ వయసులో ఇప్పుడు మరొక శస్త్రచికిత్స చేసి ప్రయత్నించడం ఎంత కష్టమో నాకు తెలుసు, ”అని తెలిపాడు. ఇప్పటికే నేను రిహాబిలిటేషన్ ప్రారంభించాను. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం ఉందంటూ ఫెడరర్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Roger Federer (@rogerfederer) -
పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్
ఈనెల 30న మొదలయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ వింబుల్డన్ టోర్నీ తర్వాత ఆటకు విరామం ఇచ్చాడు. ‘వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో మళ్లీ రాకెట్ పట్టలేదు. ఈ వారంలో డాక్టర్లను కలవాల్సి ఉంది. ఇప్పటికైతే నా పునరా గమనంపై అనిశ్చిత నెలకొని ఉంది’ అని ఫెడరర్ వివరించాడు. -
జొకోవిచ్ తడాఖా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ తన అద్భుతమైన రికార్డు కొనసాగిస్తూ... ఎనిమిదోసారి చాంపియన్‌గా అవతరించేందుకు విజయం దూరంలో నిలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 18 నిమిషాల్లో 7–6 (7/1), 6–4, 6–3తో స్విట్జర్లాండ్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్‌ను ఓడించాడు. 32 ఏళ్ల జొకోవిచ్, 38 ఏళ్ల ఫెడరర్ మధ్య ఇది 50వ ముఖాముఖి పోరు కావడం విశేషం. ఫెడరర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జొకోవిచ్ నెగ్గి ముఖాముఖి రికార్డులో 27–23తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్‌పై జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో విజయం (2020, 2016, 2011, 2008 సెమీఫైనల్స్) కావడం గమనార్హం. ఈ టోర్నీలో జొకోవిచ్పై ఫెడరర్ ఒక్కసారి (2007 ప్రిక్వార్టర్ ఫైనల్స్) మాత్రమే గెలుపొందాడు. ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ తలపడతాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఏడుసార్లూ జొకోవిచ్‌నే టైటిల్ వరించడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో జొకోవిచ్‌కు ‘టాప్ ర్యాంక్’ అవకాశాలు మెరుగయ్యాయి. ఫెడరర్‌తో మ్యాచ్‌లో జొకోవిచ్‌కు తొలి సెట్లో గట్టిపోటీ ఎదురైంది. సాండ్‌గ్రెన్ (అమెరికా)తో జరిగిన ఐదు సెట్ల క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ తొడ నొప్పితోనే ఆడాడు. జొకోవిచ్‌తో మ్యాచ్‌లో ఫెడరర్ కదలికలు చూశాక అతను పూర్తి ఫిట్నెస్తో లేడనిపించింది. తొలి సెట్లో ఫెడరర్ ఒకదశలో 5–2తో ఆధిక్యంలో నిలిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ స్కోరును 5–5తో సమం చేశాడు. చివరకు టైబ్రేక్‌లో పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత జొకోవిచ్ జోరు పెంచగా... ఫెడరర్ పూర్తిగా డీలా పడ్డాడు. మ్యాచ్ మొత్తంలో 11 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయినా ఫెడరర్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 18 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు సాధించాడు. మరోవైపు 15 ఏస్‌లు సంధించిన ఫెడరర్... మూడు డబుల్ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. ఫైనల్ చేరే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. బోపన్న జంట ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–నదియా కిచోనెక్ (ఉక్రెయిన్) జంట 0–6, 2–6తో ఐదో సీడ్ బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఫెడరర్‌తో ఆడటం ఎప్పుడూ సులువు కాదు. ఈ మ్యాచ్‌లో అతని కదలికలు చూశాక పూర్తి ఫిట్నెస్తో లేడని అర్థం చేసుకున్నాను. తొడల్లో నొప్పి కలుగుతోన్నా ఫెడరర్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేయడం ప్రశంసనీయం. తన 22 ఏళ్ల కెరీర్లో ఫెడరర్ 1500 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడినా ఏనాడూ మ్యాచ్ మధ్యలో గాయం కారణంగా వైదొలగలేదు. ఈ అంశమే ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగేలా చేస్తుంది. –జొకోవిచ్ -
ఎవరీ బియాంక..!
ఏడాది క్రితం వరకు టాప్–150లో కూడా లేని బియాంక నేడు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్ ఓపెన్ చాంపియన్ కావాలని మూడేళ్ల క్రితమే బియాంక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2016లో ప్రతిష్టాత్మక జూనియర్ టోర్నీ ఆరెంజ్ బౌల్ టైటిల్ సాధించిన బియాంక... యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు ఇచ్చే చెక్ ప్రతిని తయారు చేసుకొని దానిపై తన పేరును రాసుకుంది. మూడేళ్ల తర్వాత బియాంక ఏకంగా నిజమైన చెక్‌నే అందుకోవడం విశేషం. బియాంక తల్లిదండ్రులు మారియా, నికూ 1994లో రొమేనియా నుంచి కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. 2000 జూన్ 16న టొరంటోలో బియాంక జన్మించింది. ఏడేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టుకున్న బియాంక నాలుగేళ్ల తర్వాత కెనడా జాతీయ టెన్నిస్ ప్రోగ్రామ్‌లో భాగమైంది. కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2016లో రోజర్స్ కప్ టోర్నీ సందర్భంగా సిమోనా హలెప్ సూచనతో ప్రొఫెషనల్‌గా మారింది. తల్లి మారియా పర్యవేక్షణలో 12 ఏళ్ల ప్రాయం నుంచే ధ్యానం చేసే అలవాటు చేసుకున్న బియాంక 2017లో వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టి తొలి రౌండ్లో నిష్క్రమించింది. 2018లో నిలకడగా ఆడిన ఆమె ఈ ఏడాది మరింత రాటుదేలింది. ప్రీమియర్ ఈవెంట్ టోర్నీలైన ఇండియన్ వెల్స్ ఓపెన్, రోజర్స్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలిచి యూఎస్ ఓపెన్‌లో అడుగు పెట్టింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. గాయాల బారిన పడకుండా... తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటే 2020లో బియాంక ఖాతాలో మరిన్ని టైటిల్స్ చేరే అవకాశముంది. -
ఒసాకా శ్రమించి...
పారిస్: వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4–6, 7–5, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా ఆరు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి సెట్ చేజార్చుకున్న ఒసాకా రెండో సెట్లో కోలుకుంది. కీలకదశలో తప్పిదాలు చేయకుండా సంయమనంతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2005లో లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయాక విజయం సాధించిన రెండో టాప్ సీడ్ ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. మూడో రౌండ్లో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. రెండో రౌండ్లో సినియకోవా 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 7–6 (7/5), 6–7 (8/10), 6–4తో మరియా సకారి (గ్రీస్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో 17 ఏళ్ల అమెరికా అమ్మాయి అమండా అనిసిమోవా 6–4, 6–2తో 11వ సీడ్ ఆర్యాన సబలెంక (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–2తో కురుమి నారా (జపాన్)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 6–4, 6–4తో సీగ్మండ్ (జర్మనీ)పై గెలిచారు. జొకోవిచ్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో థీమ్ 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, జొకోవిచ్ 6–1, 6–4, 6–3తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వైమెర్ (స్వీడన్)పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–అయోయామ (జపాన్) ద్వయం 3–6, 6–2, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. -
నాదల్కు కష్టమే!
ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల పారిస్: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి మట్టికోర్టులో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న రాఫెల్ నాదల్కు ఈసారి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ‘ఫ్రెంచ్ ఓపెన్’లో ఈ స్పెయిన్ స్టార్ పదోసారి విజేతగా నిలవాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆరోసీడ్‌గా బరిలోకి దిగుతున్న నాదల్ పార్శ్వంలోనే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌తో... సెమీఫైనల్లో ముర్రేతో నాదల్ తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్లో కెయి కనెపి (ఎస్తొనియా)తో ఆడుతుంది. మరో పార్శ్వంలో ఉన్న టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లో క్వాలిఫయర్‌ను ఢీకొంటుంది.