పారిస్: రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు ‘ఫ్రెంచ్’ మరోసారి అచ్చిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రష్యన్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మెద్వెదెవ్ క్లేకోర్టులో ఐదోసారి మొదటి రౌండ్లోనే కంగుతిన్నాడు. వరుసగా నాలుగేళ్లు అతను తొలిరౌండ్ అడ్డంకి దాటలేకపోయాడు.
తాజాగా మెద్వెదెవ్ 6–7 (5/7), 7–6 (8/6), 6–2, 3–6, 4–6తో క్వాలిఫయర్ సెబొత్ వైల్డ్ (బ్రెజిల్) చేతిలో కంగుతిన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–4, 6–3, 6–2తో క్వాలిఫయర్ ఎలియస్ వైమెర్ (స్వీడెన్)పై గెలుపొందగా... 22వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) తొలిరౌండ్ అడ్డంకిని దాటేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ జర్మన్ ప్లేయర్ 7–6 (8/6), 7–6 (7/0), 6–1తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా)పై చెమటోడ్చి నెగ్గాడు.
Biggest W of his young career. ✨🇧🇷
— Roland-Garros (@rolandgarros) May 30, 2023
Seyboth Wild's astonishing match against No.2 seed Medvedev is the extraordinary moment of the day! #ExtraordinaryMoments @HaierEurope pic.twitter.com/ZTcL9Q2tmC
స్వియాటెక్ శుభారంభం..
డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పోలండ్ స్టార్ 6–4, 6–0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో కేవలం గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 3–6, 6–1, 6–2తో రెబెక మసరొవా (స్పెయిన్)పై, ఏడో సీడ్ ఓన్స్ జాబెర్ (ట్యూనిషియా ) 6–4, 6–1తో లూసియా బ్రాంజెటి (ఇటలీ)పై, నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–4, 6–2తో క్వాలిఫయర్ లిండా ఫ్రువిర్టొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డియన్ ప్యారీ (ఫ్రాన్స్) 6–2, 6–3తో 25వ సీడ్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్)కు వరుస సెట్లలో షాకిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment