French Open 2022: మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన వరల్డ్‌ నెంబర్‌-2 | Daniil Medvedev Enters 3rd Round French Open 2022 | Sakshi
Sakshi News home page

Daniil Medvedev: మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన వరల్డ్‌ నెంబర్‌-2

Published Thu, May 26 2022 9:56 PM | Last Updated on Thu, May 26 2022 9:56 PM

Daniil Medvedev Enters 3rd Round French Open 2022 - Sakshi

టెన్నిస్‌ పురుషుల ప్రపం‍చ నెంబర్‌-2 డానిల్‌ మెద్వెదెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో మెద్వదెవ్‌.. సెర్బియాకు చెందిన లాస్లో జెరీని 6-3, 6-4, 6-3తో  వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా క్వార్టర్ ఫైనల్‌ బెర్త్‌ కోసం మెద్వెదెవ్‌ సెర్బియాకు చెందిన 28వ సీడ్‌ మియోమిర్ కెక్మనోవిక్‌తో తలపడనున్నాడు. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో జెరిని 39 విన్నర్స్‌ సందించినప్పటికి.. 68 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 

''లాస్లో పోరాటం మెచ్చుకోదగినది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో జెరీని విన్నర్స్‌ సంధించినప్పటికి.. అన్నే తప్పులు చేశాడు. అతని కాలికి కచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. అతని టఫ్‌ ఫైట్‌ కారణఃగా నేను ప్రతీ పాయింట్‌పై ఫోకస్‌ చేయాల్సి వచ్చింది.'' అని మెద్వెదెవ్‌ మ్యాచ్‌ విజయం అనంతరం పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement