French Open 2022: వారెవ్వా.. రోహన్‌ బోపన్న తొలిసారి.. | French Open 2022: Rohan Bopanna Enter His First Grand Slam Doubles Semis | Sakshi
Sakshi News home page

Rohan Bopanna: వారెవ్వా.. రోహన్‌ బోపన్న తొలిసారి..

Published Wed, Jun 1 2022 9:03 AM | Last Updated on Wed, Jun 1 2022 9:08 AM

French Open 2022: Rohan Bopanna Enter His First Grand Slam Doubles Semis - Sakshi

భారత టెన్నిస్‌ సీనియర్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తన కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న(భారత్‌)- మిడిల్‌కూప్‌(నెదర్లాండ్స్‌) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్‌ ట్రై బ్రేక్‌లో లాయిడ్‌ గ్లాస్‌పూల్‌(బ్రిటన్‌)- హెలియోవారా(ఫిన్‌లాండ్‌) జోడీపై గెలిచింది.

ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్‌ టోర్నీలో సె​మీ ఫైనల్‌ చేరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement