Marin Cilic Stuns world No 2 Daniil Medvedev In French Open 2022 - Sakshi
Sakshi News home page

French Open 2022: మెద్వెదేవ్‌కు భారీ షాక్‌.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఔట్‌

Published Tue, May 31 2022 11:36 AM | Last Updated on Tue, May 31 2022 12:36 PM

Marin Cilic stuns world No 2 Daniil Medvedev In French Open 2022 - Sakshi

ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నం.2 డానియల్ మెద్వెదేవ్‌కు భారీ షాక్‌ తగిలింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ 6-2, 6-3, 6-2తో మెద్వెదేవ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. దీంతో మెద్వెదేవ్‌ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచే మెద్వెదేవ్‌పై సిలిక్ ఆధిపత్యం చెలాయించాడు. కేవ‌లం గంటా 47 నిమిషాల్లో సిలిక్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో సిలిక్ నాలుగేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఇక క్వార్టర్‌ ఫైనల్లో  ఏడో సీడ్ ఆండ్రూ రూబ్లేవ్‌తో సిలిక్ త‌ల‌ప‌డ‌నున్నాడు.

చదవండి: ISSF World Cup: స్వర్ణ పతకంపై ఇలవేనిల్‌ బృందం గురి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement