ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల
పారిస్: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి మట్టికోర్టులో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న రాఫెల్ నాదల్‌కు ఈసారి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ‘ఫ్రెంచ్ ఓపెన్’లో ఈ స్పెయిన్ స్టార్ పదోసారి విజేతగా నిలవాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆరోసీడ్‌గా బరిలోకి దిగుతున్న నాదల్ పార్శ్వంలోనే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఉన్నారు.
అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌తో... సెమీఫైనల్లో ముర్రేతో నాదల్ తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్‌లో కెయి కనెపి (ఎస్తొనియా)తో ఆడుతుంది. మరో పార్శ్వంలో ఉన్న టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌ను ఢీకొంటుంది.
నాదల్‌కు కష్టమే!
Published Sat, May 23 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement