గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో ఈ ఆటగాడు మళ్లీ రాకెట్ పట్టలేదు. అయితే తాజాగా తన పునరాగమనంపై ఫెడరర్ స్పందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఫెడరర్ తాను యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఇటీవల చేసుకున్న శస్త్రచికిత్స కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఫెడరర్ మాట్లాడుతూ.. ఇటీవల గాయం కారణంగా చాలా నెలలు ఆటకు దూరంగా ఉన్నాను. ఇది కొన్ని విధాలుగా కష్టంగా ఉంటుంది, కానీ అదే సమయంలో నేను ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటున్నా. "నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నన్ను తప్పుగా భావించవద్దు. ఈ వయసులో ఇప్పుడు మరొక శస్త్రచికిత్స చేసి ప్రయత్నించడం ఎంత కష్టమో నాకు తెలుసు, ”అని తెలిపాడు. ఇప్పటికే నేను రిహాబిలిటేషన్ ప్రారంభించాను. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం ఉందంటూ ఫెడరర్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment