మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ నమ్మశక్యంగా లేదు: నాదల్‌ | number one ranking is not reliable: Nadal | Sakshi
Sakshi News home page

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ నమ్మశక్యంగా లేదు: నాదల్‌

Published Tue, Aug 22 2017 12:54 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ నమ్మశక్యంగా లేదు: నాదల్‌

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ నమ్మశక్యంగా లేదు: నాదల్‌

మూడేళ్ల తర్వాత ప్రపంచ పురుషుల టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకోవడం నమ్మశక్యంగా లేదని స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ అన్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్‌ 7,645 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. 2014 జూన్‌లో చివరిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన నాదల్‌ ఆ తర్వాత గాయాల కారణంగా ఒకదశలో 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.

నాదల్‌ తర్వాత ఆండీ ముర్రే (7,150 పాయింట్లు) రెండో స్థానంలో, ఫెడరర్‌ (7,145 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. వచ్చే వారం మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌లో నాదల్, ముర్రే, ఫెడరర్‌ ప్రదర్శన ఆధారంగా టాప్‌ ర్యాంక్‌ తారుమారు అయ్యే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement