న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో నాదల్ 5–7, 7–5, 7–6 (9/7), 7–6 (7/3)తో ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. 4 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకమైన టైబ్రేక్‌లలో నాదల్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. నాదల్‌తోపాటు మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), తొమ్మిదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు.
మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో మాజీ విజేత సెరెనా 6–1, 6–2తో సోదరి వీనస్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6–4, 6–4తో ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–విత్రో (అమెరికా) ద్వయంపై నెగ్గింది.
గట్టెక్కిన నాదల్
Published Sun, Sep 2 2018 2:18 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment