నాదల్‌తో డబుల్స్‌ ఆడాలనుంది: ఫెడరర్‌ | I've always wanted to play with Rafa Nadal, says Roger Federer | Sakshi
Sakshi News home page

నాదల్‌తో డబుల్స్‌ ఆడాలనుంది: ఫెడరర్‌

Published Wed, Feb 22 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

నాదల్‌తో డబుల్స్‌ ఆడాలనుంది: ఫెడరర్‌

నాదల్‌తో డబుల్స్‌ ఆడాలనుంది: ఫెడరర్‌

ప్రేగ్‌: ఫెడరర్‌... నాదల్‌... ప్రపంచ టెన్నిస్‌లో వీరిద్దరి మధ్య పోరు జరిగితే ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరు కలిసి డబుల్స్‌ బరిలోకి దిగితే అభిమానులకు పండగే. టెన్నిస్‌ గ్రేట్‌ రాడ్‌ లేవర్‌ పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ప్రారంభ లేవర్‌ కప్‌లో ఈ దృశ్యం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే నాదల్‌తో కలిసి డబుల్స్‌ ఆడాలని ఉందని ఫెడరర్‌ తన మనసులో మాట బయటపెట్టాడు. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌పై ఫెడరర్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ లేవర్‌ కప్‌లో టెన్నిస్‌ దిగ్గజాలు బోర్గ్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ టీమ్, మెకన్రో కెప్టెన్సీలోని రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ జట్లు తలపడతాయి.

‘నాదల్‌తో ఆడేందుకు ఎప్పుడూ ఇష్టపడతాను. ఎందుకంటే మా మధ్య ఆటపరంగా ఉన్న శతృత్వం అలాంటిది. అతడి ఫోర్‌హ్యాండ్‌ షాట్స్‌ అంటే నాకిష్టం. మేం కలిసి ఆడాలని లేవర్‌ కూడా కోరుకున్నారు’ అని 35 ఏళ్ల ఫెడరర్‌ తెలిపాడు. సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు జరిగే లేవర్‌ కప్‌లోని రెండు జట్లలో ఆరేసి ఆటగాళ్లుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement