
గతవారం మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్... రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్లో వైదొలిగాడు. గ్రీస్ యువతార సిట్సిసాస్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అతను కుడి కాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ‘నేను వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను’ అని 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్న ఫెడరర్ వ్యాఖ్యానించాడు.