
టొరంటో (కెనడా) : మహిళల టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ ప్లేయర్ నయోమి ఒసాకా మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. మాంట్రియల్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఒసాకా 3–6, 4–6తో మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. అయితే ప్రస్తుత నంబర్‌వన్‌గా ఉన్న యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఒసాకా మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment