మెల్‌బోర్న్: జపనీస్ టెన్నీస్ స్టార్ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బార్డీ(22వ సీడ్)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్) కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్(2018, 2020)టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్(2019,2021) టైటిల్స్ ఉన్నాయి.
కాగా నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది.
𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉.
— #AusOpen (@AustralianOpen) February 20, 2021
When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh
Comments
Please login to add a commentAdd a comment