మారథాన్‌ మ్యాచ్‌లో ఘన విజయం.. మూడో రౌండ్‌కు ముర్రే | Australian Open: Andi Murray Enters 3rd Round Beats Thanasi Kokkinakis | Sakshi
Sakshi News home page

AUS Open 2023: మారథాన్‌ మ్యాచ్‌లో ఘన విజయం.. మూడో రౌండ్‌కు ముర్రే

Published Fri, Jan 20 2023 5:20 PM | Last Updated on Fri, Jan 20 2023 5:20 PM

Australian Open: Andi Murray Enters 3rd Round Beats Thanasi Kokkinakis - Sakshi

బ్రిట‌న్ టెన్నిస్ స్టార్ ఆట‌గాడు ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో అత‌ను ఆస్ట్రేలియాకు చెందిన థ‌న‌సి కొక్కిన‌కిస్‌ను ఓడించాడు. 5 గంట‌ల 45 నిమిషాల పాటు జ‌రిగిన ఈ మారథాన్‌ మ్యాచ్‌లో ముర్రే విజేత‌గా నిలిచాడు. 4-6, 6-7(4-7), 7-6(7-5), 6-3, 7-5తో థ‌న‌సిను చిత్తు చేశాడు.

ముర్రే కెరీర్‌లో ఇది సుదీర్ఘ మ్యాచ్‌. మెల్‌బోర్న్ కాల‌మానం ప్ర‌కారం మ్యాచ్ ఉద‌యం నాలుగు గంట‌ల‌కు ముగిసింది. మ్యాచ్ గెలవ‌డం న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదు అని మ్యాచ్ అనంత‌రం ముర్రే వ్యాఖ్యానించాడు. ఇక గ్రాండ్‌స్లామ్ చరిత్ర‌లో అత్యంత ఆల‌స్యంగా ముగిసిన రెండో మ్యాచ్ ఇది.

2008 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ లిట‌న్ హెవిట్‌, సైప్ర‌స్‌కు చెందిన‌ మ‌ర్కోస్ బాఘ్దాటిస్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఉద‌యం 4.34 గంటలకు ముగిసింది. ఈ మ్యాచ్‌లో హెవిట్ 4-6, 7-5, 7-5, 6-7 (4), 6-3తో విజ‌యం సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement