Andy Murray
-
మారథాన్ మ్యాచ్‌లో ఘన విజయం.. మూడో రౌండ్‌కు ముర్రే
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో అతను ఆస్ట్రేలియాకు చెందిన థనసి కొక్కినకిస్ను ఓడించాడు. 5 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో ముర్రే విజేతగా నిలిచాడు. 4-6, 6-7(4-7), 7-6(7-5), 6-3, 7-5తో థనసిను చిత్తు చేశాడు. ముర్రే కెరీర్లో ఇది సుదీర్ఘ మ్యాచ్. మెల్బోర్న్ కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం నాలుగు గంటలకు ముగిసింది. మ్యాచ్ గెలవడం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని మ్యాచ్ అనంతరం ముర్రే వ్యాఖ్యానించాడు. ఇక గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యంత ఆలస్యంగా ముగిసిన రెండో మ్యాచ్ ఇది. 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ మ్యాచ్‌లో మాజీ వరల్డ్ నంబర్ వన్ లిటన్ హెవిట్, సైప్రస్‌కు చెందిన మర్కోస్ బాఘ్దాటిస్ మధ్య జరిగిన మ్యాచ్ ఉదయం 4.34 గంటలకు ముగిసింది. ఈ మ్యాచ్‌లో హెవిట్ 4-6, 7-5, 7-5, 6-7 (4), 6-3తో విజయం సాధించాడు. Have you ever seen anything like that?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/PSIXFMIFcl — #AusOpen (@AustralianOpen) January 19, 2023 Is anyone else still thinking about last night? 💭💭#AusOpen • #AO2023 pic.twitter.com/Ve0ogzKhvJ — #AusOpen (@AustralianOpen) January 19, 2023 -
కష్టపడి నెగ్గిన ముర్రే.. ఓడినా చుక్కలు చూపించాడు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బ్రిటన్ స్టార్.. ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ ఆండీ ముర్రే(66వ సీడ్) తొలి రౌండ్‌ను అతికష్టం మీద నెగ్గాడు. పురుషులు సింగిల్స్ తొలి రౌండ్లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని(13వ సీడ్)పై 3-3, 3-6, 6-4, 7-6(9-7), 6-7(6-10) ఓడించాడు. దాదాపు 4 గంటల 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రేకు బెరెట్టినీ చుక్కలు చూపించాడు. తొలి రెండు సెట్లను ఈజీగానే నెగ్గిన ముర్రేను మూడో సెట్లో మాత్రం బెరెట్టినీ ఖంగుతినిపించాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మరింత రసవత్తంగా మారింది. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో నాలుగో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌ను బెరెట్టినీ సొంతం చేసుకోవడంతో ఇద్దరు చెరో రెండు సెట్లు గెలిచారు. కీలకమైన ఐదో సెట్ కూడా టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక టై బ్రేక్‌లో జూలు విదిల్చిన ముర్రే 10-6తో సెట్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకొని రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. ఇక ముర్రేకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇది 50వ విజయం కావడం విశేషం. After nearly five epic hours @andy_murray has done it!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/00FgZbPb5g — #AusOpen (@AustralianOpen) January 17, 2023 Former #1 and five times #AusOpen runner up Andy Murray gets his biggest Grand Slam win in his metal hip Era, beating Matteo Berrettini 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-6) to reach the 2nd round. Saved one match point. 4 hours and 49 minutes. Legend. pic.twitter.com/tQdMjHf7WL — José Morgado (@josemorgado) January 17, 2023 Let’s hear it for @andy_murray!! 🗣️#AO2023 • #AusOpen pic.twitter.com/DyfgSs4kSN — #AusOpen (@AustralianOpen) January 17, 2023 -
ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్
ప్రస్తుతం టెన్నిస్ అభిమానుల కళ్లన్నీ స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆడనున్న లావెర్ కప్‌పై నెలకొన్నాయి. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. నాదల్, ఫెదరర్ ప్రత్యర్థులుగా ఆఖరి మ్యాచ్ ఆడాలని అభిమానులు కోరుకుంటే.. వాళ్లు మాత్రం కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడనున్నారు. ఇది కొంతవరకు ఉపశమనమే. ఎందుకంటే ఒకేసారి ఇద్దరి ఆటను.. వారి షాట్లను చూస్తాం కాబట్టి. ఇదిలా ఉంటే.. ఫెదరర్ గురువారం రాత్రి తన ట్విటర్లో షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సమకాలీన ఆటగాళ్లైన రఫేల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రేలు ఒక ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఫెదరర్ ఆఖరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ నలుగురు గురువారం రాత్రి హోటల్లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత లండన్‌లోని థేమ్స్ బ్రిడ్జి వద్ద ఫోటో దిగారు. ఇదే ఫోటోను ఫెదరర్ ట్విటర్లో షేర్ చేస్తూ .. మిత్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నా అంటూ క్యాప్షన్ జత చేశాడు. టెన్నిస్ దిగ్గజాలుగా పేరు పొందిన ఈ నలుగురు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా కాలమైంది. అందుకే ఫెదరర్ పెట్టిన ఫోటోకు లైక్స్ వర్షం కురిసింది. దాదాపు 4లక్షలకు పైగా లైక్స్ రాగా.. 40వేల రీట్వీట్స్ వచ్చాయి. ఫెదరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే.. ఆటలో ఎవరి శైలి వారిదే. ఈ నలుగురు దిగ్గజాలు కలిసి 66 గ్రాండ్ స్లామ్‌లు కొల్లగొట్టారు. అందులో నాదల్(22), జొకోవిచ్(21), ఫెదరర్(20), ముర్రే(3) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. నాదల్, జొకోవిచ్, ఫెదరర్ల హవాలో ముర్రే అంతగా వెలుగులోకి రాకపోయినప్పటికి.. వీరితో సమకాలీకుడిగా పేరు పొందడం విశేషం. ఇక నాదల్- ఫెదరర్‌లు ఇంతకముందు 2017లో లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్‌ను కలిసి ఆడారు. తాజాగా ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో అతనితో కలిసి ఆడాలని నాదల్ నిశ్చయించుకున్నాడు. heading to dinner with some friends @RafaelNadal @andy_murray @DjokerNole pic.twitter.com/2oYR3hnGaZ — Roger Federer (@rogerfederer) September 22, 2022 చదవండి: చివరి మ్యాచ్ మాత్రమే.. అంతిమయాత్రలా చేయకండి Road Safety World Series 2022: సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
ముర్రే శుభారంభం
కొన్నేళ్ల క్రితం ‘బిగ్ ఫోర్’లో ఒకడిగా వెలుగొందిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ గాయాల కారణంగా గాడి తప్పింది. ‘గ్రాండ్‌స్లామ్’ విజయాల్లో జొకోవిచ్, నాదల్, ఫెడరర్ దూసుకుపోతుంటే ముర్రే మాత్రం వెనుకబడిపోయాడు. తాను పాల్గొన్న చివరి ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ముర్రే ఒక్కసారి మాత్రమే మూడో రౌండ్ వరకు వెళ్లగలిగాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ముర్రే వరుస సెట్లలో తొలి రౌండ్లో విజయం అందుకున్నాడు. న్యూయార్క్: ఈ ఏడాది ఆడుతున్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. సోమవారం మొదలైన టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో 2016 చాంపియన్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ముర్రే 7–5, 6–3, 6–3తో ప్రపంచ 27వ ర్యాంకర్, 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండు గంటల 41 నిమిషాలపాటు జరిగిన పోరులో ముర్రే ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చిన ముర్రే 18 సార్లు పాయింట్లు గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 32 అనవసర తప్పిదాలు చేసిన ముర్రే 25 విన్నర్స్ కొట్టాడు. కెరీర్లో 16వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న ముర్రే 2016లో టైటిల్ సాధించి, 2008లో రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదెవ్ అలవోక విజయం పురుషుల సింగిల్స్‌లో తొలిరోజు జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్టెఫాన్ కొజ్లోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 6–4, 6–0తో గెలుపొందాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన అమెరికా ప్లేయర్ జేజే వుల్ఫ్ 6–4, 6–4, 6–4తో 16వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించాడు. శ్రమించి నెగ్గిన సాకరి మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ మరియా సాకరి (గ్రీస్) రెండో రౌండ్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది. తాత్యానా మరియా (జర్మనీ)తో జరిగిన తొలి రౌండ్లో సాకరి 6–4, 3–6, 6–0తో గెలిచింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–2, 6–4తో రఖిమోవా (రష్యా)పై, అలీసన్ రిస్కీ అమృత్‌రాజ్ (అమెరికా) 6–2, 6–4తో ఎలీనా యు (అమెరికా)పై విజయం సాధించారు. -
Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్
Australia Open 2022: గత ఏడాది క్వాలిఫయర్ హోదాలో యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న రాడుకాను మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 6–0, 2–6, 6–1తో 2017 యూఎస్ ఓపెన్ చాంపి యన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. లేలా అవుట్... మరోవైపు గత ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 23వ సీడ్ లేలా 4–6, 2–6తో ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. 2019 రన్నరప్, 20వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 2–6తో సొరానా క్రిస్టియా (రొమేనియా) చేతిలో... 2016 చాంపియన్, 16వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 3–6తో కయా కనెపి (ఎస్తోనియా) చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. గట్టెక్కిన ముర్రే... పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కి 2017 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరాడు. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ముర్రే 3 గంటల 52 నిమిషాల్లో 6–1, 3–6, 6–4, 6–7 (5/7), 6–4తో 21వ సీడ్ బాసిలాష్విలి (జార్జియా)పై గెలిచాడు. రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. That's one for the career highlight tape! 🔥 🇬🇧 @EmmaRaducanu v 🇺🇸 Sloane Stephens#AO2022 • #AusOpen • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/JORkiPzceX — #AusOpen (@AustralianOpen) January 19, 2022 🇬🇧 @EmmaRaducanu is feeling right at home 😁#AusOpen • #AO2022• #AOpresscon pic.twitter.com/dE1ydYbfyu — #AusOpen (@AustralianOpen) January 18, 2022 -
అదరగొట్టిన ముర్రే.. ఐదేళ్ల నిరీక్షణకు తెర
బ్రిటన్ టెన్నిస్ స్టార్.. మాజీ ప్రపంచనెంబర్వన్ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఘనంగా ఆరంభించాడు. జార్జేరియాకు చెందిన 21వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-1, 3-6,6-4,6-7(5), 6-4 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరు దాదాపు 3 గంటల 52 నిమిషాల పాటు హోరాహోరిగా తలపడినప్పటికి.. ముర్రే ఆద్యంతం ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెట్‌ను 6-1 తేడాతో గెలిచిన ముర్రే రెండో సెట్‌ను మాత్రం 3-6తో ప్రత్యర్థికి కోల్పోయాడు. అయితే తనదైన గ్రౌండ్స్ట్రోక్స్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించిన ముర్రే మూడో సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు. ఇక నాలుగో సెట్ టై బ్రేక్‌కు దారి తీసినప్పటికి కీలకమైన ఐదో సెట్‌ను 6-4తో గెలుచుకొని ముర్రే రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో టోర్నీ నిర్వాహకులు ట్విటర్లో షేర్ చేసుకున్నారు. మ్యాచ్ విజయం అనంతరం ముర్రే భావోద్వేగానికి లోనవ్వడం వైరల్‌గా మారింది. చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి ఇక 2017లో ఆఖరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన ముర్రే.. 2018లో గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్నాడు. ఇక 2019లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడాడు. అయితే తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన ముర్రే భావోద్వేగానికి గురయ్యాడు. అప్పటికే తుంటి ఎముక గాయం బాధిస్తుండడంతో తాను ఇక టెన్నిస్ ఆడనేమోనని.. ఇది చివరిదని ఎమోషనల్ కావడం అభిమానులను బాధించింది. తుంటి ఎముకకు సంబంధించి సర్జరీ చేయించుకున్న ముర్రే తన ఆటలో పదును పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఐదుసార్లు ఫైనల్ చేరిన ముర్రేకు అన్నిసార్లు భంగపాటే ఎదురైంది. ఒక ఫైనల్లో రోజర్ ఫెదరర్ చేతిలో ఓడిన ముర్రే.. మిగతా నాలుగు ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను కొట్టాలన్న కసితో ఉన్న ముర్రే.. తొలి రౌండ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇక ముర్రే ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన ముర్రే.. ఆ తర్వాత 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన బ్రిటీష్ ప్లేయర్‌గా ముర్రే చరిత్రకెక్కాడు. మళ్లీ 2016లోనూ ముర్రే వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చదవండి: అలా అయితే నువ్వు మాకొద్దు! Murray magic ✨@andy_murray outlasts Nikoloz Basilashvili 6-1, 3-6, 6-4, 6-7(5), 6-4 after nearly four hours of tennis!#AusOpen · #AO2022 🎥: @wwos · @espn · @Eurosport · @wowowtennis pic.twitter.com/lr9xMN8f9M — #AusOpen (@AustralianOpen) January 18, 2022 -
French Open:: టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం
ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మే 30 నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో గ్రాస్‌కోర్టు సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకే ముర్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా గత మార్చిలో మయామి ఓపెన్ నుంచి వైదొలిగిన ముర్రే ఆ తర్వాత మరే టోర్నీలోనూ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగలేదు. చదవండి: Rafael Nadal: పదోసారీ టైటిల్ అతడిదే -
ఫ్రెంచ్ ఓపెన్‌లో ముర్రేకు వైల్డ్ కార్డు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు ఈ నెల 27న మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు తగిన ర్యాంక్ లేకపోవడంతో ముర్రే గత ఘనతలను లెక్కలోనికి తీసుకొని (2016లో రన్నరప్) ఈ అవకాశం ఇచ్చారు. గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరం కావడంతో ముర్రే ర్యాంక్ 129కి పడిపోయింది. యూఎస్ ఓపెన్‌లోనూ ముర్రే వైల్డ్ కార్డుతోనే ఆడాడు. -
యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)కు షాక్ తగిలింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ముర్రే రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మూడో రౌండ్లోకి అడుగుపెట్టాలని భావించిన ముర్రేకు కెనడాకు చెందిన 15వ సీడ్ ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్ షాకిచ్చాడు. వరుస సెట్లలో గెలిచి ముర్రేపై అద్భుత విజయం సాధించాడు. తొలి రౌండ్లో కష్టపడి నెగ్గిన ముర్రే.. రెండో రౌండ్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఫెలిక్స్ అగర్ 6-2, 6-3, 6-4 తేడాతో ముర్రేపై సంచలన విజయం నమోదు చేశాడు. అసలు ముర్రేకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఆగర్ హ్యాట్రిక్ సెట్లను గెలుచుకుని మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. (చదవండి: టాప్ సీడ్ ఆట ముగిసింది) దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ముర్రే.. ఫెలిక్స్ ఆగర్ దెబ్బకు మెగా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించక తప్పలేదు. 20 ఏళ్ల ఫెలిక్స్ ఆగర్ తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకుని పైచేయి సాధించాడు. ఆపై రెండో సెట్లో కూడా అదే జోరును ప్రదర్శించిన ఫెలిక్స్.. మూడో సెట్లో కాస్త శ్రమించాడు. 2012 యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన ముర్రే.. మరొకసారి ఈ టైటిల్‌ను గెలవాలనుకున్న ఆశలకు రెండో రౌండ్లోనే బ్రేక్ పడింది. తుంటి భాగానికి రెండు సార్లు సర్జరీ చేయించుకున్న ముర్రే.. తొలి రౌండ్‌ను అతికష్టం మీద గెలిచాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా, రెండో రౌండ్లో గ్రౌండ్లో కదలడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ ముర్రే తన పోరును ఆదిలోనే ముగించేశాడు. -
ముర్రే అవుట్
లండన్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఆండీ ముర్రే వచ్చే నెలలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో బ్రిటన్ తరఫున 32 ఏళ్ల ముర్రే డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో తన పాత గాయం తిరగబెట్టిందని అతను వెల్లడించాడు. ‘అత్యున్నత స్థాయిలో మళ్లీ పోటీ పడేందుకు ఎంతో శ్రమించాను. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరం కావాల్సి వస్తోంది. నేను చాలా నిరాశ చెందాను. అయితే ఇటీవలి పరిణామాల తర్వాత ముందు జాగ్రత్తగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ముుర్రే చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదు సార్లు ఫైనల్ చేరిన ముర్రే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. -
పరాజయంతో పునరాగమనం
సిన్సినాటి (అమెరికా): ఏడు నెలల తర్వాత సింగిల్స్ విభాగంలో పునరాగమనం చేసిన బ్రిటన్ టెన్నిస్ స్టార్, మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ ఆండీ ముర్రేకు నిరాశ ఎదురైంది. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. రిచర్డ్ గాస్కే(ఫ్రాన్స్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 4–6, 4–6తో ఓడిపోయాడు. జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ముర్రే ఆటకు దూరంగా ఉన్నాడు. ఒకానొక దశలో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడంతో జూన్‌లో మళ్లీ ఆటపై దృష్టి పెట్టాడు. డబుల్స్ విభాగంలో ఐదు టోర్నీల్లో ఆడాడు. సిన్సినాటి ఓపెన్‌లో తొలి రౌండ్లో ఓడిపోయినప్పటికీ తాను బాధ పడటంలేదని అన్నాడు. వచ్చే నెలలో జరిగే సీజన్‌లోని చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను సింగిల్స్ విభాగంలో పోటీపడటం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు షరపోవా (రష్యా), వీనస్ విలియమ్స్ (అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–3, 7–6 (7/4)తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, వీనస్ 7–5, 6–2తో లారెన్ డేవిస్ (అమెరికా)పై విజయం సాధించారు. -
కన్నీళ్లతో టెన్నిస్‌కు ముర్రే వీడ్కోలు!
మెల్బోర్న్: సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయంతో బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ ఆండీ ముర్రే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 31 ఏళ్ల ముర్రే శుక్రవారం ప్రకటించాడు. సోమవారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్ అవుతున్నట్లు అతను చెప్పాడు. సొంతగడ్డపై ఈ ఏడాది వింబుల్డన్ ఆడిన తర్వాత గుడ్‌బై చెప్పాలనుకున్నానని, అయితే అప్పటి వరకు తాను నొప్పితో ఆడలేనని అన్నాడు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ముర్రే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘తుంటి గాయం చాలా బాధపెడుతోంది. ఏదోలా ఓర్చుకుంటూ కొంత వరకు ఆడగలనేమో. కానీ అంత సహనంతో బాధను భరిస్తూ ప్రాక్టీస్‌లో గానీ పోటీల్లో గానీ శ్రద్ధ పెట్టలేకపోతున్నా. కాబట్టి ఇదే నా ఆఖరి టోర్నీ కావచ్చు’అని ముర్రే వ్యాఖ్యానించాడు. ఇంగ్లీష్ హీరో... 1936లో ఫ్రెడ్ పెర్రీ వింబుల్డన్ గెలిచిన తర్వాత బ్రిటన్ అభిమానులు మళ్లీ టైటిల్ సాధించే తమ దేశపు ఆటగాడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు 2013లో సొంతగడ్డపై వింబు ల్డన్ గెలిచి ముర్రే 77 ఏళ్ల కల నెరవేర్చాడు. మరో మూడేళ్లకు 2016లో కూడా ముర్రే ఇదే టైటిల్ నెగ్గాడు. ఈ రెండింటికంటే ముందు 2012లో గెలిచిన యూఎస్ ఓపెన్ అతని ఖాతాలో ఉన్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (2012, 2016) అతను స్వర్ణపతకం గెలుచుకొని ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2016 నవంబర్ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగిన రికార్డు ముర్రే సొంతం. మొత్తం 45 ఏటీపీ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. -
సై అంటే సై అంటున్న ‘బిగ్ ఫోర్’
న్యూయార్క్: ఈ ఏడాది ‘బిగ్ ఫోర్’తో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరం కానుంది. గాయంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) పునరాగమనంతో పాటు ఈ ఏడాది ‘గ్రాండ్’ చాంపియన్లు ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), నాదల్ (ఫ్రెంచ్), జొకోవిచ్ (వింబుల్డన్) బరిలోకి దిగనుండటంతో యూఎస్ ఓపెన్‌లో హోరాహోరీకి రంగం సిద్ధమైంది. టాప్ స్టార్లంతా ఆడుతున్న సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీకి నేడు తెరలేవనుంది. భారత్ నుంచి యూకీ బాంబ్రీ పురుషుల సింగిల్స్‌లో... రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ డబుల్స్‌లో దిగుతున్నారు. ‘24’ కోసం సెరెనా... మహిళల సింగిల్స్ బరిలో ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ సెరెనా ఈసారి విజేతగా నిలిస్తే అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జోరుమీదున్న ‘జోకర్’... వింబుల్డన్ చాంపియన్, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) న్యూయార్క్‌లోనూ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది భుజం గాయంతో యూఎస్‌కు దూరమైన ‘జోకర్’ ఇక్కడ మూడో టైటిల్ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015లలో విజేతగా నిలిచిన జొకో ఐదుసార్లు రన్నరప్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో ఫెడరర్‌పై టైటిల్ గెలిచిన జొకోవిచ్ మొత్తం తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోరు మీదున్న ఈ సెర్బియన్ స్టార్ తన ఫామ్ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్), రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. -
ముర్రే కథ ముగిసింది
►క్వార్టర్ ఫైనల్లో సామ్ క్వెరీ చేతిలో పరాజయం ►రావ్నిచ్ను చిత్తు చేసి సెమీస్‌లోకి ఫెడరర్ ►గాయంతో జొకోవిచ్ నిష్క్రమణ లండన్: డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 3–6, 6–4, 6–7 (4/7), 6–1, 6–1తో ముర్రేను ఓడించాడు. 42వ ప్రయత్నంలో ఈ అమెరికా అజానుబాహుడు తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. అంతేకాకుండా 2009లో ఆండీ రాడిక్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన అమెరికా క్రీడాకారుడిగానూ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 3–6, 7–6 (8/6), 7–5, 5–7, 6–1తో 16వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)ను ఓడించాడు. ఫెడరర్ ఫటాఫట్... పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–4, 6–2, 7–6 (7/4)తో ఆరో సీడ్ రావ్‌నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో గతేడాది ఇదే టోర్నీ సెమీస్‌లో రావ్‌నిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ఫెడరర్ బదులు తీర్చుకున్నాడు. ఫెడరర్ తన కెరీర్లో 42వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం. థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ తొలి సెట్‌ను 6–7 (2/7) కోల్పోయి, రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సిలిచ్‌తో సామ్ క్వెరీ; బెర్డిచ్‌తో ఫెడరర్ తలపడతారు.మిక్స్డ్ డబుల్స్ విభాగం మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7–6 (7/5), 6–2తో మెక్టిక్–అనా కొంజూ (క్రొయేషియా) జోడీపై నెగ్గగా... సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం 6–7 (4/7), 4–6తో కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. -
ముర్రే మెరిసె...
అలవోక విజయంతో మూడో రౌండ్లోకి ∙వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: డిఫెండింగ్ చాంపియన్ బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే మళ్లీ మెరిశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సునాయాస విజయాన్ని సాధించాడు. తద్వారా ఈ టోర్నీలో తాను ఆడిన 13వసారీ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే 6–3, 6–2, 6–2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై గెలుపొందాడు. గంటా 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ముర్రేకు ఏదశలోనూ ఇబ్బంది కాలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన ముర్రే, కేవలం ఐదు అనవసర తప్పిదాలు చేశాడు. బ్రౌన్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ముర్రే, తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. జులపాల జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించే డస్టిన్ బ్రౌన్ 2015లో రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. 1996 నుంచి తన జుట్టును కత్తిరించుకోని 32 ఏళ్ల బ్రౌన్ ఈసారి మాత్రం ఎలాంటి అద్భుతం చేయలేదు. పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–6 (7/2), 6–4, 7–5తో మాయెర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ నిషికోరి (జపాన్) 6–4, 6–7 (7/9), 6–1, 7–6 (8/6)తో స్టకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6–1, 7–5, 6–2తో బొలెలీ (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. క్విటోవాకు షాక్... మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్, రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో క్విటోవా 3–6, 6–1, 2–6తో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ వీనస్ 4–6, 6–4, 6–1తో కియాంగ్ వాంగ్ (చైనా)పై , ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 7–6 (7/4), 4–6, 10–8తో వెకిక్ (క్రొయేషియా)పై, ఎనిమిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–4తో బ్రాడీ (అమెరికా)పై, అజరెంకా (బెలారస్) 6–3, 6–3తో 15వ సీడ్ వెస్నినా (రష్యా)పై గెలిచారు. సానియా జంట శుభారంభం మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–ఫ్లిప్కెన్స్ (బెల్జియం) జోడీ 6–4, 6–3తో ఒసాకా (జపాన్)–షుయె జాంగ్ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (8/6)తో ఎడ్మండ్ (ఇంగ్లండ్)–సుసా (పోర్చుగల్) జోడీపై నెగ్గింది. -
ముర్రే శుభారంభం
నాదల్, సిలిచ్ కూడా వింబుల్డన్ టోర్నీ లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ముర్రే 6–1, 6–4, 6–2తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలిచాడు. గంటా 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు అంతరాయం కలిగింది. మూడు ఏస్‌లు సంధించిన ముర్రే, నెట్ వద్ద 29 పాయింట్లు సాధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 97వ ర్యాంకర్ డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)తో ముర్రే ఆడతాడు. మరోవైపు నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–1, 6–3, 6–2తో జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తన కెరీర్లో 850వ విజయాన్ని నమోదు చేశాడు. క్విటోవా ముందుకు... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), రెండో సీడ్ హలెప్ (రొమేనియా), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో క్విటోవా 6–3, 6–4తో లార్సన్ (స్వీడన్)పై, హలెప్ 6–4, 6–1తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)పై, స్వితోలినా 7–5, 7–6 (10/8)తో బార్టీ (ఆస్ట్రేలియా)పై, వీనస్ 7–6 (9/7), 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచారు. వీనస్ కంట కన్నీరు తొలి రౌండ్లో మెర్టెన్స్పై గెలిచాక మీడియా సమావేశానికి హాజరైన మాజీ చాంపియన్ వీనస్ కన్నీళ్లపర్యంతమైంది. జూన్ 9న ఫ్లోరిడాలో వీనస్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో వీనస్ కారు ఢీకొని 78 ఏళ్ల జెరోమ్ బార్సన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇటీవలే మరణించాడు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి వీనస్‌ను మీడియా ప్రశ్నించగా ఆమె భోరున విలపించింది. ‘ఆ సంఘటనపై స్పందించేందుకు నా నోట మాటలు రావడంలేదు. ఆట మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేను’ అని వీనస్ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకైతే వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. -
వావ్రింకా, ముర్రే జోరు
క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)... ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ వావ్రింకా 7–5, 7–6 (9/7), 6–2తో 15వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... టాప్ సీడ్ ముర్రే 6–3, 6–4, 6–4తో ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. మోన్ఫిల్స్తో రెండు గంటల 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మోన్ఫిల్స్ ఓటమితో ఈ టోర్నీలో ఫ్రాన్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. 1983లో యానిక్ నోవా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాక... 1988లో హెన్రీ లెకొంటె ఫైనల్‌కు చేరిన తర్వాత ఇప్పటివరకు ఈ టోర్నీలో ఫ్రాన్స్ నుంచి మరో క్రీడాకారుడు ఫైనల్‌కు చేరలేకపోయాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ముర్రే తాజా విజయంతో తన కెరీర్లో 650 విజయాలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 15వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), ఎనిమిదో సీడ్ కీ నిషికోరి (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరి 0–6, 6–4, 6–4, 6–0తో వెర్డాస్కో (స్పెయిన్)పై, జొకోవిచ్ 7–6 (7/5), 6–1, 6–3తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, థీమ్ 6–1, 6–3, 6–1తో జెబలాస్ (అర్జెంటీనా)పై నెగ్గగా... సిలిచ్ 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అండర్సన్ (దక్షిణాఫ్రికా) గాయంతో వైదొలిగాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరితో ముర్రే; సిలిచ్‌తో వావ్రింకా; కరెనో బుస్టాతో నాదల్; థీమ్‌తో జొకోవిచ్ తలపడతారు. సానియా జంట ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 6–3, 6–4తో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. క్వార్టర్స్‌లో ప్లిస్కోవా, హలెప్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), మూడో సీడ్ హలెప్ (రొమేనియా), 28వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో హలెప్ 6–1, 6–1తో నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 4–6, 6–3, 7–5తో మార్టిక్ (క్రొయేషియా)పై, గార్సియా 6–2, 6–4తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, ప్లిస్కోవా 2–6, 6–3, 6–4తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్‌లో ముర్రే
పారిస్: ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో ముర్రే 7–6 (10/8), 7–5, 6–0తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/2), 6–0, 6–2తో ఫాగ్నిని (ఇటలీ)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–1, 6–3, 6–3తో లోపెజ్ (స్పెయిన్)పై, వెర్డాస్కో (స్పెయిన్) 6–2, 6–1, 6–3తో 22వ సీడ్ క్యువాస్ (ఉరుగ్వే)పై నెగ్గారు. రద్వాన్‌స్కా అవుట్...: మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా 2–6, 1–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–2, 2–6, 6–3తో బెలిస్ (అమెరికా)పై, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 7–5తో కసత్కినా (రష్యా)పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 4–6, 9–7తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై గెలిచారు. -
శ్రమించిన ముర్రే
పారిస్: బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ ఆండీ ముర్రే ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ దాటేందుకు చెమటోడ్చాడు. ఈ టాప్ సీడ్ ఆటగాడికి స్లోవేకియా ప్లేయర్ మార్టిన్ క్లిజాన్ గట్టిపోటీనిచ్చాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో చివరకు 6–7 (3/7), 6–2, 6–2, 7–6 (7/3)తో నెగ్గిన ముర్రే ఊపిరి పీల్చుకున్నాడు. టాప్ సీడ్ ముర్రేతో జరిగిన పోరులో స్లోవేకియా ఆటగాడు క్లిజాన్ స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. దీంతో రెండు సెట్లు టైబ్రేక్‌కు దారితీశాయి. చివరకు అనుభవజ్ఞుడైన బ్రిటన్ స్టార్‌దే పైచేయి అయింది. అతనితో పాటు వావ్రింకా, సిలిచ్, నిషికొరి ఫ్రెంచ్ ఓపెన్గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో ఐదో సీడ్ స్వితోలినా, రద్వాన్‌స్కా, వెస్నినా మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. వావ్రింకా కూడా... ఇతర మ్యాచ్‌లలో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–4, 7–6 (7/5), 7–5తో డొల్గొపొలొవ్ (ఉక్రెయిన్)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–2, 6–2తో క్రావ్చుక్ (రష్యా)పై, 8వ సీడ్ నిషికొరి (జపాన్) 6–3, 6–0, 7–6 (7/5) జెరిమి చార్డి (ఫ్రాన్స్)పై, 21వ సీడ్ ఇస్నర్ (అమెరికా) 6–3, 7–6 (7/3), 7–6 (7/2)తో లోరెంజి (ఇటలీ)పై, 28వ సీడ్ ఫాంగ్నిని (ఇటలీ) 6–4, 7–5, 6–3తో అండ్రిస్ సెప్పి (ఇటలీ)పై గెలుపొం దారు. రష్యా ఆటగాడు కచనోవ్ 7–5, 6–4, 6–4తో 13వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చాడు. 29వ సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా)తో జరిగిన పోరులో 3–6, 6–3, 1–1 స్కోరు వద్ద అల్మాగ్రో (స్పెయిన్) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగడంతో డెల్ పొట్రో ముందంజ వేశాడు. 18వ సీడ్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7–5, 4–6, 1–6, 2–6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో కంగుతిన్నాడు. రద్వాన్‌స్కా ముందంజ మహిళల సింగిల్స్‌లో పోలండ్ క్రీడాకారిణి, తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో ఆమె 6–7 (3/7), 6–2, 6–3తో వాన్ విత్వాన్చ్ (బెల్జియం)పై గెలుపొందింది. మిగతా మ్యాచ్‌ల్లో 20వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)కు 4–6, 1–6తో కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–3, 6–2తో పిరొంకొవా (బల్గేరియా)పై, 14వ సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా) 4–6, 6–3, 6–0తో లెప్చెంకో (అమెరికా)పై గెలుపొందారు. 17వ సీడ్ అనస్తాసిజా సెవస్తొవా (లాత్వియా) 6–3, 6–0తో బౌచర్డ్ (కెనడా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో రోహన్ బోపన్న జోడి శుభారంభం చేసింది. ఏడో సీడ్ బోపన్న–దబ్రోస్కీ (కెనడా) జోడి 6–0, 6–1తో జెస్సికా మూర్–మ్యాట్ రీడ్ (ఆస్ట్రేలియా) జంటపై అలవోక విజయం సాధించింది. -
'టాప్' గేర్‌లో ముర్రే
మాడ్రిడ్: గత కొంతకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. సోమవారం ఏటీపీ ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో ముర్రే అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మరొకవైపు ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా)ను ఓడించిన జ్వెరావ్(జర్మనీ) టాప్ టెన్ లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ముర్రే (10,370 పాయింట్లు)టాప్ లో కొనసాగుతుండగా, జొకోవిచ్ (7,445) రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దర మధ్య 2925 పాయింట్ల తేడా ఉండటం ముర్రే ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇక స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) వరుసగా ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ రెండో ర్యాంకులో నిలిచింది. -
ముర్రేకు షాక్
మాడ్రిడ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ మాడ్రిడ్: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ ఆండీ ముర్రే (బ్రిటన్)కు చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడోరౌండ్లో ముర్రే 3–6, 3–6తో ప్రపంచ 59వ ర్యాంకర్, బోర్నా కోరిక్ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఓసారి బ్రేక్ చేసిన ముర్రే.. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు ప్రపంచ మాజీ నం.1 నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ జకోవిచ్ 6–4, 7–5తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ నాదల్ 6–3, 6–1తో నికీ కిర్గియోస్ (ఆస్ట్రియా)పై అలవోక విజయం సాధించారు. -
తెప్పమీద తేలి ‘ఆడారు’
జ్యూరిచ్: ఆఫ్రికా ఖండంలోని చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా స్విస్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్, బ్రిటన్ క్రీడాకారుడు ఆండీ ముర్రే అడుగులు వేశారు. ఇందుకోసం ఇక్కడి లిమ్మట్ నదిలో కదిలే తెప్పపై ఆటను ప్రాక్టీస్ చేశారు. ‘మ్యాచ్ ఫర్ ఆప్రికా 3’ పేరిట రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఈ ఆటలో ఇరువురు పాల్గొన్నారు. తెప్పపై ఆట శిక్షణలో భాగంగా ఫెదరర్, ఆండీలు నదిలో పడకుండా బంతిని కొట్టాల్సి ఉంటుంది. విభిన్నంగా నదే వేదికగా నిర్వహించిన ఈ శిక్షణను ఇరువురి అభిమానులతోపాటు వందలాదిమంది తిలకించారు. దీనిని డ్రోన్ సహాయంతో వీడియో తీశారు. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన రోజర్ ఫెదరర్ ఫౌండేషన్.. దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్లలో విద్యా సంబంధిత ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. -
క్వాలిఫయర్ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రేకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ ముర్రే (బ్రిటన్) 4–6, 6–7 (5/7)తో క్వాలిఫయర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గతంలో పోస్పిసిల్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముర్రే ఈసారి మాత్రం కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
అటు ముర్రే... ఇటు కెర్బర్
ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్స్‌కు చుక్కెదురు l మిషా, కోకో వాండెవె సంచలన విజయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం పెను సంచలనాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 5–7, 6–2, 6–4తో ఆండీ ముర్రేను బోల్తా కొట్టించగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 35వ ర్యాంక్ కోకో వాండెవె 6–2, 6–3తో కెర్బర్‌ను మట్టికరిపించింది. 2004లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులు ప్రిక్వార్టర్స్లోపే ఓడిపోవడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని ఐదుసార్లూ రన్నరప్ట్రోఫీతోనే సరిపెట్టుకున్న ముర్రేకు ఈసారి కూడా ఈ టోర్నీ కలిసిరాలేదు. జొకోవిచ్ రెండో రౌండ్లోనే ఓడిపోవడంతో ముర్రేకు ఈసారి టైటిల్ మార్గం సుగమం అయిందని భావించినా... మిషా జ్వెరెవ్ రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. ముర్రేతో 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన మిషా ఏకంగా 118 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 65 సార్లు పాయింట్లు సాధించడం విశేషం. కేవలం 26 అనవసర తప్పిదాలు చేసిన మిషా ఎనిమిదిసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. కెర్బర్తో 68 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కోకో ఏదశలోనూ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రెండు సెట్లలో రెండేసిసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో తన కెరీర్లో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఫెడరర్... మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మరోసారి స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఫెడరర్ 6–7 (4/7), 6–4, 6–1, 4–6, 6–3తో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 24 ఏస్‌లు సంధించి, ఏడుసార్లు నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/2), 7–6 (7/4), 7–6 (7/4)తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6–7 (4/7), 6–2, 6–4, 6–4తో ఇవాన్స్ (బ్రిటన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ముగురుజా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), 13వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగురుజా 6–2, 6–3తో సొరాని క్రిస్టియా (రొమేనియా)పై, వీనస్ 6–3, 7–5తో మోనా బార్తెల్ (జర్మనీ)పై, పావ్లీచెంకోవా (రష్యా) 6–3, 6–3తో కుజ్నెత్సోవాపై గెలిచారు. సానియా–స్ట్రికోవా జంటకు షాక్ మహిళల డబుల్స్ విభాగం మూడో రౌండ్లో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్)–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 3–6, 6–2, 2–6తో ఎరి హోజుమి–మియు కాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6–4, 6–3తో డెస్టానీ ఐయివా– పోల్మన్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. -
ప్రపంచ నెంబర్ వన్‌కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నెంబర్ వన్, బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రేకు షాక్ తగిలింది. ఈ మెగా టైటిల్‌ను సాధించాలన్న కల మరోసారి కలగానే మిగిలింది. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో ముర్రే అనామక ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ముర్రే 5-7, 7-5, 2-6, 4-6 స్కోరుతో 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మూడున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే నాలుగు సెట్లలో మ్యాచ్‌ను కోల్పోయాడు. -
కెర్బర్... మళ్లీ కష్టంగా!
శ్రమించి నెగ్గిన టాప్ సీడ్ మూడో రౌండ్లో ఫెడరర్, ముర్రే ఏడో సీడ్ సిలిచ్‌కు చుక్కెదురు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: నంబర్‌వన్ ర్యాంక్‌తోపాటు టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్‌కు మళ్లీ గట్టిపోటీ లభించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఈ జర్మనీ స్టార్ రెండో రౌండ్లోనూ మూడు సెట్ల పోరులో గట్టెక్కింది. బుధవారం తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న కెర్బర్ రెండో రౌండ్లో 6–2, 6–7 (3/7), 6–2తో కరీనా వితోయెఫ్ట్ (జర్మనీ)పై గెలుపొందింది. రెండు గంటల ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 34 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ ప్లేయర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేయగలిగింది. గతంలో కెర్బర్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 0–6, 0–6తో ఓడిపోయి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయిన వితోయెఫ్ట్ ఈసారి మాత్రం 11 గేమ్‌లు సాధించడం విశేషం. ‘తొలిసారి టాప్ సీడ్ హోదాలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్నాను. ఈ ఒత్తిడిని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది. పదో సీడ్ నవారో ఓటమి మూడో రోజు మహిళల సింగిల్స్ విభాగంలో మూడు అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 29వ సీడ్ మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో), 20వ సీడ్ షుయె జాంగ్ (చైనా) రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. క్రిస్టియా (రొమేనియా) 7–6 (7/1), 6–3తో నవారోపై, అలీసన్ రిస్కీ (అమెరికా) 7–6 (9/7), 4–6, 6–1తో షుయె జాంగ్‌పై, మోనా బార్తెల్ (జర్మనీ) 6–4, 6–4తో మోనికా పుయిగ్పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ వీనస్ (అమెరికా) 6–3, 6–2తో వొగెలె (స్విట్జర్లాండ్)పై, ఏడో సీగ్ ముగురుజా (స్పెయిన్) 7–5, 6–4తో క్రాఫోర్డ్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 6–2, 6–1 తో ఫుర్లీస్ (ఆస్ట్రేలియా)పై, 11వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో బొసెరప్ (అమెరికా)పై నెగ్గారు. వావ్రింకా అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ నిషికోరి (జపాన్), మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) వరుస సెట్లలో తమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. ముర్రే 6–3, 6–0, 6–2తో రుబ్లెవ్ (రష్యా)పై, ఫెడరర్ 7–5, 6–3, 7–6 (7/3)తో నోవా రూబిన్ (అమెరికా)పై, వావ్రింకా 6–3, 6–4, 6–4తో జాన్సన్ (అమెరికా)పై, నిషికోరి 6–3, 6–4, 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై గెలిచారు. పదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) కూడా మూడో రౌండ్లోకి చేరారు. ఇస్నెర్కు షాక్ మరోవైపు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), 19వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న జాన్ ఇస్నెర్ 7–6 (7/4), 7–6 (7/4), 4–6, 6–7 (7/9), 7–9తో మిషా జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అన్‌సీడెడ్ డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) 3–6, 7–5, 6–3, 6–3తో సిలిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. -
ముర్రే నిరీక్షణ ఫలించేనా...
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్లో నేడు ప్రారంభం కానుంది. గతంలో ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి మాత్రం విజేత హోదాలో తిరిగి వెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ముర్రేతోపాటు జొకోవిచ్ (సెర్బియా), వావ్రింకా (స్విట్జర్లాండ్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ రికార్డుస్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై (అమెరికా) దృష్టి పెట్టింది. ప్రపంచ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), రద్వాన్‌స్కా (పోలండ్), సిమోనా హలెప్ (రొమేనియా), ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు. ఈ టోర్నీ మ్యాచ్‌లు ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
ఖతర్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్
దోహా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాడు. ఖతర్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ప్రస్తుత నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ పోరులో జొకోవిచ్ 6–3, 5–7, 6–4తో విజయం సాధించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 2,09,665 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 42 లక్షలు) లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సెట్లో జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలో ఉండి, తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను సాధిం చాడు. అయితే ముర్రే పట్టుదలతో పోరాడి మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడంతోపాటు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 7–5 తో దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లో ఏడో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
ముర్రేకు 'చెక్' పెట్టాడు!
దోహా:గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రేకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ బ్రేక్ వేశాడు. ఖతార్ ఓపెన్‌లో భాగంగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 5-7, 6-4 తేడాతో ముర్రేపై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. ఇదే క్రమంలో ముర్రే 28 వరుస విజయాలకు జొకోవిచ్ చెక్ పెట్టాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. గతంలో ముర్రేపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ టైటిల్ ను వరుసగా రెండోసారి చేజిక్కించుకున్నాడు. ఈ విజయంపై జొకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు. 2017లో టైటిల్‌తో శుభారంభం చేయడం ఆనందంగా ఉందన్నాడు. -
నంబర్‌వన్‌ను కాపాడుకోవాలంటే..
దోహా: ఇటీవల తాను సాధించిన నంబర్‌వన్ ర్యాంకును కాపాడుకోవాలంటే శ్రమించక తప్పదని బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అభిప్రాయపడ్డాడు. గతేడాదిని ఘనంగా ముగించిపట్ల సంతోషం వ్యక్తం చేసిన ముర్రే.. నంబర్ వన్ ర్యాంకుకు రావాలనే లక్ష్యంతోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ ఘనతు అందుకున్నట్లు తెలిపాడు. ఈ ర్యాంకును సాధించడానికి ఎంత కష్టపడ్డానో, దాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే శ్రమించక తప్పదన్నాడు. తనకు బలమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది సెర్బియా స్టార్ జొకోవిచ్నేనని ముర్రే తెలిపాడు. గతంలో జొకోను పలుమార్లు ఓడించినప్పటికీ అతనే తనకు కఠినమైన ప్రత్యర్థి అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్‌ను మరోసారి ఓడించటంపైనే దృష్టి పెట్టినట్లు ముర్రే పేర్కొన్నాడు. -
ఇక నుంచి ‘సర్’ ముర్రే... బ్రిటన్ టెన్నిస్ స్టార్‌కు నైట్‌హుడ్ పురస్కారం
ప్రపంచ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే... ప్రఖ్యాత అథ్లెట్ మో ఫరాలకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారం దక్కింది. శుక్రవారం రెండో ఎలిజబెత్ రాణి ప్రకటించిన నూతన సంవత్సర గౌరవ పురస్కార జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. అంతర్జాతీయ వేదికపై ఇంగ్లండ్ ఖ్యాతిని పెంపొందించినందుకు ఈ ఎంపిక జరిగింది. ఇక నుంచి వీరి పేరు ముందు ‘సర్’ అని సంభోదిస్తారు. 29 ఏళ్ల ముర్రే 2016లో వింబుల్డన్ టైటిల్ నెగ్గడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మో ఫరా రియో ఒలింపిక్స్‌లో 5,000... 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు గె లిచాడు. -
హిట్ హిట్ ముర్రే...
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సొంతం ఫైనల్లో జొకోవిచ్పై విజయం నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్ ముగింపు లండన్: ఈ ఏడాది గొప్ప ఫామ్‌లో ఉన్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సీజన్‌ను ఘనంగా ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ముర్రే విజేతగా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-4తో నాలుగుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ ఫలితంతో ముర్రే ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స ప్రవేశపెట్టాక ఓ బ్రిటన్ ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడం, సీజన్‌ను కూడా నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన ముర్రేకు 23 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.16 కోట్ల 29 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. 29 ఏళ్ల ముర్రేకిది వరుసగా 24వ విజయంతోపాటు వరుసగా ఐదో టైటిల్ కావడం విశేషం. అక్టోబరులో బీజింగ్, వియన్నా, షాంఘై ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ముర్రే... ఈ నెలలో పారిస్ మాస్టర్స్ సిరీస్‌తోపాటు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. అంతేకాకుండా 2006లో ఫెడరర్ తర్వాత మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకొని సీజన్ ముగింపు టోర్నమెంట్ టైటిల్ సాధిం చిన ప్లేయర్‌గా కూడా ముర్రే గుర్తింపు పొందాడు. మరోవైపు ఆండీ ముర్రే సోదరుడు జేమీ ముర్రే డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించాడు. టెన్నిస్ ర్యాంకింగ్స చరిత్రలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఇద్దరు సోదరులు ఏకకాలంలో నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
'నంబర్ వన్' విజయం.. వెరీ వెరీ స్పెషల్!
లండన్: బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఎవరికైనా గొప్ప విషయమే. అందులోనూ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న తర్వాత గెలిచిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆటగాళ్లకు ప్రత్యేకమే కదా. లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ పై 6-3, 6-2 తేడాతో విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన గేమ్‌లో రెండు వరుస నెట్లలో ముర్రే పైచేయి సాధించాడు. స్థానిక ఆటగాడు ముర్రేకు మ్యాచ్ ఆసాంతం వీక్షకుల నుంచి మద్దుతు లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ముర్రే మాట్లాడుతూ.. ఈ వాతావరణం తనకెంతో గొప్పగా అనిపించిందన్నాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ గెలుపోటముల రికార్డును ముర్రే 73-9తో మెరుగు పరుచుకున్నాడు. బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ కీ నిషికోరితో తలపడనున్నాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ముర్రే నెంబర్ ర్యాంకు సాధించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య గత వారం ర్యాంకులను వెల్లడించింది. ముర్రే, జొకోవిచ్, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు. -
ముర్రే.. హిప్ హిప్ హుర్రే..!
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో తొలిసారి నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా అవతరించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా అతడు ఈ ఘనత వహించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకులలో ముర్రే టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ముర్రే ఖాతాలో 11,185 పాయింట్లుండగా, జొకోవిచ్ ఖాతాలో 10,780 పాయింట్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టాన్ వావ్రింకా మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకూ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన సెర్బియా యోధుడు నొవాక్ జోకొవిచ్ ఈ టోర్నీలో క్వార్టర్స్ లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. ఈ ఏడాది ఒలింపిక్స్ స్వర్ణంతో పాటు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ లోనూ స్వర్ణం నెగ్గిన ముర్రే.. వరుసగా సింగిల్స్ లో రెండు స్వర్ణాలు నెగ్గిన టెన్నిస్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. -
పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-3, 6-7 (4/7), 6-4తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచి కెరీర్లో 14వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 7,46,550 యూరోల (రూ. 5 కోట్ల 55 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. సోమవారం విడుదల కానున్న ర్యాంకింగ్‌సలో ముర్రే అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. -
ప్రపంచ నంబర్‌వన్‌గా ముర్రే
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తన కెరీర్లోతొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ పారిస్ టోర్నీ క్వార్టర్స్‌లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది. -
'టాప్'కు గెలుపు దూరంలో..
పారిస్:ఎప్పట్నుంచో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకుపై కన్నేసిన బ్రిటన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే దాన్ని సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. తాజాగా జరుగుతున్న పారిస్ మాస్టర్స్ టోర్నీలో సెమీ ఫైనల్లో ముర్రే విజయం సాధించినట్లయితే వరల్డ్ నంబర్ వన్‌గా నిలుస్తాడు. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో థామస్ బెర్డిచ్‌పై విజయం సాధించిన ముర్రే.. సెమీస్ అడ్డంకిని అధిగమించిన క్రమంలో నంబర్ వన్ ర్యాంకు కూడా సొంతం చేసుకుంటాడు. ఇప్పటికే వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానాన్ని ముర్రే ఆక్రమించే అవకాశాలున్నాయి. శనివారం జరిగే సెమీఫైనల్లో రోనిచ్తో ముర్రే తలపడనున్నాడు. ఈ టోర్నీలో వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్.. మారిన్ సిలిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో అతను టాప్ ర్యాంకును కోల్పోయే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. దాదాపు 122 వారాలుగా జొకోవిచ్ నంబర్ వన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
నిషికొరి కొట్టేశాడు
ముర్రేపై సంచలన విజయం సెమీస్‌కు చేరిన జపాన్ స్టార్ వావ్రింకా, సెరెనా కూడా యూఎస్ ఓపెన్ న్యూయార్క్: రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీ నిషికొరి (జపాన్) మళ్లీ ఇన్నాళ్లకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన నిషికొరి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 1-6, 6-4, 4-6, 6-1, 7-5తో సంచలన విజయం సాధించాడు. కీలక సమయాల్లో దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన జపాన్ ప్లేయర్ దానికి తగిన ఫలితాన్ని అందుకోగా... ఒక దశలో ముర్రే వరుసగా ఏడు గేమ్‌లు కోల్పోయాడు. మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి 17 బ్రేక్ పాయింట్లు నమోదు చేయడం విశేషం. 2014 ఫైనల్లో సిలిక్ చేతిలో ఓడిన నిషికొరి సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో తలపడతాడు. హోరాహోరీ... తొలి సెట్లో చక్కటి నియంత్రణతో ఆడిన ముర్రే ,పదునైన రిటర్న్‌ల సహాయంతో 35 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. అనంతరం రెండో సెట్లో వ్యూహం మార్చిన నిషికొరి డ్రాప్ షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. ఆసక్తికరంగా సాగిన మూడో సెట్లో స్కోరు 4-4 వద్ద సమంగా ఉన్నప్పుడు తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆ తర్వాత సెట్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగో సెట్ ఆరంభంలో ఆర్థర్ యాష్ స్టేడియంలో సౌండ్ సిస్టం వ్యవస్థ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. ఈ గోలపై రిఫరీకి ఫిర్యాదు కూడా చేసిన ముర్రే, ఈ దశలో పూర్తిగా ఏకాగ్రత కోల్పోయాడు. మరో వైపు సంయమనం పాటించిన ఆరో సీడ్ దూసుకుపోయాడు. వరుసగా ఐదో గేమ్‌లు సొంతం చేసుకొని మ్యాచ్‌ను చివరి సెట్‌కు తీసుకుపోయాడు. ఐదో సెట్లోనూ 2-0తో అతను ముందంజ వేశాడు. అయితే కోలుకున్న ముర్రే 2-2తో స్కోరును సమం చేశాడు. నిషికొరి తర్వాతి రెండు గేమ్‌లు గెలిచినా... ముర్రే వరుసగా మూడు గేమ్‌లను సొంతం చేసుకొని 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే స్కోరు మళ్లీ 5-5తో సమమైంది. ఈ దశలో అద్భుతంగా ఆడి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన నిషికొరి తర్వాతి గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. స్టేడియంలో గోల వల్ల తాను ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా... తన ఓటమికి అది మాత్రం కారణం కాదని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల తర్వాత... మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 4-6, 6-3, 6-2 స్కోరుతో ప్రపంచ 142వ ర్యాంకర్ యువాన్ డెల్‌పొట్రొ (అర్జెంటీనా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విస్ ఆటగాడు 10 ఏస్‌లు సంధించాడు. 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ డెల్పొట్రొను వావ్రింకా ఓడించడం 2008 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. వింబుల్డన్ రెండో రౌండ్లో డెల్‌పొట్రొ చేతిలో వావ్రింకా చిత్తయ్యాడు. పోరాడి గెలిచిన సెరెనా... మహిళల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌కు చేరడంలో మూడు సెట్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2 గంటల 14 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 6-2, 4-6, 6-3తో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. టోర్నీలో తొలి సారి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేసింది. అయితే 18 ఏస్‌లు కొట్టి ఆమె మ్యాచ్‌ను కాపాడుకుంది. సెమీస్‌లో సెరెనా పదో సీడ్ ప్లిస్కోవా (చెక్)తో తలపడుతుంది. ఆండీ ముర్రేతో గతంలో తలపడిన ఎనిమిది మ్యాచ్‌లలో కీ నిషికొరి ఏడు సార్లు ఓడిపోయాడు. కొద్ది రోజుల క్రితమే రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో కూడా అతనికి పరాజయం ఎదురైంది. అయితే ఈ సారి ఈ జపాన్ స్టార్ తన ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన పోరులో వరల్డ్ నంబర్ 2ను ఓడించి కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే చాలు... నిషికొరి చెలరేగిపోతాడని అతని ఏటీపీ రికార్డు చెబుతోంది. ఇలాంటి మ్యాచ్‌లలో 79 శాతం నెగ్గిన ఘనత ఓపెన్ ఎరాలో ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా అతను అదే చేసి చూపించగా... ఈ క్యాలెండర్ ఇయర్లో నాలుగో స్లామ్లోనూ ఫైనల్‌కు చేరాలని భావించిన ముర్రే కోరిక తీరలేదు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో చివరకు నిషికొరిదే పైచేయి అయింది. -
ముర్రేకు షాకిచ్చిన జపాన్ స్టార్
బ్రిటన్ స్టార్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఆండీ ముర్రేకు జపాన్ సంచలనం కీ నిషికోరి షాకిచ్చాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ స్వర్ణంతో జోరు మీదున్న రెండో సీడెడ్ ముర్రేకు క్వార్టర్స్ లోనే బ్రేకులు పడ్డాయి. క్వార్టర్ ఫైనల్స్ లో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో ముర్రేపై నెగ్గి నిషికోరి సెమిఫైనల్స్ చేరుకున్నాడు. తొలి మూడు సెట్లలో రెండు సెట్లు కోల్పోయిన దశ నుంచి నిషికోరి అద్భుతంగా పుంజుకుని మాజీ చాంపియన్ ముర్రేను యూఎస్ ఓపెన్ నుంచి ఇంటిదారి పట్టించాడు. నాలుగో సెట్లో నిషికోరి ప్రతిఘటనకు ముర్రే తట్టుకోలేకపోయాడు. ఓ దశలో మూడుసెట్లోనే మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించగా.. ఆసియా ఆటగాడు తన రాకెట్‌కు పదును పెట్టడంతో మ్యాచ్ ఐదు సెట్ల వరకు వెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో మాత్రం ముర్రే, నిషికోరి నువ్వానేనా అనే రీతిలో పోటీపడీ మరి పాయింట్లు సాధించారు. కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. చివరి సెట్ నెగ్గి రెండోసారి యూఎస్ ఓపెన్ సెమిస్లోకి దూసుకెళ్లాడు. 2014లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఓవరాల్ గా ముఖాముఖీ పోరులో గెలుపోటముల రికార్డులో నిషికోరిపై 9-2తో ముర్రేదే పైచేయి. -
అయ్యో... నాదల్
పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోని ఈ స్పెరుున్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదు సెట్ల మ్యాచ్‌లో ఓడిపోయాడు. 4 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్, 22 ఏళ్ల లుకాస్ పురుు (ఫ్రాన్స) 6-1, 2-6, 6-4, 3-6, 7-6 (8/6)తో నాదల్‌ను ఓడించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఓటమితో నాదల్ 2004 తర్వాత తొలిసారి ఒకే ఏడాది ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోకుండా గ్రాండ్‌స్లామ్ సీజన్‌ను ముగించడం జరిగింది. ‘నేను కుర్రాడిగా ఉన్నపుడు ఆర్థర్ యాష్ స్టేడియంలో నాదల్ ఆడిన అన్ని మ్యాచ్‌లను చూశాను. ఈరోజు అతణ్నే ఓడించాను’అని పురుు అన్నాడు. పురుు విజయంతో 1947 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముగ్గురు ఫ్రాన్స ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఫ్రాన్సకే చెందిన సోంగా, మోన్ఫిల్స్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. 25 ఏళ్ల తర్వాత...: ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6-3, 3-2తో ఆధిక్యంలో ఉన్న దశలో థీమ్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో 25 ఏళ్ల తర్వాత డెల్‌పొట్రో (142వ ర్యాంక్) రూపంలో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరిసారి 1991లో జిమ్మీ కానర్స్ (174వ ర్యాంక్) ఈ ఘనత సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-2, 6-2తో 22వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-1, 6-7 (5/7), 6-3తో మర్చెంకో (ఉక్రెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 7-6 (7/4)తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. భారత్‌కు రానున్న నాదల్ స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ఈనెల 16 నుంచి 18 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడే స్పెరుున్ జట్టును మంగళవారం ప్రకటించారు. -
సెరెనా మరో అరుదైన రికార్డు!
న్యూయార్క్: ఈ ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్‌లో విజేతగా నిలవడం ద్వారా 22 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో స్టెఫీగ్రాఫ్ సరసన నిలిచిన నల్లకలువ, అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ... తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్లో విజయం సాధించిన సెరెనా.. అత్యధికంగా 306 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ను సమం చేసింది. భారతకాలమానం ప్రకారం గురువారం ఆర్థర్ యాష్ స్టేడియంలో అర్దరాత్రి జరిగిన పోరులో సెరెనా 6-3, 6-3 తేడాతో తన సహచర అమెరికా క్రీడాకారిణి వెనియా కింగ్‌పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో 13 ఏస్‌లను సంధించిన సెరెనా, 38 విన్నర్స్ ను సొంతం చేసుకుని విజయం సాధించింది. ఆద్యంత దూకుడుగా ఆడిన సెరెనా ధాటికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ సాధించిన వెనియా కింగ్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. రెండో సెట్ లో కూడా అదే ఊపును కనబరిచి వరుస సెట్లలో పోరును ముగించింది. ఈ మ్యాచ్‌కు ముందు పదే పదే వర్షం ఆటంకం కల్గించడంతో స్టేడియంలో రూఫ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటివరకూ 17 సార్లు యూఎస్ ఓపెన్ లో పాల్గొన్న సెరెనాకు ఇలా రూఫ్ కింద ఆడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆరు యూఎస్ ఓపెన్ లు గెలిచిన సెరెనా.. ఏడో టైటిల్ పై కన్నేసింది. ఒకవేళ యూఎస్ గ్రాండ్ స్లామ్ ను సెరెనా సాధిస్తే ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. -
'టాప్'పై ముర్రే గురి!
లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల టైటిల్ ను గెలిచిన బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే టాప్ ర్యాంకింగ్ పై దృష్టి పెట్టాడు. ఈ టోర్నీలో సెర్బయా స్టార్ ,ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్ లోనే నిష్క్రమించడంతో పాటు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్లో ఓడిపోవడంతో టైటిల్ ను ముర్రే సునాయాసంగా గెలిచాడు. దాంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లలో మరింత పైకి ఎగబాకాడు. వింబుల్డన్ టోర్నీ ద్వారా 1280 పాయింట్లను ముర్రే తన ఖాతాలో వేసుకోగా, జొకోవిచ్ మాత్రం 1910 పాయింట్లను కోల్పోయాడు. టోర్నీ ఆరంభానికి ముందు వింబుల్డన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జొకోవిచ్ ఖాతాలో 16, 950 ఏటీపీ పాయింట్లు ఉండగా, ముర్రే ఖాతాలో 8, 915 పాయింట్లు ఉన్నాయి. అయితే టోర్నీ ముగిసే నాటికి ముర్రే 10, 195 పాయింట్లకు ఎగబాకగా, జోకర్ 15, 040 పాయింట్లకు పడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య వ్యత్యాసం 4,845 పాయింట్లకు చేరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసాన్ని తదుపరి టోర్నీల్లో మరింత తగ్గిస్తానని ముర్రే అంటున్నాడు. 'నాకు నంబర్ ర్యాంకును ఆస్వాదించడమంటే ఇష్టం. దానిపైనే దృష్టిపెట్టా. ఇక నుంచి ప్రతీ ఈవెంట్ లోనూ మెరుగ్గా రాణించి దాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తా. అదే నా గోల్. వింబుల్డన్ అనేది నా జీవితంలో చాలా గొప్ప టోర్నమెంట్. దాన్ని రెండుసార్లు సాధించినందుకు గర్వపడుతున్నా. రాబోయే మరిన్ని గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించినట్లైతే మరింతగా రాటుదేలతా. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఓటమి పాలైన జొకోవిచ్ మరింత బలంగా తిరిగివస్తాడు' అని ముర్రే తెలిపాడు. -
ముర్రేదే వింబుల్డన్
లండన్: బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే సొంత గడ్డపై రెచ్చిపోయాడు. ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా 2012లో రికార్డు సృష్టించిన ముర్రే .. రెండోసారి వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కెనడా ఆటగాడు ఏడోసీడ్ మిలోస్ రోనిచ్‌పై 6-4, 7-6, 7-6తో విజయం సాధించాడు. ఈ ఏడాది ఇంతకుముందు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్‌కు చేరినా జొకోవిచ్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ రెండోసీడ్ ఆటగాడు ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. కెరీర్లో ముర్రేకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ముర్రే.. 2013లో వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ మూడేళ్లకు మరోసారి వింబుల్డన్ ద్వారానే తన గ్రాండ్‌స్లామ్ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న రోనిచ్ చివరికి రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఇద్దరు ఆటగాళ్లు మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే సెట్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్‌ను నెగ్గాడు. ఇక రెండోసెట్ కూడా హోరాహోరీగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలుపుకోవడంతో సమానంగా పాయింట్లు సాధిస్తూ వెళ్లారు. దాంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ముర్రే తన జోరు ప్రదర్శించాడు. ఏకంగా రెండుసార్లు రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-3తో సెట్‌ను నెగ్గాడు. మరోవైపు మూడోసెట్‌ను కూడా టైబ్రేకర్ ద్వారా నెగ్గిన ముర్రే వింబుల్డన్ విజేతగా నిలిచాడు. -
సెమీస్‌లో ముర్రే
లండన్: బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే.. ఏడోసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 7-6 (12/10), 6-1, 3-6, 4-6, 6-1తో 12వ సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 2013లో టైటిల్ సాధించిన ముర్రే... శుక్రవారం జరిగే సెమీస్‌లో బెర్డిచ్ (చెక్)తో తలపడతాడు. సోంగాతో తలపడిన 15 మ్యాచ్‌ల్లో 13సార్లు గెలిచిన ముర్రే కెరీర్లో ఇది 100వ విజయం. -
ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో
లండన్:ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు, బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ ముర్రే క్వీన్స్ క్లబ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముర్రే 6-7(5/7), 6-4, 6-3 తేడాతో మిలాస్ రాయనిక్(కెనడా)పై గెలిచి ఐదోసారి టైటిల్‌ను సాధించాడు. టై బ్రేక్ కు దారి తీసిన తొలి సెట్ ను కోల్పోయిన ముర్రే.. ఆ తరువాత రెండు సెట్లలో విజృంభించాడు. రెండు గంటల 13 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో రాయనిక్ను ముర్రే మట్టికరిపించాడు. తద్వారా ఐదోసారి క్వీన్స్ క్లబ్ టైటిల్‌ను సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ టైటిల్‌ను జాన్ మెక్ ఎన్రో, బోరిస్ బేకర్, ఆండీ రాడిక్, హెవిట్లను నాలుగు సార్లు మాత్రమే దక్కించుకున్నారు. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తరువాత డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2005లో రాడిక్ ఒక్కడే ఆ ఘనతను అందుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌కు వార్మప్ గా జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ముర్రే 37వ ఏటీపీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జైకోవిచ్...
► కెరీర్ స్లామ్’ సాధించిన సెర్బియా స్టార్ ► ఈ ఘనత అందుకున్న ఎనిమిదో ప్లేయర్ ► ఎట్టకేలకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ హస్తగతం ► ఫైనల్లో ఆండీ ముర్రేపై విజయం ► వరుసగా 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అరుదైన ఘనత జోకర్ కాదు... ఇప్పుడతను ‘కింగ్’. ఏక కాలంలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను చేత్తోపట్టిన టెన్నిస్ ప్రపంచపు రారాజు. పోయినచోటే వెతుక్కోవాలని అంటారు. నొవాక్ జొకోవిచ్ విషయంలో అదే జరిగింది. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ‘కెరీర్ స్లామ్’ ఘనతను సాధించే అవకాశం దక్కినా ఈ సెర్బియా స్టార్‌కు నిరాశే ఎదురైంది. అయితే నాలుగో ప్రయత్నంలో మాత్రం అనుకున్నది సాధించాడు. గతేడాది తుది సమరంలో వావ్రింకాను తక్కువ అంచనా వేసి బోల్తా పడినా... ఈసారి అలాంటి తప్పిదం చేయలేదు. ఫైనల్ ప్రత్యర్థి ఆండీ ముర్రేపై స్ఫూర్తిదాయక విజయం సాధించి ‘కెరీర్ స్లామ్’ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రీడాకారుడిగా నిలిచాడు. పారిస్: ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ‘ఫ్రెంచ్ ఓపెన్’ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-1, 6-2, 6-4తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీలో 2012, 2014, 2015లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జొకోవిచ్... నాలుగో ప్రయత్నంలో విజేతగా అవతరించి తొలిసారి ‘ఫ్రెంచ్’ చాంపియన్‌గా నిలిచాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ స్లామ్ (టెన్నిస్ సర్క్యూట్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) ఘనతను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఏకకాలంలో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ ఆండీ ముర్రేకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఫైనల్ ఆడుతున్న ముర్రే తొలి సెట్‌ను నెగ్గడంతో జొకోవిచ్‌కు మరోసారి నిరాశ తప్పదా అనిపించింది. అయితే వెంటనే తేరుకున్న జొకోవిచ్ రెండో సెట్ నుంచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో జొకోవిచ్ జోరు మరింత పెరిగింది. ఈ సెట్లోనూ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నాలుగో సెట్లో ముర్రే కాస్త పోటీనిచ్చినా మళ్లీ రెండుసార్లు బ్రిటన్ స్టార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ► అత్యధికంగా 12వ ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్ 11వ ప్రయత్నంలో ఈ టైటిల్ సాధించాడు. ► జిమ్ కొరియర్ (అమెరికా-1992లో) తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ► మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి నాలుగోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్, జెరోస్లావ్ డ్రోబ్నీ మాత్రమే ఇలా చేశారు. ► అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సరసన జొకోవిచ్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (14 టైటిల్స్), రాఫెల్ నాదల్ (14 టైటిల్స్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. మళ్లీ నిరాశే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో ముర్రే ఓడిపోవడం ఇది ఐదోసారి. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగుసార్లు ముర్రే ఓడిపోయాడు. ‘కెరీర్ స్లామ్’ వీరులు... ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్), డాన్ బడ్జ్ (అమెరికా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేతలు... డాన్ బడ్జ్ (1938-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), రాడ్ లేవర్ (1962, 1969-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), జొకోవిచ్ (2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్-2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 1971 తర్వాత ఫ్రాన్స్ జంటకు టైటిల్... మహిళల డబుల్స్ విభాగంలో మ్లాడెనోవిచ్-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మ్లాడెనోవిచ్-గార్సియా ద్వయం 6-3, 2-6, 6-4తో మకరోవా-వెస్నినా (రష్యా) జోడీపై గెలిచింది. 1971లో గెయిల్ చాన్ఫ్రెయు-ఫ్రాంకోయిజ్ దుర్ జంట తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫెలిసియానో లోపెజ్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట గెల్చుకుంది. ఫైనల్లో ఈ జోడీ 6-4, 6-7 (6/8), 6-3తో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయంపై నెగ్గింది. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓ స్పెయిన్ జోడీ ఖాతాలో పురుషుల డబుల్స్ టైటిల్ చేరింది. రోలాండ్ గారోస్‌లో తొలిసారి కొత్త అనుభూతికి లోనవుతున్నాను. ఇదో ప్రత్యేక క్షణం. నా కెరీర్లోనే అత్యుత్తమం. మా ఫైనల్ చూసేందుకు ఇంత మంది ప్రేక్షకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్టు, మీరు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అందుకే ఈ మట్టిపై నా హృదయం పరుస్తున్నాను. ఇలా బొమ్మ గీసి తనను అనుకరించేందుకు అనుమతి ఇచ్చిన మాజీ చాంపియన్ గుస్తావో కుయెర్టన్కు కృతజ్ఞతలు. -జొకోవిచ్ -
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్
ప్యారీస్: టాప్ సీడ్, సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నువాక్ జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఆదివారమిక్కడ జరిగిన తుది పోరులో జకోవిచ్ 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో టెన్నిస్ స్టార్ (బ్రిటన్) ఆండీ ముర్రే పై విజయం సాధించాడు. దీంతో జోకోవిచ్... తన కెరీర్లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. జకోవిచ్ కెరీర్లో ఇది 12వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ కాగా, ఇప్పటికే 8 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఎనిమిదోవ వ్యక్తిగా జకోవిచ్ రికార్డ్ సృష్టించాడు. -
క్విటోవా, సఫరోవా అవుట్
ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముర్రే పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టారు. షెల్బీ రోజర్స్ (అమెరికా) 6-0, 6-7 (3/7), 6-0తో క్విటోవాపై... సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-7 (0/7), 7-5తో సఫరోవాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-7 (6/8), 6-2తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-0తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, ఆరో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 4-6, 6-2, 6-3తో ఒసాకా (జపాన్)పై, 13వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6-1, 6-4తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగం మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-4, 7-6 (7/3)తో కార్లోవిచ్ (క్రొయేషియా)పై, ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 3-6, 2-6, 6-4తో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో సానియా జంట మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో సానియా-హింగిస్ జంట 6-2, 6-0తో నవో హిబినో-ఎరి హొజుమి (జపాన్) ద్వయంపై గెలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు వేర్వేరు భాగస్వాములతో కలిసి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. గాయంతో వైదొలిగిన నాదల్ పురుషుల సిం గిల్స్ విభాగంలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) మోచేతి గాయం కారణంగా ఈసారి టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ‘మోచేతికి గాయమైంది. ఈ టోర్నీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడితే గాయం తీవ్రత పెరిగే అవకాశముంది. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ కాకపోయుంటే అసలు బరిలోకి దిగేవాడిని కాదు’ అని నాదల్ అన్నాడు. -
జొకోవిచ్ ‘సిక్సర్’
* ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ హస్తగతం * రూ. 16 కోట్ల 35 లక్షల ప్రైజ్‌మనీ సొంతం * ఐదోసారి ఫైనల్లో ఓడిన ఆండీ ముర్రే మెల్బోర్న్: అదే జోరు. అదే ఫలితం. వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నొవాక్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 7-5, 7-6 (7/3)తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2013, 2014, 2015లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆండీ ముర్రే ఐదోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఐదు ఫైనల్స్‌లో ముర్రే నాలుగుసార్లు జొకోవిచ్ చేతిలో... ఒకసారి ఫెడరర్ (2010లో) చేతిలో ఓటమి చవిచూశాడు. రెండు గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ ఆటతీరుకు ముర్రే వద్ద సమాధానం లేకపోయింది. తొలి సెట్లో కేవలం ఒక గేమ్ కోల్పోయిన జొకోవిచ్... రెండో సెట్లో రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్నాడు. మూడో సెట్లో ఇద్దరూ ఒక్కోసారి సర్వీస్‌ను కోల్పోయారు. అయితే టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి వరుస సెట్లలో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ముర్రే ఏకంగా 65 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 34 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 16 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఆండీ ముర్రేకు 17 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 8 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1968కి ముందు ఈ టోర్నీని రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) ఆరుసార్లు సాధించాడు. ప్రస్తుతం ఎమర్సన్ పేరిట ఉన్న అత్యధిక ఆస్ట్రేలియన్ టైటిల్స్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. తన కెరీర్లో 11వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ బోర్గ్ (స్వీడన్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో, పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెయిన్-14 చొప్పున) రెండో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (12 టైటిల్స్) మూడో స్థానంలో ఉన్నారు. తాజా పరాజయంతో ఆండీ ముర్రే ఓపెన్ శకంలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఐదుసార్లు ఫైనల్లో ఓడిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. గతంలో ముర్రేకు కోచ్‌గా వ్యవహరించిన ఇవాన్ లెండిల్ యూఎస్ ఓపెన్‌లో (1982, 83, 84, 88, 89) ఐదుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత లెండిల్ యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు (1985, 86, 87) సాధించడం విశేషం. -
జొకోవిచ్ 'సిక్సర్' కొట్టాడు
మెల్బోర్న్:ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తూ ట్రోఫిని చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-1,7-5,7-6(7/3) తేడాతో వరల్డ్ నంబర్ టూ ఆటగాడు ఆండీ ముర్రే(బ్రిటన్) ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. దీంతో జొకోవిచ్ ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సాధించగా, ఓవరాల్ గా 11 వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు గంటలకు పైగా జరిగిన పోరులో జొకోవిచ్ ఆద్యంతం ఆకట్టకున్నాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్ లో ముర్రే నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ముర్రే అనవసర తప్పిదాలకు తోడు, అతని సర్వీసలను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ సెట్ ను కూడా దక్కించుకుని పైచేయి సాధించాడు. అనంతరం మూడో సెట్ లో జొకోవిచ్ -ముర్రేల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టై బ్రేక్ కు దారి తీసిన ఆ సెట్ లో జొకోవిచ్ 7-3 తేడాతో గెలిచి టైటిల్ ను ముద్దాడాడు. కాగా, ఐదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన ముర్రే మరోసారి రన్నరప్ గా నే సరిపెట్టుకున్నాడు. అంతకుముందు ముర్రే 2010,11,13,15 సంవత్సరాల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. జొకొవిచ్ గెలిచిన గ్రాండ్ స్లామ్ లు.. ఆస్ట్రేలియా ఓపెన్ (2008, 2011, 2012, 2013, 2015,2016) వింబుల్డన్ (2011, 2014, 2015) యూఎస్ ఓపెన్(2011, 2015) ఫ్రెంచ్ ఓపెన్ లు లేవు -
ఐదోసారి ఫైనల్లోకి ముర్రే
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఐదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ ముర్రే 4-6, 7-5, 6-7 (4/7), 6-4, 6-2తో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ముర్రే ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ముర్రే తలపడతాడు. 2010 ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిన ముర్రే... 2011, 2013, 2015లలో జొకోవిచ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. నేడు మహిళల ఫైనల్ (సెరెనా X కెర్బర్) మహిళల సింగిల్స్ టైటిల్ కోసం నేడు (శనివారం) జరిగే ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో ఏడో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తలపడుతుంది. ఇప్పటికే 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా ఫైనల్లో నెగ్గితే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సొంతం చేసుకున్న స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) సరసన నిలుస్తుంది. కెర్బర్ గెలిస్తే... 1994లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన మరో జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. -
ముర్రే మెరిసె...
♦ ఏడేళ్లలో ఆరోసారి సెమీస్‌కు ♦ తొలిసారి సెమీస్‌లోకి రావ్‌నిచ్ మెల్బోర్న్: అందని ద్రాక్షగా ఊరిస్తోన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే... తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ముర్రే 6-3, 6-7 (5/7), 6-2, 6-3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ముర్రే గత ఏడేళ్లలో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 2010, 2011, 2013, 2015లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచిన ముర్రే ఇదే జోరును కొనసాగిస్తే ఐదోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ముర్రే తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రావ్‌నిచ్ 6-3, 3-6, 6-3, 6-4తో 23వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. తద్వారా కెనడా తరఫున ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ముర్రే, రావ్‌నిచ్ ముఖాముఖి రికార్డులో 3-3తో సమఉజ్జీగా ఉండటంతో ఈసారి సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశముంది. ఫెరర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముర్రేకు రెండో సెట్లో మినహా అంతగా పోటీ ఎదురుకాలేదు. మూడో సెట్లో స్కోరు 3-1 వద్ద ఉన్నపుడు భారీ వర్ష సూచనతో ముందు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ మ్యాచ్ వేదికైన రాడ్‌లేవర్ ఎరీనా పైకప్పును మూసేయాలని నిర్ణయించారు. దాంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. పైకప్పు మూసిన తర్వాత ముర్రే తన దూకుడును కొనసాగించి 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. నాలుగో సెట్లో ఫెరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన ముర్రే తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 39 ఏళ్ల తర్వాత...: మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ యువతార జొహానా కొంటా సంచలన జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కొంటా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 39 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున 1977లో స్యు బార్కర్ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో జొహానా కొంటా 6-4, 6-1తో క్వాలిఫయర్ జాంగ్ షుయె (చైనా)పై గెలిచింది. హంగేరి జాతీయత ఉన్న తల్లిదండ్రులకు 1991లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించిన కొంటా 2005లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. 2012లో బ్రిటన్ పౌరసత్వం వచ్చేవరకు కొంటా ఆస్ట్రేలియాకి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం కొంటా వద్ద మూడు దేశాల (హంగేరి, ఆస్ట్రేలియా, బ్రిటన్) పాస్‌పోర్టులు ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కెర్బర్ 6-3, 7-5తో 14వ సీడ్, మాజీ నంబర్‌వన్, మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై సంచలన విజయం సాధించి సెమీస్‌లో జొహానా కొంటాతో పోరుకు సిద్ధమైంది. కొంటా, కెర్బర్లలో ఎవరు గెలిచినా తమ కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటారు. గతంలో కెర్బర్ 2011లో యూ ఎస్ ఓపెన్‌లో, 2012లో వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని నిష్ర్కమించింది. మరోవైపు కొంటా గతంలో ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. నేడు జొకోవిచ్ ఁ ఫెడరర్: పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం తొలి సెమీఫైనల్ జరగనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు. గురువారమే జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా విలియమ్స్ (అమెరికా); జొహానా కొంటాతో ఎంజెలిక్ కెర్బర్ తలపడతారు. -
ముర్రే జోరు
♦ మూడోరౌండ్లోకి ప్రవేశం ♦ వావ్రింకా, ఫెరర్, ఇస్నేర్ కూడా ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. బరిలోకి దిగిన సీడెడ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ సాఫీగా గట్టెక్కారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-0, 6-4, 6-1తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. 91 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రిటన్ ప్లేయర్ అద్భుతమైన రిటర్న్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సర్వీస్ చేసే గ్రోత్‌ను నేర్పుగా కట్టిపడేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో... 4వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 6-3, 6-4తో రాడెక్ స్టెఫానిక్ (చెక్)పై; 8వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 6-4, 6-4తో లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)పై; 10వ సీడ్ జాన్ ఇస్నేర్ (అమెరికా) 6-3, 7-6 (6), 7-6 (2)తో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై; 13వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (6), 7-6 (5), 7-5తో టోమి రోబెర్డో (స్పెయిన్)పై; 16వ సీడ్ బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రేలియా) 6-4, 6-2, 6-7 (5), 7-5తో సైమన్ బొలెల్లీ (ఇటలీ)పై; 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (2), 6-7 (4), 7-6 (3), 6-7 (8), 6-4తో గుయిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. మహిళల రెండోరౌండ్లో మూడోసీడ్ ముగురుజా (స్పెయిన్) 6-4, 6-2తో క్రిస్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై; 7వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 6-4తో అలెగ్జాండ్రా డుల్గెర్ (రొమేనియా)పై; 9వ సీడ్ ప్లిస్కోవా (చెక్) 7-6 (5), 6-1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై; అన్నికా బెక్ (జర్మనీ) 6-2, 6-3తో 11వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై; 14వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-1, 6-2తో డంకా కొవిన్చ్ (మాంటెగ్రో)పై; 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-7 (4), 6-3, 6-3తో ష్వెదోవా (కజకిస్తాన్)పై; 20వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-3, 6-3తో సెవస్తోవా (లాత్వేనియా)పై; నవోమి ఒసాకా (జపాన్) 6-4, 6-4తో 18వ సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)పై; లౌరా సెగుమండ్ (జర్మనీ) 3-6, 7-6 (5), 6-4తో 19వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు. -
ఏసెస్‌కు షాక్
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదు న్న డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రెండో పరాజయం ఎదురైంది. సింగపూర్ స్లామర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 16-27 గేమ్‌ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే లీగ్‌లో 257 గేమ్‌లతో లీగ్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఏసెస్ జట్టు ఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో 0-6తో కార్లోస్ మోయా చేతిలో ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (ఏసెస్) 6-3తో బెలిండా బెన్సిచ్పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 5-6తో బ్రౌన్-ప్లిస్కోవా జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో డోడిగ్-టామిక్ (ఏసెస్) జోడీ 4-6తో ఆండీ ముర్రే-మార్సెలో మెలో ద్వయం చేతిలో ఓటమి చెందగా... పురుషుల సింగిల్స్‌లో నిక్ కిరియోస్ 6-1తో బెర్నాడ్ టామిక్ (ఏసెస్)ను ఓడించి సింగపూర్ స్లామర్స్‌కు ఈ లీగ్‌లో ఆరో విజయాన్ని అందించాడు. -
వండర్సన్...
మూడో సీడ్ ఆండీ ముర్రేకు షాక్ ♦ దక్షిణాఫ్రికా ప్లేయర్ అండర్సన్ సంచలనం ♦ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి ♦ ఆరో సీడ్ బెర్డిచ్ కూడా ఇంటిదారి ♦ ఎదురులేని ఫెడరర్ గత ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో నిలకడకు మారుపేరుగా నిలిచిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి తడబడ్డాడు. దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు కెవిన్ అండర్సన్ ధాటికి ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లో చేతులెత్తేశాడు. భారీ సర్వీస్‌లతో విరుచుకుపడిన అండర్సన్ ఆద్యంతం నిలకడగా ఆడి వండర్ ఫలితాన్ని సాధించాడు. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. న్యూయార్క్ : గొప్ప వేదికలపై గత రికార్డులు ప్రభావం చూపవని... ఆ రోజు అద్భుతంగా ఆడిన వారినే విజయం వరిస్తుందని మరోసారి రుజువైంది. 2011 నుంచి వరుసగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. 4 గంటల 18 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-6 (7/5), 6-3, 6-7 (2/7), 7-6 (7/0)తో ముర్రేను మట్టికరిపించాడు. ► 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న 29 ఏళ్ల అండర్సన్ ఈ మ్యాచ్‌లో 25 ఏస్‌లు సంధించాడు. ముర్రే సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన అతను తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 57 అనవసర తప్పిదాలు చేసినా.. నిర్ణాయక టైబ్రేక్‌లలో మాత్రం అండర్సన్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. టాప్-15 ర్యాంకుల్లోని ఆటగాడిపై నెగ్గడం అండర్సన్ కెరీర్లో ఇదే తొలిసారి. ► ఈ మ్యాచ్‌కు ముందు ముర్రేతో గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అండర్సన్ ఐదుసార్లు ఓడిపోయాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకే ఒక్కసారి 2010 ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో ముర్రేతో ఆడిన అండర్సన్ కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచి ఓటమిని మూటగట్టుకున్నాడు. అయితే తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో అండర్సన్ నిరూపించాడు. గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈసారి అద్భుత విజయాన్ని దక్కించుకొని ముర్రే ఆట కట్టించాడు. ► 1992లో వేన్ ఫెరారీ తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో అండర్సన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో అండర్సన్ 4-3తో ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-4, 1-6, 6-3, 6-4తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. సూపర్ ఫెడరర్ మరోవైపు రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన విజయపరంపర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/0), 7-6 (8/6), 7-5తో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడో సెట్లోని 12వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి గెలిచాడు. ► 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 109 కేజీల బరువున్న ఇస్నెర్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఓ టైబ్రేక్‌ను 0-7తో కోల్పోయాడు. ఐదుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఇస్నెర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫెడరర్ 15 ఏస్‌లు సంధించి,16 అనవసర తప్పిదాలు చేశాడు. ► క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 14-2తో ఆధిక్యంలో ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రిచర్డ్ గాస్కే 2-6, 6-3, 6-4, 6-1తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయాన్ని సాధించాడు. చెమటోడ్చి నెగ్గిన హలెప్: మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-7 (6/8), 7-5, 6-2తో 24వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయింది. మహిళల టెన్నిస్‌లో వేగవంతమైన సర్వీస్, ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు సంధించిన రికార్డును కలిగిన లిసికి ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో అద్భుతంగా ఆడింది. అయితే కీలకమైన మూడో సెట్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. లిసికి ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-4, 6-4తో 2011 చాంపియన్, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)ను ఓడించగా... ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-3తో క్వాలిఫయర్ జొహనా కొంటా (బ్రిటన్)పై గెలిచింది. మిక్స్డ్ సెమీస్‌లో బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్) -యుంగ్ జాన్‌చాన్ ద్వయం (చైనీస్ తైపీ) 7-6 (9/7), 5-7, 13-11తో ‘సూపర్ టైబ్రేక్’లో సు వీ సెయి (చైనీస్ తైపీ)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) జంటపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీకి సిమోనా హలెప్-హొరియా టెకావ్ (రుమేనియా) జంట నుంచి వాకోవర్ లభించింది. సెమీస్‌లో బోపన్న-యుంగ్ జాన్ చాన్‌లతో పేస్-హింగిస్ తలపడతారు. ప్రాంజల పరాజయం జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. 15వ సీడ్ ప్రాంజల 6-7 (1/7), 3-6తో వాలెంటిని గ్రామాటికోపులూ (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం. ఓ అనామక ఆటగాడి చేతిలో ఓటమిపాలైన ప్రపంచ మూడో సీడ్ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాకు చెందిన 15వ సీడ్ కెవెన్ అండర్సన్ చేతిలో 7-6, 6-3, 6-7, 7-6 తేడాతో ముర్రే మట్టికరిచాడు. గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన కెవెన్.. ఈ సంచలన విజయంతో ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్షించాడు. ముర్రే 2012 యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫెడరర్... ఫటాఫట్...
♦ వరుసగా 15వసారి ప్రిక్వార్టర్స్‌లోకి ♦ ముర్రే, వావ్రింకా కూడా ముందంజ ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ కొత్త వ్యూహాలకు పదును పెడుతూ... అనుభవాన్ని రంగరిస్తే... వయసుతో సంబంధం లేకుండా తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించి అలవోక విజయాలు సాధించవచ్చని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నిరూపిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వింబుల్డన్ టోర్నీలో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతను యూఎస్ ఓపెన్‌లో ఈసారి దూసుకెళ్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థికి సెట్ కోల్పోకుండా ఈ ఐదుసార్ల మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఫెడరర్‌తోపాటు మాజీ విజేత ఆండీ ముర్రే, ఐదో సీడ్ వావ్రింకా, ఆరో సీడ్ బెర్డిచ్లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. న్యూయార్క్ : గతంలో తనకెంతో కలిసొచ్చిన వేదికపై ఫెడరర్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తనకు ఎదురైన అనుకూల ‘డ్రా’ను సద్వినియోగం చేసుకుంటూ, పక్కాగా ఆడుతూ ఒక్కో అడ్డంకిని దాటుతున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ స్విట్జర్లాండ్ స్టార్ వరుసగా 15వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-4, 6-4తో 29వ సీడ్ ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు. గంటా 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 34 ఏళ్ల ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. అయితే ఫెడరర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. వింబుల్డన్ టోర్నమెంట్ తర్వాత ఫెడరర్ తన సర్వీస్‌ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక కోల్ష్రైబర్తో ఇప్పటివరకు ఆడిన 10 సార్లూ ఫెడరరే నెగ్గడం విశేషం. ఈసారీ ఫెడరర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడు తూ కోల్ష్రైబర్పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. పదునైన సర్వీస్‌లు సంధిస్తూ... శక్తివంతమైన రిటర్న్ షాట్లు కొడుతూ... నెట్ వద్దకు తరచూ దూసుకువచ్చిన ఫెడరర్ నిలకడగా పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో ఫెడరర్ ప్రత్యర్థి ఆటగాళ్ల సర్వీస్‌ను రిటర్న్ చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. అతని ఆటతీరును చూశాక మునుపటి ఫెడరర్ కనిపిస్తున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 4-1తో ఆధిక్యంలో ఉన్నాడు. మూడో రౌండ్లో జాన్ ఇస్నెర్ 6-3, 6-4తో తొలి రెండు సెట్లు గెలిచాక, అతని ప్రత్యర్థి వాసెలి (చెక్ రిపబ్లిక్) మెడ నొప్పి కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. చెమటోడ్చిన బెర్డిచ్ మరోవైపు మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 30వ సీడ్ థామస్ బెలూచి (బ్రెజిల్)తో జరిగిన మూడో రౌండ్లో ముర్రే 6-3, 6-2, 7-5తో విజయం సాధించాడు. రెండు గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తన సర్వీస్‌లో ఒకే గేమ్‌ను కోల్పోయాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/5), 6-4తో బెమెల్మన్స్ (బెల్జియం)పై గెలుపొందగా... ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (2/7), 7-6 (9/7), 6-3, 6-3తో 31వ సీడ్ లోపెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బెర్డిచ్, రెండోసెట్‌ను టైబ్రేక్‌లోనే నెగ్గి పుంజుకున్నాడు. క్వార్టర్స్‌లో సిలిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సిలిచ్ 6-3, 2-6, 7-6 (7/2), 6-1తో 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-1తో 24వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో 20వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ డొనాల్డ్ యంగ్ (అమెరికా) 4-6, 0-6, 7-6 (7/3), 6-2, 6-4తో 22వ సీడ్ ట్రయెస్కీ (సెర్బియా)ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్లో 11వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్)ను ఓడించిన మాది రిగానే ఈ మ్యాచ్‌లోనూ యంగ్ తొలి రెండు సెట్లు కోల్పోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి విజేతగా నిలిచాడు. మరో ముగ్గురు అవుట్... మహిళల సింగిల్స్ విభాగంలో తాజాగా 11వ సీడ్ కెర్బర్, 16వ సీడ్ సారా ఎరాని, 18వ సీడ్ పెట్కోవిచ్ మూడో రౌండ్లోనే నిష్ర్కమించారు. 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 7-5, 2-6, 6-4తో కెర్బర్‌ను ఓడించింది. రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-2, 6-3తో రోజర్స్ (అమెరికా)పై, జొహనా కొంటా (బ్రిటన్) 7-6 (7/2), 6-3తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 7-5, 2-6, 6-1తో సారా ఎరాని (ఇటలీ)పై, లిసికి (జర్మనీ) 6-4, 4-6, 7-5తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, 24వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 1-6, 6-1, 6-4తో సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నారు. మూడో రౌండ్లో పేస్-హింగిస్ జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో యూజిన్ బౌచర్డ్ (కెనడా)-కిరియోస్ (ఆస్ట్రేలియా) జోడీ నుంచి పేస్-హింగిస్‌లకు వాకోవర్ లభించింది. క్రీడాకారులకు కేటాయించిన లాకర్ గదిలో కెనడా అమ్మాయి బౌచర్డ్ పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. దాంతో రెండో రౌండ్లో కిరియోస్-బౌచర్డ్ జంట బరిలోకి దిగలేదు. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయం 3-6, 6-3, 10-8తో కుద్రయెత్సెవా (రష్యా) -పెయా (ఆస్ట్రియా) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 6-3, 7-6 (7/4)తో ఫ్రిస్టెన్బర్గ్ (పోలండ్)-గొంజాలెజ్ (మెక్సికో) జంటపై గెలిచింది. -
ఫెడరర్... సాఫీగా
అలవోక విజయంతో రెండో రౌండ్లోకి ఆండీ ముర్రే, వావ్రింకా కూడా యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: మహిళల సింగిల్స్ విభాగంలో టాప్-10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... దానికి భిన్నంగా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం సీడెడ్ ఆటగాళ్లు సునాయాస విజయాలతో శుభారంభం చేశారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సులువైన ‘డ్రా’ పొందిన ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తోపాటు మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. అర్జెంటీనాకు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ లియోనార్డో మాయెర్తో జరిగిన తొలి రౌండ్లో ఫెడరర్ 6-1, 6-2, 6-2తో కేవలం 77 నిమిషాల్లో విజయం సాధించాడు. 34 ఏళ్ల ఈ స్విస్ స్టార్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు మాయెర్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ‘గతేడాది షాంఘై మాస్టర్స్ సిరీస్‌లో మాయెర్తో జరిగిన మ్యాచ్‌లో నేను ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలిచాను. యూఎస్ ఓపెన్‌లో ఈసారి నా తొలి రౌండ్ ప్రత్యర్థి అతనే అని తేలడంతో గట్టిపోటీ తప్పదనుకున్నాను. కానీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో వరుస సెట్లలో విజయం దక్కడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. వరుసగా 16వ సారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతోన్న ఫెడరర్ రెండో రౌండ్లో స్టీవ్ డార్సిస్ (బెల్జియం)తో తలపడతాడు. ఆస్ట్రేలియా యువతార నిక్ కిరియోస్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ ఆండీ ముర్రే 7-5, 6-3, 4-6, 6-1తో గెలుపొంది ముందంజ వేశాడు. 2 గంటల 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఏకంగా 18 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-4, 7-6 (8/6)తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో ఫ్రటాంగెలో (అమెరికా)పై, 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 6-2, 6-3, 6-4తో జజిరి (ట్యూనిషియా)పై నెగ్గారు. అయితే 11వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-2, 6-4, 4-6, 4-6, 4-6తో డొనాల్డ్ యంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-5, 7-5, 7-6 (7/4)తో క్రాజ్నోవిచ్ (సెర్బియా)పై, 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) 7-5, 6-4, 7-6 (7/1)తో క్లిజాన్ (స్లొవేకియా)పై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లోకి మాడిసన్ కీస్ మహిళల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో కీస్ 6-1, 6-2తో స్మిట్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... 31వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 5-7, 4-6తో కొంటావీట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో క్విటోవా 6-1, 6-1తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజ్నియాకి 6-2, 6-0తో జేమీ లోబ్ (అమెరికా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-2, 6-4తో వితోఫ్ట్ (జర్మనీ)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-1తో డల్గెరూ (రుమేనియా)పై, 18వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) 3-6, 6-4, 7-5తో గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్‌లో పేస్-ముర్రే జోడీ
మాంట్రియల్ : కెనడా ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్) -ఆండీ ముర్రే (బ్రిటన్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-ముర్రే ద్వయం 6-3, 6-1తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్లో ‘బై’ పొందిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్-టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీతో ఆడుతుంది. -
సాఫీగా... ముందుకు...
తొలి రోజు తరహాలోనే రెండో రోజూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. టైటిల్ ఫేవరెట్స్‌గా భావిస్తున్న వారందరూ తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేసి శుభారంభం చేశారు. మిగతా సీడెడ్ క్రీడాకారులకు కాస్త గట్టిపోటీ ఎదురైనా తుదకు గట్టెక్కి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. లండన్ : భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ క్రీడాకారులు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్లో సునాయాస విజయాలతో ముందంజ వేశారు. గతేడాది రన్నరప్, రెండో సీడ్ ఫెడరర్ 6-1, 6-3, 6-3తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా)పై కేవలం 67 నిమిషాల్లో గెలుపొంది తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రెండో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా)తో ఈ స్విస్ స్టార్ తలపడతాడు. పదో సీడ్, 2008, 2010 చాంపియన్ రాఫెల్ నాదల్ 6-4, 6-2, 6-4తో థామస్ బెలూచీ (బ్రెజిల్)ను అలవోకగా ఓడించాడు. గత మూడేళ్లుగా ఈ టోర్నీలో నాలుగో రౌండ్ దాటలేకపోయిన నాదల్ ఈసారి పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మరోవైపు బ్రిటన్ స్టార్, మూడో సీడ్ ఆండీ ముర్రే అంచనాలకు అనుగుణంగా ఆడుతూ 6-4, 7-6 (7/3), 6-4తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఈ ఇద్దరికి మహిళా కోచ్‌లు ఉండటం విశేషం. ముర్రేకు 2006 మహిళల సింగిల్స్ చాంపియన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్) కోచ్‌గా ఉండగా... కుకుష్కిన్కు అతని భార్య అనస్తాసియా కోచ్‌గా వ్యవహరిస్తోంది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (10/8), 6-7 (3/7), 6-4, 3-6, 6-2తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై కష్టపడి గెలుపొందగా... ఇతర మ్యాచ్‌ల్లో 15వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-2, 7-6 (7/4), 6-4తో డార్సిస్ (బెల్జియం)పై, 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-7 (2/7), 6-2, 6-4, 7-6 (7/2)తో ఐమెర్ (స్వీడన్)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 6-1, 6-4, 3-6, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై, 25వ సీడ్ ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) 6-3, 6-2, 6-2తో క్లెయిన్ (బ్రిటన్)పై గెలిచారు. మూడో సీడ్ హలెప్‌కు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో మాత్రం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)... నిరుటి రన్నరప్, 12వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సెపెలోవా (స్లొవేకియా) 5-7, 6-4, 6-3తో హలెప్‌ను ఓడించగా... యింగ్ యింగ్ దువాన్ (చైనా) 7-6 (7/3), 6-4తో బౌచర్డ్ను బోల్తా కొట్టించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-0తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, 10వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-0, 6-0తో విటోఫ్ట్ (బ్రిటన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి చేరుకున్నారు. బాబోయ్ ఎండ... గత కొన్నేళ్లుగా వింబుల్డన్ టోర్నమెంట్ మొదలైన వెంటనే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యేవాడు. ఆటకు ఆటంకం కలిగించేవాడు. కానీ ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. రెండో రోజు 30 డిగ్రీల వేడిలో మ్యాచ్‌లు జరిగాయి. బుధవారం ఉష్ణోగ్రత రికార్డుస్థాయిలో 35 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణశాఖ అంచనా. ఒకవేళ ఇలా జరిగితే మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో రెండో సెట్‌కు, మూడో సెట్‌కు 10 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు. పురుషుల విభాగంలో మాత్రం ఈ తరహా విరామం లేదు. -
హిట్.. హిట్.. ముర్రే
మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ సొంతం ⇒ ‘క్లే కింగ్’ నాదల్‌పై ఘనవిజయం ⇒ రెండు వారాల్లో రెండో టైటిల్ మాడ్రిడ్: క్లే కోర్టులపై తొలి టైటిల్ సాధించేందుకు పదేళ్లపాటు నిరీక్షించిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఊహించనివిధంగా వారం తిరిగేలోపు రెండో టైటిల్ సాధించి ఆశ్చర్యపరిచాడు. ‘క్లే కోర్టు’లపై తిరుగులేని రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి నెగ్గడం ఇక్కడ విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-2తో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై నెగ్గి విజేతగా నిలిచాడు. గతవారం మ్యూనిచ్ ఓపెన్‌లోనూ ముర్రే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్లో తొలిసారి క్లే కోర్టులపై టైటిల్ సాధించాడు. ఏప్రిల్ 11న తన చిన్ననాటి స్నేహితురాలు కిమ్ సియర్స్‌ను వివాహం చేసుకున్నాక ముర్రే ఆడిన రెండు టోర్నీల్లోనూ టైటిల్స్ నెగ్గ డం విశేషం. విజేతగా నిలిచిన ముర్రేకు 7,99,450 యూరోల (రూ. 5 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పదేళ్ల తర్వాత ‘ఐదు’ బయటకు నాదల్ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయిన రాఫెల్ నాదల్ ర్యాంకింగ్స్‌లోనూ పడిపోయాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్పెయిన్ స్టార్ నాలుగు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. 2005 తర్వాత నాదల్ టాప్-5 ర్యాంకుల్లో లేకపోవడం ఇదే తొలిసారి. జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆండీ ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఒక్కడే ‘ఐదు’
అంచనాలను నిజం చేస్తూ... పురుషుల టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదుర్స్ అనిపించాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. మెల్బోర్న్ పార్క్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరిన ఐదోసారీ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. జొకోవిచ్ కొత్త చరిత్ర ⇒ ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం ⇒ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు ⇒ రూ. 14 కోట్ల 96 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ⇒ ముర్రేకు నాలుగోసారీ నిరాశే మెల్బోర్న్: ఫెడరర్, రాఫెల్ నాదల్ లాంటి మాజీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించిన చోట... ఆద్యంతం నిలకడగా ఆడిన ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన హోదాకు, ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/5), 6-7 (4/7), 6-3, 6-0తో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్రను లిఖించాడు. గతంలో అతను 2008, 2011, 2012, 2013లో కూడా విజేతగా నిలిచాడు. మరోసారి నెగ్గితే... ఈ టోర్నీని అత్యధికంగా ఆరుసార్లు సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజం రాయ్ ఎమర్సన్ సరసన జొకోవిచ్ నిలుస్తాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నూ నెగ్గితే జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంటాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 96 లక్షలు); రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మూడోసారి తలపడిన జొకోవిచ్, ముర్రే ప్రతి పాయింట్‌కూ పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలతో ఈ ఇద్దరూ అలరించారు. తొలి రెండు సెట్లలో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండేసిసార్లు కోల్పోయారు. 72 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌ను టైబ్రేక్‌లో జొకోవిచ్ దక్కించుకోగా... 80 నిమిషాలపాటు జరిగిన రెండో సెట్‌ను టైబ్రేక్‌లో ముర్రే గెల్చుకున్నాడు. మూడో సెట్లోనూ తొలి ఆరు గేమ్‌ల వరకు ఇద్దరూ సమంగా నిలిచారు. అయితే ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ముర్రే ఊహించని విధంగా ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 39 నిమిషాల్లో మూడో సెట్‌ను నెగ్గాడు. నాలుగో సెట్లో జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ముర్రే సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ 28 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకొని విజేతగా నిలిచాడు. జొకోవిచ్ 8 ఏస్‌లు సంధించడంతోపాటు ముర్రే సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 40 అనవసర తప్పిదాలు చేసిన అతను నెట్‌వద్దకు 37 సార్లు వచ్చి 26 సార్లు పాయింట్లు సాధించాడు. ఈ ఓటమితో ఆండీ ముర్రేకు నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఓపెన్ శకంలో ఈ టోర్నీలో నాలుగుసార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ ఒక్కసారీ టైటిల్ సాధించలేకపోయిన తొలి ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు. -
ముర్రే మురిపించేనా
నేడు జొకోవిచ్‌తో అమీతుమీ గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌తో ఆదివారం జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ముర్రే సత్తాకు పరీక్షగా నిలువనుంది. 2013 వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించాక అతనితో తలపడిన నాలుగు సందర్భాల్లో ముర్రేకు ఓటమి ఎదురైంది. ఓవరాల్ ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 15-8తో ముందంజలో ఉన్నాడు. -
సెరెనా X షరపోవా
ఆరంభ దశలో ఎలాంటి సంచలనాలు నమోదైనా... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విభాగంలో చివరి దశకు వచ్చేసరికి టాప్ సీడ్స్ ఇద్దరే మిగిలారు. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్, రష్యా అందాలతార షరపోవా ఫైనల్‌కు చేరారు. అటు పురుషుల విభాగంలో క్వార్టర్స్‌లో నాదల్‌ను ఇంటికి పంపిన బెర్డిచ్ జోరుకు ఆండీ ముర్రే బ్రేక్ వేశాడు. * మహిళల టైటిల్ పోరుకు టాప్ సీడ్స్ * పురుషుల ఫైనల్లో ముర్రే * ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మెల్బోర్న్: ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-2తో అన్‌సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరువురు క్రీడాకారిణిలు 25 ఏస్‌లతో అలరించారు. అయితే అనుభవలేమితో ఇబ్బంది పడ్డ కీస్ 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కీలక సమయంలో డబుల్ ఫాల్ట్‌లు చేయడం కూడా సెరెనాకు కలిసొచ్చింది. తొలిసెట్ ఆరో గేమ్ వరకు మంచి నియంత్రణతో ఆడిన కీస్ ఆ తర్వాత కాస్త నిరాశపర్చింది. ఈ దశలో భారీ సర్వీస్‌లతో చెలరేగిన సెరెనా తన అనుభవంతో వరుసగా పాయింట్లు నెగ్గింది. అయితే 12వ గేమ్‌లో కీస్ అద్భుతమైన ఏస్‌ను సంధించడంతో గేమ్ టైబ్రేక్‌కు దారితీసింది. కానీ టైబ్రేక్‌లో కీస్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. ఊహించని రీతిలో రెండు ఏస్‌లను సంధించిన సెరెనా 4-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండు సెట్ పాయింట్లను కాచుకోవడంతో పాటు తిరుగులేని సర్వీస్‌ను సంధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సెరెనా మరింత దూకుడుగా ఆడింది. కీస్ చేసిన డబుల్ ఫాల్ట్‌ను ఆసరాగా చేసుకుని 5-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో కీస్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. కానీ చివర్లో సెరెనా కొట్టిన ఏస్‌కు సమాధానం చెప్పలేక సెట్‌తో పాటు మ్యాచ్‌నూ అప్పగించేసింది. షరపోవా అలవోకగా... మరో సెమీస్‌లో రెండోసీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-2తో అలవోకగా 10వ సీడ్ ఎకతెరినా మకరోవా (రష్యా)పై నెగ్గింది. గంటా 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా మూడు ఏస్‌లు సంధించగా, మకరోవా ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. అయితే 29సార్లు అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ఆరు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది. నెట్ వద్ద సూపర్‌గా ఆడిన షరపోవా తొమ్మిది బ్రేక్ పాయింట్లతో నాలుగింటిని కాచుకుంది. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగే ఫైనల్లో షరపోవా... సెరెనాతో తలపడుతుంది. బెర్డిచ్‌కు ముర్రే చెక్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-7 (6/8), 6-0, 6-3, 7-5తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 15 ఏస్‌లు కొట్టగా, బెర్డిచ్ ఐదింటితో సరిపెట్టుకున్నాడు. అయితే బ్రేక్ పాయింట్లను కాచుకోవడంలో బ్రిటన్ ఆటగాడు పైచేయి సాధించగా, చెక్ ప్లేయర్ వెనుకబడిపోయాడు. 56 అనవసర తప్పిదాలు, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. పురుషుల విభాగంలో రెండో సెమీఫైనల్ నేడు వావ్రింకా, జొకోవిచ్‌ల మధ్య జరుగుతుంది. -
ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఫైనల్ కు చేరాడు. గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్ లో ముర్రే 6-7(6-8), 6-0, 6-3, 7-5 తేడాతో బెర్డిచ్ ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్ లో రఫెల్ నాదల్ ను కంగుతినిపించిన బెర్డిచ్ ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను గెలుచుకని ముర్రేకు సవాల్ విసిరాడు. అయితే హోరా హోరీగా జరిగిన ఆ సెట్ ట్రై బ్రేక్ దారి తీసింది. చివరకు ఆ గేమ్ ను బెర్డిచ్ కైవశం చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అనంతరం ముర్రే విజృంభణ కొనసాగింది. ఇక బెర్డిచ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ముర్రే తన ఏస్ లతో బెంబేలెత్తించాడు. వరుస సెట్లను దక్కించుకున్న ముర్రే తుదిపోరుకు సిద్ధమయ్యాడు. -
ఐపీటీఎల్ తో కొత్త శిఖరాలకు టెన్నిస్: ముర్రే
దుబాయ్: టెన్నిస్ క్రీడను ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్) కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని బ్రిటీషు నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే అభిప్రాయపడ్డాడు. ఐపీటీఎల్ మహేష్ భూపతి లీగ్ కు ముర్రే నేతృత్వం వహించనున్నాడు. నవంబర్ 28న పిలిప్పీన్స్ లో ఐపీటీఎల్ ప్రారంభంకానుంది. 'క్రీడలకు కొత్త అభిమానులను సంపాదించడం ముఖ్యం. ఐపీటీఎల్ లాంటి టోర్నమెంట్ లు ఇంతకుముందెన్నడూ రాలేదు. విభిన్న అంశాలతో కూడిన ఐపీటీఎల్ ఆసక్తికరంగా ఉంటుంది. క్రీడాభిమాలకు కచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది' అని ముర్రే పేర్కొన్నాడు. -
స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు
ఎడిన్బారో: స్వతంత్ర దేశంగా అవతరించేందుకు అడుగులు వేస్తున్న స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు లబించింది. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండి ముర్రే చివరి నిమిషంలో స్కాట్లాండ్ కు సంఘీభావం ప్రకటించాడు. ప్రజాభిప్రాయసేకరణకు పోలింగ్ బూత్‌లు తెరవడానికి కొన్ని గంటల ముందు అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 'ఈరోజు స్కాట్లాండ్ దే. గత కొద్ది రోజులు స్కాట్లాండ్ కు వ్యతిరేకంగా ప్రచారం జరగడం లేదు. దీనితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్రజాభిప్రాయసేకరణ ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు. 2.7 మిలియన్ మందికి ఈ ట్వీట్ చేరింది. వేల సంఖ్యలో దీన్ని రీట్వీట్ చేయడం గమనార్హం. ఆండి ముర్రే నిర్ణయం బ్రిటన్ అభిమాను లను దిగ్భ్రాంతికి గురైయ్యారు. -
ఎదురులేని జొకోవిచ్, ముర్రే
- నాలుగో సీడ్ ఫెరర్‌కు షాక్ - క్వార్టర్స్‌లో సానియా మిక్స్డ్ జోడి - యూఎస్ ఓపెన్ న్యూయార్క్: మాజీ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌లో జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-3, 3-6, 6-1, 6-3తో ఫెరర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, ఆరో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) నాలుగో రౌండ్లో ప్రవేశించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-2 తేడాతో అమెరికాకు చెందిన సామ్ క్వెర్రీని చిత్తుగా ఓడించాడు. 2011లో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న జొకోవిచ్.. క్వెర్రీపై గెలవడం ఇది ఎనిమిదోసారి. అలాగే జకోవిచ్ వరుసగా 22 సార్లు ఈ టోర్నీ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. 85 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శక్తివంతమైన సర్వ్‌లకు పెట్టింది పేరైన సామ్‌ను జొకోవిచ్ సులువుగానే ఎదుర్కొన్నాడు. తొలి సెట్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0 ఆధిక్యం సాధించాడు. ప్రత్యర్థిని కుదురుగా ఉండనీయకుండా కోర్టు చుట్టూ తిరిగేలా వ్యూహం ప్రకారం ఆడి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక 2012 చాంపియన్, బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే 6-1, 7-5, 4-6, 6-2 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ కుజ్నెత్సోవ్ను ఓడించి ఏడోసారి నాలుగో రౌండ్‌కు చేరాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ కుజ్నెత్సోవ్ మూడో సెట్లో ముర్రేకు దీటుగా బదులిచ్చాడు. అయితే నాలుగో సెట్లో మాత్రం 27 ఏళ్ల ముర్రే త్వరగానే కోలుకుని సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చూపాడు. ఓవరాల్‌గా 47 విన్నర్ షాట్లతో ఈ ఎనిమిదో సీడ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని కీ నిషికొరి (జపాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు. అలాగే ఐదో సీడ్ మిలోస్ రవోనిక్ 7-6 (7/5), 7-6 (7/5), 7-6 (7/3) తేడాతో తొలిసారిగా యూఎస్ ఓపెప్లో బరిలోకి దిగిన 34 ఏళ్ల విక్టర్ ఎస్ట్రేల్లా బుర్గోస్పై నెగ్గేందుకు చెమటోడ్చాడు. తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-4, 6-4తో కారెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. సెరెనా జోరు ఆరోసారి టైటిల్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆశించినట్టుగానే దూసుకెళుతోంది. మూడో రౌండ్లో ఈ నంబర్‌వన్ సీడ్... 6-3, 6-3 తేడాతో వర్వారా లెప్చెంకో (అమెరికా)పై సునాయాసంగా నెగ్గింది. నాలుగో రౌండ్లో అన్‌సీడెడ్ కియా కనేపీ (ఎస్తోనియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు 75వ మ్యాచ్ నెగ్గినట్టవుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఈ ఏడాది వింబుల్డన్ ఫైనలిస్ట్, ఏడో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) 6-2, 6-7 (2/7), 6-4 తేడాతో జహ్లవోవా స్ట్రికోవాను, విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-1తో వెస్నీనా (రష్యా)పై నెగ్గింది. మరోవైపు ఆదివారం జరిగిన నాలుగో రౌండ్లో 13వ సీడ్ సారా ఎర్రానీ 6-3, 2-6, 6-0తో లూసిక్ బరోని (క్రొయేషియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సానియా జోడి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలోకి దిగిన రెండు విభాగాల్లో మంచి ఆటతీరును కనబరిచింది. డబుల్స్‌లో ఇప్పటికే మూడో రౌండ్‌కు చేరగా మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-2, 7-6 (10/8)తో డెలాక్వా (అమెరికా)-జేమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట 6-1, 4-6, 10-4తో ఐజమ్ అల్ ఖురేషి (పాక్)-కుద్య్రత్సేవ (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. -
చాంపియన్ ఖేల్‌ఖతం
-
చాంపియన్ ఖేల్‌ఖతం
దిమిత్రోవ్ చేతిలో ఓడిన ముర్రే సెమీస్‌లో జొకోవిచ్, ఫెడరర్ లండన్: గత ఏడాది స్వదేశంలో వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-1, 7-6 (7/4), 6-2తో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ముర్రేపై విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి బల్గేరియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దాదాపు రెండుగంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. రెండు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 3-6, 6-7 (4), 6-2, 6-2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై; 4వ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 3-6, 7-6 (7/5), 6-4, 6-4తో 5వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్)పై గెలిచి సెమీస్‌కు చేరారు. హలెప్, బౌచర్డ్ విజయం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-0తో 19వ సీడ్ లిసికి (జర్మనీ)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 6-3, 6-4తో 9వసీడ్ కెర్బర్ (జర్మనీ) పై నెగ్గింది. డబుల్స్ క్వార్టర్స్‌కు పేస్ జోడి పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) 6-4, 6-7 (5), 6-4, 7-5తో రోజెర్ (నెదర్లాండ్స్)-టెకాయు (రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్) -హల్వకోవా (చెక్) 6-4, 7-5తో ఫ్లెమింగ్-జోస్లిన్ రే (బ్రిటన్)పై నెగ్గారు. సానియా- టెకాయు (రొమేనియా) జోడి 6-3, 6-3తో పావిక్ (క్రొయేషియా) - జానోవిస్కీ (సెర్బియా)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. -
మూడో రౌండ్లో జొకోవిచ్
ముర్రే, దిమిత్రోవ్ కూడా.. లండన్: వింబుల్డన్‌లో స్టార్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అలవోక విజయాలతో మూడోరౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో టాప్‌సీడ్ జొకోవిచ్ 6-4, 6-3, 6-7 (5/7), 7-6 (7/5)తో రాడెక్ స్టెఫానిక్ (చెక్)పై; మూడోసీడ్ ముర్రే 6-1, 6-1, 6-0తో ప్రపంచ 92వ ర్యాంకర్ బ్లాజ్ రోలా (స్లొవేనియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 4-6, 7-6 (7/5), 7-6, (7/3), 6-1తో బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రేలియా)పై; దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 6-2, 6-4తో ల్యూక్ సావిల్లే (ఆస్ట్రేలియా)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. వీనస్, నా లీ, రద్వాన్‌స్కా ముందంజ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-2తో మీస్బర్జర్ (ఆస్ట్రియా)పై; 4వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-4, 6-0తో డెల్లాక్వా (ఆస్ట్రేలియా)పై; 6వ సీడ్ క్విటోవా (చెక్) 6-2, 6-0తో మోనా బార్తెల్ (జర్మనీ)పై; 30వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7-6 (4), 6-1తో కురుమీ నారా (జపాన్)పై గెలిస్తే... 8వ సీడ్ అజరెంకా (బెలారస్) 3-6, 6-3, 5-7తో జానోస్కి (సెర్బియా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లు (ైచైనీస్తైపీ) 6-2, 6-2, 6-7 (3), 3-6, 2-6తో జెమీ డెల్గాడో (బ్రిటన్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) చేతిలో; పురవ్ రాజా (భారత్)-డిమోలినర్ (బ్రెజిల్) 2-6, 4-6, 4-6తో సెబాస్టియన్ కాబెల్ (కొలంబియా)-మత్కోవాస్కి (పోలెండ్) చేతిలో ఓటమిపాలయ్యారు. -
ముర్రే, జొకోవిచ్ ముందంజ
వింబుల్డన్ టెన్నిస్ లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, టాప్ సీడ్ జొకోవిచ్‌లు వింబుల్డన్ తొలి రౌండ్‌ను అలవోకగా అధిగమించారు. సోమవారం తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ముర్రే 6-1, 6-4, 7-5 తేడాతో బెల్జియంకు చెందిన డేవిడ్ గాఫిన్‌పై గెలుపొందగా, జొకోవిచ్ 6-0, 6-1, 6-4తో ఆండ్రీ గులుబెవ్ (కజకిస్థాన్)పై సునాయాస విజయం సాధించాడు. గాఫిన్‌పై తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మూడో సీడ్ ముర్రేకు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. మొత్తంగా రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఎనిమిది ఏస్‌లు, 28 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 2010 రన్నరప్, ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (5-7), 6-1, 6-4, 6-3 తేడాతో రుమేనియాకు చెందిన విక్టర్ హనెస్కుపై గెలిచాడు. ఏడోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-0, 6-7 (3-7), 6-1, 6-1తో తన దేశానికే చెందిన కారెనో బుస్టాపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నా లీ, క్విటోవా సునాయాసంగా.. మహిళల సింగిల్స్‌లో గతేడాది సెమీఫైనలిస్టు, రెండో సీడ్ చైనా క్రీడాకారిణి నా లీ, మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా, మాజీ ప్రపంచ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకాలు రెండో రౌండ్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నా లీ తొలి రౌండ్లో 7-5, 6-2తో పోలెండ్‌కు చెందిన పౌలా కనియాపై గెలుపొందగా, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-0తో తన దేశానికే చెందిన లవకోవాపై నెగ్గింది. 8వ సీడ్ అజరెంకా 6-3, 7-5తో బారోని (క్రొయేషియా)పై నెగ్గింది. ఐదుసార్లు చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లో 6-4, 4-6, 6-2తో మరియా టోరో ఫ్లొర్ (స్పెయిన్)పై గెలుపొందింది. కిరిలెంకో (రష్యా) 6-2, 7-6 (8-6)తో స్టీఫెన్స్ (అమెరికా)పై నెగ్గగా, స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 4-6 తేడాతో విక్‌మేయర్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది. -
ముర్రే మెరిసేనా!
లండన్: గత పదేళ్లలో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ నలుగురు క్రీడాకారుల (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) ఖాతాలోకి వెళ్లింది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో ఈసారీ ఆ నలుగురే టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. గతేడాది 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన ఆండీ ముర్రేపై అందరికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ మహిళా క్రీడాకారిణి అమెలీ మౌరెస్మోను కోచ్‌గా నియమించుకున్నాక ముర్రే ఆడుతోన్న తొలి ప్రధాన టోర్నీ ఇదే కావడం విశేషం. నిరుడు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత ముర్రే ఇప్పటిదాకా మరే టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. తొలి రౌండ్లో బెల్జియం రైజింగ్ స్టార్ డేవిడ్ గాఫిన్తో తలపడనున్న ముర్రేకు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు ఇటీవల రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు రెండేళ్లుగా వింబుల్డన్ టోర్నీ కలసిరావడం లేదు. 2012లో రెండో రౌండ్లో ఓడిన ఈ స్పెయిన్ స్టార్... గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్లో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో పోటీపడనున్న నాదల్ ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి. వింబుల్డన్ టోర్నీని రికార్డు స్థాయిలో ఏడుసార్లు గెల్చుకున్న రోజర్ ఫెడరర్ ఖాతాలో 2012 నుంచి మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరలేదు. యువ ఆటగాళ్ల జోరులో వెనుకబడిపోయిన ఈ స్విస్ దిగ్గజానికి ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది. గత నాలుగేళ్లుగా ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంటున్న టాప్ సీడ్ జొకోవిచ్ 2011 తర్వాత మరోసారి చాంపియన్‌గా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. గతేడాది ఫైనల్లో ముర్రే చేతిలో ఓడిన ఈ సెర్బియా స్టార్‌కు కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. మహిళల విభాగానికొస్తే కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ కనిపించడంలేదు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఐదో సీడ్ షరపోవా (రష్యా), నిరుటి రన్నరప్ సబైన్ లిసికి (జర్మనీ), ఎనిమిదో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 17 లక్షల 60 వేల పౌండ్ల (రూ. 18 కోట్లు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. నేటి ముఖ్య మ్యాచ్‌లు పురుషుల విభాగం ఆండీ ముర్రే (3) x డేవిడ్ గాఫిన్ నొవాక్ జొకోవిచ్ (1) x గొలుబేవ్ థామస్ బెర్డిచ్ (6) x విక్టర్ హనెస్కూ మహిళల విభాగం నా లీ (2) x పౌలా కానియా అగ్నెస్కా రద్వాన్‌స్కా (4) xఆండ్రియా మితు పెట్రా క్విటోవా (6) x హలవకోవా నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్ -
ఒకే పార్శ్వంలో ముర్రే, జొకోవిచ్
వింబుల్డన్ ‘డ్రా’ విడుదల లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేకు ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే... గతేడాది ఫైనల్లో తలపడిన ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో పోటీపడే చాన్స్ ఉంది. తొలి రౌండ్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)తో ఆండీ ముర్రే; గొలుబెవ్ (కజకిస్థాన్)తో జొకోవిచ్; లొరెంజీ (ఇటలీ)తో ఫెడరర్; క్లిజాన్ (స్లొవేకియా)తో నాదల్ ఆడతారు. సోమ్‌దేవ్‌కు క్లిష్టం భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో 15వ సీడ్ జెర్జీ జనోవిచ్ (పోలండ్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఈ టోర్నీలో ఒక్కసారి (2011లో) మాత్రమే పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి తొలి రౌండ్లో ఫ్రిస్టన్బర్గ్ (పోలండ్)-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో; రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ ఖురేషీ (పాకిస్థాన్) ద్వయం తొలి రౌండ్లో సెర్మాక్ (చెక్ రిపబ్లిక్)-ఎల్గిన్ (రష్యా) జోడితో ఆడతాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-వెరా జ్వొనరేవా (రష్యా)లతో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో తాతిష్విలి (అమెరికా)తో సెరెనా; సమంత ముర్రే (బ్రిటన్)తో షరపోవా ఆడతారు. -
ఆండీ ముర్రే కోచ్‌గా అమెలీ మౌరెస్మో
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మహిళా మాజీ క్రీడాకారిణిని తన కోచ్‌గా నియమించుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఫ్రాన్స్ క్రీడాకారిణి అమెలీ మౌరెస్మోను ముర్రే తన కొత్త కోచ్‌గా ఎంపిక చేసుకున్నాడు. 34 ఏళ్ల మౌరెస్మో క్రీడాకారిణిగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఆస్ట్రేలియా ఓపెన్ (2006), వింబుల్డన్ (2006)లను సాధించింది. అయితే పురుషుడిని పోలిన రూపం కలిగిన మౌరెస్మో పలు వివాదాలనూ ఎదుర్కొంది. ఆమె మహిళ కాదని, తనలో మగ లక్షణాలు ఉన్నాయంటూ స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ మార్టినా హింగిస్ వంటి తోటి క్రీడాకారిణులు అప్పట్లో ఆరోపణలు చేశారు. కాగా... గ్రాస్ కోర్టులపై చక్కటి పట్టున్న మౌరెస్మోను కోచ్‌గా నియమించుకోవడం ద్వారా రానున్న గ్రాస్ కోర్టు సీజన్లో, యూఎస్ ఓపెన్‌లో రాణించాలన్నది ముర్రే ఆలోచన. గత ఏడాది వింబుల్డన్‌లో ముర్రే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పురుష క్రీడాకారులకు మహిళా ప్లేయర్స్ కోచ్‌లుగా ఉండటం అరుదు. 1990 దశకంలో చెస్నోకోవ్ (రష్యా)కు తాతియానా నౌమ్కో; 1980 దశకంలో టిమ్ మయోటికి బిల్లీ జీన్ కింగ్ కోచ్‌లుగా ఉన్నారు. నేటితరం ఆటగాళ్లలో డెనిస్ ఇస్తోమిన్ (ఉజ్బెకిస్థాన్)కు అతని తల్లి క్లౌడియా కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
షరపోవా.. ఓ మంచి టీ బ్యాగ్!!
రష్యన్ అందాల టెన్నిస్ తార మారియా షరపోవా తెలుసు కదూ.. ఆమె మంచి టీ బ్యాగ్ లాంటిదని, వేడి వేడి నీళ్లలో ఆమెను వేస్తే ఆమె ఎంత స్ట్రాంగో తెలుస్తుందని ఆండీముర్రే తల్లి జూడీ ముర్రే వ్యాఖ్యానించారు. అయితే దీనిపై షరపోవా మండిపడింది. అసలు జూడీ ముర్రే ఎవరో కూడా తనకు తెలియదని చెప్పేసింది. రోలండ్ గారోస్ మైదానంలో ఫ్రెంచి ఓపెన్ సెమీఫైనల్లోకి వెళ్లిన తర్వాత విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన రాగా.. ఆమె ఈ రకంగా సమాధానమిచ్చింది. తాను టీ బాగానే తాగుతానని, అయినా ఆమె అసలు ఏం చెప్పాలనుకుందో తనకు అర్థం కాలేదని అంది. Sharapova is like a tea bag. Put her into hot water and ul find out how strong she is. — judy murray (@judmoo) June 3, 2014 -
హిప్.. హిప్.. ముర్రే!
సమకాలిన టెన్నిస్ క్రీడలో పట్టువదలని విక్రమార్కుడిలా పయనం సాగించిన ఆటగాడు ఆండీ ముర్రే. కెరీర్ ఆరంభంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా లెక్కచేయకుండా పోరాటం సాగించిన యోధుడు. టైటిళ్ల వేటలో ఎన్నోసార్లు చివరిమెట్టుపై బోల్తా పడినా ఈ స్కాట్లాండ్ ఆటగాడు టెన్నిట్ రాకెట్ వదిలిపెట్ట లేదు. రాజీలేని పోరాటంతో రన్నరప్‌గా మిగిలిన చోటే విజేతగా అవరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో పంతం పట్టాడు. చివరకు విజయాల బాట పట్టాడు. తమ దేశానికి చారిత్రక విజయాన్ని అందించి టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. 77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటన్‌కు సాధించిపెట్టాడు ఆండీ ముర్రే. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను మట్టికరిపించి అతడీ టైటిల్ సాధించడం విశేషం. 1896లో హరోల్డ్ మహోనీ తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్కాట్లాండ్ ప్లేయర్‌గా ఆండీ ముర్రే ఘనత సాధించాడు. అంతేకాదు తన గురువు ఇవాన్ లెండిల్కు తీరని కలగా ఉన్న వింబుల్డన్‌ను తాను సాకారం చేశాడు. వింబుల్డన్‌లో ఈ ఏడాది జూలై 7న ముర్రే, జొకోవిచ్ మధ్య జరిగిన తుది సమరం సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వింబుల్డన్‌లో చివరిసారి బ్రిటన్ నుంచి వర్జీనియా వేడ్ 1977లో టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఫ్రెడ్ పెర్రీ టైటిల్ గెలిచి ఈ సంవత్సరానికి 77 ఏళ్లయింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఏడో నెల జూలైలో 7వ తేదీనే జరిగింది. ముర్రే (15-5-1987), జొకోవిచ్ (22-5-1987) పుట్టిన రోజులోనూ తేడా 7 రోజులు ఉంది. పడిలేచిన కెరటానికి ప్రతీకగా నిలుస్తాడు 26 ఏళ్ల ఆండీ ముర్రే. గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఎన్నోసార్లు తృటిలో చేజారినా నిరుత్సాహ పడలేదు. సడలని సంకల్పంతో అపూర్వ విజయాలు సొంతం చేసుకున్నాడు. అందుకే ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బీబీసీ’ అతడికి 2013 సంవత్సరానికి గానూ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందజేసింది. అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ కాదని ముర్రేకు ఈ పురస్కారం కట్టబెట్టారు. ముర్రే మరిన్ని సంచలనాలు సృష్టిచాలని టెన్నిస్ అభిమానులు కోరుకుంటున్నారు. -
ముర్రేకు పురస్కారం
లండన్: 77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది బ్రిటన్ తరఫున ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆండీ ముర్రేకు ‘బీబీసీ’ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం లభించింది. ప్రస్తుతం మియామిలో శిక్షణ తీసుకుంటున్న ముర్రేకు మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ అవార్డును అందజేసింది. ఈ పురస్కారం రేసులో అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ నిలిచినప్పటికీ ముర్రే ఘనతకే ఎక్కువ మంది మొగ్గు చూపారు.