
ఏసెస్‌కు షాక్
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదు న్న డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రెండో పరాజయం ఎదురైంది. సింగపూర్ స్లామర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 16-27 గేమ్‌ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే లీగ్‌లో 257 గేమ్‌లతో లీగ్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఏసెస్ జట్టు ఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది.
పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో 0-6తో కార్లోస్ మోయా చేతిలో ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (ఏసెస్) 6-3తో బెలిండా బెన్సిచ్‌పై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 5-6తో బ్రౌన్-ప్లిస్కోవా జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో డోడిగ్-టామిక్ (ఏసెస్) జోడీ 4-6తో ఆండీ ముర్రే-మార్సెలో మెలో ద్వయం చేతిలో ఓటమి చెందగా... పురుషుల సింగిల్స్‌లో నిక్ కిరియోస్ 6-1తో బెర్నాడ్ టామిక్ (ఏసెస్)ను ఓడించి సింగపూర్ స్లామర్స్‌కు ఈ లీగ్‌లో ఆరో విజయాన్ని అందించాడు.