తెప్పమీద తేలి ‘ఆడారు’ | Federer and Murray played match for africa three | Sakshi
Sakshi News home page

తెప్పమీద తేలి ‘ఆడారు’

Published Wed, Apr 12 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

తెప్పమీద తేలి ‘ఆడారు’

తెప్పమీద తేలి ‘ఆడారు’

జ్యూరిచ్‌: ఆఫ్రికా ఖండంలోని చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా స్విస్‌ టెన్నిస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్, బ్రిటన్‌ క్రీడాకారుడు ఆండీ ముర్రే అడుగులు వేశారు. ఇందుకోసం ఇక్కడి లిమ్మట్‌ నదిలో కదిలే తెప్పపై ఆటను ప్రాక్టీస్‌ చేశారు. ‘మ్యాచ్‌ ఫర్‌ ఆప్రికా 3’ పేరిట రోజర్‌ ఫెదరర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఈ ఆటలో ఇరువురు పాల్గొన్నారు. తెప్పపై ఆట శిక్షణలో భాగంగా ఫెదరర్‌, ఆండీలు నదిలో పడకుండా బంతిని కొట్టాల్సి ఉంటుంది.

విభిన్నంగా నదే వేదికగా నిర్వహించిన ఈ శిక్షణను ఇరువురి అభిమానులతోపాటు వందలాదిమంది తిలకించారు. దీనిని డ్రోన్‌ సహాయంతో వీడియో తీశారు. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన రోజర్‌ ఫెదరర్‌ ఫౌండేషన్‌.. దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్‌లలో విద్యా సంబంధిత ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement