రోజర్ ఫెదరర్.. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న ధీరుడు రోజర్ ఫెదరర్. తాజాగా ఈ స్విస్ టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గౌరవం దక్కింది.
న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి ఫెదరర్ డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలను విధ్యార్ధులతో ఫెదరర్ పంచుకున్నాడు.
దాదాపు 25 నిమిషాల పాటు సాగిన తన స్పీచ్‌తో విధ్యార్ధులను ఫెదరర్ మంత్రముగ్ధులను చేశాడు. తన కెరీర్‌లో సాధించిన ప్రతీ విజయానికి తను ఎంతో కష్టపడ్డానని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.
‘ఎఫర్ట్‌లెస్.. నిజానికి ఈ పదాన్ని తమ కోసం ఉపయోగించినట్లయితే చాలా మంది ప్రశంసలా భావిస్తారు. నాకు మాత్రం ఈ పదం వింటేనే నాకు చిరాకెత్తిపోతుంది. ఎందుకంటే.. శ్రమించకుండా ఏదీ అంత సులువుగా దొరకదు.
చాలా మంది నేనేదో అలవోకగా.. ఎటువంటి కష్టం లేకుండా ఆడతానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. చాలా సార్లు నాకు నేనే తిట్టుకుంటూ రాకెట్ విసిరి కొట్టేవాడిని.
కచ్చితంగా నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించేందుకు కష్టడాల్సి ఉంటుంది. ఇక రెండో పాఠం.. వీలైనంతవరకు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ కష్టపడండి. అప్పటికి మీరు ఓటమి చవిచూస్తే ఆఖరివరకు పోరాడాలి.
నా కెరీర్‌ను ఉదహరణగా తీసుకుంటే వింబుల్డన్‌లో ఓడిపోయాను. నేను నా నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాను. ఆ సమయంలో కూడా నన్ను చాలా మంది ప్రశంసలతో ముంచెత్తారు. కానీ అప్పుడు కూడా వాటిని నేను పట్టించుకోలేదు. ఏమి చేయాలో నాకు తెలుసు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మీరు కూడా పొగడ్తలను ఎప్పుడూ పట్టించుకోకండి.
ఇక మూడో పాఠం.. టెన్నిస్ కోర్టు కంటే జీవితం చాలా విలువైనది. నేను చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చిన్న స్థలంలో (టెన్నిస్ కోర్ట్) చాలా మైళ్ళు పరిగెత్తాను. కానీ టెన్నిస్ కోర్టు ప్రపంచం చాలా పెద్దదని గ్రహించానని విధ్యార్ధులకు ఇచ్చిన ప్రసంగంలో ఫెదరర్ పేర్కొన్నాడు. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Roger Federer’s Commencement Address at Dartmouth yesterday might be the best speech he’s ever given.
Amazingly articulate, funny, full of wisdom. Made me laugh and tear up. I’m so very proud to have had him as my idol for the past two decades.
If you have 25 minutes to spare… pic.twitter.com/qfd9io9kzV— Bastien Fachan (@BastienFachan) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment