టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ''24 ఏళ్ల కెరీర్.. 24 గంటలుగా'' అనిపించిందంటూ ఫెదరర్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. కాగా ఫెదరర్ రిటైర్మెంట్‌పై నాదల్, జొకోవిచ్ సహా టెన్నిస్ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అమెరిన్ టెన్నిస్ దిగ్గజం.. నల్లకలువ సెరెనా విలియమ్స్ కూడా ఫెదరర్ రిటైర్మెంట్‌పై స్పందించింది.
''రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం... రోజర్ ఫెదరర్'' అంటూ పేర్కొంది. కాగా ఇటీవలే సెరెనా కూడా వింబుల్డన్ అనంతరం ఆటకు లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. లాంగ్ బ్రేక్ అయినప్పటికి ఇప్పటికే 40 ఏళ్లకు చేరుకున్న సెరెనా ఇకపై టెన్నిస్ కోర్టులో కనిపించడం కష్టమేననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని సెరెనా గుర్తుచేసుకుంది.
నీ గురించి చెప్పడానికి ఒక కరెక్ట్ దారిని వెతుక్కునేలా చేశారు. ఎందుకంటే నీ ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిపెట్టారు. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్బుత విజయాలు చూసిన నువ్వు కెరీర్‌ను కూడా అంతే గొప్పగా ముగించారు. నీ ఆటతీరును చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను రోజర్ ఫెదరర్. ప్రతి విషయంలోనూ నిన్నే ఫాలో అయ్యాను. నిన్ను ఎంతోగానే అభిమానించాను.
మనం ఎంచుకున్న మార్గాలు ఒకేరకమైనవని, దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచావు.. నేను కూడా నిన్నే ప్రేరణగా తీసుకునేలా చేశావు. నిన్నెన్నటికీ మరిచిపోలేను. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి నీ భవిష్యత్తు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నా. రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం ఫ్రెడ్డీ. రోజర్ ఫెదరర్ అనే పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నావు.. అందుకు కృతజ్ఞతలు అంటూ ముగించింది.
ఇక సెరెనా విలియమ్స్ అక్క వీనస్ విలియమ్స్ ఫెదరర్ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. ''గ్రేటెస్ట్ ఎవర్.. మిస్ యూ రోజర్ ఫెదరర్'' అని పేర్కొంది. మహిళా టెన్నిస్ దిగ్గజం కోకో గాఫ్ మాట్లాడుతూ.. ''మీ అందమైన ఆటతో టెన్నిస్‌ను కోర్టు లోపల, బయట వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ ఫెదరర్. ఇన్నేళ్లలో మీరు నాకు ఇచ్చిన సలహాలకు థ్యాంక్యూ. నా రోల్ మోడల్‌గా ఉన్నందుకు నేను ధన్యురాలిని. థాంక్యూ ఫర్ ఎవ్రీతింగ్'' అంటూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment