![Kate Middleton Impresses Roger Federer With Her Tennis Skills - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/28/federer.jpg.webp?itok=sWHrpXog)
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌లో ఎదురులేని ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లోనే ఫెదరర్ అత్యధికంగా 8 టైటిల్స్ గెలిచాడు. స్వతహాగా ఫెదరర్‌కు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం.
రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అంతర్జాతీయ టెన్నిస్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌కు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు.
తాజాగా జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను పురస్కరించుకొని ప్రమోషనల్ భాగంగా మంగళవారం బాల్‌బాయ్స్, బాల్‌గర్ల్స్‌తో సరదాగా గడిపాడు. ఇదే సమయంలో బ్రిటన్ యువరాణి.. 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్'.. కేట్ మిడిల్‌టన్(Kate Middleton) వింబుల్డన్ కోర్టులోకి వచ్చింది. ఆమెను తనతో టెన్నిస్ ఆడేందుకు తొలుత ఫెదరర్ ఆహ్వానించాడు.
దీంతో ఇద్దరు కలిసి కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలోనే యువరాణి ఓ పాయింట్ కూడా సంపాదించారు. బాల్ సరిగ్గా గీత మీద పడటంతో ఈ పాయింట్ రాగా.. ‘అమేజింగ్’ అంటూ ఫెదరర్ ప్రశంసించారు. కేట్ కొద్దిసేపు బాల్ గర్ల్‌గానూ వ్యవహరించారు. అయితే కేట్ మిడిల్‌టన్ నిబంధనలు మరవడంతో బాల్‌గర్ల్ ఆమెకు సలహా ఇచ్చింది. బంతి బౌన్స్ అయిన తర్వాతే మనం అందుకోవాలి అంటూ పేర్కొంది.
ఈ క్రమంలోనే యువరాణి విజ్ఞప్తి మేరకు టెన్నిస్‌లో మెళకువలు నేర్పించాడు. ‘ఇది సరైన ప్రాక్టీస్. నేను ఇంప్రెస్ అయ్యాను’ అంటూ ఫెదరర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న కేట్.. వింబుల్డన్‌లోని రాయల్ బాక్స్‌లో తరచూ కనిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
Comments
Please login to add a commentAdd a comment