ball girl
-
బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌లో ఎదురులేని ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లోనే ఫెదరర్ అత్యధికంగా 8 టైటిల్స్ గెలిచాడు. స్వతహాగా ఫెదరర్‌కు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అంతర్జాతీయ టెన్నిస్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌కు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. తాజాగా జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను పురస్కరించుకొని ప్రమోషనల్ భాగంగా మంగళవారం బాల్‌బాయ్స్, బాల్గర్ల్స్తో సరదాగా గడిపాడు. ఇదే సమయంలో బ్రిటన్ యువరాణి.. 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్'.. కేట్ మిడిల్టన్(Kate Middleton) వింబుల్డన్ కోర్టులోకి వచ్చింది. ఆమెను తనతో టెన్నిస్ ఆడేందుకు తొలుత ఫెదరర్ ఆహ్వానించాడు. దీంతో ఇద్దరు కలిసి కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలోనే యువరాణి ఓ పాయింట్ కూడా సంపాదించారు. బాల్ సరిగ్గా గీత మీద పడటంతో ఈ పాయింట్ రాగా.. ‘అమేజింగ్’ అంటూ ఫెదరర్ ప్రశంసించారు. కేట్ కొద్దిసేపు బాల్ గర్ల్‌గానూ వ్యవహరించారు. అయితే కేట్ మిడిల్టన్ నిబంధనలు మరవడంతో బాల్‌గర్ల్ ఆమెకు సలహా ఇచ్చింది. బంతి బౌన్స్ అయిన తర్వాతే మనం అందుకోవాలి అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే యువరాణి విజ్ఞప్తి మేరకు టెన్నిస్‌లో మెళకువలు నేర్పించాడు. ‘ఇది సరైన ప్రాక్టీస్. నేను ఇంప్రెస్ అయ్యాను’ అంటూ ఫెదరర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న కేట్.. వింబుల్డన్‌లోని రాయల్ బాక్స్‌లో తరచూ కనిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
జారిపడ్డాడు
అనుకోకుండా చేసే పనులు కొన్నిసార్లు ఆపదలోకి నెట్టేస్తాయి. ఇలియట్ బెంచెట్రిట్కు వచ్చింది ఆపద కాకున్నా.. అందుకు సమానమైనదే. అతడి ఇమేజ్ ఆపదలో పడిపోయింది. (గట్టెక్కే ప్రయత్నం చేశాడు లెండి). ఇలియట్ ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతుంటే అక్కడున్నాడు. తన ఆట మధ్యలో విరామం రావడంతో.. పక్కకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అటుగా బాల్ గర్ల్ వస్తే దగ్గరకు రమ్మని ఆ అమ్మాయిని పిలిచాడు. (ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ కొట్టిన బంతిని తెచ్చి ఇచ్చే అమ్మాయిల్ని బాల్ గర్ల్స్ అంటారు). ఆ అమ్మాయి ఇలియట్ దగ్గరికి వచ్చింది. ఆమెకు అరటి పండు ఇచ్చి ఒలిచి ఇమ్మని అడిగాడు. ఆమె ఒలవబోతుంటే.. చెయిర్ అంపైర్ అడ్డుపడ్డాడు. ‘‘బాల్ గర్ల్ ఏమీ నీ బానిస కాదు’’ అని ఇలియట్పై కోప్పడ్డాడు. అతడు నివ్వెరపోయాడు. ‘తప్పేముందీ! నా రెండు చేతులకూ వ్యాక్స్ ఉంది. ఒలుచుకోలేక తనకు ఇచ్చాను’’ అన్నాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ వీడియో వైరల్ అయి నెటిజన్లంతా ‘ఇలియట్ కాదు.. ఇడియట్’ అని తిట్టేస్తున్నారు. దీనికన్నా అరటితొక్క మీద నుంచి జారి పడటమే నయం అని ఇలియట్ అనుకుని ఉండాలి పాపం. -
వెక్కి వెక్కి ఏడ్చిన బాల్ గర్ల్
లండన్: టెన్నిస్ టోర్నీల్లో బాల్ బాయ్స్, బాల్‌గర్ల్స్ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో బుధవారం చోటు చేసుకుంది. ఉబ్బెకిస్తాన్ ప్లేయర్ ఇస్టోమిన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ ఒక బాల్‌గర్ల్‌కు తగిలింది. 217 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి తగలడంతో నొప్పి తట్టుకోలేకపోయిన ఆ బాల్ గర్ల్ వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో, ఇస్టోమిన్‌తో పాటు కిర్గియోస్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చారు. ‘ బంతి తగిలిన శబ్ధాన్ని నేను విన్నాను. అయితే స్కోరు బోర్డును తాకిందని అనుకున్నా. ఆ తర్వాత ఆమె చేతికి తగిలిందనే విషయం అర్ధమైంది. దాంతో ఆమె ఏడ్చేసింది. నాకు తగిలినా ఏడ్చేసేవాడిని. ఇది చాలా బాధాకరం. ఆమె ఒక చాంపియన్. త్వరగా ఆమె కోలుకుని ఎప్పటిలాగే విధులకు హాజరవుతుందని ఆశిస్తున్నా’ అని మ్యాచ్ తర్వాత కిర్గియోస్ పేర్కొన్నాడు. -
కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ..
-
సోంగాకు బాల్‌గర్ల్ లేఖ!
సిడ్నీ: అవతలి వ్యక్తి కష్టసమయంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని సాయం చేస్తే.. అది సాయం చేసిన మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కష్టాల్లో మనిషిని అక్కున చేర్చుకుని ఓదారిస్తే అది వారి హుందాతనానికి అద్దం పడుతోంది. ఇదే విషయం గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్న సమయంలో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా విషయంలో నిజమైంది. టెన్నిస్ లో కోర్టులో ఆటగాళ్లతో పాటు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే వారి పరిస్థితి ఎలా ఉన్నా కోర్టులో ఆటగాళ్లు పట్టించుకోవడమనేది చాలా అరుదు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని బంతులను తీసుకుని సోంగా వెళ్లాడు. ఆ బంతులను బాల్ గర్ల్ కు ఇవ్వబోతుండగా అమ్మాయి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దాంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దానికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా అక్కున చేర్చుకుని ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటకు పంపించి ఆమెకు వైద్య సేవలు అందించాలంటూ స్పష్టం చేశాడు. ఆ సమయంలో సోంగా జెంటిల్మన్లా వ్యవహరించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉంచితే, ఆనాడు తనపై ఉదారతను చాటుకున్న సోంగాను గుర్తు చేసుకుంటూ ఆ బాలిక..ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా ఓ లేఖను రాసింది. 'నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నేను మీకు గుర్తండకపోవచ్చు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ సందర్బంగా గాయపడిన ఓ బాల్ గార్ల్కు సాయం చేశారు. ఆమెనే నేను. ఆ సమయంలో నాపై చూపిన సానుభూతికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు ఆ సమయంలో కోర్టు బయటకు వెళ్లేందుకు మనిషి అవసరం. ఆ విషయాన్ని మీరు గుర్తించి ఆ సాయం చేసినందుకు మిమ్ముల్ని, మీలోని వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు మీరు అడిగిన వెంటనే సాయం చేయలేకపోయాను. వైరల్ ఫీవర్ కారణంగా ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు బంతి అడిగిన విషయాన్నిగుర్తించలేకపోయాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సమయంలో కళ్లు తిరుగుతుండటంతో ఏమీ కన్పించలేదు. నా విధుల్ని సరిగా నిర్వహించలేనందుకు నన్ను క్షమించండి. ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' బాల్ గర్ల్ గిలియాన లేఖలో పేర్కొంది. ఆ లేఖ చదివిని సోంగా ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆ బాల్ గర్ల్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. Thank you very much for your letter Giuliana !!! 👌🏾✨💙 #Remember #AustOpen2016 pic.twitter.com/0dBNXGUFxP — Jo-Wilfried Tsonga (@tsonga7) 22 January 2017