ముర్రే నిరీక్షణ ఫలించేనా...
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్‌బోర్న్‌లో నేడు ప్రారంభం కానుంది. గతంలో ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి మాత్రం విజేత హోదాలో తిరిగి వెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ముర్రేతోపాటు జొకోవిచ్ (సెర్బియా), వావ్రింకా (స్విట్జర్లాండ్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు.
మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ రికార్డుస్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై (అమెరికా) దృష్టి పెట్టింది. ప్రపంచ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), రద్వాన్‌స్కా (పోలండ్), సిమోనా హలెప్ (రొమేనియా), ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు. ఈ టోర్నీ మ్యాచ్‌లు ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.