Roger Federer Likely To Miss Australian Open Not Thinking About Retirement: జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఆడే అవకాశాలు లేవని అతడి కోచ్ లుబిసిచ్ తెలిపాడు. అయితే 2022లోనే ఏదో ఒక టోర్నీ ద్వారా ఫెడరర్ పునరాగమనం చేస్తాడని లుబిసిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో చివరిసారిగా ఆడిన ఫెడరర్... అనంతరం మెకాలికి మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో కోచ్ లుబిసిచ్ మాట్లాడుతూ.. ‘‘అతడు కోలుకుంటున్నాడు. టోర్నమెంట్లు ఆడాలని భావిస్తున్నాడు. పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. వందకు వంద శాతం తను తిరిగి కోర్టులో అడుగుపెడతాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు మాత్రం అందుబాటులో ఉండడు. తనకు ఇప్పుడు 40 ఏళ్లు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేగానీ రిటైర్‌మెంట్ ఆలోచన లేదు’’అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్!
Comments
Please login to add a commentAdd a comment