పెర్త్: అంతర్జాతీయ మిక్స్‌డ్ టెన్నిస్ టోర్నమెంట్ హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్–బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. అలెగ్జాండర్ జ్వెరెవ్–ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్–బెన్సిచ్ ద్వయం 2–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 6–2తో జ్వెరెవ్‌ను ఓడించి స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం రెండో మ్యాచ్‌లో కెర్బర్ (జర్మనీ) 6–4, 7–6 (8/6)తో బెన్సిచ్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్–బెన్సిచ్ జోడీ 4–0, 1–4, 4–3 (5/4)తో జ్వెరెవ్–కెర్బర్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ను ‘ఫాస్ట్ ఫోర్’ పద్ధతిలో నిర్వహించారు. తొలి నాలుగు గేమ్‌లు గెలిచిన జట్టుకు సెట్ వశమవుతుంది. ఒకవేళ స్కోరు 3–3 వద్ద సమమైతే తొమ్మిది పాయింట్లున్న టైబ్రేక్ నిర్వహిస్తారు. ఈ విజయంతో మూడుసార్లు హాప్‌మన్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఫెడరర్ రికార్డు సృష్టించాడు. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి తొలిసారి టైటిల్ సాధించిన ఫెడరర్, గతేడాడి బెన్సిచ్‌తో కలిసి ఈ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment