
లండన్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఆండీ ముర్రే వచ్చే నెలలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో బ్రిటన్ తరఫున 32 ఏళ్ల ముర్రే డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో తన పాత గాయం తిరగబెట్టిందని అతను వెల్లడించాడు. ‘అత్యున్నత స్థాయిలో మళ్లీ పోటీ పడేందుకు ఎంతో శ్రమించాను. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరం కావాల్సి వస్తోంది. నేను చాలా నిరాశ చెందాను. అయితే ఇటీవలి పరిణామాల తర్వాత ముందు జాగ్రత్తగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ముుర్రే చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదు సార్లు ఫైనల్ చేరిన ముర్రే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment