ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్‌లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు.
Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Game respects game!
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
(And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF
మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్‌గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు.
A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Nothing. But. Net.
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB
ఈ సందర్భంగా జకో క్రికెట్‌తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్‌లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్‌సన్‌తో కలిసి వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్‌బాల్ స్టార్ అలన్ విలియమ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు.
Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Race again in Paris? 😅@DjokerNole v @pbol800
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
#AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE
Comments
Please login to add a commentAdd a comment