Charity match
-
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్‌లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్‌లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్‌తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్‌గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్‌తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్‌తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్‌బాల్ స్టార్ అలన్ విలియమ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
మనసు మార్చుకున్న 'దాదా'.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో
ఆగస్టు 15, 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవనుంది. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఒక చారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ నిర్వహించాలంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బీసీసీఐని సంప్రదించింది. కేంద్ర ప్రతిపాదనను ఒప్పుకున్న బీసీసీఐ ఆగస్టు 22న భారత్ ఎలెవెన్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. కాగా బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మొదట చారిటీ మ్యాచ్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. దీనితో పాటు లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ ఆడడం లేదని స్పష్టం చేశాడు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు.. ఆపరేషనల్ కార్యక్రమాలు.. బిజీ షెడ్యూల్ కారణంగానే దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. కానీ తాజాగా దాదా తన మనసు మార్చుకున్నాడు. బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. శుక్రవారం జిమ్ సెషన్లో పాల్గొన్న గంగూలీ అందుకు సంబంధించిన ఫోటోలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నా. కసరత్తులు ఆరంభించా.. ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాలి. అలాగే మహిళా సాధికారత(Women Empowerment) కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ ఆడబోతున్నా' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న మ్యాచ్‌లో తాను భాగం కావాలనే ఉద్దేశంతోనే గంగూలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉంటూనే టీమిండియా తరపున చారిటీ మ్యాచ్ ఆడనున్న తొలి క్రికెటర్‌గా గంగూలీ చరిత్రకెక్కనున్నాడు. ఆగస్టు 22న జరగనున్న ఈ మ్యాచ్‌కు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. భారత్ ఎలెవెన్ పెద్ద సమస్య కాకపోయినా.. రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవెన్ జాబితా ఎంపిక చేయడం కష్టమే. మొత్తం 13-14 మంది ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఇక క్రికెట్‌తో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో డిజిటల్ ఫోటోగ్రఫీ కంటెస్ట్, మెంటార్షిప్ టు యంగ్ ఆథర్స్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించనున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్ ఆడనున్న గంగూలీ.. పనిలో పనిగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్(ఎల్ఎల్సీ)లో ఆడేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహిళా సాధికారత కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో 2015 నుంచి గంగూలీ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. అయితే ఈసారి బిజీ షెడ్యూల్ కారణంగా మొదట దూరంగా ఉండాలనుకున్నప్పటికి తాజాగా ఆడాలని నిశ్చయించుకున్నాడు. కరోనా తర్వాత రెండుసార్లు క్లోజ్ డోర్స్‌లోనే లీగ్ జరిగింది. ఈసారి మాత్రం ప్రేక్షకులను అనుమతించనున్న నేపథ్యంలో ఎల్ఎల్సీకి మరింత కళ వచ్చింది. గంగూలీ ఆడేందుకు ఒప్పుకోవడం సంతోషాన్ని కలిగించిందని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో.. సహ వ్యవస్థాపకుడు రామన్ రహెజా తెలిపాడు. ''ఒక లెజెండ్ ఎప్పుడు లెజెండ్‌గానే ఉంటాడు. క్రికెట్ కోసం దాదా ఎప్పుడు అండగా నిలబడి ఉంటాడు. ఈసారి నిర్వహించబోయే చారిటీ మ్యాచ్‌లో దాదా పాల్గొంటాడు. అతని ఐకానిక్ షాట్లు చూసేందుకు మేమంతా ఎదురుచూస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by SOURAV GANGULY (@souravganguly) చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. తమ టి20 చరిత్రలో అత్యధిక స్కోరు.. స్కాట్లాండ్పై భారీ విజయం -
పేదల కోసం ఛారిటీ మ్యాచ్ అన్నారు.. బ్యాట్లతో తలలు పగులగొట్టుకున్నారు
లండన్: ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షన రక్తసిక్తంగా మారింది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటామాటా పెరిగి చివరికి బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్లో నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తసిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. గొడవకి కారణం ఏంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Disgraceful scenes during a charity match which had to be abandoned after a fight between the two teams. The violence erupted at the end of a game at Mote Park Cricket Club in Maidstone during a tournament raising money for those in need of medical treatment in Pakistan pic.twitter.com/uGOYPuc3z2 — Saj Sadiq (@Saj_PakPassion) July 20, 2021 వీడియో కనిపించిన దృష్యాల ప్రకారం.. బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగినట్లు స్పష్టమవుతోంది. అనంతరం రెండు గ్రూప్‌ల ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సద్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు. దీంతో మ్యాచ్ అర్ధంతరంగా రద్దైంది. కాగా, ఈ గొడవ విషయమై మ్యాచ్ నిర్వహకుడు షెహజాద్ స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్ అని, మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే గొడవకు అసలు కారణం ఏంటన్నది తనకు కూడా తెలియదని అతను చెప్పడం విశేషం. -
‘ఆనంద్‌ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’
ముంబై: ఆ ఆటగాడు చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆడిన చెస్ గేమ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌ను ఓడించాడు. ఈ విజయం చాలా మందిని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామత్ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV — Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 చదవండి: గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. -
35 బంతులు.. 80 పరుగులు..
రాయ్‌పూర్: రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇండియా లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య లీగ్ మ్యాచ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (35 బంతుల్లో 80 పరుగులు: 10 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. వయసు పెరిగినా తనలో సత్తువ ఏ మాత్రం తగ్గలేదని సెహ్వాగ్ మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతినే బౌండరీగా మలిచిన వీరు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం అన్నట్లుగా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పాత సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చాడు. వీరు విధ్వంసం దాటికి ఇండియన్ లెజెండ్స్ కేవలం 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. సెహ్వాగ్‌కు జతగా వచ్చిన ఓపెనర్ కమ్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 33 పరుగులతో అతనికి సహకరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో నిజాముద్దీన్ 49 మినహా ఎవరు ఇండియా లెజెండ్స్ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు. ఇక ఇండియన్ లెజెండ్స్ బౌలింగ్‌లో వినయ్ కుమార్, ప్రగ్యాన్ ఓజా, యువరాజ్లు తలా 2 వికెట్లు తీయగా..మన్‌ప్రీత్ గోని, యూసఫ్ పఠాన్ చెరొక వికెట్ తీశారు. 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ సెహ్వాగ్ మెరుపులతో 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. చదవండి: ఆ జాబితాలో ఫించ్ కూడా చేరాడు.. -
'జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా'
న్యూయార్క్ : బాక్సింగ్ ప్రపంచంలో మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరు. అతని బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్‌లకు తలొగ్గాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించనున్నాడు. బౌట్ సత్తా చాటేందుకు మైక్ టైసన్ ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతను ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేశాడు. చాలా కఠోరంగా కసరత్తు చేస్తున్న 53 ఏళ్ల మైక్ టైసన్‌ను చూస్తుంటే అతని పవర్ ఏ మాత్రం తగ్గలేదిని తెలుస్తుంది. ఆ వీడియోలో ' నేను మళ్లీ రింగ్‌లోకి వస్తున్నా.. ప్రత్యర్థులకు ఇదే సవాల్ ' అంటూ కామెంట్ జత చేశాడు. 53 ఏళ్ల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.('ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు') వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్‌గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతున్నారని సమాచారం. ఇక చివరిసారిగా 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో టైసన్ చివరి బౌట్లో తలపడ్డాడు. 1986లో 20 ఏళ్ల వయసులోనే టైసన్ ట్రెవర్ బెర్బిక్ను ఓడించి ప్రపంచ యువ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఖ్యాతి గాంచాడు. టైసన్ తన కెరీర్లో మొత్తం 50 ప్రొఫెషనల్ ఫైట్స్‌ను గెలిచాడు. ఇక మాజీ చాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్‌తో టైసన్ తన ఎగ్జిబిషన్ బౌట్లో తలపడే అవకాశాలు ఉన్నాయి. -
బ్యాట్ పట్టి.. ఫోర్ కొట్టి
మెల్బోర్న్ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి మరోసారి దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ కొట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ అపూర్వ ఘట్టం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఓ చారిటబుల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా నష్టపోయిన వారిని అదుకునేందుకుగాను బుష్ ఫైర్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా పాంటింగ్ ఎలెవన్, గిల్‌క్రిస్ట్ ఎలెవన్ రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నాయి. ఇక పాంటింగ్ జట్టుకు సచిన్ కోచ్‌గా వ్యవహరించాడు. భుజం గాయం కారణంగా సచిన్ ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్ల సూచనను పక్కకు పెట్టి మరీ బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సందర్బంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని సచిన్ తనదైన రీతిలో బౌండరీ తరలించాడు. చూడముచ్చటైన ఈ షాట్‌కు పెర్రీతో సహా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్‌తో పెర్రీ కాసేపు సంభాషించి పలు సూచనలు తీసుకున్నారు. కాగా చాలా కాలం తర్వాత జెర్సీ నంబర్ 10 మైదానంలో కనిపించడంతో అటు క్రికెట్ ఫ్యాన్స్ అటు సచిన్ వీరాభిమానులు పండగ చేసుకున్నారు. Sachin is off the mark with a boundary!https://t.co/HgP8Vhnk9s #BigAppeal pic.twitter.com/4ZJNQoQ1iQ — cricket.com.au (@cricketcomau) February 9, 2020 చదవండి: దగ్గరి దారులు వెతక్కండి! క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష -
మొన్న అర్జున్.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్‌కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను రితి స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. -
వరల్డ్ ఎలెవన్ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లు
దుబాయ్ : ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు ఎంపికయ్యారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్‌లోని పలు స్టేడియాలు నేలమట్టమవగా... వాటిని పునర్మించేందు చారిటీ మ్యాచ్ నిర్వహించి విరాళాలు సేకరించాలని ఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ లార్డ్స్ వేదికగా మే 31న వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడుతుంది. ఈ ప్రపంచ ఎలెవన్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ తాజాగా భారత్ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో గతకొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై కార్తీక్ కళ్లుచెదిరే విజయాన్నందించారు. ఇప్పటికి తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ త్వరలోనే మిగతా ఆటగాళ్లను ఎంపికచేయనుంది. ఇక ప్రపంచ ఎలెవన్ ఢీకొనబోతున్న వెస్టిండీస్ జట్టును ఆదేశ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా సామ్యూల్ బద్రీ, క్రిస్‌గేల్‌లతో కూడిన 13 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడంపై ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడల్లా క్రికెట్ కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టీ20 మ్యాచ్ ప్రేక్షకులను రంజింప చేయనుంద’ని మోర్గాన్ తెలిపారు. -
ఫుట్‌బాల్ ప్లేయర్‌గా షాకిచ్చిన బోల్ట్
సాక్షి, స్పోర్ట్స్ : జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ బొరష్యా డార్ట్మండ్ చారిటీ కోసం ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొన్నాడు. అనుభవమున్న ఆటగాడిలా రెండు గోల్స్ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్, హెడర్ ద్వారా గోల్ చేసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకి షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ విన్నర్ మారియో గాట్జ్తో తలపడి మరీ గోల్ చేయడం విశేషం. తన ప్రదర్శన చూసి డార్ట్మండ్ టీమ్ క్లబ్ తనతో కాంట్రాక్ట్ చేసుకుంటుందోమో అంటూ బోల్ట్ సరాదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా బోల్ట్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. డార్ట్మండ్ టీమ్ స్పాన్సర్ ‘పూమా’ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొని ప్రచారం కల్పించాల్సిందిగా కోరటంతో బోల్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తాడు. జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్ వరల్డ్ చాంపియన్ షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. New Levels #NextJourney pic.twitter.com/aeOilbnSq9 — Usain St. Leo Bolt (@usainbolt) March 23, 2018 -
ఛారిటీ మ్యాచ్‌లో ధోని, సెహ్వాగ్
ఈనెల 17న లండన్‌లో మ్యాచ్ లండన్: భారత వన్డే జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌లు ఓ ఛారిటీ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఈనెల 17న కియా ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఎలెవన్‌తో హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్ జట్టు తలపడనుంది. ధోని, వీరూతో పాటు ఆఫ్రిది (పాకిస్తాన్), గిబ్స్ (దక్షిణాఫ్రికా) హీరోస్ జట్టులో ఉన్నారు. ఈ జట్టుకు ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) నాయకత్వం వహించనున్నాడు. ఇయాన్ బోథమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. మెకల్లమ్, స్టైరిస్, వెటోరి (న్యూజిలాండ్), హెడెన్ (ఆసీస్), జయవర్ధనే (లంక), స్మిత్ (దక్షిణాఫ్రికా), షాపూర్ జద్రాన్ (అఫ్ఘానిస్తాన్)లు ‘రెస్ట్’ జట్టులో ఉన్నారు. ఈ జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా, సునీల్ గవాస్కర్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. హెల్ప్ ఫర్ హీరోస్ క్రికెట్ క్లబ్, ఇంగ్లండ్ వికలాంగుల టీమ్ కోసం నిధులు సమీకరించడానికి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ‘చాలా మంది క్రికెట్ సూపర్ స్టార్లతో కలిసి ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఓ మంచి పని కోసం మేం మద్దతిస్తున్నందుకు గర్వంగా ఉంది. హీరోస్ జట్టుకు మద్దతివ్వాలని అభిమానులను కోరుతున్నా’ అని ధోని పేర్కొన్నాడు.