మొన్న అర్జున్‌.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని | Dhoni And Arjun Kapoor Playing Charity Football Match in Mumbai | Sakshi
Sakshi News home page

మొన్న అర్జున్‌.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని

Oct 8 2019 12:44 PM | Updated on Oct 8 2019 2:12 PM

Dhoni And Arjun Kapoor Playing Charity Football Match in Mumbai - Sakshi

ముంబై : ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్‌ కోసం రెండు నెలలు క్రికెట్‌కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను రితి స్పోర్ట్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 

దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్‌ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement