rithi sports
-
మొన్న అర్జున్.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్‌కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను రితి స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. -
ఎప్పుడూ తప్పు చేయలేదు
సురేశ్ రైనా స్పష్టీకరణ న్యూఢిల్లీ: వ్యాపారవేత్తనుంచి డబ్బులు తీసుకున్నానంటూ తనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది చేసిన ఆరోపణలను భారత క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. ఏ స్థాయిలో అయినా తాను ప్రాతినిధ్యం వహించిన జట్టు తరఫున నిజాయితీగా ఆడానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అతను అన్నాడు. తన మేనేజ్మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ ద్వారా రైనా ఒక మీడియా ప్రకటనను విడుదల చేశాడు. ‘నా గురించి ఇటీవల మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందించాల్సి వస్తోంది. కెరీర్ ఆసాంతం నేను నిజాయితీగా, అంకిత భావంతో క్రికెట్ ఆడాను. ఏ దశలోనూ ఎలాంటి తప్పు చేయలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచన కూడా ఉంది’ అని రైనా వివరణ ఇచ్చాడు. రైనాతో పాటు జడేజా, బ్రేవో బయటి వ్యక్తులనుంచి లంచాలు తీసుకున్నారని ఇటీవల లలిత్ మోది వెల్లడించారు. అయితే ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లకూ క్లీన్చిట్ ఇచ్చాయి.