ఈనెల 17న లండన్‌లో మ్యాచ్
లండన్: భారత వన్డే జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌లు ఓ ఛారిటీ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఈనెల 17న కియా ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఎలెవన్‌తో హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్ జట్టు తలపడనుంది. ధోని, వీరూతో పాటు ఆఫ్రిది (పాకిస్తాన్), గిబ్స్ (దక్షిణాఫ్రికా) హీరోస్ జట్టులో ఉన్నారు. ఈ జట్టుకు ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) నాయకత్వం వహించనున్నాడు. ఇయాన్ బోథమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
మెకల్లమ్, స్టైరిస్, వెటోరి (న్యూజిలాండ్), హెడెన్ (ఆసీస్), జయవర్ధనే (లంక), స్మిత్ (దక్షిణాఫ్రికా), షాపూర్ జద్రాన్ (అఫ్ఘానిస్తాన్)లు ‘రెస్ట్’ జట్టులో ఉన్నారు. ఈ జట్టుకు కిర్‌స్టెన్ కోచ్‌గా, సునీల్ గవాస్కర్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. హెల్ప్ ఫర్ హీరోస్ క్రికెట్ క్లబ్, ఇంగ్లండ్ వికలాంగుల టీమ్ కోసం నిధులు సమీకరించడానికి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ‘చాలా మంది క్రికెట్ సూపర్ స్టార్‌లతో కలిసి ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఓ మంచి పని కోసం మేం మద్దతిస్తున్నందుకు గర్వంగా ఉంది. హీరోస్ జట్టుకు మద్దతివ్వాలని అభిమానులను కోరుతున్నా’ అని ధోని పేర్కొన్నాడు.
ఛారిటీ మ్యాచ్‌లో ధోని, సెహ్వాగ్
Published Thu, Sep 3 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement