
సాక్షి, స్పోర్ట్స్ : జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్‌జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ బొరష్యా డార్ట్‌మండ్ చారిటీ కోసం ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొన్నాడు. అనుభవమున్న ఆటగాడిలా రెండు గోల్స్ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్, హెడర్ ద్వారా గోల్ చేసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకి షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ విన్నర్ మారియో గాట్జ్‌తో తలపడి మరీ గోల్ చేయడం విశేషం. తన ప్రదర్శన చూసి డార్ట్‌మండ్ టీమ్ క్లబ్ తనతో కాంట్రాక్ట్ చేసుకుంటుందోమో అంటూ బోల్ట్ సరాదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా బోల్ట్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు.
డార్ట్‌మండ్ టీమ్ స్పాన్సర్ ‘పూమా’ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొని ప్రచారం కల్పించాల్సిందిగా కోరటంతో బోల్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తాడు. జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్ వరల్డ్ చాంపియన్ షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
New Levels #NextJourney pic.twitter.com/aeOilbnSq9
— Usain St. Leo Bolt (@usainbolt) March 23, 2018