usain bolt
-
టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ప్రచారకర్తగా బోల్ట్
దుబాయ్: అథ్లెటిక్స్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు కొత్తగా క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జూన్ 1 నుంచి జరిగే ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న నేపథ్యంలో విండీస్ జట్టులో భాగమైన జమైకా దేశ ప్లేయర్ బోల్ట్‌ను ఎంచుకుంది.కొన్నేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికిన ఫాస్టెస్ట్ స్ప్రింటర్ బోల్ట్ పేరిటే ప్రస్తుతం 100 మీటర్లు, 200 మీటర్లు ప్రపంచ రికార్డులు నమోదై ఉన్నాయి. ‘ఈ కొత్త పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉంది. అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే కరీబియన్ దేశం నుంచి వచ్చిన నా మదిలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.వరల్డ్ కప్ అమెరికాలో జరగడం క్రికెట్ మార్కెట్‌ను మరింత విస్తరించేలా చేస్తుంది. అయితే టోర్నీలో మాత్రం నేను వెస్టిండీస్ జట్టుకు మద్దతు పలుకుతా’ అని బోల్ట్ వెల్లడించాడు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. -
ఉసేన్ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోని రోబో.. 100 మీటర్ల రేస్‌లో గిన్నిస్ రికార్డు
కాస్సీ అనే రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రేస్‌ను 24.73 సెకెన్లలో ముగించిన కాస్సీ.. అత్యంత వేగంగా పరుగు పూర్తి చేసిన రెండు కాళ్ల రోబోగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. మనుషుల వేగంతో పోల్చుకుంటే కాస్సీ వేగం తక్కువే అయినప్పటికీ.. ఓ రోబో నుంచి ఇది ఆశ్చర్యకరమైన ప్రదర్శనే అని చెప్పాలి. గతంలో ఏ రోబో ఇంత వేగంగా 100 మీటర్ల పరుగు పందెన్ని పూర్తి చేయలేదు. కాస్సీ ప్రదర్శన దాని రూపకర్తలకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మున్ముందు కాస్సీ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పరుగులో మరింత వేగాన్ని అందుకోవడం కాస్సీకి కష్టతరమైన సవాలు కాదని వారంటున్నారు. అసలైన సవాలు పరుగు మొదలుపెట్టడం, ఆపడమేనని తెలిపారు. కాస్సీని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఇంజనీర్లు సృష్టించారు. ఇది వారి ఎజిలిటీ రోబోటిక్స్ విభాగంచే తయారు చేయబడింది. కాస్సీ యొక్క మోకాళ్లు ఉష్ట్రపక్షి (Ostrich) నుండి ప్రేరణ పొందాయి. ఉష్ట్రపక్షి భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. దీన్ని ప్రేరణగా తీసుకునే కాస్సీని తయారు చేశారు. కాగా, కాస్సీ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోదని నెటిజన్లు అంటున్నారు. బోల్ట్‌కు కాస్సీకి వ్యత్యాసం 15 సెకెన్లు మాత్రమే. బోల్ట్ 9.58 సెకెన్లలో 100మీ రేస్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మహిళల విభాగంలో 100మీ ప్రపంచ రికార్డు ఫారెన్స్ గ్రిఫిత్ పేరిట ఉంది. ఈమె 10.49 సెకెన్లలో 100మీ రేసును పూర్తి చేసింది. -
ఆ విశేషణాలకు అసలు అర్థం అతడే! సరదాలు ఎక్కువై.. అప్పుడు దారితప్పినా..
మెరుపు ఎలా ఉంటుందో దగ్గరి నుంచి చూశారా.. అతని పరుగు చూస్తే చాలు తెలిసిపోతుంది! రెప్పపాటు కాలంలో, కళ్లు మూసి తెరిచేలోగా అంటూ విశేషణాలు తరచుగా వాడేస్తుంటామా.. వాటి అసలు అర్థం ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది! పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం ఏమిటో చెప్పాలా.. అథ్లెటిక్స్‌లో అతడు సాధించిన ఘనతలు చూస్తే మరెవరికీ అవి సాధ్యం కావని అర్థమవుతుంది! ఒకటి కాదు రెండు కాదు, ట్రాక్ పైకి అడుగు పెట్టగానే అతని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్న ప్రపంచ రికార్డులు, ఒలింపిక్స్ పతకాలు, లెక్కలేనంత అభిమాన గణం.. ఎంతటి సాధారణ నేపథ్యమైనా సరే విజయానికి దానితో పని లేదని.. ఆటతో, శ్రమతో, పట్టుదలతో శిఖరానికి చేరవచ్చని నిరూపించిన దిగ్గజం! తన ప్రతి పరుగుతో ట్రాక్‌ను శాసించిన ఆ అద్భుతం.. ఉసేన్ బోల్ట్!! మైకేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్.. ప్రపంచ క్రికెట్‌కు జమైకా అందించిన దిగ్గజ పేస్ బౌలర్లు. ఉసేన్ బోల్ట్ కూడా వారి బాటలోనే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. అయితే అతని భవిష్యత్తు మరో రూపంలో ఎదురుచూస్తోందని బోల్ట్‌కు తెలీదు. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో బోల్ట్ ఆడుతున్నప్పుడు చూసిన కోచ్ అతనికి మరో మార్గాన్ని నిర్దేశించాడు. నీకున్న మెరుపు పరుగుకు క్రికెట్ కంటే అథ్లెటిక్స్ బెటర్. ఆ రంగమైతే మరింత ‘వేగంగా’ ఎదుగుతావు అని చెప్పాడు. అప్పుడే సీన్ లోకి వచ్చిన అథ్లెటిక్స్ కోచ్ మెక్నీల్ ఆ కుర్రాడిలోని ప్రతిభను సానబెట్టడంతో బంగారు భవిష్యత్తుకు పునాది పడింది. ఆ తర్వాత అతని సహజ ప్రతిభతో స్కూల్ స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎంతో గుర్తింపు ఉన్న కరీబియన్ స్పోర్ట్స్ (కరిఫ్తా గేమ్స్)లో రెండు రజత పతకాలు సాధించడంతో అతని ఆట గురించి జమైకా బయట కూడా తెలిసింది. కొత్త తారగా దూసుకెళ్లి.. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య జూనియర్, యూత్ స్థాయిలోనూ అధికారికంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది. ఆ టోర్నీల్లో రాణిస్తే ఇక బంగారు భవిష్యత్తు ఉండటం ఖాయమని ఒక అంచనా. 15 ఏళ్ల వయసులో బోల్ట్ హంగేరీలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ప్రపంచ వేదికపై ఇదే అతనికి తొలి మెగా ఈవెంట్. అయితే 200 మీటర్ల పరుగులో అతను కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇదే కారణం వల్ల కావచ్చు.. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అతను ఆటపై దృష్టి పెట్టకుండా దూరం జరుగుతూ పోయాడు. అయితే కోచ్‌లు సరైన సమయంలో కల్పించుకోవడంతో మళ్లీ దారిలోకి వచ్చాడు. మరుసటి ఏడాదే కింగ్‌స్టన్‌లో వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ జరిగింది. సొంతగడ్డ నుంచే అద్భుతం మొదలైందా అన్నట్లుగా ఈ ఈవెంట్లో బోల్ట్ చెలరేగిపోయాడు. 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు మరో రెండు రజతాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు మొదలైన ఆ జోరు ఆ తర్వాత వేగంగా కొనసాగింది. ఎక్కడ పరుగెత్తినా, ఎక్కడ పాల్గొన్నా వరుస పతకాలు, రికార్డులు వచ్చి చేరాయి. ఈసారీ మరో ప్రమాద హెచ్చరిక! తాజా విజయాలతో బోల్ట్‌కు సరదాలు ఎక్కువయ్యాయని, క్లబ్‌లలో పార్టీలు, జంక్ ఫుడ్లతో దారి తప్పుతున్న అతడిని జాగ్రత్తగా చూసుకోమని జమైకా ప్రభుత్వమే నేరుగా జమైకా అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు చెప్పింది. దాంతో మళ్లీ కొత్తగా దారిలోకి తీసుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఇదే ఆఖరు! ఆ దిగ్గజం మళ్లీ ట్రాక్ తప్పాల్సిన అవసరం రాలేదు. వరల్డ్ చాంపియన్‌షిప్‌తో మొదలు.. బోల్ట్.. ఒలింపిక్స్ ఎంట్రీ 2004 ఏథెన్స్‌లోనే జరిగింది. అయితే తాను కూడా దానిని ఎంతో తొందరగా మర్చిపోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పరుగులో తొలి రౌండ్లోనే అతను వెనుదిరిగాడు. తర్వాతి ఏడాది తొలి ప్రపంచ చాంపియన్ షిప్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఫైనల్స్‌లో అతను చివరి స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో చూపిన ఘనతలు సీనియర్‌కు వచ్చే సరికి కనిపించకపోవడంతో బోల్ట్‌పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఇది అతనిలో కసిని పెంచింది. దాదాపు రెండేళ్ల పాటు అన్నీ వదిలి అతను ఒకే ఒక లక్ష్యంతో తీవ్ర సాధన చేశాడు. తన స్ప్రింట్స్ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని 200 మీటర్లే కాదు, 100 మీటర్ల పరుగులోనూ పాల్గొంటానంటూ కోచ్‌తో పట్టుబట్టి మరీ తన మాట నెగ్గించుకున్నాడు. 2007 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గెలిచిన 2 రజతాలు బోల్ట్‌ను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో, వరల్డ్ చాంపియన్ షిప్లో అతని విజయధ్వానం వినిపించింది. అలా ముగిసింది.. 2017 ఆగస్టు.. లండన్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతోంది. అంతకు ముందు ఏడాదే రియో ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన తర్వాత బోల్ట్ ఆటకు గుడ్‌బై చెప్పవచ్చని వినిపించింది. అయితే కొన్ని ఒప్పందాలు, ఇతర కారణాల వల్ల అతను మరో మెగా ఈవెంట్‌కు సిద్ధం కావాల్సి వచ్చింది. అయితే పతకాలు సాధించే చాన్సెస్ పట్ల కొన్ని సందేహాలు ఉన్నా.. అతనిపై అభిమానులకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. అది 100 మీటర్ల రేస్‌లో కనిపించింది. అయితే భయపడినట్లుగానే అనూహ్య ఫలితం వచ్చింది. పదేళ్ల కాలం పాటు ఓటమి లేకుండా ట్రాక్‌ను శాసించిన బోల్ట్ చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 200 మీటర్ల పందెంలో పాల్గొనని బోల్ట్.. తన అభిమానుల కోసం దేశం తరఫున 4* 100 మీటర్ రిలేలో పరుగెత్తేందుకు సంకల్పించాడు. అది బోల్ట్ చివరి రేస్‌గా ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకించింది. అయితే చివరి లెగ్‌లో జమైకా ఆశలు మోస్తూ పరుగు ప్రారంభించిన బోల్ట్ సగం దూరానికే కుప్పకూలిపోయాడు. కండరాలు పట్టేయడంతో ముందుకు వెళ్లలేక కన్నీళ్లపర్యంతం అయ్యాడు. నిర్వహకులు వీల్‌చైర్ తీసుకు రాగా, వారిని నివారిస్తూ తన సహచరులు తోడుగా రాగా ‘ఫినిషింగ్ లైన్’ను దాటాడు. అథ్లెటిక్స్ ట్రాక్‌పై ఒక అత్యద్భుత ప్రస్థానం చివరకు అలా ముగిసింది. బంగారాల సింగారం.. అథ్లెటిక్స్ చరిత్రలో అనితరసాధ్యమైన రికార్డులు బోల్ట్ పేరిట ఉన్నాయి. మూడు ఈవెంట్లు 100 మీ., 200 మీ., 4* 100 మీ. రిలేలలో మూడేసి చొప్పున వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతను 9 స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్ , 2016 రియో ఒలింపిక్స్‌లలో అతను ఈ ఘనత సాధించాడు. 6 ప్రపంచ చాంపియన్ షిప్‌లతో కలిపి 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం అతను సాధించాడు. 2008లో స్వర్ణం సాధించిన జమైకా రిలే జట్టులో సభ్యుడైన నెస్టా కార్టర్ 2017లో డోపింగ్‌లో పట్టుబడటంతో ఆ ఫలితాన్ని రద్దు చేసి పతకం వెనక్కి తీసుకోవడంతో బోల్ట్ ఖాతాలో 8 స్వర్ణాలు మిగిలాయి. అయితే ఇది తన ఘనతను ఏమాత్రం తగ్గించదని అతను చెప్పుకున్నాడు. టు ద వరల్డ్ ఉసేన్ బోల్ట్ అనగానే అందరి మదిలో మెదిలే దృశ్యం విజయానంతరం అతను ఇచ్చే పోజ్! సామాన్యుడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగానని చెప్పేలా ‘టు ద వరల్డ్’ అంటూ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక దశలో ప్రపంచ ప్రముఖులు ఎంతో మంది దీనిని అనుకరించి చూపించడం విశేషం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! -
'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'
లెజెండరీ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైన సంగతి తెలిసిందే. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టగా.. షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం డబ్బులు మాయం చేసిన సంస్థపై కోర్టులో కేసు వేయగా విచారణ కొనసాగుతుంది. తాజాగా బోల్ట్ తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై స్పందించాడు. కోట్ల రూపాయలు నష్టపోవడంతో బోల్ట్ మానసికంగా కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బోల్ట్ ఆ వార్తలను ఖండించాడు. ''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యను. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని చెప్పుకొచ్చాడు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం
జమైకా దిగ్గజ అథ్లెట్.. ఒలింపియన్ ఉసెన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి. గార్డన్ తెలిపారు. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్ అకౌంట్లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్ తరపు లాయర్ గార్డన్ వెల్లడించారు. ''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని.. ప్రైవేటు పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్ట్ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్స్టన్ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్ గార్డన్ తెలిపారు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్ బోల్ట్
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది చిరుత పులిని తలపించే వేగం. ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరుగుల వీరుడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అథ్లెట్‌గా రిటైర్ అయిన బోల్ట్ త్వరలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. చిన్నప్పటి నుంచి ఉసేన్ బోల్ట్‌కు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. క్రికెట్‌పై అమితమైన ప్రేమ ఉన్నప్పటికి పరిస్థితుల దృష్యా అథ్లెట్‌గా మారాల్సి వచ్చింది. తాజాగా క్రికెటర్ అవ్వాలన్న కలను బోల్ట్ త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్ కోచింగ్ పాఠాలు వింటూ ప్రాక్టీస్‌లో బిజీ అయ్యాడు. ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో బోల్ట్ ఆడనున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు బోల్ట్‌కు ఆహ్వానం పంపారు. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మొదటి ఎడిషన్ ఇండియాలో జరపనున్న నిర్వాహకులు ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా లీగ్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్లకు ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ అని పేర్లు పెట్టారు. కాగా ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు. -
క్రికెట్లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే!
Usain Bolt set to play T20 cricket..?: ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్ స్పోర్ట్స్ ఛానల్ ఈ లీగ్ కోసం బోల్ట్‌ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా బోల్ట్ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్ నుంచి బోల్ట్ రిటైర్మ్మెంట్ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్ అంటే ఇష్టమని బోల్ట్ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్ లవ్’ అని బోల్ట్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే. చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో -
13 ఏళ్ల అనంతరం కొత్త చాంపియన్.. ఉసేన్ బోల్ట్ తర్వాత అతడే
గత మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో ఉసేన్ బోల్ట్ రూపంలో ఒక్కడే చాంపియన్‌గా నిలిచాడు. ఇతర ప్రత్యర్థులు అతనికి సమీపంలోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు బోల్ట్ లేడు. దాంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ 200 మీటర్ల పరుగులో మెరిశాడు. ‘రియో’లో రెండో స్థానంలో నిలిచి స్వర్ణాన్ని చేజార్చుకున్న గ్రాసీ... ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా విజేతగా నిలిచి ఒలింపిక్ స్వర్ణ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. టోక్యో: నాలుగు రోజుల క్రితం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్న కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డి గ్రాసీ అద్భుతం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకంతో మెరిశాడు. దాంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ 200 మీటర్ల పరుగులో కొత్త విజేత అవతరించాడు. అంతేకాకుండా డొనోవాన్ బెయిలీ (1996 అట్లాంటా) తర్వాత స్ప్రింట్ రేసులో మళ్లీ పసిడి పతకాన్ని సాధించిన తొలి కెనడా అథ్లెట్‌గా గ్రాసీ నిలిచాడు. ఒలింపిక్స్ల్లో గ్రాసీకిది ఐదో పతకం. 2016 ‘రియో’లో 100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల టీమ్ రిలేలో కాంస్యా లను... 200 మీటర్ల పరుగులో రజతాన్ని దక్కించుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే 100 మీటర్ల పరుగులో కాంస్యాన్ని నెగ్గాడు. గ్రాసీ తర్వాత 19.68 సెకన్లలో గమ్యాన్ని చేరిన కెనెత్ బెడ్నారెక్ (అమెరికా–19.68 సెకన్లు) రజతం... నోవా లైలెస్ (అమెరికా–19.74 సెకన్లు) కాంస్యం సాధించారు. అప్పుడు చేజారింది... ఇప్పుడు దక్కింది అది రియో ఒలింపిక్స్... 200 మీటర్ల సెమీఫైనల్–2 హీట్... గన్ ఫైరింగ్ శబ్దం వినగానే బోల్ట్ తన పరుగును ఆరంభించాడు. కొద్ది సేపటి తర్వాత తన ప్రత్యర్థులు ఎంత వెనుకగా వస్తున్నారో చూద్దాం అన్నట్లు బోల్ట్ వెనక్కి ఒక లుక్కేశాడు. ఒక్కరు మినహా మిగిలిన రన్నర్లందరూ చాలా దూరంలో ఉన్నారు. అయితే బోల్ట్ వారిని పట్టించుకోలేదు. తన వెంటే వస్తోన్న గ్రాసీపైనే దృష్టి సారించాడు. వెంటనే పరుగు వేగం పెంచాడు. అలా 19.80 సెకన్లలో రేసును ముగించి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అయితే గ్రాసీ కేవలం 0.2 సెకన్లు వెనుకగా రెండో స్థానంలో నిలిచి అతడు కూడా పసిడి పోరుకు క్వాలిఫై అయ్యాడు. రేసు పూర్తయ్యాక బోల్ట్... ‘నువ్వు నన్ను చాలా కష్టపెట్టావ్’ అన్నట్లు వేలితో చూపించాడు. ఫైనల్లో మాత్రం బోల్ట్ గ్రాసీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. రేసును వేగంగా ముగించి స్వర్ణంతో మెరవగా... రెండో స్థానంలో నిలిచిన గ్రాసీ రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే సరిగ్గా ఐదేళ్ల తర్వాత బోల్ట్ లేని పరుగులో గ్రాసీ పసిడిని చేజిక్కించుకోవడం విశేషం. -
బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు
జమైకా: చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్(34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన జీవిత భాగస్వామి బెన్నెట్ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే రోజున ఫ్యామిలీ ఫోటోతో ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. అయితే, బోల్ట్ పిల్లల పేర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి పేర్లు వరసగా ఒలింపియా లైటనింగ్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్, థండర్ బోల్ట్ కాగా.. ఒలింపియా లైటనింగ్ బోల్ట్ 2020 మేలో జన్మించింది. ఇక కవలల ఫొటో మాత్రమే పంచుకున్న బోల్ట్ వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. బోల్ట్ పిల్లల పేర్లపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘లైటనింగ్ (మెరుపు), థండర్ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు.’’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. బోల్ట్ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బోల్ట్ జీవిత భాగస్వామి బెన్నెట్ స్పందిస్తూ.. ‘‘ ఈ కుటుంబానికి ఉస్సేన్ బోల్ట్ ఓ పెద్ద బలం.. పిల్లలకు ఓ గొప్ప తండ్రి.. ఎప్పటికీ ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2008, 2012, 2016 లో జరిగిన ఒలింపిక్స్‌లో ఉసేన్ బోల్ట్ ఎనిమిది బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండేసి పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్ ఉసేన్ బోల్ట్. Olympia Lightning Bolt ⚡️ Saint Leo Bolt ⚡️ Thunder Bolt ⚡️@kasi__b pic.twitter.com/Jck41B8j3J — Usain St. Leo Bolt (@usainbolt) June 20, 2021 చదవండి: Wrestler Khali: రెజర్ల్ కాళి ఇంట విషాదం -
భారత ఉసేన్ బోల్ట్ శ్రీనివాస గౌడ మరో రికార్డు
బెంగళూరు: భారత ఉసేన్ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబాళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు సృష్టించాడు. గతేడాది కంబాళ పోటీల్లో దున్నలతో పాటు142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో(100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి) పూర్తి చేసిన ఆయన.. తాజాగా జరిగిన పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. శ్రీనివాస గౌడ గతేడాది జరిగిన పోటీల్లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు(9.58 సెకన్లు) బ్రేక్ చేయగా, తాజాగా జరిగిన పోటీల్లో ఊహకు అందని స్పీడ్‌లో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి మరోసారి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. కాగా, ఈ అభినవ బోల్ట్‌ను ఒలింపిక్స్‌కు సిద్దం చేయాలని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహ్వానం పంపినప్పటికీ.. అతను దాన్ని సున్నితంగా తిరస్కరించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని ప్రకంపనలు సృష్టించాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతను లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధృవీకరించారు. గతవారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తి చేసిన ఆయన.. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా.. కంబాళ అనేది దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాళ ఆటలో ఎద్దులను ఉసికొల్పుతూ పోటీదారుడు బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. చదవండి: ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో.. -
బోల్ట్‌కు కరోనా
కింగ్స్టన్: అథ్లెట్ దిగ్గజం, ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్‌కు కరోనా వైరస్ సోకింది. దాంతో తన స్వగృహంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు అతను సోషల్ మీడియాలో తెలిపాడు. ట్రాక్‌లపై చిరుతలా పరుగెత్తే బోల్ట్ ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నాడు. ఇటీవల అత్యంత సన్నిహితులు, క్రీడాతారల మధ్య ఈనెల 21వ తేదీన తన 34వ పుట్టిన రోజు వేడుక జరుపుకున్న ఈ జమైకన్ స్టార్ ఆ వేడుకల్లో కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ పార్టీలో పాల్గొన్నవారంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా... మాస్క్ కూడా ధరించకుండానే చిందులేసినట్లు ఫొటో ల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో రోజుల వ్యవధిలో అతను ఈ మహమ్మారి బారిన పడ్డాడు. కోవిడ్–19 టెస్టులో తనకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు తెలిపాడు. కరోనా సోకడంతో బాధ్యతగల పౌరుడిగా స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పాడు. 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకున్న బోల్ట్ ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 2017లో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గేల్ బయటపడ్డాడు... బోల్ట్ పార్టీలో ఆడి పాడిన వారిలో వెస్టిండీస్ డాషింగ్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. అయితే అథ్లెట్ స్టార్‌కు కోవిడ్ సోకడంతో తను త్వరపడ్డాడు. వెంటనే కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అందులో నెగెటివ్ ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతను త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీ కోసం యూఏఈ బయల్దేరాల్సి ఉంది. ఇప్పుడు నెగెటివ్ వచ్చినా మరో రెండు టెస్టుల్లోనూ అదే ఫలితం రావాలి. అప్పుడే ఐపీఎల్ ఆడేందుకు అర్హుడు. అయితే కోవిడ్ నెగెటివ్ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న గేల్ ఈ 2020లో ఇంటిపట్టునే ఉంటానని ఎక్కడికీ ప్రయాణం చేయబోనని పోస్ట్ చేశాడు. గేల్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఉసేన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్
కింగ్స్టన్: ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘గుడ్ మార్నింగ్.. నాకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్లోకి వెళ్తున్నాను. ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్ ఏంటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలిని భావిస్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు బోల్ట్. (భౌతిక దూరం: నాడు రియల్.. నేడు వైరల్) Stay Safe my ppl 🙏🏿 pic.twitter.com/ebwJFF5Ka9 — Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020 ఇటీవల కొద్ది రోజుల క్రితమే అనగా ఆగస్టు 21న ఉసేన్ బోల్ట్ తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఇందులో ప్రముఖులతో పాటు చాలా మంది పాలుపంచుకున్నారు. అయితే ఈ పార్టీకి హాజరయిన వారు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. విచ్చలవిడిగా ప్రవర్తించారని సమాచారం. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు. వారిలో కొందరు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆగస్టు 21 న జరిగిన పుట్టినరోజు పార్టీకి మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్, బేయర్ లెవెర్కుసేన్ అటాకర్ లియోన్ బెయిలీ, క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ హాజరైనట్లు భావిస్తున్నారు. జూన్‌లో టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఈ జాబితాలో చేరిన ప్రముఖ క్రీడాకారుడు బోల్ట్. -
ఉసేన్ బోల్ట్ కూతురి పేరు తెలుసా!
కింగ్స్టన్: జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. బోల్ట్ భాగస్వామి కాసీ బెన్నెట్ జూన్ 14న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ, పేరును కానీ ప్రకటించకపోవడం గమనార్హం. బుధవారం తన భార్య కాసీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో కూతురు ఫొటోను షేర్ చేసి పేరును ప్రకటించాడు. ‘నా ప్రియురాలు కాసీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్న. నేను మీ ఆనందాన్ని తప్పా మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మేము మా కూతురు ‘ఒలింపియా లైట్నింగ్’తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం’ అంటూ బోల్ట్ తన కూతురి పేరును ప్రకటించాడు. (చదవండి: బోల్ట్ తండ్రయ్యాడు) I want to wish my gf @kasi__b a happy birthday. I get to spend ur special day with u. I want nothing but happiness for u & will continue to doing my best keeping a smile on ur face. We have started a new chapter together with our daughter Olympia Lightning Bolt ⚡️🎉🎊💫 pic.twitter.com/FhlwdaF2Zx — Usain St. Leo Bolt (@usainbolt) July 7, 2020 ఉసేన్ తండ్రైన విషయం వాస్తవమే అంటూ జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సామాజిక మాధ్యమం ద్వారా స్ఫష్టం చేస్తూ బోల్డ్ దంపతులకు శుభకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. గత మార్చిలోనే బోల్ట్... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. -
బోల్ట్ తండ్రయ్యాడు
కింగ్స్టన్: ఎనిమిదిసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత, జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తండ్రి అయ్యాడు. బోల్ట్ భాగస్వామి కాసీ బెన్నెట్ ఇక్కడి హాస్పిటల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం నిజమేనంటూ స్వయంగా జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సామాజిక మాధ్యమం ద్వారా తెలపడం విశేషం. ‘ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్–కాసి బెన్నెట్ జంటకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోల్ట్... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. -
భౌతిక దూరం: నాడు రియల్.. నేడు వైరల్
వాషింగ్టన్: ఉసేన్ బోల్ట్ అంటే క్రీడాలోకానికి బాగా తెలుసు... చాంపియన్ స్ప్రింటర్ అని! బీజింగ్ ఒలింపిక్స్‌లో మొదలైన అతని విజయపరంపర తదనంతరం డైమండ్ లీగ్‌లు, ప్రపంచ చాంపియన్ షిప్లదాకా సాగింది. పుష్కరకాలం క్రితం బీజింగ్‌లో పరుగుల చిరుతగా, రియల్ హీరోగా రికార్డుల తెరకెక్కిన బోల్ట్ ఇప్పుడు 12 ఏళ్లు అయ్యాక కూడా వార్తల్లోకెక్కాడు. చిత్రంగా అదే చాంపియన్ ఫొటోతో! 2008 ఒలింపిక్స్‌లో జరిగిన 100 మీటర్ల రేసును బోల్ట్ 9.69 సెకన్ల రికార్డు టైమింగ్‌తో ముగించి చరిత్రకెక్కాడు. అప్పుడు విజేతగా నిలిచి న క్షణాల్ని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ నికోలస్ తన కెమెరాలో బంధించాడు. ఇందులో బోల్ట్ అందరికంటే ముందుగా, వేగంగా, తోటి పోటీదారులు ఫినిషింగ్ లైన్‌కు దూరంగా ఉండగానే ముగించాడు. ఇందు లో సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) కోణం కనబడుతుంది. మహమ్మారి విజృంభణతో ఇప్పు డు ప్రపంచమంతా ఈ దూరంతోనే బతికేస్తోంది. అందుకే నాటి ఫొటో అప్పుడు ఎంతగా పతాక శీర్షికలకు ఎక్కిందో... ఇప్పుడు కూడా అంతే తాజాగా సామాజిక సైట్లలో వైరల్ అయింది. ఇప్పుడీ ఫొటో వేలసంఖ్యలో రీట్వీట్ కాగా.. లక్షలకొద్దీ లైక్‌లు వచ్చాయి. నిజంగా ఈ జమైకన్ స్ప్రింటర్ అప్పుడు రియల్... ఇప్పుడేమో వైరల్ ‘చాంపియన్’ అయ్యాడు కదా! అన్నట్లు ఈ రిటైర్డ్ చాంపియన్ కోవిడ్–19పై పోరులో జమైకాను జాగృతం చేస్తున్నాడు. మహమ్మారికి మందు దూరంగా ఉండటమేనంటూ, గడపదాటకుండా గడపడమే సురక్షితమంటూ ప్రచారం చేస్తున్నాడు. ఈ సంక్షోభంలో నిధుల సేకరణలోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. చదవండి: ఊ.. 500 సార్లు రాయండి.. పోలీసాఫీసర్‌గానూ.. డాక్టర్‌గానూ -
ట్రాక్‌పైకి కంబళ వీరుడు!
మంగళూరు: కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు. బురదతో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబళ పోటీల్లో గౌడ వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) దక్షిణభారత విభాగం డైరెక్టర్ అజయ్ భేల్, ఇతర అధికారులు కాసరగోడ్ జిల్లాలోని పైవలికేలో శ్రీనివాసతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు. బెంగళూరులోని శాయ్ కేంద్రంలో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్‌లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది. మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస ఈ ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. -
కంబాల రేసర్‌కు సాయ్ పిలుపు!
బెంగుళూరు: అంతర్జాతీయంగా ఫీల్డ్ అండ్ ట్రాక్ అథ్లెటిక్స్‌లో ఇప్పటికే తనదైన ముద్రతో దూసుకుపోతున్న భారత్‌కు మరో ఉసేన్ బోల్డ్ దొరికాడా అంటే అవుననే చెప్పాలేమో. ఉసేన్ బోల్డ్‌ను మించిన వేగంతో దూసుకొచ్చిన కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస గౌడ ఇప్పుడు యావత్ భారతావనిని ఆకర్షించాడు. అది ఇప్పుడు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు చెంతకు చేరింది. దాంతో శ్రీనివాస గౌడకు సాయ్ నుంచి ఆహ్వానం పంపుతామని ఆయన స్పష్టం చేశారు. తానే స్వయంగా శ్రీనివాస గౌడకు కాల్ చేసి సాయ్ నిర్వహించే ట్రయల్‌కు రమ్మని పిలుస్తానని పేర్కొన్నారు. ‘నేను శ్రీనివాస గౌడను సాయ్ ట్రయల్స్‌కు రమ్మని పిలుస్తా. చాలామందికి ఒలింపిక్స్ స్టాండర్స్ గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం. దాంతోనే ఎన్నో ఘనతలు సాధ్యం. భారత్‌లో టాలెంట్ అనేది నిరూపయోగంగా ఉండకూడదు’ అని కిరణ్ రిజుజు అన్నారు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ ముప్పయ్ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. (ఇక్కడ చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!) -
ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!
-
ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!
సాక్షి, బెంగుళూరు : చిరుత పులిలా పరుగెత్తే స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వేగం చూసి ఆశ్చర్యపోయాం. అబ్బురపడ్డాం..! మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడొకరు అలాంటి వేగాన్నే పరిచయం చేశాడు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే, వేగంగా పరుగెత్తే దున్నల వల్లనే శ్రీనివాస గౌడ పరుగు ముడిపడి ఉందని గమనించడం మరువొద్దు..! కంబాల అంటే ఎంతో ఇష్టం.., ‘బురద పొలంలో రెండు దున్నలను పరుగెత్తిస్తూ.. వాటితో పాటు లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ క్రీడ. సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్నకంబాల క్రీడలో ప్రధానంగా యువకులు పాల్గొంటారు. నాకు కంబాల అంటే ఎంతో ఇష్టం. ఈ విజయం నా దున్నల వల్లనే సాధ్యమైంది. అవి వేగంగా పరుగెత్తడంతో.. నేనూ అంతే వేగంగా పరుగెత్తగలిగా’అని శ్రీనివాస గౌడ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. పశువులను హింస పెడుతున్నారని జంతు ప్రేమికుల అభ్యంతరం గతంలో కొన్నాళ్లపాటు కంబాలను నిషేధించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఆటను పునరుద్ధరించారు. కంబాల ఆటలో గెలిచిన వారికి లక్షల్లో బహుమతి కూడా ఉంటుంది. -
షెల్లీ గెలిచింది మళ్లీ...
తల్లి హోదా వచ్చాక తమలో ప్రావీణ్యం మరింత పెరిగిందేకానీ తరగలేదని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్... అమెరికా స్టార్ అలీసన్ ఫెలిక్స్ నిరూపించారు. మహిళల 100 మీటర్ల విభాగంలో తనకు తిరుగులేదని షెల్లీ మరోసారి లోకానికి చాటి చెప్పగా... ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్ ఫెలిక్స్ గుర్తింపు పొందింది. 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో 33 ఏళ్ల ఫెలిక్స్‌కు 17వ పతకం కావడం విశేషం. దోహా (ఖతర్): తక్కువ ఎత్తు ఉన్నా... ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లే అలవాటుతో... ‘పాకెట్ రాకెట్’గా ముద్దు పేరు సంపాదించిన జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ మళ్లీ విశ్వవేదికపై కాంతులీనింది. తొలి సంతానం కోసం 2017 ప్రపంచ చాంపియన్ షిప్‌కు దూరమైన షెల్లీ... మగశిశువుకు జన్మనిచ్చాక ఈ ఏడాది మళ్లీ ట్రాక్‌పై అడుగు పెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రాణిస్తుందో లేదో అనే అనుమానం ఉన్న వారందరి అంచనాలను తారుమారు చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 5 అడుగుల ఎత్తు ఉన్న షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. రాకెట్ వేగంతో రేసును ఆరంభించిన షెల్లీ 20 మీటర్లకే తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి అందరికంటే ముందుకు వెళ్లిపోయింది. అదే జోరులో రేసును ముగించేసింది. డీనా యాషెర్ స్మిత్ (బ్రిటన్–10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్–10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచింది. రేసు ముగిసిన వెంటనే షెల్లీ తన రెండేళ్ల కుమారుడు జియోన్‌తో సంబరాలు చేసుకుంది. ‘మళ్లీ స్వర్ణం గెలిచి... నా కుమారుడితో విశ్వవేదికపై సగర్వంగా నిల్చోవడం చూస్తుంటే నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. గత రాత్రంతా నాకు నిద్ర లేదు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలోనూ ఇలాగే జరిగింది. శుభారంభం లభిస్తే చాలు రేసులో దూసుకుపోతానని తెలుసు. అదే వ్యూహంతో ఈసారీ బరిలోకి దిగాను. కొన్నాళ్లుగా తీవ్రంగా కష్టపడ్డాను. భర్త జేసన్, కుమారుడు జియోన్ నాలో కొత్త శక్తిని కలిగించారు’ అని షెల్లీ వ్యాఖ్యానించింది. ఫెలిక్స్...12వ స్వర్ణం గత నవంబర్‌లో ఆడ శిశువు కామ్రిన్కు జన్మనిచ్చాక... ఈ ఏడాది జులైలో ట్రాక్‌పైకి అడుగు పెట్టిన అలీసన్ ఫెలిక్స్ 4x400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది. జావెలిన్ ఫైనల్లో అన్ను రాణి... సోమవారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు 12 మంది పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ ‘ఎ’ గ్రూప్‌లో పోటీపడిన అన్ను రాణి ఈటెను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఈ క్రమంలో 62.34 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో తొమ్మిదో స్థానంతో అన్ను రాణి నేడు జరిగే ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 200 మీటర్ల హీట్స్‌లో అర్చన 23.65 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల 400 మీటర్ల హీట్స్‌లో భారత్‌కే చెందిన అంజలీ దేవి 52.33 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. -
బోల్ట్ ‘వరల్డ్’ రికార్డును బ్రేక్ చేశారు..
దోహా: సుమారు తొమ్మిది సంవత్సరాలపాటు అతని ముందు గాలికూడా జొరబడలేని వేగంతో అత్యధిక ప్రపంచ చాంపియన్ పతకాలూ గెలుచుకున్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ అయ్యింది. అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్ అలిసన్ ఫెలిక్స్.. బోల్ట్ వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4/400 మీటర్ల మిక్స్డ్ రిలేలో స్వర్ణం పతకం సాధించడంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ ఫిలెక్స్ 12 స్వర్ణ పతకాలను సాధించి కొత్త రికార్డుకు నాంది పలికారు. అంతకుముందు ఈ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 11 పసిడి పతకాలు సాధించగా దాన్ని ఫెలిక్స్ సవరించారు. 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్ రెండో లెగ్ నుంచి పోరును ఆరంభించారు. అయితే ఈ టైటిల్‌ను గెలిచే క్రమంలో అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకండ్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇది సరికొత్త వరల్డ్ రికార్డుగా నమోదైంది. ఇలా 4/400 మిక్స్డ్ రిలేలో అమెరికా జట్టు వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం రెండోసారి. ఇక్కడ జమైకా, బెహ్రయిన్ జట్లను వెనక్కునెట్టి టైటిల్‌ను అందుకున్నారు. ఇక ఫెలిక్స్ ఓవరాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనలో మహిళల 200 మీటర్ల రేసులో మూడు స్వర్ణాలు గెలుచుకోగా, 400 మీటర్ల రేసులో ఒక పసిడిని అందుకున్నారు. 4/100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణ పతకాలను ఫెలిక్స్ సాధించారు. ఇక 4/400 మీటర్ల మహిళల రిలేలో నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు. తాజాగా 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్‌కు ఇది స్వర్ణం. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫెలిక్స్‌కు మొదటి స్వర్ణం కావడం విశేషం. -
మరో ఆటకు గుడ్‌బై చెప్పిన బౌల్ట్
కింగ్స్టన్(జమైకా): ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన కలలకు స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ గుడ్ బై చెప్పాడు. ఈ పరుగుల రారాజు గతేడాది స్ప్రింట్ ఫీల్డ్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సెంట్రల్ కోస్ట్ మెరైన్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకొని అందులో చేరాడు. ఒకట్రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో గోల్స్ సైతం కొట్టాడు. అయితే, ఆ తర్వాత ఆ జట్టుతో ఒప్పందం రద్దవడం, యూరోపియన్ క్లబ్‌ల్లో చేరాలన్న ప్రయత్నం నెరవేరకపోవడంతో చివరికి ఫ్రొఫెనల్ పుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన కలలకు పుల్‌స్టాప్ పెట్టాడు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన బోల్ట్ త్వరలో తాను బిజనెస్లోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. -
జీరో గ్రావిటీలోనూ అదరగొట్టిన బోల్ట్
-
జీరో గ్రావిటీలోనూ అదరగొట్టిన బోల్ట్
పారిస్: జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. కానీ ఈ సారి నేల మీద కాదు.. జీరో గ్రావిటీ వాతావరణంలో పరుగులు తీశాడు. తనతోపాటు పోటీలో పాల్గొన్న ఫ్రెంచ్ వ్యోమగామి జీన్ ఫ్రాంకోయిస్, నోవెస్పేస్ సీఈవో ఆక్టేవ్ డి గల్లె వారితో కలిసి పరుగులు తీశాడు. ఈ పందెంలో తొలుత తడబడిన బోల్ట్ చివర్లో మాత్రం విజేతగా నిలిచాడు. జీరో స్పేస్ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన రేస్‌లో గెలిచి తన సత్తా చాటాడు. అయితే ఇదంత జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా.. జీరో గ్రావిటీతో ప్రత్యేకంగా తయారైన ఎయిర్‌బస్ జీరో జీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బోల్ట్ తన స్టైల్లో షాంపైన్ బాటిల్‌తో తన విజయాన్ని సెలబ్రెట్ చేసుకున్నాడు. అయితే ఈ బాటిల్‌ను స్పేస్ టూరిజం పెంపొందించడానికి, వ్యోమగాముల కోసం ప్రత్యేంగా తయారు చేశారు. దీనిపై బోల్ట్ మాట్లాడుతూ.. తొలుత కొద్దిగా నీరసంగా ఫీల్ అయినప్పటికీ.. తర్వాత ఈ అనుభూతి చాలా బాగా అనిపించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బోల్ట్.. 2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్షిప్ అనంతరం అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. -
అయ్యో జమైకా!
గోల్డ్‌కోస్ట్: ఉసేన్ బోల్ట్... పరుగుల చిరుత... దశాబ్దంపైగా ట్రాక్‌పై అతడిదే హవా... పోటీ ఏదైనా దేశానికి తనో పతకాల పంట...! కానీ బోల్ట్ రిటైర్మెంట్ తర్వాత అంతా మారిపోయింది. అతడు లేకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న జమైకా స్ప్రింట్ విభాగంలో (100, 200 మీటర్లు) ఒక్కటంటే ఒక్క స్వర్ణమూ గెలవలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యోహాన్ బ్లేక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 100 మీటర్ల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ అయిన బ్లేక్ ఈసారి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 200 మీటర్ల పరుగులో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఎలైన్ థాంప్సన్ గాయం కారణంగా పతకం తేలేకపోయింది. మరోవైపు ఈ క్రీడల్లో 4గీ100 మీటర్ల పరుగులో తమ రిలే బృందం స్వర్ణ పతకం నెగ్గడంలో విఫలమవడంతో మరీ తొందరగా రిటైరయ్యావంటూ కొందరు సోషల్ మీడియాలో బోల్ట్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే... తాజా ప్రదర్శనను జమైకా ఒలింపిక్ చీఫ్ క్రిస్టోఫర్ సముదా ఆశావహంగా తీసుకున్నారు. బోల్ట్ ప్రభావం తమపై చాలా ఉందంటూనే, దేశంలో ప్రతిభకు లోటు లేదని పేర్కొన్నారు. స్ప్రింట్‌లో స్వర్ణాలు సాధించకున్నా ఈసారీ అథ్లెటిక్సే జమైకాకు పతకాలు తేవడంలో పెద్ద దిక్కు అయ్యింది. జమైకా ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు సాధించగా అందులో 25 అథ్లెటిక్స్ నుంచే రావడం విశేషం. -
ఫుట్‌బాల్ ప్లేయర్‌గా షాకిచ్చిన బోల్ట్
సాక్షి, స్పోర్ట్స్ : జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ బొరష్యా డార్ట్మండ్ చారిటీ కోసం ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొన్నాడు. అనుభవమున్న ఆటగాడిలా రెండు గోల్స్ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్, హెడర్ ద్వారా గోల్ చేసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకి షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ విన్నర్ మారియో గాట్జ్తో తలపడి మరీ గోల్ చేయడం విశేషం. తన ప్రదర్శన చూసి డార్ట్మండ్ టీమ్ క్లబ్ తనతో కాంట్రాక్ట్ చేసుకుంటుందోమో అంటూ బోల్ట్ సరాదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా బోల్ట్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. డార్ట్మండ్ టీమ్ స్పాన్సర్ ‘పూమా’ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొని ప్రచారం కల్పించాల్సిందిగా కోరటంతో బోల్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తాడు. జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్ వరల్డ్ చాంపియన్ షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. New Levels #NextJourney pic.twitter.com/aeOilbnSq9 — Usain St. Leo Bolt (@usainbolt) March 23, 2018 -
బోల్ట్... ఓ ప్రేక్షకుడిగా!
సిడ్నీ: స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు విచ్చేయనున్నాడు. అయితే పోటీదారుడిగా కాదు.... సగటు ప్రేక్షకుడిగా! వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో 100 మీటర్ల పరుగు ఫైనల్ పోటీని బోల్ట్ తిలకిస్తాడని అతని సహచరుడు యోహాన్ బ్లేక్ వెల్లడించాడు. ‘8 సార్లు ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ 100, 200 మీటర్ల పరుగులో రికార్డు నెలకొల్పిన బోల్ట్ గోల్డ్‌కోస్ట్‌కు వస్తున్నాడు. 100 మీ. పరుగు ఫైనల్స్‌ను తిలకిస్తాడు’ అని చెప్పాడు. తాను వచ్చాక జమైకన్లు పతకం గెలవకపోతే బాగుండదని బోల్ట్ అన్నట్లు బ్లేక్ తెలిపాడు. -
‘మా జట్టు సిద్ధమైంది..’
పారిస్: ఇన్నాళ్లూ మనం దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ పరుగును, ప్రపంచ రికార్డులను చూశాం. ఇక మీదట అతని సారథ్యాన్ని చూడబోతున్నాం. ఈ జమైకన్ స్ప్రింట్ స్టార్ చిన్నారుల సంక్షేమం కోసం యూనిసెఫ్ సంస్థ నిర్వహిస్తున్న ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టపడే ఉసేన్ బోల్ట్ ‘సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్’ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. అవతలి జట్టు (ఇంగ్లండ్)కు బ్రిటిష్ రాక్‌స్టార్ రాబీ విలియమ్స్ నాయకత్వం వహించనున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జూన్ 10న ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోలో బ్రెజిల్ స్టార్ రొనాల్డినో, రియల్ మాడ్రిడ్ కోచ్ జినెదిన్ జిదాన్, అమెరికన్ కామెడీ యాక్టర్ విల్ ఫెరెల్ నటించారు. తన సాకర్ ముచ్చటపై బోల్ట్ ట్విట్టర్లో ‘సెలబ్రిటీస్, లెజెండ్స్, బ్రాండ్ న్యూ కెప్టెన్‌తో సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్ జట్టు సిద్ధమైంది’ అని ట్వీట్ చేశాడు. -
కంగారులకు ‘పరుగుల చిరుత’ కోచింగ్
సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఈ గురువారం నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్‌కు ఇరు జట్లు సంసిద్దమయ్యాయి. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేందుకు జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ కంగారుల జట్టుకు శిక్షణనిస్తున్నాడు. పరుగు పందెంలో రారాజైన ఈ జమైకన్ 100, 200 మీటర్ల విభాగాల్లో 8 ఒలింపిక్స్ పతకాలు అందుకొని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గత లండన్ వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన బోల్ట్ రన్నింగ్ కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. ‘పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్నదానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్ ది హెరాల్డ్ దినపత్రికకు తెలిపాడు. బోల్ట్ రన్నింగ్ టిప్స్ యాషేస్ సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆసీస్ క్రికెటర్ హ్యాండ్స్కోంబ్ తెలిపాడు. వికెట్ల మధ్య వేగంగా ఎలా పరుగెత్తాలో, అదే వేగంతోఎలా వెనక్కి రావాలో శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నాడు. -
బంగారు మనిషి
విశ్లేషణ (జీవన కాలమ్) జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది. అతను ప్రపంచంలోకెల్లా వేగంగా పరిగెత్తగల యోధుడు. తొమ్మిది సంవత్సరాలపాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానుల్ని ఆనందోత్సాహాలతో ఉర్రూతలూగించిన చాంపియన్. అతను ఉస్సేన్ బోల్ట్. అభిమానుల తృప్తికోసం ఆఖరిసారి పరుగుపందెంలో పాల్గొంటున్నాడు. అభిమానులు గర్వంగా అతని విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపం చం మరొక్కసారి ఆ విశ్వవిజేత చేసే విన్యాసానికి సిద్ధపడుతోంది. కాని ఆ రోజు అతని అడుగు ఒక్క లిప్తకాలం జంకింది. శరీరం మొరాయించింది. ఆఖరి 50 మీటర్లు ఒక జీవితకాలం దూరంగా కనిపించాయి. తనని దాటి ఏనాడూ కాలు కదపలేని ఇద్దరు ముందుకు దూసుకుపోయారు. అతనికి కాదు. వారికే ఇది పెద్ద షాక్. ఇదేమిటి? పెద్దాయన తడబడ్డాడు! 9 సంవత్సరాలపాటు అతనికి ముందు గాలికూడా జొరబడలేని వేగంతో 8 ఒలింపిక్ పతకాలూ, 11 ప్రపంచ చాంపియన్ పతకాలూ గెలుచుకుని ఎన్నోసార్లు తనని తానే జయించుకుని రికార్డులు సృష్టించిన ఒక వీరుడు ఆ రోజు కేవలం మూడు సెకెన్లు ఆలస్యమయాడు. అతని ముందు ఇద్దరు నిశ్చేష్టులయి, నిస్సహాయంగా ముందుకు దూకారు. అక్కడితో కథ ముగియలేదు. జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది. 9 సంవత్సరాలు ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా నిలిచిన బోల్టు ఏమన్నాడు? ‘నేనూ మామూలు మనిషినే!’ అన్నాడు. ఇలాంటి మామూలు మనుషులు చరిత్రలో ఎంతమంది ఉంటారు! అలాంటి అనూహ్యమైన సంఘటన మరొక్కసారి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మెన్ బ్యాటింగ్ ఏవరేజ్ 100 ఉండేది. ఇది అనూహ్యం. కాని ఆయన ఆఖరి ఆటలో కంటినిండా నీరు ఉంది. మొదటి బాల్కి అవుట్ అయాడు. కనుక ఏవరేజ్ 99.99 అయింది. ఇది కూడా చాలా అరుదయిన విషయం. పరుగు పందెం ముగుస్తూనే బోల్ట్– ఆఖరిసారి పందెం చివరి గీతని తలవొంచి తాకి ముద్దుపెట్టుకున్నాడు.. ఆ గీతమీద లోగడ గోమఠేశ్వరుడిలాగ నిలిచిన చరిత్ర అంతటితో ముగిసింది. చూస్తున్న లక్షలాది అభిమానుల కళ్లు చెరువులయాయి. ఒక దశాబ్దంపాటు ప్రపంచాన్ని పరిపాలించిన ఈ జమైకా వీరుడు– 30సార్లు ప్రపంచంలోని ఎందరో పరుగు వీరులతో పోటీ చేశాడు. వారిలో కేవలం 9 సందర్భాలలో మాత్రమే మాదకద్రవ్యాలు పుచ్చుకోని వీరులు పరుగు తీశారు. ఆ 9 సందర్బాలూ ఒక్క బోల్ట్ విజయాలే! ఓ పాత్రికేయుడు– ఆయన గురించి అన్న మాటని– ఎంత ప్రయత్నించినా తెలుగులో అంత గొప్పగా చెప్పలేను. At a time when there was-and still is- a deep sense of cynicism about sporting excellence of any kind, he was the ultimate escape artist. ఆఖరి పరుగు పందాన్ని గెలిచిన గాట్లిన్ అన్నాడు. ‘‘నేను గెలుస్తున్నంత సేపూ నన్ను వేళాకోళం చేసే కేకలు అభినందించే చప్పట్లకన్నా మిన్నుముట్టాయి. కారణం నాకు తెలుసు. ప్రపంచం బోల్ట్ అపజయాన్ని కూడా పండగ చేస్తోంది.. గెలిచినా బోల్ట్ ముందు ఒక్కసారి మోకరిల్లాలనుకున్నాను. ఈ క్రీడకి ఆయన చేసిన ఉపకారం అనితరసాధ్యం.’’ బోల్ట్ అన్నాడు: ‘‘ఈ వెక్కిరింతలు న్యాయం కాదు. గాట్లిన్ గొప్ప పోటీదారుడు. మంచిమనిషి’’. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానుల సందేశాలు వెల్లువెత్తాయి. మనకు తెలిసివచ్చే ఒకే ఒక అభిమానిని ఉటంకిస్తాను. అతను ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆయన మాటలు: ‘ప్రపంచంలో బోల్ట్ కంటే గొప్పవాడెవడూ లేడు. ఉండడు.. అంత గొప్ప క్రీడా జీవితాన్ని ఇంతవరకూ చూడలేదు. ఇంత త్వరగా ఆ రికార్డులు ఎవరూ అధిగమించలేరు. ఉస్సేన్ సాబ్! ప్రపంచం మిమ్మల్ని తప్పక మిస్ అవుతుంది. ఎప్పుడయినా సరదాకి క్రికెట్ ఆడాలనిపిస్తే రండి. నేనెక్కడ ఉంటానో మీకు తెలుసు!’. బోల్ట్ గొప్ప క్రికెట్ అభిమాని. ‘థ్యాంక్స్ చాంప్’ అని సమాధానం ఇచ్చాడు. పర్వతాన్ని ఎక్కిన ప్రతీవాడికీ దిగే రోజు వస్తుంది. కిరీటాన్ని ధరించిన మహారాజుకీ ఆఖరి విశ్రాంతి ఆరడుగులే. కాని తలవొంచే క్షణంలో తనూ మనలాంటి మనిషే అన్న స్పృహ అతన్ని మళ్లీ ఆకాశాన నిలుపుతుంది. బోల్ట్ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు. మనలాగే అందలాన్ని దిగి మనమధ్య నిలిచిన మహోన్నతమైన వీరుడు. చరిత్రలో ఎక్కువమంది బోల్ట్‌లు ఉండరు. ఆ మాటకి వస్తే ఎక్కువమంది డాన్ బ్రాడ్మెన్లూ ఉండరు. గొల్లపూడి మారుతీరావు -
ట్రాక్‌పైకి మళ్లీ రాను: బోల్ట్
లండన్: వీడ్కోలు పరుగును విషాదంగా ముగించిన స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ‘మళ్లీ బరిలోకి దిగను. రిటైరయ్యాక తిరిగి బరిలోకి దిగిన చాలా మందిని నేను చూశాను. తిరిగొచ్చాక వాళ్లు తమ స్థాయిని కోల్పోయి అభాసుపాలయ్యారు. అలాంటి వాళ్ల జాబితాలో నేను ఉండబోను’ అని ఆదివారం రాత్రి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగింపు సందర్భంగా బోల్ట్ అన్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో తన విజయవంతమైన కెరీర్‌ను మోయలేని భారంతో ముగించిన మాట వాస్తవమేనని అతను అంగీకరించాడు. తనతో ఒకరు ‘బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కూడా చివరి బౌట్లో ఓడాడు. కాబట్టి తీవ్రంగా ఆలోచించకు’ అని చెప్పడం ఎంతో కదిలించిందని బోల్ట్ అన్నాడు. తన భవిష్యత్ కార్యచరణపై మాట్లాడుతూ క్రీడలకు అంబాసిడర్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. దీనిపై ఐఏఏఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో తో తన సిబ్బంది చర్చలు జరుపుతున్నారన్నాడు. జమైకన్ కోచింగ్ బృందంలో సహాయ పాత్ర పోషించేందుకు సిద్ధమన్నాడు. 30 ఏళ్ల బోల్ట్ తనకు 50 ఏళ్లు వచ్చేసరికి ఎలా ఉంటాడో కూడా వివరించాడు. ‘ప్రత్యేకించి ఏ ఆలోచనా లేదు... కానీ పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కనాలి. అయితే వారిని స్ప్రింట్వైపు తీసుకొస్తానో లేదో తెలీదు. అందరి తల్లిదండ్రుల్లా నా ఆలోచనల్ని బలవంతంగా వాళ్లపై రుద్దను’ అని అన్నాడు. ఇక మీ తక్షణ లక్ష్యాలేంటి అన్న ప్రశ్నకు ‘పార్టీ చేసుకోవడం, తాగడం, తిరగడం’ అని నవ్వుతూ బదులిచ్చాడు. పోటీల చివరిరోజు బోల్ట్ లండన్ ఒలింపిక్ స్టేడియం మొత్తం కలియదిరిగి అభిమానులకు అభివాదం చేశాడు. తాను పరుగెత్తిన ట్రాక్‌ను ముద్దాడాడు. చిన్నారులతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా 2012 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై మూడు స్వర్ణాలు గెలిచిన బోల్ట్‌కు ఆ ట్రాక్‌లోని భాగాన్ని మెమెంటోగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్, ఐఏఏఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో అందజేశారు. అమెరికాకు అగ్రస్థానం: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికా 10 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. కెన్యా (5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు) 11 పతకాలతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు) ఆరు పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. -
లాస్ట్ రేస్: కుప్పకూలిన ఉసేన్ బోల్ట్
-
లాస్ట్ రేస్: కుప్పకూలిన ఉసేన్ బోల్ట్
లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశించిన జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన అభిమానులను నిరాశపరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల జరిగిన 100 మీటర్ల రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి చెందిన బోల్ట్.. శనివారం రాత్రి జరిగిన 4X100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. బోల్ట్ బ్యాటన్ అందుకునే సరికే అతడు నేతృత్వం వహిస్తోన్న జమైకా జట్టు మూడోస్థానంలో ఉంది. కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే తొడ కండరాలు పట్టేయడం, మోకాలినొప్పితో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు బోల్ట్. దీంతో స్వర్ణంతో కాదు కదా పతకం లేకుండానే అంతర్జాతీయ కెరీర్‌ను బోల్ట్ ముగించినట్లయింది. 4X100 మీటర్ల రిలేలో వరుసగా ఐదో పతకాన్ని అందించేందుకు బోల్ట్ విశ్వ ప్రయత్నాలు చేసినా చివరి మెట్టుపై గాయం కారణంగా సాధించలేకపోయాడు. టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్‌బెల్, ఉసేన్ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం పతకాన్ని చేజార్చుకుంది. ట్రాక్‌పై కుప్పకూలి, బాధతో విలవిల్లాడుతున్న ఉసేన్ బోల్ట్ బ్రిటన్‌కు స్వర్ణం చిజిండు ఉజా, ఆడం గెమిలి, డానీ టాల్బాట్, నెథానీల్ మిచెల్ బ్లేక్ తో కూడిన బ్రిటన్ బృందం 37.47 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జస్టిస్ గాట్లిన్ నేతృత్వంలోని అమెరికా అథ్లెట్లు 37.52 సెకన్లలో రేసు పూర్తి చేసి రజతం సాధించగా, జపాన్ బృందం 38.04 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్యం సొంతం చేసుకుంది. -
రిలే ‘పసిడి’ రేసులో బోల్ట్
4X100 మీటర్ల రిలే ఫైనల్లో జమైకా బృందం లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశిస్తున్న జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ దిశగా చివరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్లో టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్‌బెల్, ఉసేన్ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన హీట్స్‌లో... రెండో హీట్‌లో బరిలోకి దిగిన జమైకా జట్టు 37.95 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానం పొంది ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఈ హీట్ నుంచి ఫ్రాన్స్, చైనా, కెనడా జట్లు కూడా ఫైనల్‌కు చేరాయి. అంతకుముందు తొలి హీట్‌లో మైక్ రోడ్జర్స్, జస్టిన్ గాట్లిన్, బీజే లీ, క్రిస్టియన్ కోల్మన్లతో కూడిన అమెరికా జట్టు 37.70 సెకన్లలో రేసును ముగించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ హీట్ నుంచి బ్రిటన్, జపాన్, టర్కీ రిలే జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మహిళల రిలే జట్టుపై అనర్హత వేటు... మరోవైపు 4గీ400 మీటర్ల రిలేలో భారత పురుషుల, మహిళల జట్లు నిరాశాజనక ప్రదర్శనతో హీట్స్‌లోనే వెనుదిరిగాయి. జిస్నా మాథ్యూ, పూవమ్మ, అనిల్డా థామస్, నిర్మలా షెరోన్లతో కూడిన భారత మహిళల రిలే జట్టు 3 నిమిషాల 28.62 సెకన్లలో రేసును ముగించి తమ హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే తొలి ల్యాప్‌లో జిస్నా 250 మీటర్ల దూరం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వేరే లైన్లో పరుగెత్తినట్లు తేలడంతో నిర్వాహకులు భారత రిలే జట్టు ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అనర్హత వేటు వేశారు. కున్హు మొహమ్మద్, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అనస్, రాజీవ్ అరోకియాలతో కూడిన భారత పురుషుల రిలే జట్టు 3 నిమిషాల 2.80 సెకన్లలో గమ్యానికి చేరి తమ హీట్స్‌లో ఐదో స్థానంలో, ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచింది. -
ధోనిపై జయవర్ధనే సెటైర్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే సెటైర్ వేసి వార్తాల్లో నిలిచాడు. ఇందుకు జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కారణమయ్యాడు. లండన్ లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లో భాగంగా 100 మీటర్ల రేసులో బోల్ట్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో బోల్ట్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో కొద్దిపాటి విమర్శలు వెలుగచూశాయి. దీనికి జయవర్ధనే స్పందిస్తూ.. బోల్ట్ ను గౌరవించండి అంటూ ట్వీట్ చేశాడు. దానికి బదులుగా ఒక అభిమాని బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే ధోనిని కూడా గౌరవించండి అంటూ జయవర్ధనే ట్వీట్ పై సరదాగా స్పందించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జయవర్ధనే..ధోని తన బైక్ మీదా? బోల్ట్ వేగాన్ని అధిగమించేది అంటూ సెటైర్ వేశాడు. అంటే బోల్ట్ వేగాన్ని అందుకోవాలంటే ధోని బైక్ పై వెళ్లినా అందుకోలేడనే ఉద్దేశం జయవర్ధనే ట్వీట్ ద్వారా స్పష్టమైంది.ఒక అభిమాని చేసిన ట్వీట్ కు జయవర్దనే ఇంతలా స్పందిచాల్సిన అవసరముందా?అనేది ధోని అభిమానుల ప్రశ్న. Was Dhoni on his bike? https://t.co/4G92pBh8yi — Mahela Jayawardena (@MahelaJay) 7 August 2017 -
ప్రేక్షకుల తీరు మారలేదు!
బహుమతి ప్రదానోత్సవ సమయంలో గాట్లిన్‌కు మళ్లీ వెక్కిరింతలు లండన్: ఒకవైపు అభిమాన ఆటగాడు బోల్ట్ ఓడిన అసంతృప్తి... మరోవైపు విజేతగా నిలిచిన వ్యక్తి గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి తిరిగొచ్చినవాడు... దాంతో రేసు ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు తమ అసహనాన్ని దాచుకోలేకపోయారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా దానిని ప్రదర్శించారు. బోల్ట్ కాంస్య పతకం అందుకునే సమయంలో మైదానం మారుమోగేలా చప్పట్లతో అభినందించిన వారు గాట్లిన్ పేరు రాగానే ‘డోపీ... డోపీ...డోపీ’ అంటూ మళ్లీ వెక్కిరించారు. స్టేడియంలో ఒక మూలన కొంత మంది గాట్లిన్‌కు మద్దతు తెలిపినా... ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు గేలి చేయడాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో గాట్లిన్ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు కనబర్చలేదు. అమెరికా జాతీయ గీతం వినిపించే సమయంలో గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిలబడ్డాడు. -
బోల్ట్... బిజీ బిజీ!
రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం వైపు లండన్: ‘నా కంపెనీ ఎనర్టర్లో ఇప్పుడు మీరు షేర్లు కొనుగోలు చేయవచ్చు’... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు ముగిసిన మరుసటి రోజే ఉసేన్ బోల్ట్ అభిమానులకు చేసిన విజ్ఞప్తి ఇది. ట్రాక్‌ను వీడిన తర్వాత తన ఆలోచనలేమిటో బోల్ట్ స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పటికే తాను భాగస్వామిగా ఉన్న, కొత్త వ్యాపారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతను సిద్ధమవుతున్నాడు. షూస్ లోపలి భాగంలో ఉపయోగించే ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి ఇన్సోల్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. బోల్ట్‌కు ఈ సంస్థలో వాటా ఉంది. మరోవైపు తన సొంత షూ బ్రాండ్‌ను ‘టు ద వరల్డ్’ లోగోతో తీసుకొచ్చే ఆలోచన కూడా అతనికి ఉంది. అయితే 15 ఏళ్ల వయసు నుంచి అతనితో అనుబంధం కొనసాగిస్తున్న టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘పూమా’ మాత్రం బోల్ట్‌ను వదిలిపెట్టాలని భావించడం లేదు. ఇప్పటి వరకు ప్రచారకర్తగా మాత్రమే ఉన్న బోల్ట్‌ను తమ ఉద్యోగిగా మార్చుకొని కరీబియన్ దీవుల్లో వ్యాపార బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నట్లు ఆ సంస్థ సీఈ జోర్న్ గిల్డెన్ చూచాయగా చెప్పారు. ‘ఫోర్బ్స్’ లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో బోల్ట్ సంపాదన 34.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 218 కోట్లు). ఇందులో 10 మిలియన్ డాలర్ల వరకు ‘పుమా’నే అతనికి చెల్లిస్తోంది. జమైకాలోని కింగ్‌స్టన్‌లో బోల్ట్‌కు ‘ట్రాక్స్ అండ్ రికార్డ్స్’ పేరుతో సొంత రెస్టారెంట్ కూడా ఉంది. -
చిరుత చిన్నబోయింది!
-
థ్యాంక్యూ..బోల్ట్!
►క్రికెట్లో డాన్ బ్రాడ్‌మన్ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు... అయితే అతని గొప్పతనంలో ఒక్క పరుగంత తేడా కూడా రాలేదు! ► బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ తన చివరి రెండు బౌట్లలో చిత్తయ్యాడు... కానీ అది అతని పంచ్‌ల పవర్‌ను తక్కువ చేయలేదు! ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు... 11 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు... 100 మీటర్ల పరుగులో టాప్–3 టైమింగ్స్... దశాబ్దకాలం పాటు స్ప్రింట్స్‌లో ఏక ఛత్రాధిపత్యం... డోపింగ్లాంటి ఒక్క మరక కూడా అంటకుండా, వివాదమే లేకుండా సాధించిన విజయాలు... ఇలాంటి ఘనతలన్నీ ఉసేన్ బోల్ట్‌కు మాత్రమే సాధ్యమయ్యాయి. చివరి రేసులో స్వర్ణం దక్కనంత మాత్రాన ఈ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ ఆకాశమంత ఇమేజ్‌కు కించిత్ కూడా భంగం వాటిల్లదు. అద్భుతం అనే మాటను ఎప్పుడో తనకు పర్యాయపదంగా మార్చుకున్న ఈ జమైకా స్టార్ క్రీడా ప్రపంచంపై వేసిన ముద్ర చెరిగిపోనిది. ప్రపంచ అథ్లెటిక్స్ను శాసించిన అతని ‘టు ద వరల్డ్’ సిగ్నేచర్ స్టయిల్ రాబోయే తరాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. గొప్ప ఆటగాళ్ల కెరీర్లకు గొప్ప ముగింపు లభించకపోవచ్చు. కానీ ఆటలో మాత్రం వారు ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారు. ఇంతకాలం మమ్మల్ని అలరించినందుకు థ్యాంక్యూ బోల్ట్...! 100 మీటర్ల పరుగులో నమోదైన అత్యుత్తమ టాప్–30 జాబితా (9.8 సెకన్ల లోపు) తీస్తే అందులో 9 చోట్ల ఉసేన్ బోల్ట్ పేరుంది. అయితే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మిగతా 23 టైమింగ్‌లను నెలకొల్పిన వారి పేర్లను చూస్తే వారంతా ఏదో ఒకసారి డోపింగ్‌లో పట్టుబడినవారే! అంటే 30లో బోల్ట్ మినహా మరే ఇతర పేరు అక్కడ కనిపించదు. ఇందులో గాట్లిన్, టైసన్ గే, యోహాన్ బ్లేక్, అసఫా పావెల్... ఇలా అంతా బోల్ట్ తరంలోని వారు, అగ్రస్థానం కోసం అతనితో పోటీ పడినవారే. ఇది చాలు బోల్ట్ గొప్పతనాన్ని చెప్పేందుకు. ఒకదశలో డోపింగ్ అనేది అథ్లెటిక్స్‌లో భాగంగా మారిపోయేంత ప్రమాదకర స్థితికి చేరిన సమయంలో కూడా ఈ సూపర్ స్టార్ తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో అతని ఆధిపత్యం ముందు మరే పేరు వినిపించలేదు. 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలలో బోల్ట్ సాధించిన స్వర్ణాలు అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఇక మూడు ప్రపంచ రికార్డులు అతని పేరిటే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే... వాస్తవానికి గత ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాతే బోల్ట్ రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన కాంట్రాక్ట్ కారణంగా మరో ఏడాది ట్రాక్‌లో కొనసాగాల్సి వస్తోందని అతను ముందే చెప్పాడు. తను ఆట ముగించే సమయం వచ్చిందని బోల్ట్‌కు ముందే తెలుసు! అందుకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను కావాలనే 200 మీటర్ల పరుగు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈవెంట్లో ఆండ్రీ డీ గ్రేస్‌ను గానీ వేడ్ నికెర్క్ను గానీ ఓడించలేనని తనకు తెలుసంటూ బోల్ట్ సన్నిహితుల వద్ద చెప్పుకున్నాడు. ఈ సీజన్లో సొంతగడ్డ కింగ్‌స్టన్‌లో జరిగిన రేసర్స్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచినా...10.03 సెకన్ల టైమింగ్‌తో అతను తీవ్ర నిరాశ చెందాడు. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్లో గోల్డెన్ స్పైక్ రేసులో కూడా బోల్ట్ రేస్ పూర్తి చేసేందుకు 10.06 సెకన్లు తీసుకున్నా డు. 2004లో ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత వరుసగా రెండు ఈవెంట్లలో అతనికి 10 సెకన్లకు పైగా పట్టడం ఎప్పుడూ జరగలేదు! ఆ తర్వాత మొనాకో డైమండ్ లీగ్‌లో 9.95 సెకన్లతో విజయం సాధించడం బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనపై ఆశలు రేపింది. శనివారం అతను మూడో స్థానంలో నిలిచిన రేస్‌ను చూస్తే బోల్ట్ సత్తా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితమే తన ఆత్మీయ మిత్రుడు జర్మైన్ మాసన్ ఒక దుర్ఘటనలో చనిపోవడం కూడా అతనిపై ఇటీవల మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. ఆ వేడుకలు ముగిశాయి... 15 ఏళ్ల వయసులో 2002లో తొలిసారి వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన క్షణం బోల్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోల్ట్ క్రీడా ప్రపంచాన్ని, అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. సెకనులో వందో వంతు వ్యవధిలో జీవితాలు మారిపోయే ఆటలో అతను తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చాడు. బోల్ట్ తనకుతాను కొత్త లక్ష్యాలు విధించుకుంటూ పరుగు కొనసాగించాడు. వాటిని అంతే అలవోకగా తానే అధిగమిస్తూ పోయాడు. పరుగు పూర్తి కాగానే తన గుండెలపై బలంగా బాది సింహనాదం చేయడం... తనదైన స్పెషల్ ‘పోజు’తో కెమెరా కళ్లకు కనువిందు చేయడం... మైదానమంతా కలియదిరిగి అభిమానులకు ఆనందం పంచడం బోల్ట్‌కే చెల్లింది. అప్పటి వరకు నిస్సారంగా కనిపించిన అథ్లెటిక్స్ స్టేడియంలో మెరుపులా వచ్చి జీవం నింపడం అతనికే సాధ్యం. ఇకపై ఇలాంటివన్నీ కనిపించవు. ఒక్కసారి పరుగు ప్రారంభమైందంటే పది సెకన్ల పాటు కన్నార్పకుండా చూసే అభిమానులు కూడా కొన్నాళ్ల పాటు వంద మీటర్లకు విరామం ఇవ్వక తప్పదేమో! ప్రతీ కథకు ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. అయితే ఆరంభం అద్భుతమైనప్పుడు అంతం కూడా అంతే ఆసక్తిని రేకెత్తించడం సహజం. ఆఖరి రేస్‌లో ఓడినా... ఇక ముందు కూడా రాబోయే ప్రపంచం అతడిని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరో అవకాశం ఉంది... తనకెంతో ప్రత్యేకమైన 100 మీటర్ల ఈవెంట్‌ను స్వర్ణంతో ముగించాలని ఆశించిన బోల్ట్‌కు నిరాశ ఎదురైనా... తన ఓవరాల్ కెరీర్‌కు పసిడితో వీడ్కోలు పలికేందుకు జమైకా స్టార్‌కు మరో అవకాశం మిగిలి ఉంది. తన సహచరులతో కలిసి బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఈనెల 12న జరిగే 4 *100 మీటర్ల రిలేలో పాల్గొననున్నాడు. గత నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా జట్టు 4*100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. మరీ ఈసారి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. పబ్‌లో కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకునే సమయంలో ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్‌బాలర్ ఎవరు అనే చర్చ వస్తే అందరూ ఒక్కో పేరు చెబుతారు. గోల్ఫ్‌లో అయినా, టెన్నిస్‌లో అయినా వారి అభిప్రాయాల్లో కచ్చితంగా తేడాలు ఉంటాయి. కానీ స్ప్రింట్ విషయానికి వస్తే గుడ్డిగా, మరో మాటకు తావు లేకుండా అంతా బోల్ట్‌కే ఓటు వేస్తారు. –సెబాస్టియన్ కో, ఐఏఏఎఫ్ అధ్యక్షుడు ఎలాంటి బాధా లేదు. ఇక్కడికి వచ్చి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇక్కడ గెలిచినా, ఓడినా ఫలితంతో సంబంధం లేకుండా ఆట ముగించాలని ముందే నిర్ణయించుకున్నాను. నా కెరీర్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. నా కోసం ఈ ఆట కోసం నేనేం చేయాలో అంతా చేశాను. ఇక నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది. ఒక పోరాట యోధుడి (గాట్లిన్) చేతిలో, మంచి భవిష్యత్తు ఉన్న మరో ప్రతిభావంతుడి (కోల్మన్) చేతిలో ఇక్కడ ఓడిపోయాను. ఈ సీజన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆలోచించకుండా అభిమానుల కోసమే బరిలోకి దిగాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి కొంత నిరాశ ఉండటం సహజం. ఓడిపోతే ఎవరూ సంతోషించరు కదా. కానీ నా అత్యుత్తమ ఆట కనబర్చానని నాకు బాగా తెలుసు. మంచి ఆరంభం లభించకపోవడంతో నేను గెలవడం కష్టమని అర్థమైపోయింది. గాట్లిన్ ఎన్నో సంవత్సరాలుగా కఠినంగా శ్రమించాడు. అతనికి గెలిచే అర్హత ఉంది. ఒక వ్యక్తిగా, పోటీదారుడిగా కూడా నేను అతడిని ఎంతో గౌరవిస్తాను. – ఉసేన్ బోల్ట్ -
చిరుత చిన్నబోయింది!
కలయా... నిజమా! పదేళ్లుగా 100 మీటర్ల ట్రాక్‌పై తన విశ్వరూపం ప్రదర్శించిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు. విశ్వవ్యాప్తంగా తన అభిమానులందరినీ నిరాశపరిచాడు. సెమీస్‌లో నెమ్మదిగా పరుగెత్తి రెండో స్థానంలో నిలిస్తే... ఫైనల్ రేసు కోసం వ్యూహాత్మకంగా బోల్ట్ తన శక్తినంతా దాచుకున్నాడని అందరూ భావించారు. కానీ అసలు రేసులోనూ ఈ జమైకా దిగ్గజం తడబడ్డాడు. ఈ క్రమంలో విశ్వవేదికపై తన కెరీర్లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లండన్: అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ట్రాక్‌పై అడుగు పెడితే స్వర్ణం తప్ప మరో పతకం ఊహించని ఉసేన్ బోల్ట్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. చివరిసారి 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి పసిడి పతకంతో కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు పలకాలని బోల్ట్ ఆశించగా... అమెరికా వెటరన్ స్టార్ జస్టిన్ గాట్లిన్ నమ్మశక్యంకాని రీతిలో బోల్ట్‌కు షాక్ ఇచ్చి జమైకా దిగ్గజం ఆశలను అడియాసలు చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు విఖ్యాత లండన్ ఒలింపిక్ స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకుల నడుమ పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసు జరిగింది. ఎనిమిది మంది బరిలోకి దిగిన ఈ ఫైనల్లో గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా) 9.94 సెకన్లతో రెండో స్థానం, ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానం సంపాదించారు. ఆరంభం నుంచే వెనుకంజ... సాధారణంగా రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తి... ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచి... చివర్లో తన ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ లక్ష్యం వైపు దూసుకుపోవడం బోల్ట్ శైలి. కానీ ఈ రేసులో మాత్రం అలా జరగలేదు. రేసు మొదలైన క్షణం నుంచే బోల్ట్ వెనుకబడ్డాడు. రేసు ప్రారంభించడానికి ఎనిమిది మంది అథ్లెట్స్ తీసుకున్న స్పందన సమయంలో బోల్ట్ ఏడో స్థానంలో ఉన్నాడు. అందరికంటే వేగంగా స్పందించిన కోల్మన్, గాట్లిన్, యోహాన్ బ్లేక్, అకాని సింబని, ప్రెస్కోడ్, జిమ్మీ వికాట్ ముందుకు దూసుకుపోతుండగా వీరిని అందుకోవడానికి బోల్ట్ తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు 90 మీటర్ల వద్ద కోల్మన్ను బోల్ట్ అందుకున్నట్లే అనిపించినా... మరోవైపు ఎవ్వరూ అంతగా పట్టించుకోని జస్టిన్ గాట్లిన్ తన అనుభవాన్నంతా రంగరించి బుల్లెట్ వేగంతో దూసుకుపోయి అందరికంటే వేగంగా గమ్యానికి చేరుకున్నాడు. 0.2 సెకన్ల తేడాతో కోల్మన్కు రెండో స్థానం, 0.1 సెకన్ల తేడాతో బోల్ట్‌కు మూడో స్థానం లభించాయి. -
'ఇప్పటికీ నేనే గ్రేటెస్ట్'
లండన్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ పోటీల్లో 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం తన ఆధిపత్యాన్నిఎంతమాత్రం తగ్గించదని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అభిప్రాయపడ్దాడు. ఇప్పటికీ తానే గ్రేటెస్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ' ప్రపంచ గ్రేటెస్ట్ అథ్లెట్లలో నేను ఒక్కడ్ని అని ఎప్పుడో నిరూపించుకున్నా. లండన్ వ్యక్తిగత పరుగులో కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం నా ఆధిపత్యాన్ని ఏమీ తగ్గించదు. నా అత్యుత్తమ పదర్శనిని ఇచ్చా. కాంస్య పతకం నన్ను నిరూత్సాహానికి గురి చేయడం లేదు. కాకపోతే నాపై కాస్త ఒత్తిడి పడింది. సరైన ఆరంభాన్ని ఇవ్వకపోతే వెనుకబడిపోతాను అనే విషయంపై ఒత్తిడికి లోనయ్యా. అదే నన్ను రేస్ లో వెనుకబడటానికి కారణం కూడా కావొచ్చు. అయితే కొద్ది తేడాలో మాత్రం ప్రథమ స్థానాన్ని కోల్పోయా. ఇక తిరిగి పుంజుకోవడమే నా ముందున్న కర్తవ్యం'అని బోల్ట్ పేర్కొన్నాడు. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తరువాత కెరీర్ కు గుబ్ బై చెప్పబోతున్న బోల్ట్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అమెరికా స్టార్ స్పింటర్ జస్టిన్ గాట్లిన్ ఈ సారి బోల్ట్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం ఎగరేసుకుపోయాడుగాట్లిన్ 9.92 సెకన్లలో పరుగును పూర్తి చేయగా క్రిష్టియన్ కోలెమన్( అమెరికా) 9.94 సెకన్లు, జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. -
పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌కు షాక్..
లండన్: ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో గత కొన్నేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగించిన జమైకన్ పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కెరీర్లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ చివరి సారిగా పాల్గొని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. బోల్ట్ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. విజేతకు బోల్ట్ అభినందనలు.. దశాబ్దకాలముగా స్ప్రింట్ ఈవెంట్‌ను రారాజుగా ఏలిన బోల్ట్ తన చివరి 100 మీటర్ల ఫైనల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పరుగు పూర్తైన వెంటనే బోల్ట్ ఏమాత్రం నిరాశ చెందకుండా విజేతగా నిలిచిన గాట్లిన్‌కు అభినందనలు తెలిపి అభిమానులతో ముచ్చటిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. గాట్లిన్ గొప్ప పోటీదారుడని, తనకు అసలైన పోటీ ఇచ్చింది అతనే అని ప్రశంసించాడు. అమెరికా స్టార్ స్పింటర్ జస్టిన్ గాట్లిన్ ఈ సారి బోల్ట్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. 8 సార్లు చాంపియన్‌గా నిలిచిన బోల్ట్‌ను 35 ఏళ్ల జస్టిన్ అధిగమించడం విశేషం. జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లలో పరుగును పూర్తి చేయగా క్రిష్టియన్ కోలెమన్( అమెరికా) 9.94 సెకన్లు, జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేశారు. అమెరికాకు చెందిన జస్టిన్, కోలెమన్లు స్వర్ణం, రజతంలు కైవసం చేసుకున్నారు. -
బోల్ట్... తడబడి ఫైనల్‌కు
100 మీటర్ల సెమీస్‌లో జమైకా స్టార్‌కు రెండో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలనే లక్ష్యంతో లండన్‌కు వచ్చిన ఉసేన్ బోల్ట్ ఆ దిశగా ఆఖరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 100 మీటర్ల విభాగంలో ఈ జమైకా చిరుత ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం రాత్రి జరిగిన మూడో సెమీఫైనల్లో బోల్ట్ 9.98 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రేసులో బోల్ట్‌ను వెనక్కి నెట్టి క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా–9.97 సెకన్లు) అగ్రస్థానాన్ని సంపాదించడం విశేషం. తొలి సెమీఫైనల్ ద్వారా అకాని సింబిని (దక్షిణాఫ్రికా–10.05 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా–10.09 సెకన్లు)... రెండో సెమీఫైనల్ ద్వారా యోహాన్ బ్లేక్ (జమైకా–10.04 సెకన్లు), రెసి ప్రెస్కోడ్ (బ్రిటన్–10.05 సెకన్లు) ఫైనల్‌కు అర్హత పొందారు. ఈ ఆరుగురు కాకుండా అత్యుత్తమ సమయాలను నమోదు చేసిన మరో ఇద్దరు జిమ్మీ వికాట్ (ఫ్రాన్స్–10.09 సెకన్లు), బింగ్తియాన్ సు (చైనా– 10.10 సెకన్లు) కూడా ఫైనల్ బెర్త్‌లు పొందారు. హీట్స్‌లోనే ద్యుతీ చంద్, అనస్ అవుట్ మరోవైపు ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్... పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్స్‌లోనే వెనుదిరిగారు. ఔరా... ఫరా! సొంతగడ్డపై బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా మరోసారి మెరిశాడు. పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో ఫరాకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. కిప్రుయ్ చెప్టెగి (ఉగాండా; 26ని:49.94 సెకన్లు) రజతం, పాల్ తనుయ్ (కెన్యా; 26ని:50.60 సెకన్లు) కాంస్యం సాధించారు. -
ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
-
ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
‘లండన్’ రేస్‌కు బోల్ట్ రెడీ లండన్: జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ట్రాక్‌లో అతని వేగం అందుకోలేరెవరు. ఈ మల్టీ ఒలింపిక్ చాంపియన్ పతకం రేసు ఇప్పుడు ఆఖరి మజిలీకి చేరుకుంది. లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత ఆ పరుగు ఇక చరిత్రే. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సంచలన స్ప్రింటర్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బోల్ట్ తల్లిదండ్రులు వెలెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ అతనికి అందజేశారు. ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. శనివారం రాత్రి ఈ బూట్లతోనే బోల్ట్ ఆఖరి పరుగు పెడతాడు. ఆల్ ది బెస్ట్... లెజెండ్! -
అంతకంటే నీచం లేదు: బోల్ట్
లండన్:డోపింగ్ పాల్పడే అథ్లెట్లపై జమైకా స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. డోపింగ్ కు పాల్పడటమంటే ఆ క్రీడను నాశనం చేయడమనే విషయాన్ని వారు తెలుసుకోవాలని హితబోధ చేశాడు. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని, దాన్ని ఆపితేనే గేమ్ ను బతుకుతుందన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భాగంగా రెండు విభాగాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన బోల్డ్.. డోపింగ్ అనేది క్రీడకు ఎంతమాత్రం మంచికాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నాడు. 'డోపింగ్ ను ఆపాలి. అప్పుడే క్రీడలకు సాయం చేసిన వారమవుతాం. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ డోపింగ్ పాల్పడితే మాత్రం మన చేతులతోనే ఆయా క్రీడల్ని నాశనం చేసుకున్నట్లవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలని అథ్లెట్లకు సూచిస్తున్నా. మోసం చేయాలనే ప్రయత్నిస్తే ఏదొక రోజు మనం దొరక్కతప్పదు'అని బోల్డ్ హెచ్చరించాడు. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో బోల్ట్ 100 మీటర్లు,4x100 మీటర్ల రేసులో పాల్గొనున్నాడు. ఈ చాంపియన్ షిప్ తరువాత బోల్ట్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు. -
సొంతగడ్డపై బోల్ట్ చివరి రేస్
కింగ్స్టన్: జమైకా మేటి స్ప్రింట్ రన్నర్ ఉసేన్ బోల్ట్ తన సొంతగడ్డపై చివరి విజయాన్ని అందుకున్నాడు. 2002లో తాను ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన ట్రాక్‌పైనే శనివారం రాత్రి జరిగిన 100 మీటర్ల రేసును 10.03 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది బోల్ట్ తలపడిన తొలి 100 మీటర్ల ఈవెంట్ ఇదే కావడం విశేషం. వచ్చే ఆగస్టులో లండన్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత బోల్ట్ రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇదే చివరి పోటీ కావడంతో తమ అభిమాన ఆటగాడి ప్రదర్శనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య విజయాన్నందుకున్న 30 ఏళ్ల ఈ జమైకన్ చిరుత చివరిసారిగా ట్రాక్‌ను ముద్దాడి ప్రేక్షకులను అలరించాడు. ఈ పోటీలో కొత్త రికార్డు నెలకొల్పడం కన్నా తన అభిమానులను అలరించడమే ధ్యేయంగా బరిలోకి దిగినట్లు గతేడాది రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన బోల్ట్ చెప్పాడు. -
బోల్ట్ ఆల్ స్టార్స్ టీమ్ విజయం
ఒలింపిక్స్ అనంతరం బరిలోకి మెల్బోర్న్: అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ మరోసారి ట్రాక్‌పై తన జోరు చూపించాడు. ప్రారంభ నిట్రో అథ్లెటిక్స్ టీమ్స్ ఈవెంట్లో భాగంగా శనివారం జరిగిన 4గీ100మీటర్ల మిక్స్డ్ రిలేలో బోల్ట్‌కు చెందిన ఆల్‌స్టార్స్ టీమ్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రియో ఒలింపిక్స్ అనంతరం బరిలోకి దిగడం బోల్ట్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. బోల్ట్ ఆల్ స్టార్స్ జట్టుతో పాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, జపాన్, చైనా జట్లు పోటీపడుతున్నాయి. ఈ జమైకన్ స్టార్ టీమ్‌లో తన దేశం నుంచే కాకుండా అమెరికా, కెన్యాలనుంచి కూడా ఆటగాళ్లున్నారు. ఇక 4గీ100 మీ. మిక్స్డ్ రిలేలో ప్రతీ జట్టు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్స్ బరిలోకి దిగుతారు. ఆల్‌స్టార్స్ టీమ్ నుంచి ఫైనల్ ఈవెంట్లో అసఫా పావెల్‌కు జతగా బోల్ట్ పరుగు తీశాడు. ‘ఆరంభంలో మేం కాస్త నెమ్మదిగా పరిగెత్తడంతో ఆందోళనకు గురయ్యాను. అందరూ మావైపు ఓడిపోతున్నారంటూ చూశారు. అయితే చివరికి మా జట్టే గెలిచింది. ఈ విజయంతో సంతోషంగా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో పోటీల్లో పాల్గొనలేదు. స్థానిక అథ్లెట్లు కూడా విశేషంగా రాణించారు’ అని స్టేడియంలో ప్రధాన ఆకర్షణగా మారిన బోల్ట్ తెలిపాడు. రెండు గంటల పాటు నాన్‌స్టాప్‌గా సంప్రదాయక, ఆధునిక ఈవెంట్ల కలబోతగా నిట్రో అథ్లెటిక్స్ మీట్‌ను రూపొందించారు. ప్రతీ జట్టు 12 మంది చొప్పున పురుష, మహిళల అథ్లెట్లను కలిగి ఉంటాయి. -
బోల్ట్ చేజారిన రిలే స్వర్ణం
లుసానే: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సాధించిన తొమ్మిది ఒలింపిక్ స్వర్ణాలలో ఒకటి తగ్గనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బోల్ట్, మైకేల్ ఫ్రాటెర్, అసఫా పావెల్, నెస్టా కార్టర్ సభ్యులుగా ఉన్న జమైకా రిలే జట్టు 4్ఠ100 మీ టర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఈ రిలే జట్టు సభ్యుడైన నెస్టా కార్టర్ డోపింగ్‌లో పట్టుబడటంతో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో మూడేసి స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4్ఠ100 మీ.రిలే) సాధించాడు. -
ఉసేన్ బోల్ట్‌కు ఒలింపిక్ పతకం పోయింది!
ప్రపంచలోనే అత్యంత వేగమైన అథ్లెట్.. చిరుతతో కూడా పోటీపడగల సత్తా ఉన్న ఉసేన్ బోల్ట్‌కు ఒలింపిక్ పతకం చేజారింది. 2008 బీజింగ్ ఒలింపిక్ గేమ్స్‌లో జమైకా తరఫున 4x100 రిలే పోటీలో బోల్ట్‌తో పాటు పాల్గొన్న మరో అథ్లెట్ డోపింగ్ టెస్టులో దొరికేయడంతో జట్టు మొత్తానికి ఆ పతకాన్ని రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అధికారులు తెలిపారు. నెస్టా కార్టర్ అనే సహచర అథ్లెట్‌కు సంబంధించిన మూత్ర, రక్త నమూనాలను మరోసారి పరీక్షించగా.. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు నిరూపితమైంది. 100 మీటర్ల పరుగులో ప్రపంచంలోనే ఆరో అత్యంత వేగమైన అథ్లెట్ అయిన కార్టర్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రేసులో నలుగురిలో మొదటగా పరిగెత్తాడు. ఆ రేసును జమైకా జట్టు 37.10 సెకండ్లలో పూర్తిచేసి ప్రపంచరికార్డు సాధించింది. కానీ, కార్టర్ డోపింగ్‌లో ఇప్పుడు దొరికేయడంతో నాటి పతకాన్ని బోల్ట్ సహా మొత్తం నలుగురు అథ్లెట్లూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. -
మెరిశారు మురిపించారు
అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్ అందరి దృష్టిని ఆకర్షించగా... విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా... కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో ఉసేన్ బోల్ట్, స్విమ్మింగ్‌లో మైకేల్ ఫెల్ప్స్, టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్... ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు. – సాక్షి క్రీడావిభాగం ఎదురులేని బోల్ట్ సమకాలీన అథ్లెటిక్స్‌లో తనకు ఎదురులేదని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. రియో ఒలింపిక్స్ వేదికగా బోల్ట్ మూడు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మాదిరిగానే రియోలోనూ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి వరుసగా మూడోసారి ‘ట్రిపుల్’ సాధించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో అవే విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు నెలకొల్పాడు. కొత్తగా ప్రపంచ రికార్డులు సాధించకపోయినా అతనికి తన ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడం విశేషం. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఈ జమైకా స్టార్ ప్రకటించాడు. ‘బంగారు చేప’ వీడ్కోలు... ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే కెరీర్ ధన్యమైపోయిందని భావించే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మాత్రం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఇంత సులువా అని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరిచాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రియో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికాడు. ఈ ప్రదర్శనతో 31 ఏళ్ల ఫెల్ప్స్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఫెల్ప్స్ 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ‘డ్రాగన్’ జోరుకు బ్రేక్... బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది చైనా జోరుకు చెక్ పడింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్... డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సీజన్‌లోని మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నీలలో పురుషుల సింగిల్స్‌లో మూడు... మహిళల సింగిల్స్‌లో రెండు టైటిల్స్ మాత్రమే చైనా క్రీడాకారులకు దక్కాయి. చైనా దిగ్గజం లిన్ డాన్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని ఆశించిన లిన్ డాన్ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ సాధించకపోయినా రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సంపాదించింది. రోస్‌బర్గ్... రయ్ రయ్... ఫార్ములావన్ (ఎఫ్1)లో ఈసారీ మెర్సిడెస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను వెనక్కినెట్టి మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్‌లోని 21 రేసుల్లో రోస్‌బర్గ్ తొమ్మిది రేసుల్లో గెలిచి, మరో ఏడు రేసుల్లో టాప్–3లో నిలిచి మొత్తం 385 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. 10 రేసుల్లో గెలిచినప్పటికీ హామిల్టన్ (380 పాయింట్లు) మిగతా రేసుల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 1982లో రోస్‌బర్గ్ తండ్రి కేకె రోస్‌బర్గ్ ఎఫ్1 చాంపియన్‌గా నిలువగా... 34 ఏళ్ల తర్వాత అతని తనయుడు నికో అదే ఫలితాన్ని సాధించడం విశేషం. యూరోలో పోర్చు‘గోల్’... ప్రొఫెషనల్ లీగ్స్‌లో మెరుపులు మెరిపించే క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తన జాతీయ జట్టు పోర్చుగల్‌ను తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా నిలబెట్టాడు. పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో పోర్చుగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై సంచలన విజయం సాధించింది. గాయం కారణంగా ఫైనల్ ఆరంభంలోనే రొనాల్డో మైదానం వీడినప్పటికీ... మిగతా పోర్చుగల్ ఆటగాళ్లందరూ పట్టుదలతో పోరాడి ఫ్రాన్స్‌ను నిర్ణీత సమయం వరకు నిలువరించారు. అదనపు సమయంలోని 109వ నిమిషంలో ఎడెర్ అద్భుత గోల్ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పోర్చుగల్ కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. ‘కోపా అమెరికా కప్’ ఫైనల్లో మెస్సీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 2–4తో డిఫెండింగ్ చాంపియన్ చిలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మెస్సీ గురి తప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ ఫలితం తర్వాత మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జాతీయ జట్టు ప్రయోజనాలదృష్ట్యా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఇక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లీస్టర్సిటీ జట్టు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ చాంపియన్స్ లీగ్ టైటిల్‌తోపాటు ప్రపంచకప్ క్లబ్ టైటిల్‌ను గెల్చుకుంది. స్టెఫీ సరసన సెరెనా ఈ ఏడాది పురుషుల, మహిళల టెన్నిస్‌లో సంచలన ఫలితాలు వచ్చాయి. జర్మనీకి చెందిన ఎంజెలిక్ కెర్బర్... బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వరుసగా మహిళల, పురుషుల విభాగాల్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించగా... స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచి ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) రికార్డును సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే రెండోసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. అయితే సీజన్ చివర్లో తడబడిన ఈ సెర్బియా స్టార్ తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఆండీ ముర్రేకు కోల్పోయాడు. ‘కింగ్’ కార్ల్సన్... అన్ని అవాంతరాలను అధిగమిస్తూ రియో ఒలింపిక్స్‌ను బ్రెజిల్ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11 వేలకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి 67 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. చైనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మొత్తం 27 కొత్త ప్రపంచ రికార్డులు... 91 ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. -
ఈ యేటి మేటి బోల్ట్, అయానా
ఐఏఏఎఫ్ పురస్కారాల ప్రదానం మొనాకో: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ మూడేసి స్వర్ణాలు సాధించిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్... రియో ఒలింపిక్స్‌లో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకం నెగ్గిన అయానా అల్మాజ్ (ఇథియోపియా) ఈ ఏడాది ‘ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలు అందుకున్నారు. అథ్లెటిక్స్ అధికారులు, అథ్లెట్స్, జర్నలిస్టులతోపాటు ఆన్లైన్ పోలింగ్ ద్వారా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) ఈ ఇద్దరిని ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ 100, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ ఈ మూడు విభాగాల్లో పసిడి పతకాలు గెలిచాడు. 30 ఏళ్ల బోల్ట్ ఐఏఏఎఫ్ మేటి అథ్లెట్ పురస్కారాన్ని అందుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో అతను 2008, 2009, 2011, 2012, 2013లలో ఈ గౌరవాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న బోల్ట్ 19.19 సెకన్లతో తన పేరిటే ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును సవరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. ‘రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్లను 19 సెకన్లలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు. వచ్చే సీజన్లో ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉంటే ఏదైనా జరగొచ్చు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నేను పాల్గొనే అవకాశం లేదు. ఒకసారి రిటైరయ్యాక పునరాగమనం చేయొద్దని నా కోచ్ స్పష్టం చేశారు’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. -
ఇప్పుడు కష్టమే: బోల్ట్
మొనాకో: తన కెరీర్ ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఇంకా రికార్డులను బద్ధలు కొడతానని అనుకోవడంలేదని జమైకా చిరుత, ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఇక తాను పాల్గొనేది అది కొద్ది ఈవెంట్లో మాత్రమేనని, ఆ తరువాత కెరీర్‌ను ముగించక తప్పదని బోల్ట్ పేర్కొన్నాడు. ఇదే క్రమంలో తాను గతంలో సాధించిన ఘనతలను సవరించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని ఈ దిగ్గజ స్ప్రింటర్ తెలిపాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ అవార్డును అందుకోవడానికి వచ్చిన బోల్ట్.. పలు అనుభవాలను పంచుకున్నాడు. తాను గతంలో 200 మీటర్ల పరుగులో 19.19 సెకెండ్లలో నెలకొల్సిన రికార్డును మరోసారి అధిగమించడం కష్టమని ఈ సందర్భంగా బోల్ట్ తెలిపాడు. ' నా కాళ్లు రికార్డులు నెలకొల్పే ప్రదర్శనలు ఇవ్వడానికి సహకరించడం లేదు. గత సీజన్ తరువాత ఆ రికార్డును మరోసారి అందుకునే యత్నం చేశా. అందుకోసం యత్నించా కూడా. కానీ శరీరం అందుకు సహకరించలేదు. కెరీర్ ముగించే సమయంలో విపరీతంగా శ్రమించాలని అనుకోవడం లేదు. ఈ సమయంలో ఆ రికార్డును అధిగమించే ప్రణాళికలు కూడా ఏమీ లేవు.నేను ఆ రికార్డు వెనుకే ఉంటానేమో' అని బోల్ట్ పేర్కొన్నాడు. -
బోల్ట్ కూడా పోలీస్ కాలేడు!
‘కానిస్టేబుల్’ పరుగు పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వ విపరీత పోకడ నాలుగు నిమిషాల్లో 1,600 మీటర్లు.. 100 మీటర్లను 10.50 సెకన్లలో పూర్తి చేయాలని నిబంధన పురుషులతో సమానంగా మహిళలకూ పరుగు ‘పరీక్ష’ అంతర్జాతీయ పరుగు పోటీల టైమింగ్‌ను నిర్దేశించడంపై విస్తుపోతున్న క్రీడాపండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ కు నిర్వహించనున్న పరుగు పరీక్షలో ఏ ఒక్కరైనా నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరుకుంటే ఆ అభ్యర్థి కచ్చితంగా ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అంతటి ఫాస్టెస్ట్ రన్నర్ అయ్యి ఉంటారు. ఎవరైనా ఈ ఫీట్ సాధిస్తే మన దేశం అంతర్జాతీయ పోటీల్లో పతకం చేజార్చుకుందనుకోవాలి. ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు నిర్దేశించిన ఫిజికల్ టెస్ట్(స్పోర్ట్స్)లో ప్రస్తావించిన నిబంధనలు కంగుతినేలా చేస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగనున్న కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో పరుగు పరీక్షకు ఒలింపిక్స్ టైమింగ్ నిర్దేశించడం చూసిన అభ్యర్థులు విస్తుపోతున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందా లేదా అవగాహన లేక నోటిఫికేషన్ విడుదల చేసిందా? అనే అనుమానాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల టైమింగ్‌లతో పోటీగా.. ఆర్మ్రిజర్వు, ఏపీఎస్పీ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబరు 17న విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పోర్ట్స్ ఈవెంట్ల టైమింగ్‌లను రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించింది. అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో భాగంగా లాంగ్ జంప్‌తో పాటు 100 మీటర్లు, 1,600 మీటర్ల రన్నింగ్‌లో క్వాలిఫై కావాలి. ఇందులో నిర్దేశించిన టైమింగ్ లేదా అంతకంటే అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఫుల్ స్కోర్(30 మార్కులు) ఇస్తారు. లేదంటే మార్కులు తగ్గుతూ పోతాయి. 100 మీటర్ల రన్నింగ్‌లో ఫుల్ స్కోర్ సాధించాలంటే ఆ దూరాన్ని పురుషులైతే 10.50 సెకన్లు లేదా ఆ లోపు, మహిళలైతే 13 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. అప్పుడే 30 మార్కులు ఇస్తారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దేశ అథ్లెట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో ఢిల్లీకి చెందిన ఎండీ అబ్దుల్ నజీబ్ 10.574 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా మెరుగైన(10.50 సెకన్ల) టైమింగ్‌ని నిర్దేశించడంపై అభ్యర్థులే కాదు.. క్రీడా పండితులు కూడా విస్తుపోతున్నారు. 1,600 మీటర్లు పూర్తి చేస్తే.. ఒలింపిక్స్ స్వర్ణమే అలాగే గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో పురుషులకు 5 కిలోమీటర్లు, మహిళలకు 2.5 కిలోమీటర్ల రన్ నిర్వహించేవారు. ఈ ఏడాది అలా కాకుండా పురుషులకు, మహిళలకు ఒకే రన్నింగ్ ఈవెంట్‌గా 5కేఎం బదులు 1,600 మీటర్ల పరుగు పరీక్ష ఏర్పాటు చేశారు. దీంట్లోనైతే ఏకంగా రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ను తలదన్నేలా లక్ష్యాన్ని 4 నిమిషాలు, అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. అప్పుడే ఫుల్ స్కోర్(40 మార్కులు) ఇస్తారు. గతంలో పురుషులకు 5కేఎం రన్, మహిళలకు 2.5కేఎం నిర్దేశించినట్లుగానే.. ఇప్పుడు కూడా పురుషులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహించాలి. ఇలా అయితేనే మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించినట్లు అయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. అయితే ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో 1,500 మీటర్ల దూరాన్ని అమెరికాకు చెందిన మ్యాథ్యూ సెంట్రోవిట్జ్ 3.50 నిమిషాల్లో చేరుకొని స్వర్ణపతకం సాధించాడు. దీని ప్రకారం మ్యాథ్యూ 1,600 మీటర్ల దూరాన్నైతే 4.2 నిమిషాల్లో చేరుకుంటాడు. అది కూడా సింథటిక్ ట్రాక్‌పై, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూస్‌తో ఆ టైమింగ్‌లో లక్ష్యాన్ని చేరుకుంటారు. మట్టి ట్రాక్‌లో పరిగెడితే ఈ టైమింగ్‌కు ఎంత మంది చేరుకుంటారనేది ప్రభుత్వానికి, అధికారులకే తెలియాలి. సుమారు లక్షన్నర మంది అభ్యర్థులు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వారంతా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. -
జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్
కింగ్స్టన్: పరుగుల వీరుడు, జమైకా స్టార్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ తన దేశంలో పాల్గొనబోయే చివరి రేసును ప్రకటించేశాడు. స్వదేశంలో వచ్చే జూన్ లో జరిగే రేసర్స్ గ్రాండ్ ప్రినే తనకు అక్కడ ఆఖరి రేసు అని బోల్ట్ స్ఫష్టం చేశాడు. ఇప్పటికే లండన్ లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ తో తన రేసింగ్ కెరీర్‌కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించిన బోల్ట్.. జమైకాలో పాల్గొనే ఆఖరి రేసును కూడా వెల్లడించాడు. 'రేసర్స్ గ్రాండ్ ప్రినే జమైకా ప్రజల సమక్షంలో పాల్గొనబోయే ఆఖరి రేసు. ఆ తరువాత ఇక్కడ నా పరుగు ఉండదు'అని బోల్ట్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రిలో బోల్ట్ 100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాది కూడా ఇదే ఫామ్ ను చాటుకుని విజయంతో తన ప్రజలకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
హడావిడి లేకుండానే...
స్వస్థలం చేరిన ఉసేన్ బోల్ట్ కింగ్స్టన్: ఒక రజతమో, ఒక కాంస్యమో గెలిస్తేనే దేశమంతా ఊగిపోతూ చేసుకునే సంబరాలతో పోలిస్తే ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడికి ఎలాంటి స్థాయిలో ఘన స్వాగతం లభించాలో, ఏ రేంజ్లో వేడుకలు జరగాలో ఊహించుకోండి! కానీ సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ మాత్రం ఇలాంటి హడావిడి ఏమీ లేకుండా బుధవారం తన సొంత నగరం కింగ్స్టన్కు చేరుకున్నాడు. రియోలో 3 స్వర్ణాలతో పాటు ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో 9 స్వర్ణాలు నెగ్గిన దిగ్గజానికి జమైకా ప్రభుత్వం తరఫున అధికారిక స్వాగతం అంటూ కూడా ఏమీ లేదు. ప్రశాంతంగా ఎయిర్‌పోర్ట్‌నుంచి బయటికి వచ్చిన అతను బయట నిలబడిన కొంత మంది అభిమానులను చిరునవ్వుతో పలకరించాడు. వారు చేసిన సరదా వ్యాఖ్యలకు స్పందించి బదులిచ్చిన అతను కొంత మందితో సెల్ఫీలు కూడా దిగాడు. ఒక కారులో తన లగేజీ పెట్టుకునే వరకు వేచి చూసిన బోల్ట్, మరో కారులో మేనేజర్‌తో కలిసి వెళ్లిపోయాడు. అతని వెంట ఎలాంటి బలగం, బృందం కూడా లేవు! -
పెద్దకూరనా? కోడికూరనా? బోల్ట్ ఏం తింటాడు!
పరుగుల వీరాధివీరుడు ఉసేన్ బోల్ట్ ఏం తింటాడు? పెద్దకూర (బీఫ్) తినడం వల్లే అతడు ఫిట్‌గా ఉన్నాడా?.. అన్నది దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశంలో బీఫ్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు మరింత ఆజ్యం పోసేలా బీజేపీ దళిత ఎంపీ ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ఉసేన్ బోల్ట్ బీఫ్ తింటాడని, అందుకే అతను ఒలింపిక్స్‌లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడని ఆయన చెప్పుకొచ్చారు. ( బోల్టు డైట్.. జరిగిన కల్పిత ప్రచారం ఇది! ) నిజానికి బోల్ట్ బీఫ్ తింటానని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ, ఒక ఫేక్ మెమె మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. తాను పేద కుటుంబం నుంచి రావడం వల్ల శక్తిమంతమైన ఆహారం తీసుకునే అవకాశం ఉండేది కాదని, అందుకే తన కోచ్ గ్లెన్ మిల్స్ సూచన ప్రకారం రోజుకు రెండుసార్లు బీఫ్ తిన్నానని, మొదట్లో పెద్దకూరపై కొంత సందేహం ఉన్నా రానురాను దాని ప్రయోజనాలను గుర్తించానని, కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోరుకునేవారు బీఫ్ తినాలని తాను సూచిస్తానని బోల్ట్ చెప్పినట్టు ఎవరో సోషల్ మీడియాలో కల్పిత ప్రచారానికి పూనుకున్నారు. ఈ కల్పిత ప్రచారం నిజమేనని నమ్మిన బీజేపీ ఎంపీ.. బీఫ్ వల్లే బోల్ట్‌కు పతకాలు వచ్చాయని పేర్కొని నాలుక కర్చుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు సాధించడం ద్వారా మొత్తం 9 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకొని కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన ఉసేన్ బోల్ట్ తాను బీఫ్ తిన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. సాధారణ జమైకా ఆహారమైన అన్నం, దుంపలు, చేపలను మొదట్లో అధికంగా తీసుకునేవాడినని బోల్ట్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు సొంతంగా చెఫ్‌ను అపాయింట్ చేసుకోవడంతో తనకు నచ్చిన ఆహారాన్ని, హై ప్రోటీన్, కార్బోహైడ్రెట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చెప్పాడు. 'నేను మంచి డైట్‌ను ఫాలో అవుతాను. నాకు కావాల్సిన ఆహారాన్ని అందించడానికి సొంతంగా చెఫ్ ఉన్నాడు. చికెన్, రైస్, కూరగాయలు నేను అధికంగా తీసుకుంటాను. ఇది మంచి జమైకన్ ఆహారం. ఇందులో హైడ్రెటెడ్ పోషకాలు ఉండేలా చూసుకుంటాను. విదేశాలకు వెళ్లినప్పుడు కింగ్ బర్గర్, మెక్‌డొనాల్డ్ వంటకాలు తీసుకుంటాను. కానీ నా వెంట చెఫ్ ఉండటంతో నాకు కావాల్సిన ఆహారాన్ని అతడు సమకూరుస్తాడు' అని బోల్ట్ మీడియాకు తెలిపారు. ( బోల్ట్ తీసుకునే అసలైన ఆహారం ఇదే) -
బీఫ్ తిన్నాడు.. గోల్డ్ మెడల్స్ గెలిచాడు
-
బీఫ్ తిన్నాడు.. గోల్డ్ మెడల్స్ గెలిచాడు
ఒలంపిక్స్‌లో ఆశించిన రీతిలో పతకాలు సాధించకపోవడానికి మౌలిక సదుపాయాల లేమినే ప్రధాన కారణంగా ఎత్తిచూపుతూ తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చర్చనీయాంశమైన కామెంట్ చేశారు. తొమ్మిది బంగారు పతకాలు గెలుచుకున్న జమైకా ప్లేయర్ ఉసేన్ బోల్ట్, రోజుకి రెండు సార్లు ప్రొటీన్ ఆహారం బీఫ్ తినడం వల్లనే విజయాన్ని సాధించాడని ఆయన ట్వీట్ చేశారు. . బోల్ట్ది పేదకుటుంబమైనప్పటికీ రోజుకి రెండు సార్లు బీఫ్ తినాలని తన ట్రైనర్ సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్‌ను నిషేధిస్తున్న నేపథ్యంలో ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌లో అథ్లెటిక్స్‌కు సరియైన సదుపాయాలు లేకపోవడం వల్లనే పతకాలు ఆర్జించలేకపోతున్నారనే ఆరోపణలపై స్పందనగా ఆయన ఈ ట్వీట్ లు చేశారు.ఆయన చేసిన ఈ ట్వీట్లు 200 సార్ల కంటే ఎక్కువగా రీట్వీట్ అయ్యాయి. అథ్లెటిక్స్ వారి వైఫల్యాలకు, చుట్టూ ఉన్న పరిస్థితులను, ఆహార విషయాలను అంటకట్టకూడదని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తాము రాణించలేకపోయామని సాకులు చెప్పడం సరియైనది కాదని పేర్కొన్నారు. ఉసేన్ బోల్ట్ నుంచి భారత్ ప్లేయర్లు కూడా అకింతభావం నేర్చుకోవాలని, విజయాలకు మార్గాలను అన్వేషించాలని ఆయన తెలిపారు. భారత్‌లో స్పోర్ట్స్‌కు అందించే సదుపాయాల్లో లోటు లేదని, జమైకా, కెన్యా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువగా నిధులను స్పోర్ట్స్‌కు వెచ్చిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు మాంసాహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందని అథ్లెటిక్స్ ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసట శాతం తక్కువగా ఉంటుందని వాదన లేకపోలేదు. Usain bolt of Jamaica was poor and trainer advised him to eat beef both the times and he scored 9 gold medals in Olympic — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 28, 2016 As usain bolt &trainer found ways and means to win medals similarly our players and trainers should do as per their circumstances — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016 -
'గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పటికీ చెప్పడు'
జమైకా: అతడు రియోలో మెరిశాడు.. అంతకుముందు ప్రపంచ చాంపియన్ షిప్ లో తళుక్కుమన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు ఎప్పుడు దిగితే అప్పుడు.. ఎక్కడ దిగితే అక్కడ.. విజయాన్ని భుజాన వేసుకొని పరుగెత్తాడు. ఫలితంగా అతడిది బంగారు వేటలా మారింది. పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో బంగారు పతకం దక్కింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఉస్సేన్ బోల్ట్. మనుషులందరి వేగంలో చిరుతలాంటివాడని పేర్గాంచిన ఈ జమైకా పరుగుల చిరుత గురించి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు గమనిస్తే.. బోల్ట్ ఆగస్టు 21, 1986లో జమైకాలోని షేర్ వుడ్ లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు ఓ జనరల్ స్టోర్ నడిపేవారు. అతడికి షెరిన్ అనే ఓ సోదరి, సాదికి అనే ఓ సోదరుడు ఉన్నాడు. బోల్ట్ సగటు విద్యార్థి మాత్రమే. అతడికి ప్రధానంగా క్రికెట్, ఫుట్ బాల్ అంటే ఆసక్తి. జమైకాలోని ఐఏఏఎఫ్ హై ఫర్ఫామెన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా స్కాలర్ షిప్ పొందాడు. పది హేనేళ్లకే బోల్ట్ తన పరుగుల మొదలుపెట్టాడు. జమైకాలోని కింగ్స్టన్ లోజరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ లో 200 మీటర్ల పరుగుపందెంలో గెలుపొందాడు. ఇప్పటి వరకు అతడికి ఒలింపిక్ లో ఆరు, ప్రపంచ చాంపియన్ షిప్ లో 11 బంగారు పతకాలు వచ్చాయి. 2009 బెర్లిన్ లో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలో వరుసగా 9.58, 19.19 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బోల్ట్ ప్రస్తుతం జమైకాలో ఉంటున్నాడు. ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. కానీ, ఆమె పేరు ఇప్పటి వరకు బోల్ట్ చెప్పలేదు.. చెప్పడానికి ఇష్టపడడంట కూడా. మరో విషయమేమిటంటే అతడికి 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోడంట. -
బోల్ట్ షూ ఎంత ధర పలికాయో తెలుసా?
లండన్: పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ ఉయోగించి సంతకం చేసిన రన్నింగ్ షూ వేలంలో భారీ మొత్తం రాబట్టాయి. ఆన్ లైన్ లో నిర్వహించిన వేలంలో దాదాపు పన్నెండు లక్షలకు(16 వేల యూరోలు) అమ్ముడుపోయాయి. గత ఏడాది బీజింగ్ లో వరల్డ్ చాంపియన్ షిప్ 2015 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న బోల్ట్ 100 మీటర్ల పరుగు కోసం ఈ ట్రాక్ షూను ఉపయోగించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ పై బోల్ట్ ఆ సమయంలో విజయం సాధించి బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ షూ కోసం చివరిగా మొత్తం 30 బిడ్లు పోటీ పడ్డాయి. -
బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కు ట్రాక్‌పై ఎదురేలేదు. బోల్ట్ రిటైరయినట్టు ప్రకటించినా.. అతణ్ని ఓడించే మొనగాడు ఇంకా రాలేదు. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ స్ప్రింట్‌లో మూడేసి స్వర్ణాలు చొప్పున తొమ్మిది పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్ ఈవెంట్లో బోల్ట్ స్టార్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రపంచ స్టార్ స్ప్రింటర్‌గా బోల్ట్ సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తే బోల్ట్ అమ్మాయిల విషయంలోనూ చాలా ఫాస్టే. జమైకాకు చెందిన గాళ్‌ఫ్రెండ్ కాసి బెనెట్‌తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. గత ఆదివారం రియోలో 30వ బర్త్ డే పార్టీ చేసుకున్న బోల్ట్ ఓ అమ్మాయితో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే విద్యార్థిని వాట్సాప్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం రేపాయి. బెడ్ మీద బోల్ట్ తో కలసి ఉన్నప్పటి ఫొటోలను కొన్నింటిని అప్లోడ్ చేసింది. ఒలింపిక్స్ సందర్భంగా రియోలో ఓ రాత్రి బోల్ట్‌తో గడిపినట్టు ఈ అమ్మడు బాంబు పేల్చింది. వెస్ట్ రియోలోని ఓ క్లబ్లో జమైకా స్ప్రింటర్‌ను కలిసినట్టు ట్వీట్ చేసింది. కాగా తన ఫ్రెండ్ చెప్పేంత వరకు బోల్ట్ స్టార్ అథ్లెట్ అన్న విషయం తెలియదని చెప్పింది. ఇది సాధారణ విషయమని, ఫేమస్ కావడం కోసం ఫొటోలను వాట్సప్‌లో షేర్ చేయలేదని వ్యాఖ్యానించింది. బోల్ట్ కూడా ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు. ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని అంగీకరించాడు. ఈ విషయంపై బోల్ట్ సోదరి క్రిస్టినె బోల్ట్ హైల్టన్ మాట్లాడుతూ.. తన సోదరుడు కాసి బెనెట్‌ను వివాహం చేసుకుంటాడని చెప్పింది. త్వరలో ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందని వెల్లడించింది. -
బోల్ట్ కు మంత్రి పదవి?
రియో డీ జనీరో: తన ఒలింపిక్స్ కెరీర్‌ను దిగ్విజయంగా ముగించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ పరుగులో అలరించిన బోల్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ నుంచి ఓ సందేశం బోల్ట్ కు చేరింది. ఇప్పటికే తమ కీర్తిని ఎంతో ఉన్నతిలో నిలబెట్టిన బోల్ట్‌కు రాజకీయ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఆయన సంకేతాలు పంపారు. 'బోల్ట్ ప్రదర్శనతో జమైకాకు చాలా లాభం చేకూరింది. ఎన్నో ఘనతలను సాధించిన బోల్ట్ పేరును ఉపయోగించుకోవడం మాకు చాలా ముఖ్యం. అందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో హాలెన్స్ పేర్కొన్నారు. అతను ఒకవేళ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు. ఆదివారం 30వ బర్త్ డే చేసుకుంటున్న బోల్ట్..తన రెండో ఇన్నింగ్స్‌పై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జమైకా ప్రజల కోరిక మేరకు బోల్ట్ రాజకీయ ప్రవేశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బోల్ట్ రాజకీయ ప్రవేశం జరిగితే ఆ ఘనత సాధించిన తొలి ఒలింపియన్ గా బోల్ట్ నిలిచిపోతాడు. -
ఒలింపిక్ప్లో ఓ శకం ముగిసినట్లే!
రియో డీ జనీరో: ఇక ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ శకం ముగిసినట్లే. పరుగును పరుగుల రారాజు బోల్ట్ తన ఒలింపిక్స్ కెరీర్ ను ఘనంగా ముగించాడు. రియో ఒలింపిక్స్ లో 4x100 రిలేలో జమైకా జట్టు స్వర్ణం గెలవడంతో ట్రిపుల్ ట్రిపుల్ గా నిలవాలన్న కోరికను తీర్చుకున్న బోల్ట్.. తన చివరి ఒలింపిక్ రేసును అభిమానులకు మధుర జ్ఞాపకంగా మిగిల్చాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో మొదలైన బోల్ట్ పరుగు.. రియో వరకూ ఆగలేదు. ఈ ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు ఈవెంట్లోనూ పసిడిని సాధించాలనే తపనతో చెలరేగిన బోల్ట్ ఒలింపిక్స్ లో పరుగుల రారాజుగా నిలిచాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన 4x100 రిలేలో బోల్ట్,అసాఫా పావెల్, నికెల్ అష్మేడ్, యొహాన్ బ్లేక్‌లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకెండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన స్ప్రింటర్ గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ లో అపజయమే ఎరుగని చిరంజీవిగా నిలిచాడు. అయితే ఇదే తన చివరి ఒలింపిక్స్ అన్న బోల్ట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, జమైకాకు రేస్ కింగ్‌గా నిలిచిన బోల్ట్ పరుగును ఒలింపిక్స్ లో చూసే అవకాశం దాదాపు లేనట్లే. రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలను సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్ ఆద్యంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియోలో వంద మీటర్ల పరుగును 9.81 సెకెండ్లలో ముగించి పసిడిన గెలిచిన బోల్ట్.. 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించాడు. ఇక జట్టు రేసుకొచ్చేసరికి జమైకా స్వర్ణం సాధించడంలో బోల్ట్ కీలక పాత్ర పోషించాడు. రికార్డులు.. ఈ ఒలింపిక్స్ లో 100 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న బోల్ట్.. ఈ ఘనతను వరుసగా మూడు ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక అథ్లెట్‌గా నిలిచాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ ఈ ఈవెంట్లో పసిడి పతకం సాధించి 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిదాన్ని సాధించాడు. మరోవైపు 4x 100 రిలేలో స్వర్ణం సాధించడంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఒలింపిక్స్ లో తొమ్మిది పతకాలు సాధించిన అథ్లెటిక్స్ కార్ల్ లూయిస్, ఫిన్ పావో నుర్మిస్ల సరసన బోల్ట్ నిలిచాడు. దాంతో పాటు 4x 100 రిలేలో పసిడి సాధించి ఈ విభాగంలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించిన రెండో స్ప్రింటర్ గా బోల్ట్ నిలిచాడు. అంతకుముందు అమెరికన్ దిగ్గజం ఫ్రాంక్ వైకాఫ్(1928, 1932, 1936) ఒక్కడే 4x 100 రిలేలో వరుస పసిడి పతకాలను సాధించాడు. మొత్తంగా ఒలింపిక్స్‌లో బోల్ట్ ఖాతాలో తొమ్మిది స్వర్ణ పతకాలు చేరగా, 2008నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కలిపి 20 స్వర్ణాలు సాధించాడు. -
బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో అభిమానులను ఉర్రూతలుగించిన బోల్ట్.. 4x 100 మీటర్ల రిలే పరుగులోనూ మరో స్వర్ణం సాధించాడు. ఇప్పటికే రియోలో 100మీ. 200 మీటర్లు వ్యక్తిగత ఈవెంట్లో బోల్ట్ పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన 4x 100 మీటర్ల రిలేను జమైకా జట్టు 37.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో దీంతో బోల్ట్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన అథ్లెట్‌గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ అపజయమే ఎరుగని ధీరుడిగా నిలిచాడు. -
తిరుగులేని బోల్ట్
రియోడిజనీరో:జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రియోలో రెండో స్వర్ణాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు. తాజాగా జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి... మరో స్వర్ణ పతకాన్ని ఉసేన్ తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రియోలో 100 మీటర్ల పరుగులో ఉసేన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బోల్ట్.. 200 మీటర్ల రేసులో కూడా ఆద్యంత దుమ్మురేపాడు. దీంతో అతని ఖాతాలో వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్ స్వర్ణం చేరింది. తాజా ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడిని సొంతం చేసుకున్నబోల్ట్.. 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 100 మీ. ఈవెంట్ లో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రియోలో బోల్ట్ ముందు 4x 100 జట్టు రేసు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పసిడి సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయమే లేని ధీరుడిగా బోల్ట్ నిలిచిపోతాడు. -
బోల్ట్ ఇన్.. గాట్లిన్ అవుట్!
రియో డీ జనీరో: ఒకరు జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అయితే, మరొకరు అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్. ఇద్దరూ రేసులో దిగారంటే పసిడి పోరు ఆసక్తికరంగా సాగుతుంది. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల రేసులో కూడా ఇదే ఆవిష్కృతమైంది. బోల్ట్ స్వర్ణం సాధిస్తే.. గ్లాటిన్ రజతం సాధించాడు. అయితే 200 మీటర్ల ఫైనల్ రేసుకు వచ్చేసరికి మాత్రం గాట్లిన్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఇద్దరు మాత్రమే అర్హత సాధించే సెమీస్ పోరులో ఉసేన్ బోల్ట్ ప్రథమ స్థానంలో నిలవగా, కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డీ గ్రాస్సె రెండో స్థానంతో తుది పోరుకు సిద్ధమయ్యాడు. దీంతో గాట్లిన్ కు నిష్క్రమణ తప్పలేదు. ఈ రేసును 19.78 సెకెండ్లలో బోల్ట్ పూర్తి చేయగా, డీ గాస్సె 19.80 సెకెండ్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంతో ఫైనల్ రౌండ్ కు ప్రవేశించాడు. కాగా, గాట్లిన్ 20.13 సెకెండ్లలో రేసును పూర్తి చేయడంతో ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయాడు. ఇప్పటికే 100 మీటర్ల రేసులో బోల్ట్ పసిడిని సాధించాడు. దీంతో 100 మీటర్ల రేసులో వరుసగా మూడో స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ గా రికార్డు సాధించాడు. మరోవైపు వరుసగా ఏడో పసిడిని కూడా బోల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 200 మీటర్ల ఫైనల్ రేసుతో పాటు 4x100 పరుగులో బోల్ట్ పసిడిని సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయం లేని ధీరుడిగా మిగిలిపోతాడు. -
200 మీ. సెమీస్‌లో బోల్ట్
రియో ఒలింపిక్స్ పురుషుల 200 మీటర్ల విభాగంలో స్వర్ణంపై గురి పెట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన హీట్-9లో బోల్ట్ అందరికంటే వేగంగా 20.28 సెకన్లలో గమ్యానికి చేరి సెమీస్‌కు అర్హత పొందాడు. మొత్తం 10 హీట్స్ నిర్వహించగా... 24 మంది సెమీస్‌కు చేరుకున్నారు. ప్రతి హీట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితోపాటు(20) ఓవరాల్‌గా అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో నలుగురు సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు. బోల్ట్తోపాటు సెమీస్‌కు చేరిన వారిలో యోహన్ బ్లేక్, నికెల్ అష్మెడ్, జస్టిన్ గాట్లిన్, లాషాన్ మెరిట్ తదితర ప్రముఖ అథ్లెట్స్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం. 6.30 నుంచి 6.45 మధ్య మూడు సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం ఎనిమిది మంది ఫైనల్‌కు అర్హత పొందుతారు. -
బోల్ట్ అండ్ బ్యూటిఫుల్
100 మీ. పరుగులో ఉసేన్ బోల్ట్‌కు స్వర్ణం వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్ 9.81 సెకన్లలో రేస్ ఫినిష్ మెరుపు ఒకే చోట రెండో సారి రాదు అంటారు... కానీ ఈ మెరుపు రెండు సార్లు కాదు తన గడపలో మూడో సారి మెరిసింది. వేగంలో వాయుదేవుడికి కూడా పాఠాలు చెప్పగల జమై‘కింగ్’ మెడలో మళ్లీ పసిడి మాల పడింది. అడుగేస్తే చాలు పసిడి పరుగెత్తుతూ నా వైపు వస్తుందన్నట్లుగా ఆ ‘బంగారపు బూట్లు’ మళ్లీ రికార్డుల మోత మోగించాయి. బీజింగ్‌లో ప్రారంభమైన పతక పరుగు రియోలో కూడా ఆగలేదు. 100 మీటర్ల రేస్ అంటే ఒలింపిక్స్‌లో ఫ్యాన్సీ ఈవెంట్, ప్రేక్షకులకు వినోదం పంచే అందమైన పరుగు... అథ్లెట్లకు మాత్రం అది జీవిత కాల శ్రమ. పతకం కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడేవారంతా ఒక వైపు... అసలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆందోళన కనిపించకుండా బోల్ట్ మరోవైపు. ఏదో పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లినంత సులభంగా గెలవడం బోల్ట్‌కు మాత్రమే తెలిసిన విద్య. దానిని మరోసారి ప్రదర్శించిన అతను అలవోకగా లక్ష్యం చేరి తన గొప్పతనం మళ్లీ చూపించాడు. రియో: ప్రపంచంలో వేగవంతమైన అథ్లెట్‌గా తనకున్న గుర్తింపును జమైకా సూపర్ స్టార్ ఉసేన్ బోల్డ్ నిలబెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగులో తనకు తిరుగు లేదని నిరూపిస్తూ సునాయాసంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 9.81 సెకన్లలో రేస్ పూర్తి చేసి బోల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని గత టైమింగ్‌లతో పోలిస్తే ఇది ఎక్కువే అయినా... ట్రాక్‌పై ప్రత్యర్థులనుంచి బోల్ట్‌కు ఎలాంటి సవాల్ ఎదురు కాలేదు. గాట్లిన్ (అమెరికా - 9.89 సె.) రజత పతకం గెలుచుకోగా, ఆండ్రీ డీ గ్రాస్ (కెనడా-9.91 సె.) కాంస్యం దక్కించుకున్నాడు. మరో జమైకా ఆటగాడు యోహాన్ బ్లేక్‌కు నాలుగో స్థానం దక్కింది. గత జూన్‌లో గాయం కారణంగా జమైకా జాతీయ చాంపియన్షిప్నుంచి బోల్ట్ తప్పుకోవడంతో అతని ఫామ్‌పై సందేహాలు రేకెత్తాయి. అయితే ఈ దిగ్గజం అవన్నీ తప్పని చేతల్లో నిరూపించాడు. ట్రిపుల్ గ్రేట్ 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో ఒకే ఈవెంట్ (100 మీ.)లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. గతంలో దిగ్గజ అథ్లెట్లు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ ఈ ఈవెంట్లో పసిడి పతకం సాధించాడు. మొత్తంగా ఒలింపిక్స్‌లో అతనికి ఇది ఏడో స్వర్ణ పతకం కావడం విశేషం. 2008నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కలిపి బోల్ట్ ఇప్పటికి 18 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో 2 రజతాలు కూడా అతనికి దక్కాయి. ఆ వేగం వెనుక... అష్ట సూత్రాలు బోల్ట్‌ను ఓడించే మనిషి ఇంకా భూమిపై పుట్టలేదా..? మెరుపు కూడా అతనితో పోటీ పడేముందు ఆలోచించుకుంటుందా..? రికార్డులు సృష్టించటం అంత సులభమా? చిరుతలా పరిగెత్తటం అతనికెలా సాధ్యం? ఆరున్నర అడుగుల శరీరంతో అద్భుతాలు చేస్తున్న బోల్ట్‌ను చూస్తుంటే.. ఎంతో మందికి ఎన్నో సందేహాలు. జమైకాలో పుట్టి మొత్తం అథ్లెటిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఉసేన్ బోల్ట్‌ను ట్రాక్‌పై అందుకోవడం తోటి స్ప్రింటర్లకు కలలోనూ సాధ్యం కావటం లేదు. బోల్ట్ విజయం వెనక ఉన్న రహస్యాలను చూస్తే... తక్కువ శక్తితో ఎక్కువ వేగం బోల్ట్ అంత వేగంగా ఎలా పరిగెడతాడు? అనే ప్రశ్న అభిమానుల్లోనే కాదు.. భౌతికశాస్త్ర పండితుల్లోనూ చర్చనీయాంశమైంది. దీనిపై పరిశోధనలు చేపట్టిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్.. కొన్ని విషయాలపై స్పష్టత సాధించింది. బోల్ట్ శరీరంలో 8 శాతం కండరాలు పరిగెత్తేందుకు ఉపయోగపడితే... మిగిలిన 92 శాతం అతను ముందుకు దూసుకుపోయేందుకు (డ్రాగ్) పనిచేస్తున్నాయని వారు గుర్తించారు. బోల్ట్ శరీర బరువు, గాలి, ఉష్ణోగ్రత, చలనాత్మక శక్తి వంటి అంశాల ఆధారంగా గణించిన ‘డ్రాగ్ గుణకం’ సామాన్య మానవుడితో పోలిస్తే చాలా తక్కువ. అందుకే తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం దూసుకుపోవటం ఇతనికి సాధ్యమని గుర్తించారు. అసాధారణమైన అంగలు ఆరున్నర అడుగుల ఎత్తుండటం బోల్ట్‌కు కలిసొచ్చే అంశం. దీంతో చాలా పెద్ద పెద్ద అంగలు వేయవచ్చు. దీని కారణంగానే బోల్ట్ దూసుకుపోతున్నాడని కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకుడు జాన్ బారో వెల్లడించాడు. ప్రత్యేకమైన శరీరాకృతి కూడా క్షణాల్లో బోల్ట్ వేగం పుంజుకునేందుకు ఉపకరిస్తోంది. మిగిలిన అథ్లెట్లు సగటున 45 అంగల్లో 100 మీటర్లు పరిగెడితే.. బోల్ట్ కేవలం 40 అంగల్లోనే రేసు ఫినిష్ చేస్తున్నాడు. ఒకవేళ రేసు జరుగుతున్న దిశలోనే వాయు గమనం ఉన్నట్లైతే బోల్ట్ మరింత వేగంగా రేసు ఫినిష్ చేస్తాడు. గ్లెన్ మిల్స్ శిష్యరికం గ్లెన్ మిల్స్ ప్రపంచంలోని గొప్ప అథ్లెట్లకు కోచ్. అనేకమంది జమైకన్ అథ్లెట్లను ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దారు. యొహాన్ బ్లేక్, అసాఫా పావెల్ వంటి స్టార్లు ఈయన శిష్యులే. 2004లో బోల్ట్‌ను స్టార్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న మిల్స్... ఈ ‘చిరుత’ను ప్రపంచానికి పరిచయం చేయటంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కేవలం వంద మీటర్లకే పరిమితమవుతానన్న బోల్ట్‌ను 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో పాల్గొనేలా మిల్స్ ప్రోత్సహించారు. కాళ్లు కాదు స్ప్రింగులు ఉసేన్ బోల్ట్ వేగంపై పరిశోధనలు చేసిన వారిలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొఫెసర్ మాక్స్ ప్రొకోపీ ఒకరు. ఈయన చెప్పినదాని ప్రకారం.. బోల్ట్‌లో ఉన్న జన్యుపరమైన అడ్వాంటేజ్ వల్ల అతని పాదాలు స్ప్రింగుల్లా పనిచేస్తున్నాయి. సాధారణ అథ్లెట్లు పరిగెత్తే సమయంలో అడుగుతీసి మరో అడుగు వేస్తున్నప్పుడు 226 కిలోల శక్తి ఉత్పన్నమైతే... బోల్ట్ అడుగులో 453 కిలోల శక్తి ఉత్పన్నమవుతోంది. అంటే కాళ్లు స్ప్రింగుల్లా ఎగురుతాయి. దీని వల్ల మరింత వేగంగా.. ఎక్కువ దూరంతో అంగలు వేయవచ్చు. యూరోపియన్లు, ఆసియన్లతో పోలిస్తే జమైకన్ల శరీరం సౌష్టవంగా ఉంటుంది. వీరి కాళ్లు మరీ ముఖ్యంగా మోకాళ్లు చాలా బలంగా ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ పరిగెత్తేందుకు అనుకూలంగా శరీరంలో మార్పు వస్తుంది. అందుకే బ్లేక్, పావెల్, నెస్టా కార్టర్, స్టీవ్ ముల్లింగ్స్ వంటి అథ్లెట్లు జమైకా నుంచి వచ్చారు. భోజనం, నిద్ర ఉసేన్ బోల్ట్ రికార్డులు బద్దలు కొట్టడానికి, పతకాల పంట పండించడానికి పడే కష్టంలో అతని చెఫ్ (వంట మనిషి) భాగస్వామ్యం కూడా ఉంది. బోల్ట్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక కప్పు ఆహారంలో కనీసం 177 కేలరీలుండాల్సిందే. రోజూవారీ డైట్లో 34 శాతం సి-విటమిన్, 40 శాతం బీ6 విటమిన్ (శక్తిని పెంపొందించేందుకు), 26 శాతం పొటాషియం ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో అకీ పండు, ఉప్పుచేప, యెల్లో యామ్ (ఒక రకమైన కంద), ఆలు గడ్డ ఇస్తారు. మధ్యాహ్నం భోజనంలో పాస్తా, చికెన్ (బ్రెస్ట్) ... రాత్రి భోజనంలో అన్నం, బఠాణీలు ఉంటాయి. భోజనం, వ్యాయామమే కాదు.., అథ్లెట్లకు నిద్ర కూడా సరిగా ఉండాలి. అయితే బోల్ట్‌కు నిద్రంటే చాలా ఇష్టం. ఏమాత్రం సమయం దొరి కినా నిద్రపోతాడు. ‘పొద్దున్నే నిద్రలేవాలి.. వెంటనే జిమ్‌కు పోవాలి’ అనే రూల్స్ ఏం పెట్టుకోకుండా.. కాస్త ఆలస్యంగానైనా శిక్షణ ప్రారంభిస్తాడు. ఫిట్నెస్ మంత్ర శరీరాకృతిని సరిగా ఉంచుకోవటమే అథ్లెట్ల ప్రధాన సమస్య. బోల్ట్ కూడా ఇందులో భాగంగా రోజూ జిమ్‌లో సాధన చేస్తాడు. ఇందులో లెగ్ వర్కవుట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే గంటల తరబడి భారీగా వ్యాయామాలు కాకుండా శరీరం ఫిట్‌గా ఉండేలా చూసుకుంటాడు. దీని వల్లే శరీరం బరువు పెరగకుండా ఉండి వేగంగా పరిగెత్తేందుకు వీలుంటుంది. భయం బోల్ట్ విజయానికి భయం కూడా ఓ కారణమే. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. ఎప్పుడూ తనను ఎవరో తరుముతున్నట్లు ఊహించుకుంటానని చాలా సందర్భాల్లో బోల్ట్ చెప్పాడు. ‘నా తోటి అథ్లెట్లను పెద్ద సాలీడులుగా ఊహించుకుంటా. దీంతో నాకు భయం ఎక్కువవుతుంది. ఈ భయంతోనే వారినుంచి తప్పించుకునేందుకు వేగంగా పరిగెడతా’ అని బోల్ట్ తెలిపాడు. తీరని దాహం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ అయినా.. బోల్ట్‌లో రికార్డుల దాహం తీరదు. ఎప్పటికప్పుడు తన రికార్డులు తనే బద్దలు కొట్టుకోవాలనే తపనతోనే రోజురోజుకూ వేగం పెంచుకుంటున్నాడు. 100 మీటర్ల రేసులో తను నెలకొల్పిన 9.58 రికార్డును ఎప్పటికైనా తనే బద్దలు కొడతానంటున్నాడు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ బోల్ట్‌కు ఆఖరి ఈవెంట్. మరి ఈ సంవత్సర కాలంలో దీనిని సాధ్యం చేస్తాడో లేదో చూడాలి. రేస్ ఎలా జరిగిందంటే... బోల్ట్ ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో నెమ్మదిగా రేస్‌ను ప్రారంభించాడు. 0.155 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో అతను ఎనిమిది మందిలో ఏడో స్థానంతో స్లో స్టార్ట్ చేశాడు. సగం పరుగు ముగిసిన తర్వాత కూడా అతను వెనుకబడే ఉన్నాడు. 6.1 సెకన్ల టైమింగ్ సమయంలో గాట్లిన్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే చివరి 40 మీటర్లలో బోల్ట్ తన విశ్వరూపం చూపించాడు. గాలికంటే వేగంగా దూసుకుపోయి విజేతగా అవతరించాడు. లిన్ఫోర్ట్ క్రిస్టీ (32) తర్వాత ఎక్కువ వయసులో 100 మీ. స్ప్రింట్ గెలిచిన ఆటగాడిగా బోల్ట్ నిలిచాడు. ఈ నెల 21తో బోల్ట్‌కు 30 ఏళ్లు నిండుతాయి. పరుగు పూర్తి కాగానే బోల్ట్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. తన బంగారు బూట్లను తీసి ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు సిద్ధమైపోయాడు. ఆ వెంటనే మోకాళ్లపై కాస్త వంగి ఆకాశం వైపు చూపిస్తూ తన మార్క్ ‘టు ద వరల్డ్’ పోజులో అభిమానులను అలరించాడు. కిక్కిరిసిన స్టేడియం బోల్ట్ పేరుతో హోరెత్తిపోయింది. గాట్లిన్‌కు వెక్కిరింతలు డోపింగ్‌లో పట్టుబడి గతంలో రెండు సార్లు నిషేధానికి గురైన అమెరికన్ జస్టిన్ గాట్లిన్ 34 ఏళ్ల వయసులోనూ పట్టు వీడలేదు. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో అతను తన మూడో పతకాన్ని గెలుచుకున్నాడు. 2004లో స్వర్ణం, 2012లో కాంస్యం అతని ఖాతాలో ఉన్నాయి. అయితే అతను ట్రాక్‌పై అడుగు పెట్టిననాటినుంచి స్టేడియం మొత్తం డోపీ అంటూ వెక్కిరించింది. కానీ రెండో స్థానంలో నిలిచిన అనంతరం గాట్లిన్ ఇవేవీ లెక్క చేయలేదు. అమెరికా జాతీయ పతాకంతో స్టేడియం మొత్తం ఒక్కడే కలియతిరిగాడు. ‘ఇక్కడి 9 సెకన్ల కోసం మేం ఏడాదిలో 365 రోజులు కష్ట పడతాం. 34 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీ పడి పోడియంపై నిలవడం సంతోషంగా ఉంది. ఈ విజయం నా కొడుకు కోసం. మా అథ్లెట్లు అందరం పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. నేను చేసిన తప్పుకు ఇప్పటికే శిక్ష అనుభవించినా... సూటిపోటి మాటలు నేను ఇక ముందు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు తెలుసు’ అని గాట్లిన్ ఉద్వేగంగా చెప్పాడు. మరో వైపు బోల్ట్ కూడా స్టేడియంలో అథ్లెట్‌ను ఆట పట్టించడం తనను కూడా ఆశ్చర్యపరచిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని అన్నాడు. ‘చిరంజీవి’గా ఉండిపోతా! రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ మరో రెండు ఈవెంట్లు 200 మీ., 4ఁ100 మీటర్ల రిలేలో పాల్గొనాల్సి ఉంది. ఈ రెండింటిలో స్వర్ణం గెలవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అదే జరిగితే మూడు ఒలింపిక్స్‌లలో మూడు చొప్పున మొత్తం 9 స్వర్ణాలతో తిరుగులేని ఘనత బోల్ట్ సొంతమవుతుంది. ఇదే జరిగితే తాను ఎప్పటికీ మరణం దరి చేరని చిరంజీవిగా మిగిలిపోతానని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ‘మరో రెండు పతకాలు గెలిస్తే చాలు, నేను ఆటను ముగించేయవచ్చు. ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోవచ్చు. దానిని సాధిస్తాననే నమ్మకముంది’ అని బోల్ట్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. 200 మీటర్ల పరుగులో తన రికార్డు (19.19 సె.)ను బద్దలు కొట్టి 19 సెకన్ల లోపు పూర్తి చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ స్ప్రింట్ స్టార్ వెల్లడించాడు. 100 మీటర్ల రేస్‌లో తాను గెలుస్తానని ముందునుంచే చెప్పానని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని ఉసేన్ చెప్పాడు. ‘రేస్ చాలా బాగా జరిగింది. ఆరంభంలో తొందరేం లేదు. ప్రశాంతంగా పరుగెత్తవచ్చని నాకు నేనే చెప్పుకున్నాను. నేను మరీ వేగంగా లక్ష్యం చేరలేదనేది వాస్తవం. కానీ ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. సాధారణంగా సెమీ ఫైనల్, ఫైనల్ మధ్య ఉండే విరామంతో పోలిస్తే ఈ సారి కోలుకునేందుకు మాకందరికీ తక్కువ సమయం లభించింది’ అని బోల్ట్ తన ఈవెంట్‌ను విశ్లేషించాడు. మూడు స్వర్ణాలు గెలిచేందుకు తాను రియోకు వచ్చానని, ఇందులో విఫలమైతే తాను తట్టుకోలేనని అతను అన్నాడు. -
చిరుత కూడా చిన్నబోయేలా..
-
ప్రేక్షకుల ప్రవర్తన షాక్ కు గురిచేసింది: బోల్ట్
అమెరికన్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ కు ఆదివారం రియో ఒలింపిక్స్ లో చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ పరుగుల వీరుడైన అతడి పట్ల ప్రేక్షకులు విపరీతంగా ప్రవర్తించారు. అతనిపై కేకలు వేసి అవమానపరిచారు. అయినా, నిరుత్సాహానికి లోనుకాని గాట్లిన్ మెరుపువేగంతో పరుగెత్తి రజతం సాధించాడు. జమైకన్ స్టార్ ఉసేన్ బోల్ట్ 9.81 సెకన్లలో 100 మీటర్ల పరుగుపందెం పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలువగా.. 9.89 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న గాట్లిన్ కొద్దిలో గోల్డ్ మెడల్ ను చేజార్చుకున్నాడు. అయితే, గ్లాటిన్ 2001లో డ్రగ్స్ వాడి డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయాడు. దీంతో అతనిపై ఏడాదిపాటు నిషేధం విధించారు. ఆ తర్వాత 2006లో అతను మరోసారి డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలాడు. 2010లో మళ్లీ అథ్లెటిక్స్ లో అడుగుపెట్టిన గాట్లిన్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో తాజా ఒలింపిక్స్ తో తన సత్తా చాటాడు. 34 ఏళ్ల వయస్సులోనూ పతకం సాధించాడు. అయితే, అతన్ని చూడగానే ప్రేక్షకులు హేళనగా వ్యాఖ్యలు చేస్తూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. 100 మీటర్ల సెమీస్ పరుగుపందెంలోనూ ఇదే రకంగా చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు పరుగులు వీరుడు ఉసేన్ బోల్ట్ ను మాత్రం ప్రేక్షకులు గౌరవ హర్షధ్వానాలతో స్వాగతించారు. అతడు మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కింది. వారి అభిమానాన్ని బోల్ట్ సాదరంగా ఆహ్వానించాడు. అయితే, రేసు ముగిసిన తర్వాత సహచర ఆటగాడికి ఎదురైన చేదు అనుభవంపై బోల్ట్ స్పందించాడు. 'ఇప్పటివరకు నాకు తెలిసి మైదానంలో ఒక ఆటగాడిని సతాయించడం ఇదే తొలిసారి అనుకుంటా. ప్రేక్షకుల ప్రవర్తన నన్ను షాక్ గురిచేసింది' అని బోల్ట్ విస్మయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల మూర్ఖ ప్రవర్తనను పంటిబిగువున భరించిన జస్టిన్ గాట్లిన్ రజతం సాధించిన అనంతరం అమెరికా జాతీయ జెండాను భుజాన వేసుకొని మైదానంలో కలియతిరిగారు. ఆయనకు కొంతమంది ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభించింది. -
బోల్ట్ 'పరుగు' వెనుక రహస్యం?
రియో డీ జనీరో: 'నాలో చురుకుదనం తగ్గింది. రేసును పూర్తి చేసే క్రమంలో సరైన ప్రదర్శన చేయలేదు. రేస్‌లో నా ప్రారంభం అంత గొప్పగా జరగలేదు. ఏ పెద్ద ఈవెంట్లోనూ ఈ సమయంలో పరుగెత్తిన అలవాటు నాకు లేదు. గాడిలో పడటానికి యత్నిస్తా. ' ఇవన్నీ రియో ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన తరువాత బోల్డ్ చెప్పిన మాటలు. తొలి రౌండ్ హీట్స్ పోటీల్లో భాగంగా 10.07 సెకన్లలో లక్ష్యం చేరి అగ్రస్థానంలో నిలిచినా బోల్ట్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే పతకం పోరుకు వచ్చేసరికి బోల్ట్ తనలోని చురుకుదనం తగ్గలేదని నిరూపించుకుని.. రియోలో తొలి స్వర్ణాన్ని అందుకున్నాడు. కేవలం 9.81 సెకన్లలో పురుషుల వందమీటర్ల ఫైనల్ పరుగుపందెన్ని పూర్తిచేసి.. వరుసగా మూడోసారి ఒలింపిక్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్ప్రింటర్ గా చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో పురుషుల వందమీటర్ల పరుగు పందెంలో బోల్ట్ స్వర్ణాలను సాధించగా.. ఆయా ఒలింపిక్స్‌లలో 200 మీటర్ల వ్యక్తిగత రేసులో, 4x100 జట్టు పరుగు పందెంలో ఆ స్పీడ్ స్టార్ పసిడి పతకాలను కైవసం చేసుకున్నాడు. అయితే.. బోల్ట్‌కు మాత్రమే ఇదెలా సాధ్యమైంది? అతను బుల్లెట్లా దూసుకెళ్లడం వెనక రహస్యమేంటి? 2008లో ఒలింపిక్స్‌లో పసిడి పండించడంతో మొదలుపెట్టి.. ఇప్పటి వరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్.. ఆటేదైనా.. మెడల్ మాత్రం బోల్ట్ దే. మామూలుగా వేగంగా పరిగెత్తాలంటే.. కాళ్లు వేగంగా కదిలించాలి. కానీ బోల్ట్ మాత్రం వేరే చిట్కా పాటిస్తాడట. అగ్రశ్రేణి స్ప్రింటర్లు 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 50 నుంచి 55 అంగలు ఉపయోగిస్తే.. ఈ జమైకా స్టార్ 40 అంగల లోపే రేసును పూర్తి చేస్తాడట. కొన్ని సందర్బాల్లో కేవలం 35 అంగల్లోనే ఆ రేసును పూర్తి చేయడమే బోల్ట్ ను మిగతావారి కంటే ముందంజలో నిలబెడుతుందట. గతంలో బోల్ట్ వేగంపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన శాస్త్ర వేత్త డాక్టర్ ఎలెన్ ఈ విషయాలను వెల్లడించారు. అదే బోల్ట్‌ను మిగతావారి కంటే ముందు రేస్ పూర్తి చేసేందుకు సహాయపడుతుంది.అంతే కాదు.. సాధారణంగా అగ్రశ్రేణి రన్నర్ ప్రతి అంగలో భూమి మీద కాలు మోపే కాలం 0.12 సెకండ్లు కాగా.. బోల్ట్ కేవలం 0.8 సెండ్లు మాత్రమే నేల మీద కాలు పెడతాడు. మిగతా వారితో పోలిస్తే బోల్ట్ 10 నుంచి 15 శాతం ఎక్కువ సమయం గాలిలో ఉంటాడట. ఇవన్నీ బోల్డ్ రేసును వేగంగా పూర్తి చేయడానికి ప్రధాన కారణమని తేల్చారు. -
చిరుత కూడా చిన్నబోయేలా..
రియో డిజెనీరో: చిరుతపులే చిన్నబోయేలా.. లేడి కూడా సిగ్గుపడేలా.. రేసుగుర్రం ఆగి చూసేలా.. రెప్పపాటులో మెరుపువేగంతో అతడు సృష్టించిన చరిత్ర గురించి చెప్పాలంటే ఇలాంటి ఉపమానాలు ఎన్ని చెప్పినా సరిపోదేమో. అందరూ ఊహించినట్టే జమైకన్ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని నమోదుచేశాడు. కేవలం 9.81 సెకన్లలో పురుషుల వందమీటర్ల పరుగుపందెన్ని పూర్తిచేసి.. వరుసగా మూడోసారి ఒలింపిక్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యుత్తమ అథ్లెట్ గా చరిత్రలో చెరిగిపోని రికార్డు సాధించాడు. రియో ఒలింపిక్స్ లో ఆదివారం పురుషుల వంద మీటర్ల పరుగుపందెం హోరాహోరీగా సాగింది. జమైకన్ చిరుతగండు బోల్ట్ కి అమెరికన్ పరుగులవీరుడు జస్టిన్ గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. క్షణంలో అతికొద్దితేడాతో తనదే పైచేయి అని బోల్ట్ నిరూపించుకున్నాడు. 9.81 సెకన్లతో బోల్ట్ ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలుపొందగా.. గాటిన్ 9.84 సెకన్లతో రేసును పూర్తిచేసి రజతంతో సరిపెట్టుకున్నాడు. కెనడా పరుగులవీరుడు అండ్రీ డి గ్రాస్ 9.91 సెకన్లతో మూడోస్థానంలో నిలిచి కాంస్యం పతకాన్ని అందుకున్నాడు. పురుషుల వందమీటర్ల పరుగు పందెంలో ఇది బోల్ట్ కు మూడో స్వర్ణం. అతను 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో స్వర్ణాలను సాధించాడు. గాయాలు వేధిస్తున్నా.. సరైన ఫామ్ లో లేకపోయినా.. ఈ జమైకా చిరుత విశ్వక్రీడల వేదికపై తన అసలు సత్తా ఏమిటో చాటాడు. పరుగుపందెంలో విజయం సాధించిన వెంటనే ఉసెన్ బోల్ట్ లో ఆనందం పరవళ్లు తొక్కింది. తనకు ప్రోత్సాహం ఇచ్చిన మైదానంలోని ప్రేక్షకులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. -
బోల్ట్ ‘పరుగు’ ప్రారంభం
సెమీస్‌కు చేరిన స్టార్ అథ్లెట్ రియో: ఒలింపిక్స్‌లో వరుసగా మూడు సార్లు 100 మీటర్ల స్వర్ణం గెలిచిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఉసేన్ బోల్ట్ శుభారంభం చేశాడు. శనివారం జరిగిన తొలి రౌండ్ హీట్స్ పోటీల్లో నెగ్గిన బోల్ట్, సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ పోటీలో 10.07 సెకన్లలో లక్ష్యం చేరిన బోల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. ‘రేస్‌లో నా ప్రారంభం అంత గొప్పగా జరగలేదు. చురుకుదనం తగ్గినట్లు అనిపించింది. ఏ పెద్ద ఈవెంట్లోనూ ఈ సమయంలో పరుగెత్తిన అలవాటు నాకు లేదు. రేపు మరింత మెరుగ్గా పరుగెడతానని ఆశిస్తున్నా’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ఈ క్వాలిఫయింగ్ రేస్ మధ్యాహ్నం నిర్వహించారు. తొలి రౌండ్లో అత్యుత్తమ టైమింగ్ (10.01 సె.) నమోదు చేసి గాట్లిన్ కూడా ముందంజ వేశాడు. యోహన్ బ్లేక్, బ్రోమెల్, మార్విన్ బ్రేసీ, ఆండ్రీ డీ గ్రేస్ 100 మీటర్ల విభాగంలో సెమీస్‌కు అర్హత సాధించిన ఇతర అథ్లెట్లు. పురుషుల 100మీ. పరుగు సెమీస్: సోమవారం ఉదయం గం.5.30 ఫైనల్స్: ఉదయం గం. 6.55 -
ఎందుకిలా వెల వెల ...
ఖాళీగా కనిపిస్తున్న ఒలింపిక్స్ స్టేడియాలు ఆసక్తి చూపించని స్థానికులు భయాలతో దూరమైన విదేశీయులు రండి బాబూ రండి... మా ఆటను చూడండి... ఒక్క పది సెకన్లు మాత్రమే... ఆలసించిన ఆశాభంగము... పాత రోజుల్లో ఊర్లోకి సినిమా వచ్చినప్పుడు రిక్షాలో తిరుగుతూ చేసే ప్రకటనలాగా వినిపిస్తోంది కదూ... ఇప్పుడు అచ్చం అలాగే మాట్లాడుతోంది ఎవరో కాదు... ప్రపంచ క్రీడా చరిత్రలో దిగ్గజ ఆటగాడి నోటినుంచే ఈ పలుకులు వచ్చాయి మరి. ఆదివారం జరిగే స్ప్రింట్ పోటీల కోసం టికెట్లు కొనమంటూ ఉసేన్ బోల్ట్ చేస్తున్న విజ్ఞప్తి ఇది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చివరకు బోల్ట్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒలింపిక్స్ అంటే క్రీడల పండగ. నాలుగేళ్లకు ఒక సారి వచ్చే అతి పెద్ద సంబరం. ఇంత మంది ఒకే చోట, ఒకే సారి తమ ఆటను ప్రదర్శించేందుకు, దానిని చూసి తరించేందుకు అభిమానులకు ఇదొక్కటే అవకాశం. ప్రత్యక్షంగా క్రీడలు తిలకించినవారికి ఆ జ్ఞాపకాలు జీవిత కాలం మదిలో పదిలం. కానీ రియోలో పరిస్థితి చూస్తే అంతా తలకిందులుగా కనిపిస్తోంది. చాలా క్రీడాంశాలను అసలు జనం పట్టించుకోకపోవడంతో స్టేడియాలన్నీ బోసిపోతున్నాయి. అనామకులే కాదు అసాధ్యులైన స్టార్లు బరిలో ఉన్న పోటీలకు కూడా స్పందన లేకపోవడం ఆశ్చర్యకరం. టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఒక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడుతున్నాడంటే జనం ఎంతగా ఎగబడిపోతారు... టికెట్ ధర ఎంత భారీగా ఉన్నా కొనేసి కోర్టులో వాలిపోతారు. చాలా సందర్భాల్లో డబ్బులు ఉన్నా టికెట్ కూడా దొరకదు. కానీ రియో ఒలింపిక్స్‌లో అతను ఆడుతున్న కోర్టులో గుప్పెడంత మంది ప్రేక్షకులు కూడా లేరు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ క్రీడ అయిన టెన్నిస్‌కే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర క్రీడలను జనం ఏ మాత్రం పట్టించుకుంటారు. ఇక అధమ స్థాయిలో వాటర్‌పోలో, రగ్బీ సెవెన్స్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, మహిళల ఫుట్‌బాల్‌లాంటి ఈవెంట్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వీటితో పోలిస్తే బీచ్ వాలీబాల్ పరిస్థితి కాస్త మె రుగ్గా ఉన్నా అందుకు కారణమేమిటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్వహణలో లోపాలు రియో ఒలింపిక్స్‌లో ప్రేక్షకుల కోసం అన్ని ఆటలు, కేటగిరీలు కలిపి మొత్తం 75 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచారు. అధికారిక లెక్క ప్రకారం 84 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ అదే లెక్క స్టేడియాలలో మాత్రం ప్రతిఫలించడం లేదు. క్రీడలు జరుగుతున్న స్టేడియంలు రియో నగరంలో ఒక్కో మూలన ఉన్నాయి. ఒక చోటికి వెళ్లాలంటేనే కనీసం మూడు సార్లు బస్సు కానీ రైలు కాని ఎక్కి దిగాల్సిన పరిస్థితి. పైగా ఇంత కష్టపడి మైదానానికి వెళితే సెక్యూరిటీ సిబ్బంది అపరిమిత నిబంధలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. బ్రెజిల్ జిమ్నాస్ట్ ఆర్థర్ జనేటి ఆటను చూద్దామని వెళ్లిన ఒక వీర ఫ్యాన్‌ను విపరీతమైన సెక్యూరిటీ తనిఖీల కారణంగా చాంతాడులాంటి క్యూ పలకరించింది. దాంతో అతను పోటీలు చూడలేకపోయాడు. ‘ఇది దుర్మార్గం, టికెట్ కొన్న ప్రేక్షకుడు అంటే మా అధికారులకు అంత చులకనా, బ్రెజిల్వాసిగా సిగ్గు పడుతున్నా’ అని అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీటికి తోడు బ్లాక్ టికెట్ల జోరు కూడా అసలు అభిమానులను ఆటకు దూరం చేస్తోంది. ‘నలుగురు సభ్యుల మా కుటుంబం అధికారిక టికెట్ ధర ప్రకారం లెక్క చూసుకొని ఇక్కడికి వస్తే టికెట్లు లేవన్నారు. పక్కనే బ్లాక్‌లో అమ్మేవాడి రేట్లో మేం ఒక్కరం కూడా పోటీలు చూడటం సాధ్యం కాదు’ అంటూ ఒక వ్యక్తి వెనుదిరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. పైగా కొన్ని ఆటల గురించి బ్రెజిల్వాసులకు బొత్తిగా పరిచయం లేదు. దాంతో వారు అటు వైపు తిరిగి కూడా చూడటం లేదు. టికెట్ల ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయనేది కొంత మంది స్థానికుల వాదన. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా సీట్లు ఖాళీగా కనిపించడం ఆశ్చర్యకరం. విదేశీయులు బైబై... ప్రపంచంలో ఎక్కడ పెద్ద స్థాయి క్రీడా ఈవెంట్ జరిగినా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విదేశీ అభిమానులు రావడం సహజం. ఆటలతో పాటు సరదాగా తిరిగేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కానీ రియోలో తాజా పరిణామాలు వారిని భయపెట్టినట్లున్నాయి. సాధారణంగా విదేశీయులు ఆన్లైన్లో చాలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే క్రీడల సమయానికి పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటినుంచో జికా వైరస్ వారిని వెంటాడుతూనే ఉంది. తాజాగా దోపిడీలు, కిడ్నాపింగ్‌లు, పోలీసు కాల్పులు, బాంబు స్వాధీనంవంటి వార్తలు వారిని మళ్లీ ఆలోచనలో పడేసినట్లున్నాయి. క్రీడా గ్రామం మొదలు క్రీడాకారులపై కూడా దాడులు జరుగుతున్న చోట మనమెంత అని ఆందోళన పెరిగిపోయింది. దాంతో చాలా మంది ఆన్లైన్లో టికెట్లు రద్దు చేసుకున్నారు. మరో వైపు నిబంధనల ప్రకారం ప్రతీ స్టేడియంలో స్పాన్సర్ల కోసం పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించారు. కానీ వారెవరూ మ్యాచ్‌లు చూసేందుకు రాకపోవడంతో అంతా ఖాళీగా కనిపిస్తోంది. ఈ సీట్లను ఇతరులకు కేటాయించే అవకాశం కూడా లేదు. అథ్లెటిక్స్‌పై ఆశలు ప్రేక్షకుల అసహనాన్ని నిర్వాహకులు కూడా గుర్తించినట్లున్నారు. అందుకే స్టేడియం బయట సుదీర్ఘ క్యూల విషయంలో క్షమాపణలు చెప్పారు. ఇకపై అలాంటివి జరగవని హామీ ఇచ్చారు. పైగా తమ ప్రయత్నంగా స్టేడియాలు నింపే పనిలో పడ్డారు. అమ్ముడుపోని టికెట్లను స్కూల్ విద్యార్థులకు పంచడమే కాదు, వారిని బస్సులో వేదికల వద్దకు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక వారి ఆశలన్నీ శుక్రవారంనుంచి జరిగే ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల మీదే ఉన్నాయి. ఇప్పటి వరకు జనం పెద్దగా రాకపోయినా... అథ్లెటిక్స్‌కు బాగా ఆదరణ ఉంటుందని, అది సూపర్ సక్సెస్ అయితే వేరే లోటు కనిపించకుండా పోతుందని వారు భావిస్తున్నారు. అదే ఆశతోనే బోల్ట్‌తో టికెట్లు కొనమంటూ సందేశం వినిపించారు. ‘నేను రియోలో ఉన్నాను... మిమ్మల్ని నిరాశపర్చను’ అని అతనితో చెప్పించారు. ఈ పోటీలకు జనం ఎగబడితే ఇక నిర్వాహకులు ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని కూర్చొవచ్చేమో. ఒకవేళ బోల్ట్ 100మీ. పరుగు ఫైనల్‌కూ స్టేడియం ఖాళీగా ఉంటే మాత్రం ఈ ఒలింపిక్స్ గురించి చరిత్రలో ఎవరూ చెప్పుకోరు. టీవీల్లోనూ చూడట్లేదు... లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే రియోలో టీవీ వీక్షకుల సంఖ్య కూడా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా టీవీ హక్కులు కలిగి ఉన్న ప్రసారకర్త ఎన్బీసీ చెప్పిన వివరాల ప్రకారం 2016 ఒలింపిక్స్ తొలి ఐదు రోజుల్లో సగటు వీక్షకుల సంఖ్య 28.6 మిలియన్లుగా ఉంది. అయితే లండన్‌లో ఇదే సమయానికి టీవీల్లో ఒలింపిక్స్‌ను 35.6 మిలియన్ల మంది చూశారు. నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంతో రియోను పోలిస్తే వీక్షకుల సంఖ్య 35 శాతం పడిపోవడం విశేషం. అయితే ఈ సారి వెబ్‌లో చూసేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం దీనికి ఒక కారణంగా చెబుతున్న ఎన్బీసీ, రాబోయే రోజుల్లో రేటింగ్స్ పెరుగుతాయని నమ్మకంతో ఉంది. -
ఒలింపిక్ ఆఫ్ ద ఫీల్డ్
బోల్ట్... సాంబా డ్యాన్స్ రియో డి జనీరో: మైదానంలో చిరుత వేగంతో పరిగెత్తడమే కాదు.. తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని జమైకా సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ నిరూపించుకున్నాడు. ఒలింపిక్స్‌లో అత్యంత ఆదరణ కలిగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న ఈ 29 ఏళ్ల పరుగు వీరుడు ఇక్కడ తొలిసారిగామీడియా ముందుకు వచ్చాడు. సమావేశం ముగిశాక ఫొటోలకు ఫోజులిస్తుండగా ఒక్కసారిగా వెనకవైపు నుంచి డ్రమ్మర్స్‌తో పాటు 10 మంది సాంబా నృత్యకారులు వచ్చారు. వచ్చీ రావడంతోనే బోల్ట్‌ను చుట్టుముట్టి తమ డ్యాన్స్‌ను ప్రారంభించారు. ఏమాత్రం బెదరని బోల్ట్ కూడా వారితో పాటే కాళ్లు కదిపాడు. అనంతరం వారితో వరుసగా నిలబడి సాంబా తరహాలో నృత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఇవే తన చివరి ఒలింపిక్స్ అని బోల్ట్ మరోసారి స్పష్టం చేశాడు. మరో వింత ‘జంట’ రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ సాక్షిగా మరో ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల ఇసడోరో రగ్బీ సెవెన్ క్రీడాకారిణి. అదే దేశానికి చెందిన మరో 28 ఏళ్ల మహిళ మరోర్జీ ఒలింపిక్స్‌లో వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఒలింపిక్స్‌ను చిరకాలం గుర్తిండిపోయేలా మార్చుకోవాలని ఈ ఇద్దరూ భావించారు. రగ్బీ సెవెన్ ఫైనల్ ముగిసి మెడల్స్ ప్రదానం అయ్యాక మర్జోరీ వెళ్లి ఇసడోరాకు పెళ్లి ప్రతిపాదన చేసింది. అంతే ఓ గాఢ చుంబనంతో ఇసడోరా తన అంగీకారం తెలిపింది. ‘జట్టులో తను చోటు దక్కించుకున్న అనంతరం ఈ గేమ్స్ తనకు ప్రత్యేకంగా ఉండాలని భావించాను. ఇక ఆమే నా జీవితం. ప్రేమే గెలుస్తుందని అందరికీ నిరూపించదలిచాను’ అని ఎన్యా పేర్కొంది. బ్రెజిల్లో గే, లెస్బియన్ వివాహాలు చట్టరీత్యా అంగీకారమే. ఈ ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ‘జికా’ తలనొప్పి..! న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు రావడానికి ముందు దిగిన ఓ ఫొటో.. ఆ అ మెరికా మహిళా ఫుట్‌బాలర్‌ను ఎక్కడికి వెళ్లినా ‘వెంటాడింది’. బ్రెజిల్లో జికా వైరస్ తీవ్రతను గుర్తు చేస్తూ గోల్‌కీపర్ హోప్ సోలో తన ముఖానికి మాస్క్‌తో పాటు చేతిలో కీటక నిరోధక బ్యాట్‌ను పట్టుకుని ఫొటో దిగింది. అంతేకాకుండా ‘దీన్ని షేర్ చేయకండి.. ఇలా మీరూ సిద్ధం కండి!’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది బ్రెజిల్ వాసుల మనస్సు చివుక్కుమనేలా చేసింది. తమ కోపాన్ని తీర్చుకునేందుకు వారు అమెరికా, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అవకాశంగా తీసుకున్నారు. బంతి కీపర్ హోప్ దగ్గరకు వెళ్లినప్పుడల్లా స్టేడియంలోని ప్రేక్షకులు మొత్తం కసిదీరా ‘జికా.. జికా’ అంటూ అరవడం ప్రారంభించారు. నిజానికి కివీస్‌తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇలాగే హేళన చేసినప్పటికీ ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో ఇది తారాస్థాయికి చేరింది. అయితే ఎంతగా రెచ్చగొట్టినా హోప్ మాత్రం ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. -
'నా కొడుకు బోల్ట్ సక్సెస్ మంత్రం అదే'
కింగ్స్టన్: స్ప్రింట్ విభాగాల్లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టిన ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ కూల్ గా రికార్డులు బద్దలు కొట్టడానికి కారణం ఏంటో తెలుసా?, అతని చిరునవ్వేనట. ఈ విషయాన్ని ఉసేన్ బోల్ట్ తల్లి జెన్నీఫర్ బోల్ట్ స్పష్టం చేశారు. తన కొడుకు బోల్డ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే అతన్ని చాంపియన్‌గా నిలబెడుతుందని జెన్నీఫర్ తెలిపారు. అదే అతని సక్సెస్ కు ప్రధాన కారణమన్న జెన్నీఫర్.. వచ్చే ఒలింపిక్స్‌లో కూడా బోల్ట్ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా చాలా సానుకూలంగా ఆలోచించే ధోరణి బోల్ట్ కు తన నుంచే వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న జెన్నీఫర్.. అదే విషయాన్ని తన కొడుక్కి పదే పదే చెబుతుంటానని పేర్కొన్నారు. 'రియో గేమ్స్‌కు బోల్ట్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. ఆ గేమ్స్‌లో బోల్ట్ నుంచి మెరుగైన ప్రదర్శన ఉంటుందని తెలుసు. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేయమని నా కొడుక్కి చెప్పా. దేవుడ్ని ఎప్పుడూ మరవద్దని తెలిపా. బైబిల్‌ను చదువుకోమని చెప్పా'అని జెన్నీఫర్ తెలిపారు. 100 మీటర్ల, 200 మీటర్ల పరుగులో వరల్డ్ రికార్డులు సృష్టించిన బోల్ట్.. ఇప్పటివరకూ రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని ఆరు స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. రియో అర్హతలో భాగంగా జమైకా జాతీయ మీట్ నుంచి గాయం కారణంగా అర్థాంతరంగా వైదొలిగిన బోల్ట్.. ఆ తరువాత లండన్‌లో జరిగిన డైమండ్ లీగ్ ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. జూలై 22 వ తేదీన జరిగిన 200 మీటర్ల రేసులో బోల్ట్ సత్తా చాటి రియోకు సిద్ధమయ్యాడు. -
రియోలో పరుగుల చిరుత
రియోడిజనీరో: వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బ్రెజిల్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి వారం రోజుల ముందే రియోడిజనీరోకి రావడం పరుగుల వీరుడి అంకిత భావానికి నిదర్శనం. వరుసగా మూడు ఒలింపిక్స్ లో 100, 200, 4x100 విభాగాలలో స్వర్ణాలు సాధించిన తొలి అథ్లెట్ గా రికార్డు నెలకొల్పేందుకు బోల్ట్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో మూడు విభాగాలలో స్వర్ణాలు సాధించాడు బోల్ట్. గత శుక్రవారం 200 మీటర్ల రేస్ ను 19.89 సెకన్లలో పూర్తిచేసి తన ఫిట్ నెస్ మరోసారి నిరూపించుకున్నాడు. ఉసేన్ బోల్ట్ మ్యునిక్ లో ఒలింపిక్స్ కోసం శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ట్రయల్స్‌లో పాల్గొనకున్నా జమైకా దేశం బోల్ట్ ఎంట్రీని రియో ఒలింపిక్స్‌కు పంపించింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పరుగుతోనే బదులివ్వాలని బోల్ట్ భావిస్తున్నాడు. మరోవైపు రికార్డు స్వర్ణాలపై కన్నేసిన బోల్ట్, రియోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. -
నన్ను గాట్లిన్ అగౌరపరిచాడు: బోల్ట్
లండన్: రియో ఒలింపిక్స్ కు ముందు జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్‌కు మాటల యుద్ధం ప్రారంభమైంది. రియో అర్హతలో భాగంగా గత నెల్లో జమైకా నేషనల్ సీనియర్ చాంపియన్ షిప్స్ ట్రయల్స్ నుంచి బోల్ట్ అర్థాంతరంగా వైదొలగడాన్నిలండన్ డైమండ్ లీగ్ వేదికగా గాట్లిన్ తప్పుబట్టాడు. అప్పుడు వైదొలిగిన బోల్ట్ చికిత్స అనంతరం తిరిగి పోటీల్లో పాల్గొనడాన్ని ఒక తప్పుగా చిత్రీకరించే యత్నం చేశాడు. బోల్ట్ ఒక అమెరికా స్పింటర్ గా ఉన్నట్లైతే మరొకాసారి అవకాశం ఉండేది కాదంటూ గాట్లిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీనిపై బోల్ట్ కూడా ఘాటుగానే స్పందించాడు. 'అదొక జోక్‌లా అనిపించినా, నన్ను అగౌరపరిచే విధంగా ఉంది. నేను ట్రయల్స్ నుంచి వైదొలగానని అమెరికన్ స్ప్రింటర్లు భావించి ఉంటారు. నేను మళ్లీ లండన్ ట్రయల్స్ లో పాల్గొనడం వారిలో అసంతృప్తి కల్గించి ఉంటుంది. ప్రతీ సంవత్సరం నన్ను నిరూపించూకుంటూ ముందుకు సాగుతున్నా. నేనే అత్యుత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదు. గాట్లిన్ మాటలు విన్న మరుక్షణం నాకు నవ్వొచ్చింది. ఆ తరువాత చాలా బాధనిపించింది. నన్ను టార్గెట్ చేస్తూ గ్లాటిన్ అలా వ్యాఖ్యానించడం నిజంగా అమర్యాదగా ప్రవర్తించినట్లే' అని బోల్ట్ తెలిపాడు. రియో అర్హతలో భాగంగా లండన్ లో జరిగిన డైమండ్ లీగ్ 200మీటర్ల రేసును బోల్ట్ దిగ్విజయంగా ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన ఆ రేసును బోల్ట్ 19.89 సెకన్లలో పూర్తి చేసి సత్తా చాటాడు. -
రియో బృందంలో బోల్ట్
కింగ్స్టన్: రియోకు వెళ్లే జమైకా అథ్లెట్ల బృందంలో ఉసేన్ బోల్ట్‌కు చోటు దక్కనుంది. ఈ మేరకు జమైకా అథ్లెటిక్స్ అడ్మినిస్ట్రేటివ్ సంఘం (జేఏఏఏ) బోల్ట్ పేరును రియోకు పరిశీలించాలని ఆ దేశ ఒలింపిక్ సంఘాని(జేఓఏ)కి సూచించినట్లు సమాచారం. దీంతో జేఓఏ 100మీ., 200మీ.లో పాల్గొనే నలుగురు అథ్లెట్ల బృందంలో బోల్ట్ పేరును చేర్చింది. నిబంధనల ప్రకారం ముగ్గురు అథ్లెట్లు మాత్రమే ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ బృందం నుంచి తుది జట్టును రియో టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేస్తుంది. జాబితాలో పేరు చేర్చినప్పటికీ... జూలై 22న జరిగే లండన్ డైమండ్ లీగ్ మీట్లో బోల్ట్ రియోకు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ అర్హత ట్రయల్స్‌లో తొడ కండరంలో అసౌకర్యం కారణంగా బోల్ట్ ఫైనల్ బరిలో దిగలేదు.