బోల్ట్‌ ఆల్‌ స్టార్స్‌ టీమ్‌ విజయం | Nitro Athletics: Usain Bolt All-Stars team to face England in 'revolutionary' meet | Sakshi
Sakshi News home page

బోల్ట్‌ ఆల్‌ స్టార్స్‌ టీమ్‌ విజయం

Published Sun, Feb 5 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

బోల్ట్‌ ఆల్‌ స్టార్స్‌ టీమ్‌ విజయం

బోల్ట్‌ ఆల్‌ స్టార్స్‌ టీమ్‌ విజయం

ఒలింపిక్స్‌ అనంతరం బరిలోకి
మెల్‌బోర్న్‌: అథ్లెటిక్స్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ మరోసారి ట్రాక్‌పై తన జోరు చూపించాడు. ప్రారంభ నిట్రో అథ్లెటిక్స్‌ టీమ్స్‌ ఈవెంట్‌లో భాగంగా శనివారం జరిగిన 4గీ100మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో బోల్ట్‌కు చెందిన ఆల్‌స్టార్స్‌ టీమ్‌.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రియో ఒలింపిక్స్‌ అనంతరం బరిలోకి దిగడం బోల్ట్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. బోల్ట్‌ ఆల్‌ స్టార్స్‌ జట్టుతో పాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, జపాన్, చైనా జట్లు పోటీపడుతున్నాయి. ఈ జమైకన్‌ స్టార్‌ టీమ్‌లో తన దేశం నుంచే కాకుండా అమెరికా, కెన్యాలనుంచి కూడా ఆటగాళ్లున్నారు. ఇక 4గీ100 మీ. మిక్స్‌డ్‌ రిలేలో ప్రతీ జట్టు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్స్‌ బరిలోకి దిగుతారు.

ఆల్‌స్టార్స్‌ టీమ్‌ నుంచి ఫైనల్‌ ఈవెంట్‌లో అసఫా పావెల్‌కు జతగా బోల్ట్‌ పరుగు తీశాడు. ‘ఆరంభంలో మేం కాస్త నెమ్మదిగా పరిగెత్తడంతో ఆందోళనకు గురయ్యాను. అందరూ మావైపు ఓడిపోతున్నారంటూ చూశారు. అయితే చివరికి మా జట్టే గెలిచింది. ఈ విజయంతో సంతోషంగా ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో పోటీల్లో పాల్గొనలేదు. స్థానిక అథ్లెట్లు కూడా విశేషంగా రాణించారు’ అని స్టేడియంలో ప్రధాన ఆకర్షణగా మారిన బోల్ట్‌ తెలిపాడు. రెండు గంటల పాటు నాన్‌స్టాప్‌గా సంప్రదాయక, ఆధునిక ఈవెంట్ల కలబోతగా నిట్రో అథ్లెటిక్స్‌ మీట్‌ను రూపొందించారు. ప్రతీ జట్టు 12 మంది చొప్పున పురుష, మహిళల అథ్లెట్లను కలిగి ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement