కాస్సీ అనే రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రేస్‌ను 24.73 సెకెన్లలో ముగించిన కాస్సీ.. అత్యంత వేగంగా పరుగు పూర్తి చేసిన రెండు కాళ్ల రోబోగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. మనుషుల వేగంతో పోల్చుకుంటే కాస్సీ వేగం తక్కువే అయినప్పటికీ.. ఓ రోబో నుంచి ఇది ఆశ్చర్యకరమైన ప్రదర్శనే అని చెప్పాలి. గతంలో ఏ రోబో ఇంత వేగంగా 100 మీటర్ల పరుగు పందెన్ని పూర్తి చేయలేదు.
కాస్సీ ప్రదర్శన దాని రూపకర్తలకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మున్ముందు కాస్సీ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పరుగులో మరింత వేగాన్ని అందుకోవడం కాస్సీకి కష్టతరమైన సవాలు కాదని వారంటున్నారు. అసలైన సవాలు పరుగు మొదలుపెట్టడం, ఆపడమేనని తెలిపారు.
కాస్సీని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఇంజనీర్లు సృష్టించారు. ఇది వారి ఎజిలిటీ రోబోటిక్స్ విభాగంచే తయారు చేయబడింది. కాస్సీ యొక్క మోకాళ్లు ఉష్ట్రపక్షి (Ostrich) నుండి ప్రేరణ పొందాయి. ఉష్ట్రపక్షి భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. దీన్ని ప్రేరణగా తీసుకునే కాస్సీని తయారు చేశారు.
కాగా, కాస్సీ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోదని నెటిజన్లు అంటున్నారు. బోల్ట్‌కు కాస్సీకి వ్యత్యాసం 15 సెకెన్లు మాత్రమే. బోల్ట్ 9.58 సెకెన్లలో 100మీ రేస్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మహిళల విభాగంలో 100మీ ప్రపంచ రికార్డు ఫారెన్స్ గ్రిఫిత్ పేరిట ఉంది. ఈమె 10.49 సెకెన్లలో 100మీ రేసును పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment