సొంతగడ్డపై బోల్ట్‌ చివరి రేస్‌ | Usain Bolt wins final 100m race in Jamaica in emotional farewell | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై బోల్ట్‌ చివరి రేస్‌

Published Sun, Jun 11 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

సొంతగడ్డపై  బోల్ట్‌ చివరి రేస్‌

సొంతగడ్డపై బోల్ట్‌ చివరి రేస్‌

కింగ్‌స్టన్‌: జమైకా మేటి స్ప్రింట్‌ రన్నర్‌ ఉసేన్‌ బోల్ట్‌ తన సొంతగడ్డపై చివరి విజయాన్ని అందుకున్నాడు. 2002లో తాను ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించిన ట్రాక్‌పైనే శనివారం రాత్రి జరిగిన 100 మీటర్ల రేసును 10.03 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది బోల్ట్‌ తలపడిన తొలి 100 మీటర్ల ఈవెంట్‌ ఇదే కావడం విశేషం. వచ్చే ఆగస్టులో లండన్‌లో జరగనున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత బోల్ట్‌ రిటైర్మెంట్‌ తీసుకోనున్నాడు.

ఈ నేపథ్యంలో  సొంతగడ్డపై ఇదే చివరి పోటీ కావడంతో తమ అభిమాన ఆటగాడి ప్రదర్శనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య విజయాన్నందుకున్న 30 ఏళ్ల ఈ జమైకన్‌ చిరుత చివరిసారిగా ట్రాక్‌ను ముద్దాడి ప్రేక్షకులను అలరించాడు. ఈ పోటీలో కొత్త రికార్డు నెలకొల్పడం కన్నా తన అభిమానులను అలరించడమే ధ్యేయంగా బరిలోకి దిగినట్లు గతేడాది రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన బోల్ట్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement