2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా | If I win in Rio 2016, I will become legend: Usain Bolt | Sakshi
Sakshi News home page

2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా

Published Fri, Oct 9 2015 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా

2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా

మెక్సికో సిటీ: స్ప్రింట్లో ప్రపంచ రికార్డులు సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్.. 2016 రియో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. రియోలోనూ పతకాలు గెలిస్తే లెజెండ్ అవుతానిన బోల్ట్ అన్నాడు.

స్ప్రింట్లో ఎదురులేని బోల్ట్ 100, 200 మీటర్ల రేసుల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.  2012 లండన్ ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. 'రియోలోనూ గెలిస్తే అమితంగా సంతోషిస్తాను. లెజెండ్ అవుతాను. అప్పుడు ఎవరైనా అడిగితే నేను లెజెండ్ అని చెబుతాను' అని బోల్ట్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ కోసం వచ్చే నెలలో సాధన ప్రారంభిస్తానని చెప్పాడు. బీజింగ్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నానని  తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement