లండన్: జమైకా చిరుత, స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్కు లండన్ ఒలింపిక్స్ స్టేడియంతో ప్రత్యేక అనుబంధముంది. మూడేళ్ల క్రితం ఈ వేదికపై జరిగిన ఒలింపిక్స్లో బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 100, 200 మీటర్ల రేసుతో పాటు 4x400 మీ రిలేలో బోల్ట్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మూడేళ్ల తర్వాత బోల్ట్ మళ్లీ ఈ స్టేడియానికి వస్తున్నాడు. ఈ నెలలో ఈ వేదికపై జరిగే డైమండ్ లీగ్లో పాల్గొననున్నాడు. 100 మీటర్ల రేసులో పాల్గొననున్నట్టు బోల్డ్ ప్రకటించాడు. ఈ స్టేడియంలో తనకు మధురానుభూతులున్నాయని అన్నాడు. కాగా కాలిగాయం కారణంగా బోల్ట్ ఇటీవల పారిస్, లాసన్నె రేసుల నుంచి వైదొలిగాడు.
లండన్ ఒలింపిక్స్ స్టేడియానికి బోల్ట్
Published Fri, Jul 10 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement
Advertisement