మరో ఆటకు గుడ్‌బై చెప్పిన బౌల్ట్‌ | Usain Bolt Saying His Sports Life Is Over | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ కలలకు బౌల్ట్‌ గుడ్‌బై!

Published Thu, Jan 24 2019 8:16 AM | Last Updated on Thu, Jan 24 2019 8:16 AM

Usain Bolt Saying His Sports Life Is Over - Sakshi

కింగ్స్‌టన్‌(జమైకా): ఫ్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారాలన్న తన కలలకు స్ప్రింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ గుడ్‌ బై చెప్పాడు. ఈ పరుగుల రారాజు గతేడాది స్ప్రింట్‌ ఫీల్డ్‌ నుంచి రిటైర్‌ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారాలన్న తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సెంట్రల్‌ కోస్ట్‌ మెరైన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకొని అందులో చేరాడు. ఒకట్రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో గోల్స్‌ సైతం కొట్టాడు. అయితే, ఆ తర్వాత ఆ జట్టుతో ఒప్పందం రద్దవడం, యూరోపియన్‌ క్లబ్‌ల్లో చేరాలన్న ప్రయత్నం నెరవేరకపోవడంతో చివరికి ఫ్రొఫెనల్‌ పుట్‌బాల్‌ ఆటగాడిగా మారాలన్న తన కలలకు పుల్‌స్టాప్‌ పెట్టాడు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన బోల్ట్‌ త్వరలో తాను బిజనెస్‌లోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement