25 ఏళ్లకే ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ ఆటకు వీడ్కోలు పలికి టెన్నిస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ విషయాన్ని మరువక ముందే మరో ఆటగాడు కేవలం 23 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. మాంచెస్టర్ యునైటెడ్ గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న పాల్ వూల్‌స్టన్ తన అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్చపరిచాడు. 23 ఏళ్లకే తన ఇష్టమైన ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించాడు.
ఈ విషయాన్ని వూల్‌స్టన్ ట్విటర్ ద్వారా ప్రకటించి భావోద్వేగానికి గురయ్యాడు. ''23 ఏళ్లకే ఇలాంటిది రాస్తానని ఎప్పుడు ఊహించలేదు. కానీ ఫుట్‌బాల్‌లో నా చాప్టర్ ముగిసిపోయింది. గాయాలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం. కెరీర్‌లో సాధించిన విజయాలపై నేను గర్వంగా వెనక్కి తిరిగి చూసుకోలగను. కానీ భవిష్యత్తులో ఏం చూస్తాననే దానిపై విపరీతమైన ఆసక్తి ఉంది. కొత్త చాప్టర్ నాకోసం నిరీక్షిస్తోంది'' అంటూ రాసుకొచ్చాడు.
కాగా పాల్ ఊల్‌స్టన్ 2018లో మాంచెస్టర్ యునైటెడ్‌లో గోల్‌కీపర్‌గా జాయినయ్యాడు. అండర్-18 సమయంలో న్యూకాసిల్ యునైటెడ్‌కు ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శనతో అతనికి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి పిలుపు వచ్చింది.
చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు
Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్
Never thought I would have to write this at 23 but this chapter has had to come to an end.
— Paul Woolston (@PAULHW_) March 23, 2022
I can look back proudly on what I’ve achieved in my career but I am excited about what’s in store for the future.
A new chapter awaits 💥 pic.twitter.com/PbcVaepfMH
Comments
Please login to add a commentAdd a comment