ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్‌ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.
దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్‌పోస్ట్‌లోకి బంతి వెళ్లడంతో ఫుట్‌బాల్‌లో అత్యంత లాంగెస్ట్ గోల్‌గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్‌ను దాటుకొని అతని తలపై నుంచి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్‌గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది.
ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson
— TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023
Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS
చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో..
Comments
Please login to add a commentAdd a comment