guinnis record
-
వండర్బోయ్స్! ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..?
కనిపెట్టాలేగాని పిల్లల్లో వేయి రకాల టాలెంట్స్ఉంటాయి. వాటిని ప్రోత్సహిస్తే వారు వండర్బోయ్స్ అవుతారు. వండర్స్ సృష్టిస్తారు. ఇక్కడ ఉన్నపిల్లలు అలాంటి వారే. వారు చేసిన పని వారిని రికార్డ్ బుక్స్‌లో ఎక్కించింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా టాలెంట్‌ని ప్రదర్శిద్దామా?ఇక్కడ కనిపిస్తున్న చిరుత పేరు శరణ్ గొరజాల. వయసు ఒక సంవత్సరం 9 నెలల 28 రోజులు (ఏప్రిల్ 30, 2024– రికార్డు సాధించే సమయానికి). ఈ బుడతడు ఏం చేశాడో తెలుసా? ‘పరిగెత్తు’ అనగానే పరిగెత్తాడు. 50 మీటర్ల దూరాన్ని 28 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు ఇదే వయసు బుడతడు ఈ దూరాన్ని 29 సెకన్లలో పూర్తి చేస్తే మనవాడు ఒక సెకను ముందే పూర్తి చేసి రికార్డు సాధించాడు.‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. శరణ్ గొరజాలది చిత్తూరు జిల్లా. తండ్రి స్వరూప్, తల్లి ప్రియాంక. చిన్నప్పటి నుంచి బలే హుషారు. ఇంట్లో ఆడుకోమంటే పరిగెత్తడం నేర్చాడు. హాల్లో, వరండాలో, ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తడమే పని. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఏముంది... 50 మీటర్లు లాగించేశాడు. పెద్దయ్యి 100 మీటర్ల పరుగులో రికార్డు సాధించాలని కోరుకుందాం.ఈ గంభీర వదన మహానుభావుని పేరు గోకుల్ పోఖ్రాజ్ పథ్. వయసు 3 సంవత్సరాల 3 నెలలు. కాని మైండు నిండా సమాచారం... ఏదడిగితే అది టక్కున సమాధానం. వీడి మెమొరీ చూసి వీళ్లమ్మ కొన్ని సంగతులు నేర్పింది. వాటిని మర్చి΄ోతేనా? ఎప్పుడు అడిగినా చెబుతాడు. వీడి వయసు పిల్లలు చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా చెప్పమంటే మర్చి΄ోతారు. వీడు? శరీరంలో 33 భాగాల పేర్లు, 23 రకాల వాహనాలు, కంప్యూటర్లో ఉండే 19 రకాల పార్ట్‌ల పేర్లు, 12 పండుగలు, 17 పెంపుతు జంతువుల పేర్లు, 16 జలచరాల పేర్లు, 16 చారిత్రక స్థలాల పేర్లు, 8 మంచి అలవాట్లు, 6 నర్సరీ రైములు కాకుండా ఏబీసీడీలు అన్నీ వాటితో వచ్చే పదాలు చెబుతాడు. ఇంకా ఏమేమి చెబుతాడో మనకెందుకు... ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇతడి పేరు రాసి చల్లగా జారుకోక.హరియాణలోని ఝుజ్జర్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల కార్తికేయ జాఖర్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎవరి గైడెన్స్ లేకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్లను డెవలప్ చేసి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సం΄ాదించాడు. కార్తికేయ నాన్న రైతు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో బడి ΄ాఠాలు వినడమే కాదు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు కార్తికేయ. అలా అని కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరిమితం కాలేదు.‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ మూడు యాప్‌లను సొంతంగా డెవలప్ చేశాడు. అవి: 1.జనరల్ నాలెడ్జీ యాప్: లుసెంట్ జీకే2. కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్: రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్3. డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్: శ్రీరామ్ కార్తిక్.‘కార్తికేయలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రభుత్వ సహకారం ఉంటే మా అబ్బాయి మరెన్నో సాధించగలడు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కార్తికేయ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటున్నాడు కార్తికేయ తండ్రి అజిత్. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
రికార్డులను చుట్టూ తిప్పుకుంటున్న గాయని.. మూడేళ్లకే!
మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది. తన పాటలతో రికార్డులను తన వెంట తిప్పుకుంటోంది. ఒక కాన్సర్ట్‌లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన అద్భుత ఘనతను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్ అవుతోంది. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్‌లో జరిగిన COP 28 సమ్మిట్‌కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన విజయాన్ని షేర్ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు. 2018 జనవరిలో లాంగెస్ట్ లైవ్ సింగింగ్ కన్సర్డ్ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్ గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్‌లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది. 2005 ఆగస్టు17న కన్నూర్‌లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది. అన్నయ్య సుశాంత్ సతీష్ ఉన్నారు. 2 నెలల వయస్సులో దుబాయ్‌కి షిప్ట్. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది. నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్‌గా భావిస్తుందిసుచేత సతీష్. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్‌కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్‌కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్‌బుక్‌లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్‌లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్‌లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్‌లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్‌క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్‌ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
రొనాల్డో చరిత్ర.. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. పోర్చుగల్ తరపున రొనాల్డో 200వ మ్యాచ్ ఆడాడు. పురుషుల ఫుట్‌బాల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూరోకప్ 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా పోర్చుగల్ మంగళవారం అర్థరాత్రి ఐస్‌లాండ్‌తో తలపడింది. మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో నెగ్గింది. పోర్చుగల్ తరపున వచ్చిన ఏకైక గోల్ కూడా క్రిస్టియానో రొనాల్డోదే కావడం విశేషం. ఆట 89వ నిమిషంలో రొనాల్డో జట్టుకు గోల్ అందించాడు. ఇక రొనాల్డోకు ఇది 123వ అంతర్జాతీయ గోల్. 200వ మ్యాచ్ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. ''చాలా సంతోషంగా ఉంది. దేశం తరపున 200 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. నా కెరీర్లో ఇదొక గొప్ప ఘనతగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకచ్చాడు. కాగా యూరో 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్-జెలో ఉన్న పోర్చుగల్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నాలుగు విజయాలు అందుకొని టాపర్‌గా కొనసాగుతుంది. "I'm so happy. For me it's an unbelievable achievement" We spoke to Mr 200 @Cristiano Ronaldo... pic.twitter.com/LpaInwxHej — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 The historical scorer of the teams 🐐🇵🇹⚽️#CR7𓃵 #CR200#CristianoRonaldo pic.twitter.com/i0z0DHaTKA — عمر المدريدي ⓮㉟ (@omar14rmd) June 20, 2023 🙌🙌🙌#EURO2024 @selecaoportugal pic.twitter.com/JydpIv0BSE — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 చదవండి: మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది -
ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్
ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్‌ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్‌పోస్ట్‌లోకి బంతి వెళ్లడంతో ఫుట్‌బాల్‌లో అత్యంత లాంగెస్ట్ గోల్‌గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ను దాటుకొని అతని తలపై నుంచి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్‌గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది. ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS — TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. -
సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో గిన్నిస్ రికార్డు.. విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా
గుంటూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్, విజ్ఞాన్ యూనివర్సిటీ, కలెక్టివ్ పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అతిపెద్ద సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వారానికి సంబంధించింది) కార్యక్రమాన్ని నిర్వహించాయి. తానా ఫౌండేషన్ తరఫున ట్రస్టీ విద్యాధర్ గారపటి ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ అవగాహన కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించడం విశేషం. గతంలో 1919 మందితో సర్వైకల్ అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఇప్పుడు 4000 మంది పాల్గొనడంతో పాత గిన్నిస్ రికార్డు చెరిగిపోయింది. మార్చి 18న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వేదిక కావడం తెలుగువారికి గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోతోంది. 2030 నాటికి మరణాల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ కారణంగా మరణించేవారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళనకర విషయం. చదవండి: అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు -
‘టీ’ చేయటంలో గిన్నిస్ రికార్డ్.. మీరూ ప్రయత్నిస్తారా?
కేప్‌టౌన్: చాయ్ అంటే ఒక పానీయమే కాదు అది చాలా మంది జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉదయం లేవగానే కప్పు టీ లేకుండా ఉండటాన్ని ఊహించలేని స్థాయిలో దానికి ఆదరణ లభించింది. ఇంటికి ఎవరైనా బంధవులచ్చినప్పుడు ముందుగా టీ తాగుతారా? అని అడుగుతారు. క్షణాల్లోనే తీసుకొచ్చి ఇస్తుంటారు. అయితే.. అదే టీ చేసి గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఓ మహిళ చేసి చూపించారు. ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును తన పేరు లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్ ప్రాంతానికి చెందిన ఇంగర్ వలెంటైన్ అనే మహిళ ఈ ఫీట్‌ను సాధించారు. స్థానికంగా లభించే ‘రూయ్‌బోస్’ అనే టీని తయారు చేయటం ద్వారా తమ దేశ పర్యటక, ట్రావెల్ రంగాలను బలోపేతం చేయాలని భావించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఇంగర్ వలెంటైన్ మూడు రకాల రుచులు వెన్నిల, స్ట్రాబెర్రీ, ఒరిజినల్ టీని ఉపయోగించారు. రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక సైతం ఉంది. ఒకే టీ తయారీ పాత్ర ఉపయోగించాలి, కొన్ని కప్పులు వాడాలి. దీంతో ఆమె ఓ స్ట్రాటజీని వాడి.. ఈ ఫీట్‌ను పూర్తి చేశారు. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సైతం సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్‌కు అందించే వారు. ఇలా ఒక్క గంట సమయంలోనే 249 కప్పుల టీని తయారు చేయటమే కాదు.. దానిని విద్యార్థులు తాగేలా చేశారు. అంటే ఒక్క నిమిషానికి నాలుగు కప్పుల టీని తయారు చేసినట్లన్నమాట. Here's what you missed on the latest episode of Stumbo Record Breakers 👇@stumbopopssa @etv https://t.co/SnOAnSHa1E — Guinness World Records (@GWR) October 18, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
20 కార్లు.. 13 సెకన్లు.. ఏడేళ్ల చిన్నారి ‘గిన్నిస్’ రికార్డ్
ముంబై: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు ఈ చిన్నారి సరిగ్గా సరిపోతుంది. చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆమెనే మహారాష్ట్ర, పుణెకు చెందిన ఏడేళ్ల చిన్నారి దేశ్నా ఆదిత్య నాహర్. లింబో స్కేటింగ్‌లో 20 కార్ల కింద నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 193 అడుగుల దూరాన్ని చేరుకునేందుకు 13.74 సెకన్ల సమయం మాత్రమే తీసుకుని అబ్బుర పరిచింది ఈ పాప. గతంలో చైనాకు చెందిన 14 ఏళ్ల బాలిక పేరున ఉన్న 14.15 సెకన్ల రికార్డును తిరగరాసింది. లింబో స్కేటింగ్‌ను రోలర్ లింబోగా కూడా పిలుస్తారు. అడ్డంగా పెట్టిన పోల్ వంటి ఏదైనా వస్తువు కింద నుంచి రోలర్ స్కేటింగ్ చేసే ఈ ఆటకు చాలా గుర్తింపు ఉంది. 20 కార్ల కింద నుంచి వేగంగా వెళ్తున్న చిన్నారి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఏప్రిల్ 16న మహారాష్ట్ర, పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య నాహర్ కేవలం 13.74 సెకన్లలోనే 20 కార్ల కింద నుంచి లింబో స్కేట్ నిర్వహించింది. ఈ రికార్డ్ సాధించేందుకు దిశ్నా సుమారు ఏడాదిన్నరపాటు సాధన చేసింది.’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఖాతాలో రాసుకొచ్చింది. That's seven-year-old Deshna Nahar from #Pune #India. She has registered her name in the Guinness Book of records in 'Limbo Skating' Proud of you #DeshnaNahar pic.twitter.com/8gXoeWyQN7 — Amai K (@ItsAmaiKroos) July 29, 2022 మరోవైపు.. దుబాయ్‌లోని భారత యోగా టీచర్ సుమారు 30 నిమిషాల పాటు ఒకే యోగా పోజ్‌లో ఉండి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆ వీడియోను యాష్ మాన్సుఖ్భాయ్ మొరాదియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తేలు ఆకారంలో యోగాసనం వేశారు మొరాదియా. 21 ఏళ్ల యోగా టీచర్ 29 నిమిషాల 4 సెకన్ల పాటు ఆ యోగాసనంలో ఉండి.. గతంలోని 4 నిమిషాల 47 సెకన్ల రికార్డును తిరగరాశారు. ఇదీ చదవండి: ఎవరెస్ట్ ఎక్కిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... గిన్నిస్ రికార్డు తండ్రికి అంకితం -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే!
ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్‌లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
వాటే ఫీట్.. నిముషాలే కష్టం అలాంటిది ఏకంగా 9 గంటల ప్లాంక్!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ అందరి దృష్టి ఫిట్‌నెట్ మీద పడింది. కొందరు పోషకాహారంతో ఇమ్యునిటీ పెంచుకుంటుంటే, ఇంకొందరేమో శారీరక కసరత్తులతో ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తున్నారు. ఎవరి పందా వారిది. అయితే తాజాగా ఓ వ్యక్తి అందుకు భిన్నంగా ఆలోచించి ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టాడు. అసలేంచేశాడంటే.. సాధారణంగా ఏవరైనా కొన్ని నిముషాలపాటు మాత్రమే ప్లాంక్ పొజిషన్లో ఉండగలరు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ మాత్రం ఏకంగా 9 గంటల 30 నిముషాల ఒక సెకను పాటు ప్లాంక్ పొజిషన్లో ఉండి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించాడు. గతంలో 8 గంటల 15 నిముషాల 15 సెకన్లపాటు నమోదైన రికార్డును తాజాగా స్కాలీ క్రాక్ చేసినట్టు గిన్నీస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెల్లడించింది. ఆగస్టు 6, 2021న ఈ రికార్డు నమోదైనట్టు తెల్పింది. నిజానికి స్కాలీకి కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (సీఆర్పీఎస్) ఉన్నందువల్ల, అతని ఎడమ చేతికి శాశ్వతంగా నొప్పి తెలియదని, దీంతో అతను సాధించగలిగాడని కూడా తెల్పింది. కాగా సీఆర్పీఎస్పై అవగాహన కల్పించేందుకు ఈ రికార్డు సాధించానని డానియల్ స్కాలీ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ ఈ వీడియోని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. -
ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!
ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 44 ఏళ్ల బ్రిటీష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ. కరోనా వైరస్ ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న చిన్నారులకు ఏదోరకంగా సాయం చేయాలనుకున్న జాఫ్రీ తనకు తెలిసిన విద్యతో కోట్లు సంపాదించి సామాజిక సేవచేస్తున్నాడు. గత ఏడాది కరోనా కాలంలో జాఫ్రీ వేసిన ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పెయింటింగ్ తాజాగా దుబాయ్‌లో జరిగిన వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మన రూపాయలలో దీని విలువ రూ.450 కోట్లకుపై మాటే. జాఫ్రీ ఈ మొత్తాన్నీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు.జాఫ్రీ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌ను 70 భాగాలుగా వేసాడు. ఈ భాగాలను విడివిడిగా విక్రయించి 30 మిలియన్ డాలర్లను కూడబెట్టి చిన్నారులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఫ్రెంచ్ క్రిఫ్టో కరెన్సీ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్ మొత్తం పెయింటింగ్‌కు రెట్టింపు డబ్బులు ఇస్తాననడంతో పెయింటింగ్ రూ.450 కోట్లకు విక్రయించాడు. జాఫ్రీ ఈ మొత్తాన్నీ దుబాయ్ కేర్స్, యూనిసెఫ్, యునెస్కో, గ్లోబల్ గిఫ్ట్ట్ ఫౌండేషన్ వంటి సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు. కరోనా కాలంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. తినడానకి తిండిలేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది చిన్నారులు నానా అవస్థలు పడడం చూసి చలించిన జాఫ్రీ వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే పెద్ద పెయింటింగ్ వేసి కనీసం 30 మిలియన్ డాలర్లు సంపాదించి చిన్నారులకు విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. అతిపెద్ద పెయింటింగ్ వేసేందుకు చిన్నారుల నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుని..‘‘కరోనా కాలంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే విధంగా ఆర్ట్ వర్క్స్‌ను నాకు పంపండి’’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులను జాఫ్రీ కోరాడు. జాఫ్రీ సందేశానికి స్పందించిన 140 దేశాల్లోని చిన్నారులు ఆన్లైన్ ద్వారా తమ ఆర్ట్‌వర్క్‌ను పంపించారు. అప్పుడు దుబాయ్‌లోని అట్లాంటిస్ హోమ్ హోటల్లో జాఫ్రీ సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20గంటలపాటు కష్టపడి చిన్నారులు పంపిన చిత్రాలను జతచేస్తూ గతేడాది సెప్టెంబరులో పెయింటింగ్‌ను పూర్తిచేశాడు. 17 వేల చదరపు అడుగుల ‘జర్నీ ఆఫ్ హ్యూమానిటీ’ పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించడం తో ఈపెయింటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌గా నిలిచింది. ఇది నాలుగు ఎన్బీఏ బాస్కెట్ బాల్ కోర్టుల పరిమాణానికి సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌ను దక్కించుకున్న అబ్దున్ మాట్లాడుతూ..‘‘నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి తిండిలేనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎన్నోసార్లు ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పెయింటింగ్ విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో మంది చిన్నారుల ఆకలి తీరుస్తాయి. అందుకే రెట్టింపు ధరతో పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. -
3 రోజుల్లో లోకం చుట్టిన వనిత
నవంబర్ 18, 2020 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ వారు 3 రోజుల 14 గంటల్లో (87 గంటలు) 7 ఖండాలు చుట్టిన వనితగా అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్ ఖాలా అల్రొమైతీని ప్రకటించారు. ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఘనత సాధించింది. గతంలో అమెరికన్ నటి జూలీ బెర్రీ 92 గంటల్లో ఈ రికార్డ్ సాధించారు. ‘మా దేశం చిన్నదే కావచ్చు. కాని మేం కూడా రికార్డులు సాధించగలమని నిరూపించడానికే ఈ ప్రయాణం కట్టాను’ అంటున్నారు డాక్టర్ ఖాలా. ‘లోకం చుట్టిన వీరుడు’ అని సినిమా ఉంది. ఎం.జి.ఆర్ హీరో. ‘లోకం చుట్టిన వీరురాలు’ అని ఎవరూ సినిమా తీయలేదు. ఎందుకంటే లోకం చుట్టే పని పురుషుడిది అని లోకం అభిప్రాయం. సాహసయాత్రలు చేసిన సింద్బాద్, గలీవర్లు పురుషులే. కాని స్త్రీలు చేసిన సాహసప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే వెలికి తీసి గ్రంథస్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే అతి తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డు (ఏడు ఖండాలను తాకిన) ఒక వనితకు సొంతం కావడం. ఆ వనిత పేరు డాక్టర్ ఖాలా అల్‌రొమైతీ. యు.ఏ.ఇ దేశస్తురాలు. ఆమె ఫిబ్రవరిలో దాదాపు కరోనా దుమారం మొదలవుతున్న సమయంలో ఈ రికార్డు సాధించి తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కింది. నవంబర్ 18, 2020న ఆమె రికార్డును అధికారికంగా ప్రకటించారు. 3 రోజుల 14 గంటలు స్త్రీలను నాలుగు గోడల మధ్య ఉంచే పురుష సమాజం ఇది. ఇక ఇస్లామీయ సమాజాలలో వారికి స్వేచ్ఛ ఉండదనే ప్రచారం ఉంటుంది. కాని అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ ఖాలా ఈ లోకాన్ని చుట్టిన వనితగా రికార్డ్ సాధించాలనుకున్నారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ కరోనా సంగతి తెలియని రోజుల్లోనే 2020 సంవత్సరానికి ‘డిస్కవర్ యువర్ వరల్డ్’ అనే థీమ్ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు. ఇక మా దేశంలో అన్ని దేశాల పౌరులు నివసిస్తారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఏ దేశం వారినైనా మీరు చూడొచ్చు. వారందరూ రావడం వల్లే మా దేశం ఎంతో కళకళలాడుతుంది. అందుకని వారికి కృతజ్ఞతగా కూడా వారున్న దేశాలను, ఖండాలను చుట్టి రావాలని అనుకున్నారు’ అంటారు డాక్టర్ ఖాలా. ఫిబ్రవరిలో మొదలైన ఆమె ప్రయాణం ఫిబ్రవరి 13, 2020న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ముగిసింది. అంటే అంతకు నాలుగు రోజుల ముందు ఆమె దుబాయ్ నుంచి బయలుదేరిందన్న మాట. ఏడు ఖండాలను తాకి ఆస్ట్రేలియాలో యాత్ర ముగించడానికి ఆమె తీసుకున్న సమయం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లు. ఇంతకు ముందు ఉన్న రికార్డు ఏడు ఖండాలను అత్యంత తక్కువ టైమ్‌లో చుట్టి రావాలని ఇంతకు ముందు అనుకున్నది కూడా ఒక స్త్రీనే. ఆమె పేరు జూలీ బెర్రీ. అమెరికన్ నటి. ఆమె తన స్నేహితుడు కేసె స్టివార్ట్తో కలిసి ‘72 గంటల్లో 7 ఖండాలు’ అనే రికార్డు యాత్ర చేసింది. 13 డిసెంబర్ 2017న సిడ్నీలో మొదలుపెట్టి డిసెంబర్ 16న చిలీలో తన యాత్ర ముగించింది. అయితే ఆమె ఆశించినట్టుగా 72 గంటల్లో కాక యాత్ర 92 గంటల్లో ముగిసింది. అయినప్పటికీ అది అత్యంత తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డుగా గిన్నిస్ బుక్‌లో నమోదైంది. ఈ యాత్రలో జూలీ ఆమె మిత్రుడు దాదాపు 48 గంటలు అసలు నిద్ర లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ టెన్ టు సిక్స్ చేసే పని పట్ల విసుగు ఉండటం వల్లే ఈ యాత్ర చేసి విజయవంతం అయ్యారు. నా కుటుంబం తోడు నిలిచింది ‘యాత్ర మొదలెట్టానన్న మాటే కాని మధ్యలో చాలాసార్లు అనుకున్నాను ఆగి వెనక్కి వెళ్లిపోదామా అని. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. ఎయిర్‌పోర్టుల్లో ఫ్లయిట్లను పట్టుకోవడం అంత సులభం కాదు. కాని నా కుటుంబం నాకు అన్ని విధాలుగా సహకరించి యాత్ర పూర్తి చేసేలా చూసింది’ అన్నారు డాక్టర్ ఖాలా. ‘మాది చిన్న దేశమే అయినా రికార్డ్ సృష్టించిన విశేషాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తయిన భవనం మా దేశంలో ఉంది. లార్జెస్ట్ హైడెఫినేషన్ వీడియో వాల్ మా దేశంలో ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే పోలీస్ కార్ కూడా మాకే సొంతం. మా దేశ అధ్యక్షుడు, ప్రధాని.. ఇద్దరూ తమ పౌరులను గొప్ప పనులు చేయమని ప్రోత్సహిస్తుంటారు. మహిళల ముందంజకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వారిని చూసి కూడా నేను స్ఫూర్తి పొందాను’ అంటారు డాక్టర్ ఖాలా. ఖాలా వివాహిత. పిల్లల తల్లి. అయినప్పటికీ ఆమె ఈ అరుదైన రికార్డు కోసం సంకల్పం తీసుకున్నారు. ‘నా సాఫల్యం నా దేశానికి, నా సమాజానికి అంకితం ఇస్తున్నాను. నన్ను చూసి కలలు కనవచ్చని వాటిని సాఫల్యం చేసుకోవచ్చని ఎవరైనా స్ఫూర్తి పొందితే అంతే చాలు’ అన్నారు ఖాలా. పత్రికలు ఈ రికార్డు అనౌన్స్ అయ్యాక ఖాలాను మెచ్చుకుంటూ కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘ఆమె లోకం చుట్టింది. మనం ఇంకా పక్క మీద నుంచి లేవడానికే తాత్సారం చేస్తున్నాం’ అని హెడ్డింగ్ పెట్టింది. కదలడం జీవ లక్షణం. ఈ కరోనా తర్వాత ఎంత వీలైతే అంత లోకం చుడదామనుకునేవారు తప్పక ఖాలా వంటి మహిళలను చూసి స్ఫూర్తి పొందుతారు. – సాక్షి ఫ్యామిలీ -
ఈ బాస్కెట్‌బాల్ రన్నింగ్ చూసి తీరాల్సిందే
బాస్కెట్‌బాల్‌తో ఆడడం అందరికి రాదు. మంచి శారీరక శ్రమతో కూడుకున్న ఈ గేమ్‌ను అత్యంత నైపుణ్యంతో ఆడితేనే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలము. అలాంటిది దుబాయ్‌కు చెందిన అజ్మత్ ఖాన్ అనే అథ్లెట్ బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ రోడ్డుపై వేగంగా పరిగెత్తాడు. కేవలం 6 నిమిషాల 1 సెకన్లపాటు ఆడి ఈ ఘనత సాధించాడు. పరిగెత్తుతూ బంతిని డ్రిబ్లింగ్ చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో ట్రైనింగ్ అవసరం. అలాంటిది రోడ్డు మీద పరిగెడుతూ ఆడటం అనేది గొప్ప విషయం. అందుకే అజ్మత్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. (చదవండి : లవర్ కోసం తనను తాను అమ్మకానికి) ఖాన్ ఇలాంటి ఘనత సాధించడం మొదటిసారి కాదు. 2019 మార్చిలో 44 నిమిషాల 19 సెకండ్ల సమయంతో 10 కి.మీ. పరుగును వేగంగా పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకున్నారు. రికార్డు లిస్టింగ్ యుఎఇ పేజీ అథ్లెట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా అజ్మత్ఖాన్తోపాటు ఒక టైమ్ కీపర్ కూడా పరిగెత్తాడు. .ఈ రికార్డులను సాధించడానికి తాను ఎంతగానో కృషి చేస్తానని ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram * تعرفوا على عزمت خان من الباكستان الذي نجح بكسر الرقم القياسي لأسرع وقت لقطع ميل أثناء تنطيط كرة السلة خلال 6 دقائق وثانية. تمت المحاولة الناجحة في إمارة دبي في الإمارات العربية المتحدة خلال شهر يونيو من هذا العام. ليس من الجديد على عزمت كسر الأرقام القياسية فهو أيضاً يحمل الرقم القياسي لأسرع وقت لقطع 10 كم أثناء تنطيط كرة السلة حيث قام بإكمال المسافة خلال 44 دقيقة خلال 16 ثانية في شهر مارس من العام الماضي في إمارة دبي أيضاً. 🌟 @azmat_athlete Meet Azmat Khan from Pakistan who recently broke the record for the fastest mile dribbling a basketball in 6 minutes and one second in Dubai, UAE. Azmat is not new to record breaking achievements. He managed last year to break the record for the fastest 10 km dribbling a basketball in 44 minutes and 19 seconds. _______________________ #GUINNESSWORLDRECORDS #GWR #OFFICIALLYAMAZING #run #running #runner #fitness #runners #instarunners #training #sport #motivation #workout #fit #غينيس_للأرقام_القياسية #أرقام_قياسية #رياضة #تمارين A post shared by Guinness World Records Arabia (@gwrarabia) on Sep 28, 2020 at 4:57am PDT -
గిన్నిస్ నృత్యం
కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంత మహిళలు సంప్రదాయ నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించారు. నపోరా పండుగ సందర్భంగా 299 మంది మహిళలు లడఖ్ సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా షాండోల్ నృత్యం చేశారు. దీంతో అత్యధిక మంది ప్రజలు ఓ చోట గుమిగూడి షాండోల్ నృత్యం చేసినట్లు గిన్నిస్ ప్రతినిధి సర్టిఫికెట్ ఇచ్చారు. బౌద్ధ పండితుడు, సన్యాసి నపోరా బోధనలు, జీవిత విశేషాలను సంప్రదాయ నృత్యంలో ప్రదర్శిస్తారు. -
ఏమోయ్.. సరదాగా పార్కుకు వెళ్దామా..
వెళ్దాం.. వెళ్దాం.. ఆ వెళ్లేదేదో.. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్న మిల్ ఎండ్స్ పార్కుకు వెళ్దాం.. ఆ రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు.. పచ్చిక చూసి.. అదే పార్కు అనుకుంటున్నారా.. కాదండీ.. ఎక్కడుందబ్బా అని దిక్కులు చూడకండి.. అదిగో సరిగ్గా రోడ్డు మధ్యన ఆ.. అదే.. అరే.. కరెక్టుగా గుర్తుపట్టేశారే.. అదిగో ఆ రోడ్డుకు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌లా కనిపిస్తున్నదే మిల్ ఎండ్స్ పార్కు! ఏమిటి.. ఈ తొక్కలో మొక్కా అని గట్టిగా అనమాకండి.. ఎందుకంటే.. మొక్కే కదా అని పీకేస్తే.. పీక తెగ్గోసే రకాలు అక్కడ.. ఎందుకంటే.. పోర్ట్‌ల్యాండ్ వాసులకు ఈ పార్కు అంటే ఎంతో ప్రీతి.. చాన్స్ దొరికినప్పుడల్లా ఇక్కడ పండగల్లాంటివి చేసేసుకుంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పార్కు మా సొంతం అని కాలరెగరేస్తుంటారు. సాక్ష్యంగా గిన్నిస్ వాళ్లు ఇచ్చిన రికార్డు ప్రతిని కూడా చూపిస్తారు. అంతేనా.. ఈ పార్కు ఎలా ఏర్పడిందన్న విషయాన్ని కూడా మనకు పూసగుచ్చినట్లు వివరిస్తారు.. మరి మనం పూస గుచ్చకుండానే ఆ కథను వినేద్దామా.. అనగనగా.. కొన్నాళ్ల క్రితం.. అంటే 1940ల్లో.. ఇక్కడ కరెంటు స్తంభం పాతడానికి గొయ్యి తవ్వారు. కరెంటు స్తంభమైతే రాలేదు గానీ.. గొయ్యి మిగిలిపోయింది. దీంతో స్థానిక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే డిక్ఫగాన్ అనే ఆయన ఈ గొయ్యిలో పూల మొక్క నాటాడు. వాళ్ల ఆఫీసు దీని ఎదురుగానే ఉండేది. ఆయన మిల్ ఎండ్స్ పేరిట సదరు పత్రికలో తన అనుభవాలను కథలు కథలుగా రాసేవాడు. దీన్ని ప్రపంచంలోనే అతి చిన్నపార్కుగా పేర్కొంటూ.. ఈ పార్కు దాని చుట్టూ నివసించే జనం గురించి తన కాలమ్‌లో ఊహాజనిత కథనాలు రాసేవాడు. తాను ఓ సారి ఓ దేవతను తనకో పార్కు కావాలని కోరానని.. అయితే.. దాని సైజు చెప్పకపోవడంతో ఆ దేవత తనకీ చిన్న పార్కును ప్రసాదించిందని.. ఇలా ఉండేవి అతడి కథనాలు. 1969లో ఫగాన్ చనిపోయాడు. 1976లో స్థానిక అధికార యంత్రాంగం దీన్ని సిటీ పార్కుగా ప్రకటించింది. తదనంతర కాలంలో ఈ పార్కు పేరు మీద ఉత్సవాలు కూడా జరిగాయి. కొంతమంది చిన్నచిన్న బొమ్మలతో దీన్ని అలంకరించడం.. ఒక మొక్క ఎండిపోతే.. మరొకటి నాటడం వంటివి చేసేవారు. పార్కులోని మొక్కల పేర్లు మారాయి గానీ.. అతి చిన్న పార్కుగా మిల్ ఎండ్స్ పేరు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కథ కంచికి.. మనం ఇంటికి.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
112 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే
టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాకా మంగళవారం ప్రపంచ రికార్డుకెక్కారు. జూలై 25, 1905న జపాన్‌లోని హొక్కాయ్డోలో జన్మించిన మసాజో నూటపన్నెండేళ్ల వయస్సులో ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మసాజో ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన ఎక్కువగా స్వీట్లు తినడానికి ఇష్టపడతారని, వేడి నీళ్ల స్నానం అంటే ఆయనకు మక్కువని వారు తెలిపారు. ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రతి రోజూ దినపత్రిక చదువుతారని వెల్లడించారు. స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో న్యూజెన్ ఒలివెరా పేరు మీద ఉన్న ప్రపంచరికార్డు ఆయన మరణానంతరం మసాజోకు దక్కింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వయో వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ పేరు గాంచింది. తమ దేశంలో దాదాపు 68000 శతాధిక వృద్ధులు జీవిస్తున్నారని జపాన్ ప్రభుత్వం గతంలో వెల్లడించింది. -
గిన్నిస్ రికార్డు చేరువలో గురుకుల విద్యార్థులు
అనంతపురం రూరల్ : గురుకులాలకు చెందిన విద్యార్థులు గిన్నిస్ రికార్డు కోసం చేసిన ప్రయత్నం ఫలిస్తుందని గురుకుల విద్యా సంస్థల కో ఆర్డినేటర్ ఉషారాణి అన్నారు. తిరుపతిలో జరిగిన గురుకుల విద్యార్థుల నాట్య విశేషాలను ఆమె ఆదివారం తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను చాటడానికి రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి వేదికగా 125 పాఠశాలల నుంచి దాదాపు 3,150 మంది విద్యార్థులు పోటీపడగా, జిల్లా తరుపున కురుకుంట అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత నాట్యంతో ఆకట్టుకున్నారని ప్రశసించారు. డాన్స్‌మాస్టర్ మక్బుల్ శిక్షణలో విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు. -
గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'
-
గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఎన్నో రోజులుగా అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఫలించింది. వరుణుడు కొద్ది సేపు బయపెట్టి తెలంగాణ ఆడబిడ్డల చేతిలో రికార్డ్‌ను అందించాడు. వర్షం కారణంగా తీవ్ర ఒత్తిడి గురైన పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ అధికారులు వర్షం తగ్గుముఖం పట్టే సరికి ఊపిరి పీల్చుకున్నారు. చివరికి పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దిగ్విజయం గిన్నిస్ రికార్డ్ సాధించామని ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, ఒలింపిక్స్ రజక పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో చీరకట్టుతో విచ్చేసిన విదేశీ వనితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంత్రం 5.12 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలనకు జయసింహ(హైదరాబాద్), కుమరన్(బెంగుళూరు), బెల్ది శ్రీధర్, బెల్ది కార్తీక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌కు విజిల్ ప్రకటించారు. బతుకమ్మ చుట్టూ ఉన్న మహిళలు ఒక్కసారిగా నృత్యం ప్రారంభించారు. తిరిగి సాయంత్రం 5.25 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలకు జయసింహ రికార్డ్ పూర్తి అయిందంటూ విజిల్ మోగించారు. మొత్తం ఎల్బీ స్టేడియంలో 10,029 మంది మహిళలు ఉండగా బతుకమ్మ చుట్టూ 9,292 మంది మహిళలు చేరి మహా బతుకమ్మ నృత్యంలో పాల్గొన్నారు. కేరళలో ఓనం పండుగకు 5,211 మంది మహిళలు ఒకేసారి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. దాన్ని ఇప్పుడు తెలంగాణ ఆడ బిడ్డలు అధిగమించారు. ఎల్బీ స్టేడియంలో రంగురంగుల పూలతో 20 అడుగుల ఎత్తైన మహా బతుకమ్మను అలంకరించారు. 35 వరుసల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ సందడి వాతావరణం నెలకొల్పారు. బతుకమ్మ పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది. -
మళ్లీ మొదలైన బతుకమ్మ గిన్నిస్ సంరంభం!
-
మళ్లీ మొదలైన బతుకమ్మ గిన్నిస్ సంరంభం!
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేందుకు సన్నద్ధమవుతుండగా.. కాసేపు వరుణుడు అడ్డుపడ్డాడు. భారీగా వర్షం కురువడంతో ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన మహా బతుకమ్మ వేడుకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం వెలియడంతో మళ్లీ బతుకమ్మ సందడి మొదలైంది. ఎల్బీ స్టేడియంలో శనివారం మహా బతుకమ్మ వేడుక కోసం ప్రభుత్వం సకల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా పదివేల మందితో బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల ఎత్తుతో మహా బతుకమ్మను తీర్చిదిద్దారు. 35 వరుసల్లో పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడేలా వీలు కల్పించారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగులో పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. మైదానం నిండా సందడి వాతావరణం నెలకొంది. ’బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో’ అంటూ భక్తిపారవశ్యంతో పాటలు పాడుతూ.. చూడముచ్చటగా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. తీరొక్క పూల బతుకమ్మలతో పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడుతోంది. -
బతుకమ్మ గిన్నిస్ రికార్డుకు అనూహ్య ఆటంకం!
-
చూడకుండా చెప్పేశాడు
కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన అధ్యాపకుడు పి.అరవింద్ బైనరీ అంకెలను గుర్తుపెట్టుకుని చెప్పి, గిన్నిస్ రికార్డు సాధించాడు. కేవలం ఒక్క నిమిషంలోనే 270 బైనరీ అంకెలను గుర్తుపెట్టుకుని, వాటిని వరుసగా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రస్తుతం ఇటలీలో టూరిస్టు గైడ్‌గా పనిచేస్తోన్న ఈయన.. ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీసు భాషలు మాట్లాడగలరు. త్వరలో విద్యార్థుల కోసం మెమరీ క్లబ్‌ను ప్రారంభిస్తానని ఈ సందర్భంగా అరవింద్ చెప్పారు. భారత్‌కు తిరిగి వచ్చి జ్ఞాపకశక్తికి సంబంధించి రికార్డులపై పరిశోధన చేస్తానని తెలిపారు.