కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ అందరి దృష్టి ఫిట్‌నెట్ మీద పడింది. కొందరు పోషకాహారంతో ఇమ్యునిటీ పెంచుకుంటుంటే, ఇంకొందరేమో శారీరక కసరత్తులతో ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఎవరి పందా వారిది. అయితే తాజాగా ఓ వ్యక్తి అందుకు భిన్నంగా ఆలోచించి ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టాడు. అసలేంచేశాడంటే..
సాధారణంగా ఏవరైనా కొన్ని నిముషాలపాటు మాత్రమే ప్లాంక్ పొజిషన్‌లో ఉండగలరు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ మాత్రం ఏకంగా 9 గంటల 30 నిముషాల ఒక సెకను పాటు ప్లాంక్ పొజిషన్‌లో ఉండి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించాడు. గతంలో 8 గంటల 15 నిముషాల 15 సెకన్లపాటు నమోదైన రికార్డును తాజాగా స్కాలీ క్రాక్ చేసినట్టు గిన్నీస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెల్లడించింది. ఆగస్టు 6, 2021న ఈ రికార్డు నమోదైనట్టు తెల్పింది.
నిజానికి స్కాలీకి కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (సీఆర్‌పీఎస్) ఉన్నందువల్ల, అతని ఎడమ చేతికి శాశ్వతంగా నొప్పి తెలియదని, దీంతో అతను సాధించగలిగాడని కూడా తెల్పింది. కాగా సీఆర్‌పీఎస్‌పై అవగాహన కల్పించేందుకు ఈ రికార్డు సాధించానని డానియల్ స్కాలీ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ ఈ వీడియోని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment