Plank off competition
-
వాటే ఫీట్.. నిముషాలే కష్టం అలాంటిది ఏకంగా 9 గంటల ప్లాంక్!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ అందరి దృష్టి ఫిట్‌నెట్ మీద పడింది. కొందరు పోషకాహారంతో ఇమ్యునిటీ పెంచుకుంటుంటే, ఇంకొందరేమో శారీరక కసరత్తులతో ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తున్నారు. ఎవరి పందా వారిది. అయితే తాజాగా ఓ వ్యక్తి అందుకు భిన్నంగా ఆలోచించి ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టాడు. అసలేంచేశాడంటే.. సాధారణంగా ఏవరైనా కొన్ని నిముషాలపాటు మాత్రమే ప్లాంక్ పొజిషన్లో ఉండగలరు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ మాత్రం ఏకంగా 9 గంటల 30 నిముషాల ఒక సెకను పాటు ప్లాంక్ పొజిషన్లో ఉండి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించాడు. గతంలో 8 గంటల 15 నిముషాల 15 సెకన్లపాటు నమోదైన రికార్డును తాజాగా స్కాలీ క్రాక్ చేసినట్టు గిన్నీస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెల్లడించింది. ఆగస్టు 6, 2021న ఈ రికార్డు నమోదైనట్టు తెల్పింది. నిజానికి స్కాలీకి కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (సీఆర్పీఎస్) ఉన్నందువల్ల, అతని ఎడమ చేతికి శాశ్వతంగా నొప్పి తెలియదని, దీంతో అతను సాధించగలిగాడని కూడా తెల్పింది. కాగా సీఆర్పీఎస్పై అవగాహన కల్పించేందుకు ఈ రికార్డు సాధించానని డానియల్ స్కాలీ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ ఈ వీడియోని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. -
హీరో చాలెంజ్‌కు సై అన్న సన్నీ లియోన్!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఈ మధ్య ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తోటి నటులతో ఉత్సాహంగా చర్చలు కూడా జరుపుతోంది. తాజాగా హోరో-నిర్మాత ఉదయ్ చోప్రాతో వ్యాయామల గురించి ఈ అమ్మడు చర్చించింది. ఈ సందర్భంగా ఉదయ్ సన్నీకి ఓ సవాల్ విసిరాడు. తాను జిమ్‌లో ప్లాంకింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేస్తున్న ఫొటోలు పోస్టుచేసి.. నువ్వు కూడా ఇలా చేయగలవా అంటూ చాలెంజ్ చేశాడు. అంతకుముందు సన్నీ తన జిమ్ ట్రైనర్ ప్రశాంత్ తో ప్లాంక్ ఎక్స్‌ర్‌సైజ్‌ల గురించి చర్చించింది. 'ధూమ్-3' స్టార్ ఉదయ్ చోప్రా విసిరిన సవాల్‌ను సై అంటూ స్వీకరించిన సన్నీ.. అతి కష్టమైన ప్లాంక్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తూ.. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ' ప్రశాంతతో కలిసి అతి కష్టమైన ప్లాంక్ ఎక్సర్సైజ్ ఒక నిమిషం పాటు చేశాను. దీనిని ప్రాక్టిస్ చేసేటప్పుడు ఫామ్ అనేది ముఖ్యం. మీరు మాత్రం ఇది ట్రై చేసి గాయాలపాలవ్వకండి. దీనిని చేయడం ఎంత కష్టమో రెండో ఫొటోలో చూడొచ్చు' అని పేర్కొంది. దీంతో ఇటు హీరో ఉదయ్ చోప్రా, అటు జిమ్ ట్రైనర్ ప్రశాంత్ సన్నీ లియోన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాకుండా జిమ్‌లో ఓ రోజు ఇద్దరం కలిసి ప్లాంక్ ఎక్సర్సైజ్ పోటీ పెట్టుకుందామంటూ ఉదయ్.. సన్నీకి సూచించాడు. దీనికి సన్నీ స్పందిస్తూ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ పోటీ పెట్టుకుందామని, అయితే తనకు గెలుస్తానన్న నమ్మకం మాత్రం లేదని చెప్పుకొచ్చింది. రెండు మోచేతులు నేలపై ఆనించి బెలూన్‌పై బస్కీలు తీయడాన్ని ప్లాంక్ ఎక్సర్సైజ్ అంటారు.