కనిపెట్టాలేగాని పిల్లల్లో వేయి రకాల టాలెంట్స్‌ఉంటాయి. వాటిని ప్రోత్సహిస్తే వారు వండర్‌బోయ్స్ అవుతారు. వండర్స్ సృష్టిస్తారు. ఇక్కడ ఉన్నపిల్లలు అలాంటి వారే. వారు చేసిన పని వారిని రికార్డ్ బుక్స్‌లో ఎక్కించింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా టాలెంట్‌ని ప్రదర్శిద్దామా?
ఇక్కడ కనిపిస్తున్న చిరుత పేరు శరణ్ గొరజాల. వయసు ఒక సంవత్సరం 9 నెలల 28 రోజులు (ఏప్రిల్ 30, 2024– రికార్డు సాధించే సమయానికి). ఈ బుడతడు ఏం చేశాడో తెలుసా? ‘పరిగెత్తు’ అనగానే పరిగెత్తాడు. 50 మీటర్ల దూరాన్ని 28 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు ఇదే వయసు బుడతడు ఈ దూరాన్ని 29 సెకన్లలో పూర్తి చేస్తే మనవాడు ఒక సెకను ముందే పూర్తి చేసి రికార్డు సాధించాడు.
‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. శరణ్ గొరజాలది చిత్తూరు జిల్లా. తండ్రి స్వరూప్, తల్లి ప్రియాంక. చిన్నప్పటి నుంచి బలే హుషారు. ఇంట్లో ఆడుకోమంటే పరిగెత్తడం నేర్చాడు. హాల్లో, వరండాలో, ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తడమే పని. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఏముంది... 50 మీటర్లు లాగించేశాడు. పెద్దయ్యి 100 మీటర్ల పరుగులో రికార్డు సాధించాలని కోరుకుందాం.
ఈ గంభీర వదన మహానుభావుని పేరు గోకుల్ పోఖ్‌రాజ్ పథ్. వయసు 3 సంవత్సరాల 3 నెలలు. కాని మైండు నిండా సమాచారం... ఏదడిగితే అది టక్కున సమాధానం. వీడి మెమొరీ చూసి వీళ్లమ్మ కొన్ని సంగతులు నేర్పింది. వాటిని మర్చి΄ోతేనా? ఎప్పుడు అడిగినా చెబుతాడు. వీడి వయసు పిల్లలు చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా చెప్పమంటే మర్చి΄ోతారు. వీడు? శరీరంలో 33 భాగాల పేర్లు, 23 రకాల వాహనాలు, కంప్యూటర్‌లో ఉండే 19 రకాల పార్ట్‌ల పేర్లు, 12 పండుగలు, 17 పెంపుతు జంతువుల పేర్లు, 16 జలచరాల పేర్లు, 16 చారిత్రక స్థలాల పేర్లు, 8 మంచి అలవాట్లు, 6 నర్సరీ రైములు కాకుండా ఏబీసీడీలు అన్నీ వాటితో వచ్చే పదాలు చెబుతాడు. ఇంకా ఏమేమి చెబుతాడో మనకెందుకు... ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇతడి పేరు రాసి చల్లగా జారుకోక.
హరియాణలోని ఝుజ్జర్‌కు చెందిన పద్నాలుగు సంవత్సరాల కార్తికేయ జాఖర్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎవరి గైడెన్స్ లేకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్‌లను డెవలప్ చేసి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సం΄ాదించాడు. కార్తికేయ నాన్న రైతు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో బడి ΄ాఠాలు వినడమే కాదు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు కార్తికేయ. అలా అని కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరిమితం కాలేదు.
‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ మూడు యాప్‌లను సొంతంగా డెవలప్ చేశాడు. అవి:
1.జనరల్ నాలెడ్జీ యాప్: లుసెంట్ జీకే
2. కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్: రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్
3. డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్: శ్రీరామ్ కార్తిక్.
‘కార్తికేయలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రభుత్వ సహకారం ఉంటే మా అబ్బాయి మరెన్నో సాధించగలడు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కార్తికేయ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటున్నాడు కార్తికేయ తండ్రి అజిత్.
Comments
Please login to add a commentAdd a comment