బాస్కెట్‌బాల్‌తో ఆడడం అందరికి రాదు. మంచి శారీరక శ్రమతో కూడుకున్న ఈ గేమ్‌ను అత్యంత నైపుణ్యంతో ఆడితేనే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలము. అలాంటిది దుబాయ్‌కు చెందిన అజ్మత్ ఖాన్ అనే అథ్లెట్ బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ రోడ్డుపై వేగంగా పరిగెత్తాడు. కేవలం 6 నిమిషాల 1 సెకన్లపాటు ఆడి ఈ ఘనత సాధించాడు. పరిగెత్తుతూ బంతిని డ్రిబ్లింగ్ చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో ట్రైనింగ్ అవసరం. అలాంటిది రోడ్డు మీద పరిగెడుతూ ఆడటం అనేది గొప్ప విషయం. అందుకే అజ్మత్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. (చదవండి : లవర్ కోసం తనను తాను అమ్మకానికి)
ఖాన్ ఇలాంటి ఘనత సాధించడం మొదటిసారి కాదు. 2019 మార్చిలో 44 నిమిషాల 19 సెకండ్ల సమయంతో 10 కి.మీ. పరుగును వేగంగా పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకున్నారు. రికార్డు లిస్టింగ్ యుఎఇ పేజీ అథ్లెట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా అజ్మత్‌ఖాన్‌తోపాటు ఒక టైమ్ కీపర్ కూడా పరిగెత్తాడు. .ఈ రికార్డులను సాధించడానికి తాను ఎంతగానో కృషి చేస్తానని ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment