బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్‌ వీడియోలు | Viral Videos of Holi Some People Were Beaten For Forcefully Applying Color Made Funny | Sakshi
Sakshi News home page

బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్‌ వీడియోలు

Published Sat, Mar 15 2025 11:30 AM | Last Updated on Sat, Mar 15 2025 12:50 PM

Viral Videos of Holi Forcefully Applying Color Hilarious

దేశంలో హోలీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందించారు. కొందరైతే ‘ఏమీ అనుకోకండి’ అంటూ ఎదుటివారిని ఆటపట్టిస్తూ వారిని రంగుల్లో ముంచెత్తారు. సోషల్‌ మీడియాలో హోలీకి సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని తెగనవ్వు తెప్పిస్తున్నాయి.
 

రంగు జల్లాడని ఫోను విసిరికొట్టి..
సోషల్‌ మీడియాలో ప్ర్యత్యక్షమైన ఒక వీడియోలో ఒక యువకుడు మంచి దుస్తులు ధరించి నడుచుకుని వస్తుండగా, మరొక యువకుడు అతనిపై రంగులు కుమ్మరిస్తాడు. దీంతో ఆగ్రహంచిన ఆ వ్యక్తి తన సెల్‌ ఫోనును అతని మీదకు విసరడాన్ని చూడవచ్చు.

రంగుపడిందని..
మరో హొలీ వీడియోలో ఒక యువతి కుర్చీలో కూర్చున్న అంకుల్‌పై వెనుక నుంచి రంగు పోస్తుంది. వెంటనే అంకుల్‌ ఆగ్రహంతో ఫోనును పగులగొడతాడు.

ఇరువర్గాల వివాదం 
@Dominus_vaibhav అనే యూజన్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియోలో మద్యం మత్తులో హోలీ ఆడవద్దు అనే వ్యాఖ్యానంతో పాటు, రెండు గ్రూపులు గొడవ పడుతున్న ఒక సీన్‌ కనిపిస్తుంది.

ఏదో జరిగింది
మరో వీడియోలో రెండు గ్రూపులు ఎందుకో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తే ఏదో జరిగింది అని అనిపించడం ఖాయం.

హోలీలో కొట్టుకుంటున్నారు
ఇంకొక వీడియోలో దానిని రికార్డు చేస్తున్న వ్యక్తి హోలీలో కొట్టుకుంటున్నారని పెద్దగా అరుస్తూ చెప్పడాన్ని గమనించవచ్చు.

తాతకు కోపం వస్తే..
ఈ వీడియోలో ఒక తాత దుకాణం ముందు కూర్చుని కనిపిస్తున్నాడు. ఇంతలో హోలీ ఆడుతున్న కొందరు యువకులు అతనిపై రంగులు చిలకరిస్తారు. దీంతో ఆయన ఆగ్రహిస్తూ,  కర్రతో వారిని తరిమికొడతాడు.

ఇది కూడా చదవండి: Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement