వైరల్ : ‌ఒబామా అదరగొట్టాడు! | Barack Obama Football Skills Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్ : ‌ఒబామా అదరగొట్టాడు!

Nov 1 2020 2:45 PM | Updated on Nov 1 2020 5:10 PM

Barack Obama Football Skills Viral Video - Sakshi

వీడియో దృశ్యాలు

న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. వీలైనంత ఎక్కువ సమయం డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తరుపున ప్రచారంలో గడుపుతున్నారు. శనివారం నాటి ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని ఓ స్కూల్‌కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా బాస్కెట్‌ బాల్‌ ఆటలో తన ప్రతిభను బయటపెట్టారు. అక్కడి జిమ్‌లోని బాస్కెట్‌ బాల్‌ కోర్టులోకి అడుగుపెట్టి బాల్‌ను నెట్‌లో పడేలా వేశారు. ( కొంపముంచిన ట్రంప్‌.. 700 మంది మృతి )

ఆ వెంటనే ‘నాకు ఇంతే వచ్చు!’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న ప్రముఖులు, సామాన్యులు ఒబామా ప్రతిభను మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement