
చూడకుండా చెప్పేశాడు
కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన అధ్యాపకుడు పి.అరవింద్ బైనరీ అంకెలను గుర్తుపెట్టుకుని చెప్పి, గిన్నిస్ రికార్డు సాధించాడు. కేవలం ఒక్క నిమిషంలోనే 270 బైనరీ అంకెలను గుర్తుపెట్టుకుని, వాటిని వరుసగా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ప్రస్తుతం ఇటలీలో టూరిస్టు గైడ్‌గా పనిచేస్తోన్న ఈయన.. ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీసు భాషలు మాట్లాడగలరు. త్వరలో విద్యార్థుల కోసం మెమరీ క్లబ్‌ను ప్రారంభిస్తానని ఈ సందర్భంగా అరవింద్ చెప్పారు. భారత్‌కు తిరిగి వచ్చి జ్ఞాపకశక్తికి సంబంధించి రికార్డులపై పరిశోధన చేస్తానని తెలిపారు.